Aadi
-
క్రేజీ ఫెల్లో హీరోయిన్‌తో ఆది సాయి కుమార్ కొత్త సినిమా ప్రారంభం
లవ్ లీ యంగ్ హీరో ఆది సాయి కుమార్ కొత్త సినిమా ప్రకటన ఇచ్చేశారు. విలేజ్ ప్రేమకథ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు 'కృష్ణ ఫ్రమ్ బృందావనం' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. దిగంగనా సూర్యవంశీ ఇందులో హీరోయిన్. ఈ చిత్రాన్ని దర్శకుడు వీరభద్రమ్ చౌదరి తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తూము నరసింహా, జామి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు గురువారం నాడు కాకతీయ హిల్స్‌లోని వెంకటేశ్వరుడి సన్నిధిలో ఘనంగా జరిగాయి. పూజా కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ సాయి కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా హీరో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ.. ‘మా మూవీ ఓపెనింగ్‌కు వచ్చిన దిల్ రాజు గారికి, అనిల్ రావిపూడి గారికి థాంక్స్. చుట్టలబ్బాయ్ తరువాత మళ్లీ ఓ సినిమా చేయాలని నేను, వీరభద్రమ్ ప్రయత్నించాం. ఇన్ని రోజులకు మంచి కథ, స్క్రిప్ట్ దొరికింది. మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమా అవుతుంది. కుటుంబమంతా కలిసి చూసి నవ్వుకునేలా ఉంటుంది. జూన్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. క్రేజీ ఫెల్లో సినిమాలో నేను, దిగంగనా సూర్యవంశీ కలిసి నటించాం. మళ్లీ ఇప్పుడు ఈ చిత్రంలో నటిస్తున్నాం. ప్రేమ కావాలి, లవ్ లీ, సుకుమారుడు, ప్యార్ మే పడిపోయానే అంటూ అనూప్ రూబెన్స్ నాకు మంచి సాంగ్స్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా మంచి పాటలు ఇస్తున్నారు. ఈ రోజు అనూప్ గారి పుట్టిన రోజు. మంచి టెక్నీషియన్లు, ఆర్టిస్టులతో రాబోతున్నాం. అన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామ’ని అన్నారు. సాయి కుమార్ మాట్లాడుతూ.. ‘దిల్ రాజు గారు, అనిల్ రావిపూడి గారు ఎంత బిజీగా ఉన్నా అడిగిన వెంటనే వచ్చినందుకు థాంక్స్. వీరభద్రమ్ గారికి ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టం. మేం చేసిన చుట్టలబ్బాయ్ బాగా ఆడింది. ఆయన కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలను తీస్తుంటారు. కృష్ణ ఫ్రమ్ బృందావనం కూడా ఫ్యామిలీతో చూడదగ్గ చిత్రంగా ఉంటుంది. ఆదికి అనూప్ రూబెన్స్ ఎప్పుడూ కూడా బెస్ట్ ఆల్బమ్స్ ఇస్తూనే వచ్చారు. ఈ సినిమాలోనూ మంచి పాటలు ఉండబోతున్నాయి. ఎంతో ప్యాషన్ ఉన్న నిర్మాతలు మంచి కథతో చేస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. దిగంగనా సూర్యవంశీ మాట్లాడుతూ.. ‘ఆది గారితో ఇది వరకు నేను క్రేజీ ఫెల్లో సినిమా చేశాను. మళ్లీ ఆది గారితో కలిసి నటిస్తుండటం ఆనందంగా ఉంది. వీరభద్రమ్ గారు చెప్పిన కథ చాలా బాగా నచ్చింది. ఇందులో నా పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు. -
ఎన్టీఆర్ బర్త్‌డే.. గందరగోళంలో అభిమానులు!
టాలీవుడ్లో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. తమ అభిమాన హీరోల బర్త్‌డే సందర్భంగానో.. లేదా 10, 20 ఇయర్స్ పూర్తి చేసుకున్నారనో..ఇలా మొత్తంగా ఏదో ఒక కారణంతో హిట్ సినిమాలను మళ్లీ థియేటర్స్‌లో ప్రదర్శిస్తున్నారు. ఫ్యాన్స్ నుంచి కూడా రీరిలీజ్ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అందుకే ఈ మధ్య స్టార్ హీరోల పుట్టిన రోజు నాడు ఏదో ఒక సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేశ్‌బాబు, పవన్ కల్యాన్, చిరంజీవి లాంటి హీరోల సినిమాలు రీరిలీజై మంచి వసూళ్లను రాబట్టాయి. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలు రీరిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. మే 20న ఎన్టీఆర్ బర్త్‌డే. ఈ సందర్భంగా ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ సినిమాలను థియేటర్స్‌లో ప్రదర్శించబోతున్నారు. మే 20న 'సింహాద్రి' సినిమాని భారీస్థాయిలో రీరిలీజ్ చేయాలని అభిమానులు నిర్ణయించారు. దీంతో పాటు ‘ఆది’, ‘నిన్ను చూడాలని’ చిత్రాలను కూడా విడుదల చేయబోతున్నారు. ఆది చిత్రాన్ని అయితే మే 20 నుంచి 28 వరకు ప్రదర్శించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 'నిన్ను చూడాలని' చిత్రాన్ని మే 19న ప్రదర్శిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. గందరగోళంలో ఫ్యాన్స్ సాధారణంగా స్టార్ హీరోల బర్త్‌డే రోజు ఏదో ఒక్క సినిమా మాత్రమే..అది కూడా ఒక్క రోజే రీరిలీజ్ చేస్తున్నారు. ఇటీవల అల్లు అర్జున్ బర్త్‌డే (ఏప్రిల్ 8) సందర్భంగా ‘దేశముదురు’ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఒక్క సినిమా కావడంతో ఫ్యాన్స్ అంతా ఆ చిత్రాన్ని వీక్షించారు. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి మాత్రం గందరగోళానికి గురవుతున్నారు. ఒకేసారి పలు సినిమాలను రీరిలీజ్ చేస్తున్నట్లు ప్రకటిస్తుండటంతో ఏ సినిమా చూడాలో అర్థంగాక తలలు పట్టుకుంటున్నారు. అయితే మెజారీటీ ఫ్యాన్స్ మాత్రం ‘సింహాద్రి’కే మొగ్గు చూపుతున్నారు. మరికొంతమంది అయితే ‘ఆది’, ‘సింహాద్రి’ రెండూ చూస్తామని కామెంట్ చేస్తున్నారు. Ninnu Chudalani release ani evadu cheppadu ra Kapu lanja kodaka 💦💦💦💦 Ila direct ga edche kante … ma Mo cheekachu kadha ra @NagaBabuOffl @KChiruTweets https://t.co/0gzMJCear4 — #MassAmmaMoguduNTR (@CHARanhassan4) April 11, 2023 -
పన్నెండేళ్లు పూర్తి చేసుకున్న ఆది సాయికుమార్
డైలాగ్ కింగ్ సాయికుమార్ వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన హీరో ఆది సాయికుమార్. ప్రేమకావాలి సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యి నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఆది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నేటితో పన్నెండేళ్లు పూర్తయ్యింది. ఈ పుష్కరకాలంలో ఆయన ఎన్నెన్నో ప్రయోగాలు చేశారు. ఫలితంతో సంబంధం లేకుండా అభిమానుల్ని అలరించడానికి డిఫరెంట్ జానర్స్‌ను ప్రయత్నిస్తూనే వచ్చాడు. ఆయన కెరీర్లో ప్రేమ కావాలి, లవ్లీ, సుకుమారుడు, శమంతకమణి, ఆపరేషన్ గోల్డ్ ఫిష్, బుర్రకథ, శశి ఇలా అనేక రకాల కాన్సెప్టులతో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు.గత ఏడాది ఏకంగా ఐదు సినిమాలతో ముందుకు వచ్చాడు. కానీ కరోనా వల్ల ఆది నటించిన సినిమాలు కాస్త ఆలస్యం అయ్యాయి. దీంతో గత ఏడాది తీస్ మార్ ఖాన్, క్రేజీ ఫెల్లో,బ్లాక్ అతిథి దేవో భవ, టాప్ గేర్ అంటూ ఇలా వరుసగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. చివరగా వచ్చిన టాప్ గేర్ సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇప్పుడు ఆది సాయి కుమార్ ఓటీటీలోనూ ఎంట్రీ ఇచ్చారు. పులి మేక అనే వెబ్ సిరీస్‌లో ఆది సాయి కుమార్ నటించారు. ప్రస్తుతం ఈ పులి మేక వెబ్ సిరీస్ జీ5లో ట్రెండ్ అవుతోంది. ఫోరెన్సిక్ టీమ్ హెడ్ ప్రభాకర్ శర్మ పాత్రలో ఆది కనిపించిన తీరు, నటించిన సీన్ల గురించి అంతా చర్చించుకుంటున్నారు. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా ఇలా ఓటీటీలోనూ నటించి ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చారు.త్వరలోనే ఆది నుంచి రాబోతున్న కొత్త ప్రాజెక్టుల వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. -
జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా..!
2002లో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఆది సినిమా మీకు గుర్తుందా? రాయమసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సాధించింది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ నునుగు మీసాలతో చిన్నపిల్లాడిలా కనిపించాడు. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించిన హీరోయిన్ కీర్తి చావ్లా మీకు గుర్తుందా? ఆమె ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తుందో తెలుసా? తెలుగులో కొన్ని సినిమాల్లో నటించిన కీర్తి అ తర్వాత పెద్దగా సక్సెస్ కాలేదు. ఇంతకీ ఆమె ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసుకుందాం. ఆది సినిమాతో ఆరంగేట్రం చేసిన కీర్తి చావ్లా మన్మధుడు, కాశీ, శ్రావణమాసం, సాధ్యం, బ్రోకర్ చిత్రాల్లో కనిపించింది. కీర్తి చావ్లా తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ చిత్రాల్లోనూ నటించింది. కీర్తి చావ్లాకు సంబంధించిన తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. చివరి సారిగా 2016లో నమిత లీడ్ రోల్లో నటించిన ఇలమై ఊంజల్ అనే తమిళ్ సినిమా తర్వాత కీర్తి చావ్లా మరో సినిమాలో నటించలేదు. అయితే ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడం గమనార్హం. -
ఆది నా బెస్ట్ ఫ్రెండ్: హీరో సందీప్ కిషన్
లవ్లీ హీరో ఆది సాయి కుమార్ తాజా చిత్రం టాప్ గేర్. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అన్ని హంగులతో ఈ సినిమా తెరకెక్కించారు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని వర్గాల ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఓ డిఫరెంట్ పాయింట్ టచ్ చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఆది సాయికుమార్ టాక్సీ డ్రైవర్‌గా నటిస్తుండటం విశేషం. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 30న విడుదల చేయబోతున్నట్టుగా మేకర్లు ప్రకటించారు. డైలాగ్ కింగ్ సాయికుమార్ మాట్లాడుతూ.. 'మా నాన్నతో మొదలైన మా జర్నీ ఆది వరకు వచ్చింది. ఆది క్రికెటర్ అవ్వాలనుకున్నాం. కానీ మెగాస్టార్ అన్నయ్య సాంగ్‌తో ఇండస్ట్రీకి వచ్చాడు. అందరూ ఈ "టాప్ గేర్" సినిమా ట్రైలర్, టీజర్ బాగుందని మెచ్చుకుంటున్నారు. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా మా ఆదికి బిగ్ బ్రేక్ అవుతుందని ఆశిస్తున్నా.' అని అన్నారు. హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. 'శశి ఈ సినిమాకు దర్శకత్వం వహించడం చాలా హ్యాపీగా ఉంది. ప్రస్థానం సినిమాతో నా జర్నీ మొదలైంది. ఆది నాకు బెస్ట్ ఫ్రెండ్. ఈ సినిమా బిగ్ హిట్ అవ్వడమే కాకుండా ఈ "టాప్ గేర్" సినిమాతో ఆది కెరీర్ బ్రేక్ లేకుండా సాగిపోవాలి. అలాగే రాబోయే 2023 లో ఆదితో నేను ఒక సినిమా తీసేందుకు ప్లానింగ్ చేస్తున్నా. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు. హీరో ఆది మాట్లాడుతూ.. 'శ్రీధర్ చాలా పాజిటివిటి ఉన్న వ్యక్తి. తను ఇంకా ఇలాంటి సినిమాలు చాలా తీయాలి. శశి చాలా డెడికేషన్ ఉన్న వ్వక్తి. తను ఈ సినిమాకు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. మా "టాప్ గేర్" సినిమాను అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు. చిత్ర దర్శకుడు శశికాంత్ మాట్లాడుతూ... 'థ్రిల్లర్, సస్పెన్స్ ఇలా అన్నీ ఏమోషన్స్ ఉన్న ఇలాంటి మంచి కథ. ప్రొడ్యూసర్ శ్రీధర్ రెడ్డి నన్ను సెలెక్ట్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా "టాప్ గేర్" సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు. ఈ కార్యక్రమానికి హీరో సందీప్ కిషన్, సాయి కుమార్, బెక్కం వేణుగోపాల్, యన్ శంకర్, నిర్మాతలు దామోదర ప్రసాద్, అనిల్ సుంకర, రాధా మోహన్, నటుడు డి. యస్. రావు, డైరెక్టర్ శేఖర్ సూరి, సత్తి బాబు, నారాయణ్ గౌడ్, హరీష్, సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. హీరో సందీప్ కిషన్, డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారు టాప్ గేర్ బిగ్ టికెట్‌ను లాంఛ్ చేశారు . -
ఆది సాయికుమార్ ‘టాప్‌గేర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆసక్తి రేపుతున్న ఆదిసాయికుమార్ 'క్రేజీఫెలో' ట్రైలర్
ఆది సాయికుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘క్రేజీ ఫెలో’. ఫణికృష్ణ సిరికి దర్శకత్వం వహించారు. దిగంగనా సూర్యవంశీ, మర్నా మీనన్ హీరోయిన్లు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కె.కె.రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేసి, ఈ నెల 14న సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ‘మావాడు చాలా మారిపోయాడు.. ఇంతకుముందులా లేడు’ అంటూ అనీష్ కురువిల్లా చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమై, ‘పుణ్యానికి పోతే పాపం ఎదురయిందంటే ఇదే అనుకుంటా’ అంటూ ఆది చెప్పే డైలాగ్‌తో ముగిసింది. ‘‘ఫ్యామిలీ, ఫన్, రొమాన్స్, యాక్షన్ ఉన్న చిత్రమిది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ మూవీకి సమర్పణ: లక్ష్మీ రాధామోహన్, సంగీతం: ఆర్ఆర్ ధృవన్, కెమెరా: సతీష్ ముత్యాల -
జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘ఆది’ రీరిలీజ్! ఎప్పుడంటే..
ప్రస్తుతం టాలీవుడ్లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. గతంలో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్న స్టార్ హీరోల చిత్రాలను ప్రస్తుతం థియేటర్లో ప్రదర్శిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఆయా హీరోల స్పెషల్ డేస్‌ను పురస్కరించుకున్న భారీ విజయం సొంతం చేసుకున్న ఆనాటి ఎవర్గ్రీన్ చిత్రాలను మళ్లీ రిలీజ్ చేసి ఫ్యాన్స్ చేత ఈళలు వేయిస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ బాబు పోకిరి, పవన్ కల్యాణ్ జాల్సా, రీసెంట్గా బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి చిత్రాలను రీరిలీజ్ చేయగా వాటికి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చాయి. చదవండి: క్రేజీ అప్డేట్.. ఆ రోజు నుంచే ‘పుష్ప-2’ రెగ్యులర్ షూటింగ్! కలెక్షన్స్ పరంగా పోకిరి, జాల్సా చిత్రాలు అదుర్స్ అనిపించాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ చిత్రం కూడా రాబోతోంది. తారక్ కెరీర్ల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం, ఆయనకు స్టార్డమ్ తెచ్చిపెట్టిన ఫ్యాక్షన్ డ్రామా మూవీ ‘ఆది’. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం రీరిలీజ్‌కు నవంబర్‌లో భారీ ఎత్తున సన్నాహాలు జరుగుతున్నట్లు ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చదవండి: అలనాటి హీరోయిన్ గౌతమి కూతురిని చూశారా? త్వరలో హీరోయిన్గా ఎంట్రీ! జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీకి వచ్చి 22న ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో నవంబర్‌లో ఈ సినిమాను మళ్లీ థియేటర్లో ప్రదర్శించాలని అనుకుంటున్నట్లు ‘ఆది’ చిత్ర బృందం పేర్కొన్నట్లు సమాచారం. కాగా బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి రీరిలీజ్ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేశ్ నవంబర్ 3వ వారంలో ఆది రీరిలీజ్ ఉండోచ్చని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసి నందమూరి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే నవంబర్ వరకు వేచి చూడాల్సిందే. కాగా ఈ సినిమాలో తారక్ జోడిగా కీర్తి చావ్లా నటించింది. -
సరికొత్త లుక్‌లో ఆది సాయికుమార్
డిఫరెంట్ జోనర్ మూవీస్‌లో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకంటూ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు హీరో ఆది సాయికుమార్. ఇప్పుడు ఆది కథానాయకుడిగా నాటకం ఫేమ్ కళ్యాణ్ జి.గోగణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. విజన్ సినిమా బ్యానర్ ప్రొడక్షన్ నెం.3గా ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆదివారం(ఆగస్ట్ 15) రోజున టి.ఎం.కె(TMK) అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమై పూజా కార్యక్రమాలను జరుపుకుంది. పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రం కోసం ఆది సాయికుమార్ సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. సాయికార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి బాల్‌రెడ్డి సినిమాటోగ్రాఫర్, మణికాంత్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. -
సాయి కుమార్ ఆన్లైన్ క్లాసులు చెప్పేవారు: రానా
‘‘ఇప్పుడు అందరికీ ఆన్లైన్ క్లాసులు తెలుస్తున్నాయి. కానీ, నాకు నా మొదటి చిత్రం నుంచి సాయికుమార్‌గారు ఆన్లైన్ క్లాసులు చెప్పేవారు. అందుకే, ఆయన పిలిస్తే నేను వచ్చేస్తా. ఆదికి ‘శశి’ సినిమా పెద్ద హిట్ ఇవ్వాలి’’ అని రానా అన్నారు. ఆది, సురభి జంటగా శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శశి’. ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమా 19న విడుదలవుతోంది. ప్రీ రిలీజ్ వేడుకలో హీరోలు రానా దగ్గుబాటి, సందీప్ కిషన్, నాగశౌర్య, విశ్వక్ సేన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. హీరో ఆది మాట్లాడుతూ –‘‘శ్రీనివాస్ ‘శశి’ కథ చెప్పినప్పుడు ఎంతో ఎగ్జయిట్ అయ్యాను’’ అన్నారు. దర్శకుడు శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ– ‘‘సినిమాలు ఆడొచ్చు ఆడకపోవచ్చు. కానీ చెడ్డపేరు రాకుండా సినిమా తీయాలని నిర్మాతలు చెప్పిన మాట మరచిపోలేను. ఇప్పటివరకు మీరు ఆదిని చూశారు. ‘శశి’లో బొమ్మ వేరేలా ఉంటుంది’’ అన్నారు. సభలో సాయికుమార్ కూడా పాల్గొన్నారు. చదవండి: సోషల్ హల్చల్: చీరలో పరువాలు పరుస్తోన్న శ్రద్ధా దాస్ -
జంగిల్లో ఏం జరిగింది?
‘ఇప్పటివరకూ ఎన్నో హారర్ చిత్రాలు చూసి ఉంటారు. ఇప్పుడు సరికొత్త హారర్ చిత్రం తీసుకొస్తున్నాం’ అంటోంది ‘జంగిల్’ చిత్రబృందం. ఆది, వేదిక హీరోహీరోయిన్లుగా కార్తీక్ విఘ్నేష్ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ చిత్రం ‘జంగిల్’. ‘అది శ్వాసిస్తుంది. అది దాక్కొని ఉంటుంది. అది వేటాడుతుంది’ అన్నది క్యాప్షన్. మహేశ్ గోవిందరాజ్, అర్చనా చందా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘మా సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తాం. అలాగే రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం. కార్తీక్ విఘ్నేష్ దర్శకత్వ ప్రతిభ, కెమెరా, నేపథ్య సంగీతం మా సినిమాకు ప్రత్యేక ఆకర్షణ’’ అన్నారు. ఈ సినిమాకు లైన్ ప్రొడ్యూసర్స్: ఎస్ సత్యమూర్తి, సురేశ్ కుమార్, కెమెరా: గౌతమ్ జార్జ్, సంగీతం: జోస్ ప్రాంక్లిన్. -
‘బుర్రకథ’ ట్రైలర్ విడుదల
-
ఆది, శ్రద్ధా శ్రీనాథ్ సినిమాపై మహిళా నిర్మాతఫిర్యాదు
బంజారాహిల్స్: ఫోర్జరీ సంతకాలు, డాక్యుమెంట్లతో తమ సినిమా పేరు మార్చి తనకు నష్టం తీసుకొచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరు తూ ఓ మహిళా నిర్మాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిలింనగర్ రోడ్ నెం. 9లో ఉంటున్న అనురాధ ఉప్పలపాటి సత్యనారాయణ ప్రొడక్షన్స్ పేరుతో ఆది సాయికుమార్, శ్రద్ధా శ్రీనాథ్ హీరో, హీరో యిన్లుగా ‘ఈడు జోడు’ సినిమాను ప్రారంభించింది. అదే సమయంలో గుర్రం విజయలక్ష్మి సహ నిర్మాతగా చేరింది. ఆమెతో పాటు విశ్వనాథ్ అరిగెల అనే సినీ దర్శకుడితో అనురాధ నిబంధనల మేరకు ఒప్పందం కుదర్చుకుంది. అయితే గత మార్చి 30న భావన క్రియేషన్స్‌తో ఈ సినిమా పేరును మార్చి ‘జోడి’ పేరుతో గుర్రం విజయలక్ష్మి, విశ్వనాథ్ ప్రకటిస్తూ మీడియాకు వివరాలను అందజేశారు. ఈ కారణంగా తాను రూ.2 కోట్లు నష్టపోయానని ఫోర్జరీ సంతకాలతో సినిమా పేరు ను మార్చడమే కాకుండా బ్యానర్ కూడా మార్చా రని ఆమె ఆరోపించారు. ఫిర్యాదు మేరకు గుర్రం విజయలక్ష్మి, అరిగెళ్ళ విశ్వనాథ్‌పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
'బుర్ర కథ' సినిమా ప్రారంభోత్సవం
-
ముహూర్తం ఖరారైంది
మలయాళంలో ప్రముఖ నటుడు మోహన్‌లాల్ తనయుడు ప్రణవ్ మోహన్‌లాల్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘ఆది’. తాజాగా ఆయన రెండో చిత్రం ప్రారంభోత్సవం వచ్చే నెల 9న జరగనుందని మాలీవుడ్ సమచారం. అరుణ్ గోపీ దర్శకత్వం వహించనున్నారు. వివేక్ హర్షన్, హరినారాయణన్, రంగనాథ్, జోసెఫ్, ధన్య బాలకృష్ణన్, లిబిన్ మోహనన్ తదితరులు నటించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా వచ్చే నెలాఖర్లో స్టార్ట్ కానుందట. మరోవైపు ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ హీరోగా రూపొందనున్న మరార్కర్ సినిమాలో యంగ్ మోహన్‌లాల్ క్యారెక్టర్లో ప్రణవ్మోహన్లాల్ నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది నవంబర్‌లో స్టార్ట్ కానుంది. -
ప్యూర్ లవ్‌స్టోరీ మొదలు
ఆది కథానాయకుడిగా శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న కొత్త సినిమా ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. డీఆర్పీ వర్మ సమర్పణలో శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై చింతలపూడి శ్రీనివాస్, చావలి రామాంజనేయులు నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి దర్శకుడు వంశీపైడిపల్లి క్లాప్ ఇచ్చారు. హీరో ఆది మాట్లాడుతూ–‘‘కథ గురించి డైరెక్టర్ నాకు మూడు గంటల నరేషన్ ఇచ్చారు. ప్యూర్ లవ్‌స్టోరీ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో రెండు షెడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాను. హీరోయిన్ పేరును త్వరలోనే ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా చేయడానికి మాకు సహకరిస్తోన్న సాయికుమార్‌గారికి, హీరో ఆదిగారికి, నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు దర్శకుడు. ‘‘సీమశాస్త్రి’ సినిమా తర్వాత మేము చేస్తోన్న చిత్రమిది. దర్శకుడు మంచి కథ చెప్పారు. సినిమా హిట్ సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత చావలి రామాంజనేయులు. ఈ కార్యక్రమంలో సాయికుమార్, నాగశౌర్య, నిర్మాత భరత్ చౌదరి పాల్గొన్నారు. రాజీవ్ కనకాల, రాధికా, రావు రమేష్, అజయ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాకు సంగీతం: అరుణ్ చిలువేరు. -
చింతపల్లి పోలీస్ స్టేషన్లో ఆది సినిమా ..
చింతపల్లి (పాడేరు): స్థానిక పోలీస్ స్టేషన్లో గురువారం సినిమా షూటింగ్ నిర్వహించారు. ప్రముఖ నటుడు సాయికుమార్ తనయుడు ఆది హీరోగా, షాషా హీరోయిన్గా తెరకెక్కిస్తున్న నూతన చిత్ర నిర్మాణం గత కొద్ది రోజులుగా ఒక్కడ జరుగుతోంది. విలేజ్ వినాయకుడు చిత్రంలో నటించిన కృష్ణుడు, కేరింతలు చిత్రంలో నటించిన నూకరాజు, హీరోయిన్ షాషా, ఛత్రపతి ఫేం మనోజ్‌నందంలపై స్థానిక పోలీస్ స్టేషన్లో పలు సన్నివేశాలు చిత్రీకరించారు. ఉగ్రవాదులు పోలీసులకు మధ్య జరిగిన పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు. అడవి సాయికిరణ్ ఈ చిత్రానికి నిర్మాత, దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. మరికొద్ది రోజులు పాటు ఈ ప్రాంతంలో పలు సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు ఆయన తెలిపారు. -
లైక్ డాడ్స్ – లైక్ సన్స్
మమ్ముటి, మోహన్‌లాల్ మలయాళ సూపర్ స్టార్స్. ఇద్దరూ సూపర్ స్టార్స్ అంటే పోటీ సహజమే. కానీ అది కేవలం సినిమాల వరకు మాత్రమే. బయట వాళ్లిద్దరూ మంచి స్నేహితులు. వాళ్లనే వాళ్ల వారసులు కూడా ఫాలో అవుతున్నారు. మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ ఆల్రెడీ హీరోగా హిట్. ఇప్పుడు మెహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ ‘ఆది’ సినిమా ద్వారా మలయాళ ఇండస్ట్రీకు పరిచయం అయ్యాడు. ‘ఆది’ సినిమా ఈ నెల 26న విడుదలైంది. ఈ సందర్భంగా ప్రణవ్ డెబ్యూ సినిమాకు దుల్కర్ సల్మాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ లెటర్ రాసి, ఫేస్బుక్ ద్వారా పంచుకున్నారు. ‘‘డియరెస్ట్ అప్పు, ‘ఆది’ సినిమాకు ఆల్ ది వెరీ బెస్ట్. మనిద్దరం ఎప్పుడూ మంచి ఫ్రెండ్లీ బాండ్‌ను షేర్ చేసుకున్నాం. నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడు నువ్ చిన్నపిల్లాడివి. మనం ఫ్రెండ్స్ అయినప్పడు నీకు ఏడేళ్లు. నేను హై స్కూల్లో చదువుతున్నాను. నువ్వు నాకు ఎప్పటికీ ‘లిటిల్ బ్రదర్’వే. నీ ప్రతీ స్టెప్‌ను అప్రిషియేట్ చేస్తూ, నీ సక్సెస్ కోరుకుంటున్నాను. నీ పెరెంట్స్, సిస్టర్ నీ ఎంట్రీకు ఎంత ఎగై్జటెడ్‌గా ఉన్నారో నాకు తెలుసు అండ్ వాళ్లు అస్సలు వర్రీ అవ్వాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే నువ్వు పుట్టిందే సూపర్ స్టార్ అవ్వడం కోసం’’ అంటూ ప్రణవ్‌కు హృదయపూర్వక విషెస్ తెలిపారు దుల్కర్ సల్మాన్. చాలా బాగుంది కదూ. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఏ నటుడైనా తన తొలి సినిమాను స్క్రీన్ పై చూసుకొని మురిసిపోవాలనుకుంటాడు. కానీ ప్రణవ్ మోహన్ లాల్ మాత్రం అందుకు భిన్నం. ప్రణవ్‌కు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమట. తన తొలి సినిమా ‘ఆది’ షూటింగ్ కంప్లీట్ అవ్వగానే తన ఫేవరేట్ ప్లేస్ హిమాలయాలకు వెళ్లిపోయాడట. ప్రణవ్ తనను తాను ఇంకా స్క్రీన్ మీద చూసుకోలేదు అని దర్శకుడు జీతూ జోసెఫ్ పేర్కొన్నారు. ‘ఆది’ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రణవ్ యాక్షన్ సీక్వెన్స్ బాగా చేశాడని, మిగతా సీన్స్ కూడా ఓకే అని టాక్. సో.. మోహన్ లాల్ ఫుల్ హ్యాపీ అన్నమాట. -
బిగ్‌బాస్ బ్యూటీతో యంగ్ హీరో..
సాక్షి, చెన్నై: తెలుగులో లవ్ల్లీ, ప్రేమకావాలి సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న యువ హీరో ఆది. త్వరలో హీరోయిన్ ఓవియాతో కలిసి కొలివుడ్కు పరిచయం అవుతున్నారు. బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో తర్వాత మంచి పాపులారిటీ పెంచుకున్న నటి ఓవియా. ఈ భామకు చిత్రాల అవకాశాలు వరుస కడుతున్నాయి. అందులో ఒకటి కాటేరి. యామిరుక్క భయమే వంటి హారర్ కామేడీ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు డీకే తాజాగా ఈ కాటేరికి దర్శకత్వం బాధ్యతలను చేపడుతున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మించనున్నారు. ఈ చిత్రం గురించి రాజా మాట్లాడుతూ.. కాటేరి ఎడ్వేంచర్ కామెడీ చిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో హారర్ థ్రిల్లర్ సన్నివేశాలు చోటు చేసుకుంటాయని ఆయన అన్నారు. ఈ చిత్రం ద్వారా తెలుగు యువ నటుడు ఆదిని హీరోగా పరిచయం చేస్తున్నామని చెప్పారు. ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు ఉంటారనీ, అందులో ఒకరిగా ఓవియాను ఎంపిక చేసినట్లు ఆయన తెలపారు. మరో ముగ్గురిని ఎరన్నది త్వరలో వెల్లడిస్తామన్నారు. అదే విధంగా త్వరలోనే చిత్ర షూటింగ్ ప్రారంభం అవుతుందని డీకే తెలపారు. కాగా, ఈయన ఇంతకు ముందు జీవా, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన కవలైవేండామ్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించక పోవడంతో తొలి చిత్రం యామిరుక్క భయమే చిత్ర నేపధ్యం అయినా హారర్నే తన తాజా చిత్రానికి నమ్ముకున్నారని చెప్పవచ్చు. -
సంతోషంలో ఓ స్పెషాల్టీ ఉంటుంది
– సురేశ్ కొండేటి ‘సంతోషం’ సౌత్ ఇండియన్ ఫిల్మ్ 16వ వార్షికోత్సవ అవార్డుల వేడుక ఈ నెల 12న హైదరాబాద్‌లో జరుగనుంది. ఈ అవార్డులకు సంబంధించిన లోగోను ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా, హీరోయిన్ రెజీనా లాంచ్ చేశారు. తొలి ఆహ్వాన పత్రికను శివాజీరాజా రెజీనాకు అందించారు. శివాజీరాజా మాట్లాడుతూ –‘‘సంతోషం అవార్డ్స్ వేడుక 16వ వసంతంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉంది. ‘మా’ అసోసియేషన్‌లోని పేద కళాకారులందరికీ ఆర్థికంగా ఆయన సహాయం చేస్తున్నందుకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఎప్పటిలానే సంతోషం వేడుకల్లో ఓ స్పెషాలిటీ ఫ్లాన్ చేశాం’’ అన్నారు ‘సంతోషం’ అధినేత సురేశ్ కొండేటి. ‘‘సంతోషం అవార్డు తీసుకోవాలన్న నా కల ‘ప్రేమకావాలి’తో తీరింది’’ అన్నారు హీరో ఆది. సురేశ్ కొండేటికి రెజీనా, హెబ్బా పటేల్ శుభాకాంక్షలు తెలియజేశారు. -
మూవీరివ్యూ: శమంతకమణి
మల్టీ స్టారర్ మూవీ అంటే తెలుగు సినీపరిశ్రమ లాంటి చోట సాహసమే. వెంకీ, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు మల్టీ స్టారర్ చేసి సక్సెస్ అయినా ఆ బాటలో నడిచేందుకు పెద్దగా దర్శకులు ఆసక్తి కనబరచలేదు. అయితే తాజాగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య నలుగురు అప్ కమింగ్ హీరోలను తీసుకుని ఒక ఇన్వెస్టిగేషన్ కథతో చేసిన ప్రయత్నమే శమంతకమణి. టాలీవుడ్లో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నలుగురు హీరోలతో తెరకెక్కింది ఈ సినిమా. నారా రోహిత్, సుధీర్‌బాబు, సందీప్‌కిషన్, ఆది. ఇలా నలుగురు యంగ్ హీరోస్ కలిసి చేసిన సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు ఉన్నాయి. వీళ్లకి తోడు నలుగురు హీరోయిన్ల సందడి.. ఇంకోవైపు, రాజేంద్రప్రసాద్, సుమన్. ఇలా.. భారీ కాస్టింగ్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం. నలుగురు యువకుల జీవితాలతో కథ మొదలవుతుంది. కృష్ణ (సుధీర్ బాబు), శివ(సందీప్ కిషన్), కార్తీక్ (ఆది), సి.ఐ రంజిత్‌గా నారా రోహిత్‌లు ఎవరి జీవితాలు, ఎవరి గోలలో వాళ్లుంటారు. అలాంటి పరిస్థితుల్లో కృష్ణ(సుధీర్‌బాబు) ఓ పెద్ద పార్టీ ఇస్తాడు. అయితే పార్టీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లడానికి పార్కింగ్‌లోకి వచ్చిన కృష్ణకు అక్కడ ఉండాల్సిన ఐదు కోట్ల విలువచేసే తన కారు శమంతకమణి చోరీ అయ్యిందని తెలుస్తుంది. ఎవరు దొంగిలించారో తెలుసుకోవడానికి ఫిర్యాదు చేసిన తర్వాత ఆ కేసును సిఐ రంజిత్‌కుమార్ డీల్ చేయడం మొదలుపెడుతాడు. కేసు విచారణలో భాగంగా కృష్ణ ఇచ్చిన పార్టీకి వచ్చిన వారిలో అనుమానంగా కనిపించిన శివ, కార్తీక్, రాజేంద్రప్రసాద్‌లను విచారిస్తాడు. అయితే వాళ్లలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతూ ఉండడంతో ఆ కారు ఎవరు దొంగలించారన్న దానిపై స్పష్టత పోతుంది. అయితే ఆ కారును ఏం చేశారు? దేనికోసం 5కోట్ల విలువచేసే కారును తీసుకెళ్లారు? ఆ కారుకి వీళ్లకి సంబంధం ఏంటి? అసలు రంజిత్ కుమార్‌కు ఆ కారుకు ఉన్న సంబంధం ఏంటి? మరి ఈ నలుగురిలో కారు ఎవరు దొంగలించారన్నదే ‘శమంతకమణి’ స్టోరీ. నటీనటులు నటుల పరంగా ఎవరిని ఎత్తి చూపడానికి లేదు. ఈ సినిమాకున్న అతి పెద్ద బలం నలుగురు కథానాయకులు. ఎవరికి బలమైన ఇమేజ్ లేకపోవడమే పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు. స్టార్ ఇమేజ్ బ్రాండ్ ఒక్కరికి ఉన్నా కూడా తేడాలు కనిపించేవి కాని అందరు ఒకే రేంజ్ కాబట్టి ఆ సమస్య రాలేదు. ఒకపాత్రతో వేరేదానికి పోలిక లేకపోవడం వల్ల ఎవరికి వారు బాగా బాగా పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి అవకాశం దక్కింది. కానీ వీళ్ల టాలెంట్ ని పూర్తిగా వాడుకోవడంలోనే దర్శకుడు బాగానే సక్సెస్ అయ్యాడు. స్క్రీన్ స్పేస్ అందరికి సమానంగా రావాలి అనే ప్రయత్నంలో ట్రాక్ కొద్దిగా తప్పడం సెకండ్ హాఫ్ లో స్పష్టంగా కనిపిస్తుంది. అందరిలోకి ఎవరు బాగా చేసారు అంటే చెప్పటం కష్టమే. సుధీర్ బాబు ఆ పాత్రకు సరిపోయాడు కాని సందీప్ కిషన్, నారా రోహిత్ పాత్రలతో పోలిస్తే అతని స్పాన్ తక్కువే. రాజేంద్ర ప్రసాద్ తన భుజాలపై మోయడానికి మాగ్జిమం ట్రై చేసాడు. అంతవరకు మెచ్చుకోవచ్చు. హీరొయిన్లు కైరా దత్, అనన్య సోని, చాందిని జస్ట్ గ్లామర్ డోస్ కోసమే కానీ నటనపరంగా పెద్దగా ఆకట్టుకోలేదు. సుమన్ చాలా రోజుల తర్వాత ఫుల్ లెంగ్త్ విలన్ రోల్ లో ఆశ్చర్యపరుస్తాడు. ఇతని పాత్రే కీలకం. తనికెళ్ల భరణి, బెనర్జీ, ఇంద్రజ, హేమ, కృష్ణతేజ అవసరమైనప్పుడు వచ్చి అనవసరం అనేది లేకుండా మేనేజ్ చేసారు. సాంకేతికవర్గం నలుగురు యువకులను ప్రధానంగా తీసుకుని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య శమంతకమణి కథను తయారు చేసుకున్నాడు. మొదట్లో ట్రైలర్ లో చూపించినట్టే సినిమా కథ మొత్తం శమంతకమణి కారు చుట్టూనే ఉంటుంది. సినిమా మొదలై ఎండ్ వరకు కారునే ప్రధాన పాత్ర పోషించింది. అయితే క్రైమ్ త్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందించాలని డైరెక్టర్ అనుకున్నాడు. అయితే మనకు ట్రైలర్ లో కనిపించిన క్యూరియాసిటీ సినిమాలో కనబడదు. ఒక కారు ఎంతో విలువైంది కాబట్టే దాన్ని దొంగలు కొట్టెయ్యడంం. దాన్ని పోలీస్ లు కనిపెట్టడం వంటిది ఎన్నో సినిమాల్లో వచ్చేసింది. కథ పరంగా కొత్తగా శమంతకమణిలో మనకేం కనబడదు. అసలు కారు చుట్టూ కథను అల్లినపుడు కారు గురించి ప్రేక్షకులకు ఎటువంటి థ్రిల్లింగ్ కలగదు. అసలా కారు స్పెషాలిటీ ఏమిటనేది క్లారిటీ ఇవ్వలేదు దర్శకుడు.ఇక మ్యూజిక్ విషయానికొస్తే మణిశర్మ సినిమాకు తగ్గ బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్నాడు. సినిమాలో ఉన్నది ఒకటే పాట. ఆ పాట ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు మరో పెద్ద ప్లస్. సీన్స్ కి తగ్గట్లుగా స్టైలిష్ విజువల్స్ తో సమీర్ రెడ్డి మెప్పించాడు. ఇక నిర్మాణ విలువలు విషయంలో కాస్త అసంతృప్తే కనబడుతుంది. – సాక్షి స్కూల్ ఎడిషన్ -
ఆది హీరోగా 'నెక్ట్స్ ఏంటి..?'
స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో ఆది. డైలాగ్ కింగ్ సాయికుమార్ వారసుడిగా వెండితెరకు పరిచయం అయిన ఆది.. హీరోగా గుర్తింపు తెచ్చుకున్నా.. స్టార్ ఇమేజ్ మాత్రం అందుకోలేకపోయాడు. కెరీర్ స్టార్టింగ్‌లో ఒకటి రెండు సక్సెస్‌లు వచ్చినా.. తరువాత వరుస ఫ్లాప్‌లు నిరాశపరిచాయి. ప్రస్తుతం మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతున్న శమంతకమణి సినిమాలో నటిస్తున్న ఆది తరువాత సోలో హీరోగా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. బుల్లితెరపై నటుడిగా, దర్శకుడిగా సక్సెస్ సాధించిన ప్రభాకర్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా వీ4 మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న సినిమాలో ఆది హీరోగా నటిస్తున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన కామెడీ థ్రిల్లర్ 'యామిరుక్క భయమే'కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నెక్ట్స్ ఏంటి..? అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇటీవల సూపర్ హిట్ అయిన నాని సినిమాలోని పాట పల్లవిని ఆది సినిమాకు టైటిల్‌గా నిర్ణయించారు. -
వైజాగ్ బీచ్ రోడ్డులో 'నిన్ను కోరి'
వరుస సక్సెస్‌లతో సూపర్ ఫాంలో ఉన్న నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా నిన్ను కోరి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. నాని సరసన నివేదా థామస్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా థియట్రికల్ ట్రైలర్‌ను చిత్రయూనిట్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 7న రిలీజ్ అవుతోంది. -
శమంతకమణా.. ఆవిడెవరు సార్..!
యంగ్ హీరోస్ నారా రోహిత్, ఆది, సందీప్ కిషన్, సుదీర్ బాబులు హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ మూవీ శమంతకమణి. గతంలో ఎన్నడూ లేని విధంగా నలుగురు యంగ్ హీరోస్ ఒకే సినిమాలో కలిసి నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా ఇంట్రస్టింగ్ పోస్టర్ లో మరింత హైప్ క్రియేట్ చేసిన చిత్రయూనిట్ తాజాగా టీజర్ తో మరోసారి ఆకట్టుకుంది. శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మెకానిక్ మహేష్ బాబుగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాపై మరిన్ని అప్ డేట్స్ త్వరలోనే వెల్లడించనున్నారు. -
స్వర్ణకమలం మీద ఇష్టంతో...
ఆది, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా విశ్వనాథ్ అరిగెల దర్శకత్వంలో ఉప్పలపాటి చరణ్‌తేజ్, గుర్రం విజయలక్ష్మి నిర్మిస్తున్న చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నిర్మాత చరణ్ తేజ్ తల్లిదండ్రులు ఉప్పలపాటి రామకృష్ణ, అనురాధ కెమెరా స్విచ్చాన్ చేయగా, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘విశ్వనాథ్‌గారి సినిమాల్లో ‘స్వర్ణకమలం’, అందులో భానుప్రియగారి పాత్ర నాకు బాగా ఇష్టం. ఆ తరహా సినిమా చేయాలనుకున్నా. ఈ సినిమా అలానే ఉంటుంది. ఆది ఏ పాత్రను అయినా బాగా చేయగలుగుతారు. అయితే హీరోయిన్‌కు శాస్త్రీయ నృత్యంలో ప్రావీణ్యం ఉండాలి. అందుకే శ్రద్ధా శ్రీనాథ్‌ను తీసుకున్నాం. ఈ నెల 19న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ‘‘ఫ్యామిలీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. రెండేళ్ల క్రితమే ఈ కథ వినిపించిన దర్శకుడు మూడున్నర నెలల క్రితం బౌండెడ్ స్రిప్ట్తో నా దగ్గరకు వచ్చాడు. కథ బాగా నచ్చడంతో నటించేందుకు ఒప్పుకున్నా’’ అన్నారు ఆది. ‘‘కన్నడలో రెండు, తమిళంలో ఓ సినిమా చేశా. తెలుగులో నా తొలి సినిమా ఇది’’ అన్నారు శ్రద్ధా శ్రీనాథ్. ఈ చిత్రానికి సంగీతం: ఫణి కళ్యాణ్, సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: రాఘవ చండ్ర, కొలిపెర్ల రోహిత్. -
పవన్ సినిమాలో బన్నీ విలన్
కాటమరాయుడు సినిమాతో మరోసారి నిరాశపరిచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తన నెక్ట్స్ సినిమా పనిలో బిజీ అయ్యాడు. జల్సా, అత్తారింటికి దారేది లాంటి హిట్ సినిమాలను అందించిన తివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి మరో సినిమా చేస్తున్నాడు పవన్. ప్రస్తుతం సెట్స్ ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇప్పటికే కోలీవుడ్ సీనియర్ నటి ఖుష్బూ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటుండగా, మరో కోలీవుడ్ స్టార్ ను పవన్ సినిమా కోసం తీసుకోనున్నారట. సరైనోడు సినిమాలో అల్లు అర్జున్ కు ప్రతినాయకుడిగా నటించిన కోలీవుడ్ హీరో ఆది, పవన్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడు. అయితే ఆది చేసేది పాజిటివ్ క్యారెక్టరా..? లేక నెగెటివ్ క్యారెక్టర్ఆ..? అన్న విషయం మాత్రం ఇంకా బయటకు రాలేదు. -
ఆదికి జోడిగా మరాఠి భామ
స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా చాలా రోజులుగా స్టార్ ఇమేజ్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో ఆది. డైలాగ్ కింగ్ సాయి కుమార్ వారసుడిగా వెండితెరకు పరిచయం అయిన ఆది.. ప్రేమకావాలి,లవ్ లీ లాంటి హిట్ సినిమాలో నటించిన స్టార్ ఇమేజ్ మాత్రం సొంతం చేసుకోలేకపోయాడు. వరుస ఫ్లాప్‌లతో కెరీర్‌ను ఇబ్బందుల్లో పడేసుకున్న ఆది, మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ఆడియన్స్ ముందు రానున్నాడు. బుల్లితెరపై నటుడిగా, దర్శకుడిగా ఆకట్టుకున్న ప్రభాకర్ దర్శకత్వంలో ఆది హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. వీ4 మూవీస్ బ్యానర్లో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమాలో ఆదికి జోడిగా ఓ మరాఠి భామను ఎంపిక చేశారు. మరాఠితో పాటు తమిళ, కన్నడ సినిమాల్లోనూ నటించిన వైభవీ శాండిల్య, ఆది సరసన హీరోయిన్గా నటిస్తోంది. గీతా ఆర్ట్స్ 2, యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీస్ సంస్థలు సంయుక్తంగా వీ 4 మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. -
వీ4 తొలి సినిమా ఆదితో..!
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, యువి ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలతో కలిసి వీ4 పేరుతో కొత్త బ్యానర్ నెలకొల్పిన సంగతి తెలిసింది. ముందుగా ఈ బ్యానర్ పై భారీ చిత్రాలను మాత్రమే తెరకెక్కిస్తారన్న ప్రచారం జరిగింది. అయితే ఈ బ్యానర్ తొలి ప్రయత్నంగా ఓ చిన్న సినిమాను ప్రారంభిస్తున్నారు. ఎలాంటి అంచనాలు లేని డిఫరెంట్ కాంబినేషన్‌ను ఈ సినిమా కోసం సెట్ చేస్తున్నారు. ఇప్పటికే హీరోతో పాటు దర్శకుణ్ని కూడా ఫైనల్ చేసిన నిర్మాతలు త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్కు రెడీ అవుతున్నారు. కెరీర్ స్టార్టింగ్‌లో మంచి ఫాంలోనే కనిపించినా.. తరువాత వరుస ఫ్లాప్ లతో కష్టాల్లో పడ్డ హీరో ఆది. సాయికుమార్ తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆది, హీరోగా స్టార్ ఇమేజ్ కోసం పోరాడుతున్నాడు. ఈ యంగ్ హీరోతో టీవీ స్టార్ ప్రభాకర్ దర్శకత్వంలో ఓ సినిమాను ప్లాన్ చేస్తోంది వీ4 సంస్థ. గతంలో ప్రభాకర్ దర్శకత్వంలో శిరీష్ హీరోగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో సినిమా పట్టాలెక్కనుందన్న వార్త వినిపించింది. అయితే శిరీష్ సినిమాను పక్కన పెట్టేసిన ప్రభాకర్ ఆది హీరోగా సినిమాను రూపొందించే పనిలో ఉన్నాడు. ఈ సినిమాతో పాటు ఈ ఏడాదిలోనే మరో రెండు చిన్న మీడియం రేంజ్ సినిమాలను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. -
నలుగురు హీరోలతో మల్టీ స్టారర్
టాలీవుడ్ యంగ్ హీరోలు ఈగోలను పక్కన పెట్టి కలిసి పనిచేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. దీంతో మరో యూత్ మల్టీ స్టారర్‌కు రంగం సిద్ధమవుతోంది. ఈ సినిమాలో ఇద్దరు, ముగ్గురు కాదు ఏకంగా నలుగురు యంగ్ హీరోలు కలిసి నటిస్తున్నారు. ఇప్పటికే మల్టీ స్టారర్ సినిమాలు చేసిన సందీప్ కిషన్, నారా రోహిత్ తో పాటు సుదీర్ బాబు, ఆదిలు కలిసి ఒకే సినిమాలో కనిపించబోతున్నారు. విభిన్న చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన నారా రోహిత్.. బాలీవుడ్ లో విలన్ గా కూడా చేసొచ్చిన సుధీర్ బాబు.. తెలుగు, తమిళ భాషల్లో బిజీగా ఉన్న సందీప్ కిషన్.. మాస్ ఇమేజ్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్న సాయి కుమార్ కొడుకు ఆది. ఈ నలుగురు ఇప్పుడు ఒక సినిమాకు సైన్ చేశారట. సుదీర్ బాబు హీరోగా భలే మంచి రోజు సినిమాను తెరకెక్కించిన శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ సంస్థ ఈ నలుగురు హీరోల మల్టీ స్టారర్‌ను రూపొందిస్తుంది. ఇప్పటికే ఈ భారీ మల్టీ స్టారర్లో నటించేందుకు నలుగురు హీరోలు ఒకే చెప్పేశారు. మార్చిలో ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. -
ఆదిని కొత్తగా ఆవిష్కరించే మరగద నాణయం
యువ నటుడు ఆదిని కొత్త డైమన్సన్‌లో ఆవిష్కరించే చిత్రంగా మరగద నాణయం ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు ఏఆర్కే.శరవణన్ అంటున్నారు. యాక్సెస్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై జి.ఢిల్లీబాబు నిర్మిస్తున్న చిత్రం మరగదనాణయం. ఆది కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయనకు జంటగా నిక్కీగల్రాణి నటిస్తున్నారు.ఇతర పాత్రల్లో ఆనంద్‌రాజ్, మునీష్కాంత్, కాళీవెంకట్, అరుణ్‌రాజ్ కామరాజ్, డానీ, కోటశ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఎంఎస్.భాస్కర్, మైన్ గోపి నటిస్తున్నారు. దిబునినన్ థామస్ సంగీతాన్ని, పీవీ.శంకర్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం వివరాలను బుధవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు తెలుపుతూ ఇది ఎడ్వెంచర్, ఫాంటసీ, కామెడీ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. చిత్ర కథ, కథనాలు ఇంతకు ముందెప్పుడూ ప్రేక్షకులు చూడనటువంటివిగా ఉంటాయని తెలిపారు. నటుడు ఆది ఇంతకు ముందు యాక్షన్ కథా చిత్రాల్లో నటించినా, ఈ చిత్రం ఆయన్ని కొత్త కోణంలో ఆవిష్కరించేదిగా ఉంటుందన్నారు. ఈ చిత్ర రూపకల్పనలో పూర్తి స్వేచ్ఛను ఇస్తున్న నిర్మాత ఢిల్లీబాబుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు.కథా బలం ఉన్న చిత్రాలనే నిర్మించాలన్నది యాక్సెస్ ఫిలిం ఫ్యాక్టరీ లక్ష్యం అని నిర్మాత తెలిపారు. 90 కథల్లో ఎంపిక చేసిన కథ ఇదని చెప్పారు. విభిన్న కథా చిత్రంలో నటిస్తునందుకు చాలా సంతోషంగా ఉందని హీరో ఆది పేర్కొన్నారు. -
కార్తీకేయ., ఆది చేజారినట్టేనా..?
స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. స్టార్ ఇమేజ్ కోసం చాలా రోజులుగా పోరాడుతున్న యంగ్ హీరో ఆది. కెరీర్లో ప్రేమకావాలి, లవ్లీ లాంటి హిట్ సినిమాలు ఉన్నా కమర్షియల్ స్టార్‌గా ప్రూవ్ చేసుకునే సినిమాలు మాత్రం ఇంత వరకు రాలేదు. దీంతో తెలుగుతో పాటు కన్నడ మార్కెట్ మీద కూడా దృష్టి పెట్టిన ఆది ఓ రీమేక్ సినిమాతో సాండల్‌వుడ్‌లో ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఆది ఆశలు నేరవేరేలా కనిపించటం లేదు. తెలుగులో నిఖిల్ హీరోగా తెరకెక్కిన కార్తీకేయ సినిమాను కన్నడ రీమేక్ చేయాలని ప్లాన్ చేశాడు ఆది. అయితే ఆ సినిమాను ఇప్పుడు మరో నటుడు అభిషేక్ వర్మ హీరోగా రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ప్రస్తుతం రవిబాబు దర్వకత్వంలో తెరకెక్కుతున్న అదిగో సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న అభిషేక్ వర్మ, కార్తీకేయ రీమేక్‌తో సాండల్‌వుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేసుకున్నాడు. ఈ సినిమాను అభిషేక్ వర్మ తండ్రి స్వయంగా నిర్మించాలని భావిస్తున్నాడు. ఇప్పటికే ప్రయత్నాలు కూడా మొదలైపోయాయి, ఈ రీమేక్ కోసం కన్నడ నాట బాగా పాపులర్ అయిన క్రేజీ టైటిల్‌ను రిజిస్టర్ చేయించారట. 'కుమారస్వామి' పేరుతో ఈ సినిమా రీమేక్‌కు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న టాక్ వినిపిస్తొంది. -
డై..లాగి కొడితే...
సినిమా : ఆది రచయితలు: పరుచూరి బ్రదర్స్ దర్శకత్వం: వీవీ వినాయక్ ఆది (ఎన్టీఆర్), నందు (కీర్తిచావ్లా) కాలేజీలో ప్రేమించుకుంటారు. తన ప్రేమ విషయం తండ్రి నాగిరెడ్డికి (రాజన్ పి.దేవ్) చెబుతుంది నందు. ఆదిని ఇంటికి పిలిపించమని కూతురికి చెబుతాడు తండ్రి. నాగిరెడ్డి ఇంటికొచ్చిన ఆది.. నా పేరు ఆదికేశవ రెడ్డి అంటాడు. అంటే.. అని నాగిరెడ్డి ఆరా తీయబోతుండగా.. ఎస్.. ఆయన మనవడినే. ‘నాగిరెడ్డి.. నేనెవరో తెలిసాక నువ్వు పరువుగా ఫీలయ్యే నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయవని నాకు బాగా తెలుసు. కానీ, నువ్వు చేసినా.. చేయకపోయినా నీ పరువుకి తాళి కట్టేది నేనే’ అంటాడు ఆది. రేయ్ అని నాగిరెడ్డి అరిస్తే.. రేయ్..అరవకు.. అమ్మతోడు.. అడ్డంగా నరికేస్తా! చెప్పేది విను అంటూ నాగిరెడ్డికి వార్నింగ్ ఇస్తాడు ఆది. అమ్మ తోడు... ఈ డైలాగ్ సూపర్ హిట్.. -
మీసై మురుక్కు అంటున్న హిప్ హాప్ తమిళ
తమిళసినిమా: వృత్తి ఏదైనా దాన్ని ప్రేమించి చేయాలి. అప్పుడే అందు లో విజయపుటంచులను చూడగలం. అందుకు ఉదాహరణలు ఎన్నో. ఇక ఒక చిన్న కుర్రాడు సంగీతంపై మోహం తో తానే సంగీత ఆల్బమ్‌ను తయారు చేసుకున్నాడు. అది సంగీత ప్రియుల మధ్య విశేష ఆదరణను పొందింది. ఆ తరువాత ఆ యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌తో కలిసి కొన్ని చిత్రాలలో పాటలు పాడి గాయకుడిగాను పేరు తెచ్చుకున్నాడు. ఆ పాటలు కూడా ప్రాచుర్యం పొందాయి. అలా అతనిలోని టాలెంట్‌ను గుర్తెరిగిన సినీ ప్రముఖుల్లో సుందర్.సీ ఒకరు. అంతే తాను దర్శకత్వం వహించిన ఆంబళ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా ఆ యువకుడిని పరిచయం చేశారు. ఆ కుర్రాడెవరో ఇప్పటికే మీకు అర్థం అయి ఉంటుంది. ఎస్. ప్రస్తుతం యువ సంగీత తరంగంగా దూసుకుపోతున్న ఆయనే హిప్ హాప్ తమిళ ఆది. అర ణ్మణై-2,తనీఒరువన్ తదితర సంచలన విజయాలను సొంతం చేసుకున్న చిత్రాల సంగీతదర్శకుడు హిప్ హాప్ తమిళ ఇప్పుడు పలు కోణాల్లో తన ప్రతిభను నిరూపించుకోవడానికి సిద్ధం అయ్యారు. మీసై మురుక్కు చిత్రం ద్వారా కథకుడు, సంగీతదర్శకుడు, దర్శకుడు, కథానాయకుడు అంటూ పలు విధాలుగా తెరవెనుక, తెర ముందుకు రాబోతున్నారు. సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చిన దర్శకుడు సుందర్.సీనే ఈయనకు దర్శకుడిగానూ, కథానాయకుడిగానూ అవకాశం కల్పించడం విశేషం. తాను జల్లికట్టు ఇతివృత్తంగా రూపొందించిన వీడియో ఆల్బమ్‌ను చూసి దర్శకుడు సుందర్.సీ హీరోగానూ,దర్శకుడిగానూ అవకాశం ఇచ్చారని హిప్ హాప్ తమిళ చెప్పారు. అవ్నీ పిక్చర్స్ పతాకంపై ఆయన నిర్మిస్తున్న మీసై మురుక్కు చిత్రంలో హిప్ హాప్ తమిళ సరసన నవ నటి ఆద్మిక నాయకిగా పరిచయం అవుతున్నారు. హాస్యనటుడు వివేక్ ఆయనకు మామగా నటిస్తున్న ఈ చిత్రం ఆడియోను దసరా పండుగ సందర్భంగా విడుదల చేశారు. -
'పక్కింటి అబ్బాయి'గా చుట్టాలబ్బాయి..
ఇటీవల 'చుట్టాలబ్బాయి'గా ప్రేక్షకులను పలకరించిన ఆది త్వరలో 'పక్కింటి అబ్బాయి'గా అలరించనున్నాడు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన 'చుట్టాలబ్బాయి' సినిమా ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఫ్యామిలీ ఎంటర్టెయినర్గా తెరకెక్కిన చుట్టాలబ్బాయి సినిమా ఆదికి చెప్పుకోదగ్గ హిట్ ఇచ్చింది. అదే ఉత్సాహంతో ఇప్పుడు 'పక్కింటి అబ్బాయి'ని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. 'పక్కింటి అబ్బాయి'ని స్వయంగా తానే నిర్మిస్తానని ఆది తండ్రి, ప్రముఖ నటుడు సాయికుమార్ తెలిపారు. ఇదివరకు ఆది హీరోగా వచ్చిన 'గరం' సినిమాకు సాయి కుమారే నిర్మాతగా వ్యవహరించారు. -
ఏట్టి రీమేక్‌లో ఆది..?
చుట్టాలబ్బాయి సినిమాతో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన యంగ్ హీరో ఆది, తరువాత చేయబోయే సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఎక్కువగా లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న క్యారెక్టర్లలో మాత్రమే కనిపించిన ఆది, భవిష్యత్తులో ప్రయోగాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ముఖ్యంగా క్రీడా నేపథ్యం ఉన్న సినిమాల్లో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. స్కూల్ డేస్ నుంచి మంచి రన్నర్‌గా పేరున్న ఆది తమిళ్లో ఘన విజయం సాధించిన ఏట్టి సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఓ వింత వ్యాదితో బాదపడుతున్న క్రీడాకారుడి కథగా తెరకెక్కిన ఈ సినిమాను ముందుగా నాగశౌర్యతో రీమేక్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే తాజాగా ఆది స్టేట్ మెంట్‌తో ఏమైనా మార్పులు జరుగుతాయేమో చూడాలి. -
వైభవాల రాముడొచ్చేశాడే...
రియల్ లైఫ్‌లో తండ్రీ కొడుకులైన సాయి కుమార్, ఆది రీల్ లైఫ్‌లో తొలిసారి తండ్రీ కొడుకులుగా నటించిన చిత్రం ‘చుట్టాలబ్బాయి’. వీరభద్రమ్ దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్, ఎస్.ఆర్.టి మూవీ హౌస్ పతాకంపై వెంకట్ తలారి, రామ్ తాళ్లూరి నిర్మించారు. నమితా ప్రమోద్ కథానాయిక. ఎస్ఎస్ తమన్ స్వరపరచిన పాటలు ఇటీవల విడుదలయ్యాయి. సాయికుమార్ పుట్టినరోజును పురస్కరించుకుని హైదరాబాద్‌లో ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ‘రంగరంగ వైభవాల రాముడొచ్చేశాడే... రంగు రంగు సంబరాల కానుకిచ్చేశాడే...’’ అంటూ సాగే టీజర్లో సాయికుమార్, ఆది అలరించారు. ‘‘పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కింది. అన్నివర్గాల వారికి నచ్చుతుందనే నమ్మకం ఉంది. బ్యాంకాక్‌లో తీసిన ఆది ఇంట్రడక్షన్ సాంగ్ సినిమాకే హైలెట్. తమన్ మంచి పాటలిచ్చాడు. సినిమాను త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని దర్శకుడు తెలిపారు. -
చుట్టాలబ్బాయి రిస్క్ చేస్తున్నాడా..?
