యాక్షనే కాదు రొమాన్స్‌లోనూ ‘టాప్‌ గేర్‌’ వేసిన ఆది | Romantic Side Of Aadi Saikumar Top Gear Unveiled | Sakshi
Sakshi News home page

Top Gear: యాక్షనే కాదు రొమాన్స్‌లోనూ ‘టాప్‌ గేర్‌’ వేసిన ఆది సాయికుమార్‌

Published Tue, Oct 25 2022 7:43 PM | Last Updated on Tue, Oct 25 2022 7:43 PM

Romantic Side Of Aadi Saikumar Top Gear Unveiled - Sakshi

వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్‌ హీరో ఆది సాయికుమార్‌. ఇటీవల ‘క్రేజీ ఫెలో’తో అలరించిన ఆది..త్వరలోనే ‘టాప్‌ గేర్‌’అనే డిఫరెంట​ కాన్సెప్ట్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆదిత్య మూవీస్ &ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమా రాబోతోంది. పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఆది సాయికుమార్ టాక్సీ డ్రైవర్‌గా నటిస్తుండటం విశేషం. ఆయన పోషించిన ఈ రోల్ సినిమాలో కీలకం కానుందని, ప్రేక్షకులకు ఓ డిఫరెంట్ అనుభూతినిస్తుందని అంటున్నారు మేకర్స్. ఈ సినిమాతో ఆది సాయి కుమార్ కెరీర్‌కి టాప్ గేర్ పడినట్లే అని చెబుతున్నారు.   

ఇప్పటికే ఈ టాప్ గేర్ సినిమా నుంచి విడుదలైన టైటిల్ లుక్, ఫస్ట్ లుక్, 3డీ మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది. అయితే దీపావళి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు సినిమాలోని ఇంకో యాంగిల్‌ను చూపిస్తోంది. యాక్షన్‌లోనే కాదు.. రొమాన్స్‌లోనూ టాప్ గేర్ వేస్తాను అన్నట్టుగా ఆది సాయి కుమార్ పోస్టర్ చెబుతోంది. ఈ పోస్టర్ చూస్తుంటే.. హీరోయిన్‌ రియా సుమన్‌, ఆది కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయినట్టు కనిపిస్తోంది. ఇక ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ సింగిల్‌ను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement