'రోమియో'లో హీరో రవితేజ గెస్ట్ రోల్ | hero ravi teja doing guse role in romeo movie | Sakshi
Sakshi News home page

'రోమియో'లో హీరో రవితేజ గెస్ట్ రోల్

Published Thu, Oct 9 2014 7:26 PM | Last Updated on Sat, Sep 2 2017 2:35 PM

'రోమియో'లో హీరో రవితేజ గెస్ట్ రోల్

'రోమియో'లో హీరో రవితేజ గెస్ట్ రోల్

దర్శకుడు పూరి జగన్నాథ్ తన సోదరుడు సాయిరామ్‌శంకర్ హీరోగా రూపొందిన 'రోమియో' చిత్రంలో హీరో రవితేజ మెరవనున్నాడు. ఈ సినిమాలో అతడు అతిథి పాత్ర చేశాడు. హీరో అన్నయ్య పాత్రలో అతడు నటించాడు. ఈ విషయాన్ని పూరి జగన్నాథ్ వెల్లడించారు. ఇందులో కథకు కీలకమైన సాయి అన్నయ్య పాత్రను రవితేజ పోషించాడని చెప్పారు.

పవర్ సినిమా తర్వాత రవితేజ చిత్రం ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. కాగా, 'రోమియో'లో రవితేజ నటించాడన్న వార్త ప్రేక్షకులకు ఆసక్తి కలిగిస్తోంది. పూరి జగన్నాథ్ రాసిన కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా శుక్రవారం(అక్టోబర్ 10న) విడుదలకానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement