
ఆది సాయికుమార్‘టాప్ గేర్’ చిత్రంలో దర్శకుడిగా పరిచయం అయ్యాడు కె.శశికాంత్. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం..దర్శకుడిగా శశికాంత్‌కు మంచి పేరుని తెచ్చిపెట్టింది. తొలి సినిమానే ఓ డిఫరెంట్ జానర్‌ని ఎంచుకొని తన టాలెంట్ బయటపెట్టాడు. ఎంతో గ్రిప్పింగ్ గా స్టోరీని నడిపిస్తూ ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. అందుకే శశికాంత్‌కు వరుస అవకాశాలు వస్తున్నాయి.
ప్రస్తుతం తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టారు. శశికాంత్ తన రెండో సినిమాను ప్రముఖ హీరోతో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు నడుస్తున్నాయి. టాప్ గేర్ లాగే మరో డిఫరెంట్ పాయింట్ తీసుకొని స్టోరీ సిద్ధం చేసుకున్నారట. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన వివరాలు అధికారికంగా వెలువడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment