– సాయిరామ్ శంకర్
‘‘పూర్తి స్థాయి వినోదం, ఫ్యామిలీ డ్రామా, ఓ చిన్న సందేశం.. ఇలా అన్ని వాణిజ్య అంశాలతో ‘వెయ్ దరువెయ్’ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పగలను. నా కెరీర్‌లో ఈ మధ్య గ్యాప్ వచ్చింది. ఆ దూరాన్ని ‘వెయ్ దరువెయ్’ తగ్గిస్తుందనే నమ్మకం ఉంది’’ అని హీరో సాయిరామ్ శంకర్ అన్నారు. నవీన్ రెడ్డి దర్శకత్వంలో సాయిరామ్ శంకర్, యషా శివకుమార్ జంటగా నటించిన చిత్రం ‘వెయ్ దరువెయ్’. లక్ష్మీనారాయణ ΄పొత్తూరు సమర్పణలో సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై దేవరాజు ΄పొత్తూరు నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘నవీన్ ‘వెయ్ దరువెయ్’ కథ చెప్పగానే నచ్చింది.
ఇందులో నా పాత్ర చాలా సరదాగా ఉంటుంది. నాకు తప్పకుండా మంచి కమ్ బ్యాక్ మూవీ అవుతుందనిపించింది. ఈ సినిమాని 35 రోజుల్లోనే పూర్తి చేశామంటే ఆ క్రెడిట్ నిర్మాత, డైరెక్టర్, కెమెరామేన్‌లదే. పైగా నటీనటులందరూ అనుభవం ఉన్నవాళ్లు కావడం కూడా మరో కారణం. ఈ మూవీకి భీమ్స్‌గారి సంగీతం, నేపథ్య సంగీతం ప్లస్ అయింది. నా 20 ఏళ్ల సినీ ప్రయాణంలో విజయాలు, పరాజయాలూ ఉన్నాయి. ప్రస్తుతం ఆచితూచి మంచి కథలు ఎంచుకుంటున్నా. మా అన్నయ్య (పూరి జగన్నాథ్) దర్శకత్వంలో హీరోగా చేసే స్థాయికి నేనింకా చేరుకోలేదు. ఆ స్థాయి, ఆ స్టార్‌డమ్, నా మార్కెట్ పరిధి పెరిగినప్పుడు చేస్తాను. ప్రస్తుతం నేను నటించిన ‘ఒక పథకం ప్రకారం, రీ సౌండ్’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment