'యుద్ధం గెలవాలంటే, మృత్యువుతో పోరాడే గెలవాలి'.. 'టాప్‌ గేర్‌'లో ట్రైలర్ | Sakshi
Sakshi News home page

Top Gear Movie trailer: ఆది యాక్షన్‌ థ్రిల్లర్ మూవీ.. అదరగొడుతున్న టాప్ గేర్ ట్రైలర్

Published Sun, Dec 18 2022 9:53 PM

Aadi Sai Kumar Top Gear Movie trailer released by Mass Hero Ravi Teja - Sakshi

యంగ్ టాలెంటెడ్ హీరో ఆది సాయి కుమార్, రియా సుమన్‌ జంటగా తెరకెక్కిన చిత్రం 'టాప్ గేర్'. ఈ చిత్రానికి కె.శశికాంత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదిత్య మూవీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందించారు. కేవీ శ్రీధర్‌రెడ్డి  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులను ముందుకొస్తున్నారు ఆది సాయి కుమార్. 'టాప్ గేర్'తో మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మాస్ హీరో రవితేజ చేతులమీదుగా రిలీజ్ చేశారు. డిసెంబర్ 30న ఈ సినిమా విడుదల చేయనున్నారు. 

అసలు కథేంటంటే..: కథలోని పాత్రలందరూ డేవిడ్‌, అతడి ఆచూకీ గురించి అడుగుతూ కనిపించారు. మరి ఇంతకీ డేవిడ్‌ ఎవరు? హైదరాబాద్‌లో జరిగిన పలు హత్యలకు, డేవిడ్‌కూ సంబంధం ఏంటి? క్యాబ్‌ డ్రైవర్‌ అయిన ఆదిని ఎందుకు పోలీసులు వెంటాడారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఆద్యంతం ఉత్కంఠభరిత కథ, కథనాలతో సినిమాను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. 

ఈ ట్రైలర్‌లోని ప్రతి సన్నివేశం కూడా ఉత్కంఠ భరితంగా ఉంది. ఈ ట్రైలర్‌లో ఆది యాక్షన్ సీన్స్ అబ్బురపరుస్తున్నాయి. హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ ప్రేమలో ట్విస్టులు, విలన్స్ అటాక్, హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలిచాయి. ఎవర్రా మీరు.. నన్నెందుకు చంపాలనుకుంటున్నారు? అని హీరో ఆది చెప్పే డైలాగ్ సినిమాలో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలోబ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్రలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement