Top Gear: టాక్సీ డ్రైవర్‌గా ఆది సాయికుమార్‌ | Adi Saikumar To Enthrall As A Taxi Driver For Top Gear Movie | Sakshi
Sakshi News home page

Top Gear: టాక్సీ డ్రైవర్‌గా ఆది సాయికుమార్‌

Published Sat, Oct 1 2022 3:13 PM | Last Updated on Sat, Oct 1 2022 3:13 PM

Adi Saikumar To Enthrall As A Taxi Driver For Top Gear Movie - Sakshi

ప్రేమ కావాలి సినిమాతో వెండితెరకు పరిచమైయ్యాడు ఆదిసాయికుమార్‌. ఆ తర్వాత పలు వైవిధ్యభరితమైన సినిమాల్లో భాగమవుతూ తనదైన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. ప్రస్తుతం వివిధ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న ఆది సాయి కుమార్.. మరికొద్ది రోజుల్లో టాప్ గేర్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 

ఆదిత్య మూవీస్ &ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అన్ని హంగులతో ఈ టాప్ గేర్ సినిమా రాబోతోంది. పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఓ డిఫరెంట్ పాయింట్ టచ్ చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఆది సాయికుమార్ టాక్సీ డ్రైవర్‌గా నటిస్తుండటం విశేషం. ఆయన పోషించిన ఈ రోల్ సినిమాలో కీలకం కానుందని, ప్రేక్షకులకు ఓ డిఫరెంట్ అనుభూతినిస్తుందని అంటున్నారు మేకర్స్. 

ఇప్పటికే ఈ టాప్ గేర్ సినిమా నుంచి విడుదలైన టైటిల్ లుక్, ఫస్ట్ లుక్, 3డీ మోషన్ పోస్టర్‌కు  ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.  మోషన్  పోస్టర్ లో ఆది సాయి కుమార్ కారు నడుపుతున్నట్లు చూపించి.. యాక్షన్ మోడ్ తో ఆకట్టుకున్నారు.  ఈ సినిమాలో రియా సుమన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కే.వీ శ్రీధర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు గిరిధర్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.  ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరిదశలో ఉన్నాయి. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదిని ప్రకటిస్తామని చిత్రబృందం పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement