
ఆది సాయికుమార్, రియా సుమన్ జంటగా శశికాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టాప్ గేర్’. ఆదిత్య మూవీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘‘పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. ఇందులో ఆది టాక్సీ డ్రైవర్‌గా నటించారు.
అన్ని వర్గాల ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే డిఫరెంట్ పాయింట్‌ని మూవీలో టచ్ చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీరామ్, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి.
Comments
Please login to add a commentAdd a comment