'Top Gear' Movie Team Send Birthday Wishes to Aadi Sai Kumar - Sakshi
Sakshi News home page

Aadi Sai Kumar: టాప్‌ గేర్‌ టీమ్‌ నుంచి ఆది సాయికుమార్‌కు బర్త్‌డే విషెస్‌

Published Fri, Dec 23 2022 5:36 PM | Last Updated on Fri, Dec 23 2022 6:07 PM

Top Gear Team Send Birthday Wishes to Aadi Sai Kumar - Sakshi

'ప్రేమ కావాలి' అంటూ కెమెరా ముందుకొచ్చి తన విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నారు యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆది సాయి కుమార్. 2011లో ఇండస్ట్రీలో అడుగు పెట్టి వైవిధ్యభరితమైన కథలతో అలరిస్తున్నారు. రోల్ ఎలాంటిదైనా సరే అందులో లీనమవుతూ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ క్లాస్, మాస్ ఆడియన్స్ మెప్పు పొందుతున్నారు. 2011 సంవత్సరంలో ప్రేమ కావాలి సినిమాకు గాను దక్షిణాది ఫిలిం ఫేర్ అవార్డుల్లో ఉత్తమ నూతన నటుడిగా పురస్కారం అందుకున్నారు ఆది.

ఈ ఏడాది కూడా ఎన్నో రకాల పాత్రలతో ప్రేక్షకులను థ్రిల్ చేశారాయన. ప్రస్తుతం ఆయన తెలుగులో టాప్ గేర్ సినిమా చేస్తున్నారు. కె. శశికాంత్ దర్శకత్వంలో కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 30న రిలీజ్‌ కానుంది. నేడు (డిసెంబర్ 23) ఆది సాయి కుమార్ పుట్టినరోజు కావడంతో 'టాప్ గేర్' టీమ్ ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెబుతోంది. త్వరలో మరిన్ని మంచి సినిమాలతో అలరించేందుకు రెడీ అవుతున్నారు ఆది సాయి కుమార్.

చదవండి: ఐదేళ్లుగా నటి సీక్రెట్‌ లవ్‌
చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన కైకాల సత్యనారాయణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement