hero ravi teja
-
'యుద్ధం గెలవాలంటే, మృత్యువుతో పోరాడే గెలవాలి'.. 'టాప్ గేర్'లో ట్రైలర్
యంగ్ టాలెంటెడ్ హీరో ఆది సాయి కుమార్, రియా సుమన్ జంటగా తెరకెక్కిన చిత్రం 'టాప్ గేర్'. ఈ చిత్రానికి కె.శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదిత్య మూవీస్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందించారు. కేవీ శ్రీధర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులను ముందుకొస్తున్నారు ఆది సాయి కుమార్. 'టాప్ గేర్'తో మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మాస్ హీరో రవితేజ చేతులమీదుగా రిలీజ్ చేశారు. డిసెంబర్ 30న ఈ సినిమా విడుదల చేయనున్నారు. అసలు కథేంటంటే..: కథలోని పాత్రలందరూ డేవిడ్, అతడి ఆచూకీ గురించి అడుగుతూ కనిపించారు. మరి ఇంతకీ డేవిడ్ ఎవరు? హైదరాబాద్‌లో జరిగిన పలు హత్యలకు, డేవిడ్కూ సంబంధం ఏంటి? క్యాబ్ డ్రైవర్ అయిన ఆదిని ఎందుకు పోలీసులు వెంటాడారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఆద్యంతం ఉత్కంఠభరిత కథ, కథనాలతో సినిమాను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. ఈ ట్రైలర్‌లోని ప్రతి సన్నివేశం కూడా ఉత్కంఠ భరితంగా ఉంది. ఈ ట్రైలర్లో ఆది యాక్షన్ సీన్స్ అబ్బురపరుస్తున్నాయి. హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ ప్రేమలో ట్విస్టులు, విలన్స్ అటాక్, హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలిచాయి. ఎవర్రా మీరు.. నన్నెందుకు చంపాలనుకుంటున్నారు? అని హీరో ఆది చెప్పే డైలాగ్ సినిమాలో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలోబ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్రలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
రవితేజగారు హిట్టవుతుందన్నారు
‘‘నా కెరీర్లో ‘రాక్షసన్’ కంటే ముందు కూడా మంచి హిట్స్ ఉన్నాయి. కానీ నా మార్కెట్‌ను పెంచిన చిత్రం ‘రాక్షసన్’. ఈ సినిమా తర్వాత నాకు పెద్ద నిర్మాతలు, దర్శకుల నుంచి మంచి ఆఫర్లు వచ్చాయి. కానీ కొన్ని కారణాలతో ఆ సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఇలా ఎందుకు జరుగుతోంది? అనే కోపంతోనే నిర్మాతనయ్యాను’’ అని విష్ణువిశాల్ అన్నారు. విష్ణు విశాల్ హీరోగా నటించి, నిర్మించిన తమిళ చిత్రం ‘ఎఫ్ఐఆర్’. మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 11న విడుదల కానుంది. హీరో రవితేజ సమర్పణలో అభిషేక్ నామా ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సందర్భంగా విష్ణు విశాల్ చెప్పిన విశేషాలు. ► ముందు మను ఆనంద్ ఓ యాక్షన్ స్టోరీ చెప్పారు. వేరే కథ ఉందా? అని అడిగితే ‘ఎఫ్ఐఆర్’ సినిమా లైన్ చెప్పారు. నేను ఈ లైన్‌కి ఓకే చెప్పడంతో ఆయన ఆశ్యర్యపోయారు. ఎందుకంటే ఇలాంటి ఓ సున్నితమైన కథను నేను ఒప్పుకుంటానని ఆయన ఊహించలేదు. ఈ సినిమాను నా స్నేహితుడు ఒకరు నిర్మించాల్సింది కానీ పరిస్థితుల కారణంగా నేనే నిర్మాతగా మారాల్సి వచ్చింది. నేను ఎప్పుడు కులాలు, మతాలు అని చూడను. ఈ సినిమాలో ఏ మతాన్ని, ఎవ్వర్నీ తక్కువగా చూపించలేదు. మతం కంటే మాన వత్వం గొప్పది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ► నా భార్య జ్వాల (బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల) ఫ్రెండ్ ఒకరు రవితేజ దగ్గర వర్క్ చేస్తున్నారు. అలా ‘ఎఫ్ఐఆర్’ సినిమా గురించి రవితేజతో మాట్లాడటం జరిగింది. ఈ సినిమా రఫ్ కట్ చూసిన రవితేజగారు తప్పకుండా హిట్ అవుతుందన్నారు. ‘మీలా నేను కమర్షియల్ సినిమాలు చేయాలనుకుంటున్నాను’ అని నేను రవితేజతో అంటే.. ‘ నేను నీలా కంటెంట్ బేస్డ్ సినిమాలు చేయాలనుకుంటున్నాను’ అన్నారు. -
రవితేజపై సిట్ ప్రశ్నల వర్షం!
-
‘రవితేజకు డ్రగ్స్ అలవాటు లేదు’
హైదరాబాద్: హీరో రవితేజకు డ్రగ్స్ అలవాటు లేదని ఆయన కుటుంబ వైద్యుడు, సన్నిహితుడు కడియాల రాజేంద్ర తెలిపారు. రవితేజ పేరును డ్రగ్స్ కేసులోకి లాగడం బాధించిందని, ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎంతో వేదనకు గురయ్యారని చెప్పారు. సోమవారం ఆయన ‘సాక్షి’టీవీతో మాట్లాడుతూ... రవితేజకు సిగరెట్ వాసన కూడా గిట్టదని వెల్లడించారు. అవుట్డోర్ షూటింగ్లో ఉండడం వల్లే ఆయన మీడియాకు ముందుకు రాలేదన్నారు. రవితేజపై జరుగుతున్న ప్రచారం అబద్దమని చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందికాబట్టి తాను మీడియా ముందుకు వచ్చినట్టు వివరించారు. డ్రగ్స్ వ్యవహారంతో రవితేజకు సంబంధం లేదన్న విషయం దర్యాప్తులో తేలుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. రవితేజ తమ్ముడు భరత్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన రోజున మద్యం మత్తులో లేడని, ఆ రోజు ఆయన తాగలేదని డాక్టర్ రాజేంద్ర వెల్లడించారు. డ్రగ్స్ కేసులో దొరికిన తర్వాత ఆయన మారిపోయాడని, దురలవాట్లు మానుకున్నారని చెప్పారు. బిగ్‌బాస్‌కు సెలెక్టయ్యానని ఇటీవల తనతో చెప్పారని గుర్తు చేసుకున్నారు. అన్నిమానేసిన తర్వాత భరత్ చనిపోవడం బాధాకరమని ఆయన అన్నారు. భరత్ అంత్యక్రియల విషయంలోనూ రవితేజ కుటుంబాన్ని మీడియా తప్పుగా చిత్రీకరించిందని వాపోయారు. రవితేజ కుటుంబంపై అసత్య ప్రచారం చేయొద్దని మీడియాను కోరారు. -
'రోమియో'లో హీరో రవితేజ గెస్ట్ రోల్
దర్శకుడు పూరి జగన్నాథ్ తన సోదరుడు సాయిరామ్‌శంకర్ హీరోగా రూపొందిన 'రోమియో' చిత్రంలో హీరో రవితేజ మెరవనున్నాడు. ఈ సినిమాలో అతడు అతిథి పాత్ర చేశాడు. హీరో అన్నయ్య పాత్రలో అతడు నటించాడు. ఈ విషయాన్ని పూరి జగన్నాథ్ వెల్లడించారు. ఇందులో కథకు కీలకమైన సాయి అన్నయ్య పాత్రను రవితేజ పోషించాడని చెప్పారు. పవర్ సినిమా తర్వాత రవితేజ చిత్రం ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. కాగా, 'రోమియో'లో రవితేజ నటించాడన్న వార్త ప్రేక్షకులకు ఆసక్తి కలిగిస్తోంది. పూరి జగన్నాథ్ రాసిన కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా శుక్రవారం(అక్టోబర్ 10న) విడుదలకానుంది.