డైలాగ్ కింగ్ సాయికుమార్ వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో ఆది. ప్రేమకావాలి, లవ్లీ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న ఆది, తరువాత వరుస ఫెయిల్యూర్స్‌తో వెనకపడ్డాడు. గత రెండేళ్లలో చేసిన ప్యార్ మే పడిపోయానే, రఫ్, గరం లాంటి సినిమాలు ఆది కెరీర్‌కు ఏమాత్రం కిక్ ఇవ్వలేదు. దీంతో తన ఆశలన్ని రాబోయే చుట్టాలబ్బాయి మీదే పెట్టుకున్నాడు. భాయ్ లాంటి డిజాస్టర్ తరువాత వీరభద్రం చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావటంతో ఆది కెరీర్‌కు చుట్టాలబ్బాయి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో అన్న ఆలోచనలో ఉన్నారు. ఇలాంటి సమయంలో రిలీజ్ డేట్ విషయంలో కూడా రిస్క్ చేస్తున్నాడీ యంగ్ హీరో. ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న చుట్టాలబ్బాయిని ఆగస్టు 5న రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే అదే రోజున మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ లీడ్ రోల్లో తెరకెక్కిన మనమంతాతో పాటు అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన శ్రీరస్తు శుభమస్తు సినిమా కూడా రిలీజ్ అవుతోంది. ఈ రెండు సినిమాలకు కాస్త పాజిటివ్ టాక్ ఉండటంతో పాటు బిజినెస్ పరంగా కూడా చుట్టాలబ్బాయి కన్నా ఒకడుగు ముందే ఉన్నాయి. మరి ఈ కాంపిటీషన్లో చుట్టాలబ్బాయి పోటి పడి గెలుస్తాడా..? -
‘చుట్టాలబ్బాయి’ ఆడియో రిలీజ్
-
ఆదితో కలసి నటించడం కిక్ ఇచ్చింది
- సాయికుమార్ ‘‘ఇప్పటి తరంలో ప్రతిభ చాలా ఉంది. కానీ, వారికి ప్రోత్సాహం లభించడం లేదు. కొత్త తరాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత దర్శక-నిర్మాతలపై ఉంది. పీజే శర్మ కుటుంబం ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చింది. మంచి హీరోకి కావాల్సిన లక్షణాలన్నీ ఆదిలో ఉన్నాయి’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. ఆది, నమితాప్రమోద్ జంటగా శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్, ఎస్.ఆర్.టి మూవీ హౌస్ పతాకంపై వీరభద్రమ్ దర్శకత్వంలో వెంకట్ తలారి, రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న చిత్రం ‘చుట్టాలబ్బాయి’. ఎస్ఎస్ తమన్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని తలసాని విడుదల చేసి దర్శకుడు కొరటాల శివకు అందించారు. హీరో సుధీర్‌బాబు ట్రైలర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ - ‘‘తెలంగాణ ప్రభుత్వం చిన్న చిత్రాల కోసం ఐదో ఆటకు వెసులుబాటు కల్పిస్తోంది. డెరైక్టర్ కొరటాల శివ పెద్ద హీరోలతో పాటు చిన్న హీరోలను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ‘చుట్టాలబ్బాయి’ విజయవంతమై చిత్ర బృందానికి మంచి పేరు తీసుకురావాలి’’ అన్నారు. వీరభద్రమ్ మాట్లాడుతూ- ‘‘ఆది, సాయికుమార్‌గారు మొదటిసారి కలిసి నటించిన చిత్రమిది. ఈ చిత్రంతో మా నిర్మాతలకు ‘చుట్టాలబ్బాయి’ అనేది ఇంటి పేరుగా మారిపోతుంది. అంత బాగా నిర్మించారు’’ అన్నారు.‘‘మేం ఈ చిత్రం నిర్మించామంటే కారణం వీరభద్రమ్. తను పని రాక్షసుడు. ఈ సినిమా బాగా తీశాడు’’ అని నిర్మాతలు తెలిపారు. సాయికుమార్ మాట్లాడుతూ- ‘‘నేను, మా అబ్బాయి ఆది కలిసి ఓ చిత్రం చేయాలనుకుంటున్న సమయంలో ఈ చిత్రం కుదిరింది. ఆదితో కలిసి నటించడం నాకు కిక్ ఇచ్చింది. కుటుంబ సమేతంగా చూసేలా వీరభద్రమ్ ఈ చిత్రం తెరకెక్కించారు’’ అని పేర్కొన్నారు. ఈ వేడుకలో ఆది, నమితా ప్రమోద్, ఎస్ఎస్ తమన్, హీరోలు సందీప్ కిషన్, రాజ్ తరుణ్, నిర్మాతలు కేకే రాధామోహన్, మల్కాపురం శివకుమార్, శ్రీమతి జీవితా రాజశేఖర్, దర్శకుడు అనిల్ రావిపూడి, రచయితలు కోన వెంకట్, బీవీఎస్ రవి, పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి తదితరులు పాల్గొన్నారు. -
కన్నడ కార్తికేయలో ఆది?
డైలాగ్ కింగ్ సాయికుమార్ వారసుడిగా టాలీవుడ్‌కు పరిచయం అయిన యంగ్ హీరో ఆది. తొలి సినిమాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఆది.. తరువాత మాస్ యాక్షన్ సినిమాల మీద దృష్టి పెట్టి ఇబ్బందుల్లో పడ్డాడు. ప్రస్తుతం వీరభద్రం దర్శకత్వంలో చుట్టాలబ్బాయి సినిమాలో నటిస్తున్నాడు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు ఆది. అదే సమయంలో కన్నడ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. సాయికుమార్‌కు టాలీవుడ్‌తో పాటు శాండల్‌వుడ్‌లో కూడా స్టార్ ఇమేజ్ ఉంది. సాయికుమార్ హీరోగా తెరకెక్కిన కన్నడ చిత్రాలు మంచి సక్సెస్‌లు సాధించాయి. దీంతో ఆదిని కూడా కన్నడలో హీరోగా పరిచయం చేసే ఆలోచనలో ఉన్నాడు సాయికుమార్. నిఖిల్ హీరోగా టాలీవుడ్లో మంచి సక్సెస్ సాధించిన కార్తీకేయ సినిమాను ఆది హీరోగా కన్నడలో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట. తెలుగులో చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ఈ థ్రిల్లర్ హీరోగా.. నిఖిల్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆది విషయంలో కూడా అదే వర్క్ అవుట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నాడు డైలాగ్ కింగ్. మరి తెలుగు నాట స్టార్ ఇమేజ్ కోసం కష్టపడుతున్న, ఆది శాండల్‌వుడ్ ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి. -
‘చుట్టాలబ్బాయి’లో సాయికుమార్
పేరవరం గౌతమీ గోదావరి చెంతన సోమవారం ‘చుట్టాలబ్బాయి’ సినీ సందడి నెలకొంది. సినిమా షూటింగ్ నిమిత్తం వచ్చిన నటులతో గ్రామం కోలాహలంగా మారింది. హీరో ఆది, హీరోయిన్లు నమితా ప్రమోద్, యామిని, పృథ్వి, పోసాని కృష్ణమురళి, జీవా తదితరులపై వివిధ సన్నివేశాలను దర్శకుడు వీరభద్రం తెరకెక్కించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఆర్టీ మూవీస్ అండ్ ఐశ్వర్యలక్ష్మి బేనర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామన్నారు. ధవళేశ్వరం, కడియపులంక, ఆత్రేయపురం తదితర ప్రాంతాల్లో ఈ నెల 20 వరకూ షూటింగ్ జరుగుతుందని తెలిపారు. ఈ సినిమాలో ఒక విలక్షణ పాత్రలో సాయికుమార్ నటిస్తున్నారని చెప్పారు. గతంలో అహ నా పెళ్లంట, పూలరంగడు, బాయ్ తదితర చిత్రాలు నిర్మించామన్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా సన్నివేశాలను అందంగా చిత్రీకరించేందుకు ఇక్కడకు వచ్చినట్టు తెలిపారు. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం వీరభద్రం. సంగీతం ఎస్ఎస్ థమన్, నిర్మాత రామ్ తలారి. - పేరవరం (ఆత్రేయపురం) -
గరం మసాలా
కొత్త సినిమా గురూ! చిత్రం: ‘గరం’ తారాగణం: ఆది, అదాశర్మ, చైతన్యకృష్ణ కథ, మాటలు: శ్రీనివాస్ గవిరెడ్డి కెమేరా: టి. సురేందర్ రెడ్డి సంగీతం: అగస్త్య సమర్పణ: వసంత శ్రీనివాస్ నిర్మాత: సురేఖ పి స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్.ఆర్. మదన్ పిల్లలు పెరుగుతున్నప్పుడు వాళ్ల ఈడువాళ్ళయిన పక్కింటి అబ్బాయితోనో, అమ్మాయితోనో తల్లి తండ్రులు పోల్చడం సహజం. ఆ క్రమంలో ఒకర్ని తక్కువ చేస్తూ, వేరొకర్ని ఎక్కువ చేయడమూ సహజం. అలా ప్రత్యర్థులుగా పెరిగిన ఇద్దరు సమ వయస్కుల్లో ఒకరు అనుకోకుండా చిక్కుల్లో పడితే? అప్పుడు రెండోవాడే సహాయానికొస్తే? ఇదీ స్థూలంగా ‘గరం’ ఇతివృత్తం. ఇటీవలే ‘సీతమ్మ అందాలు - రామయ్య సిత్రాలు’తో దర్శకుడైన రచయిత శ్రీనివాస్ గవిరెడ్డి మాటలతో సహా అందించిన కథ ఇది. నటుడు సాయికుమార్ తొలిసారిగా నిర్మాణ బాధ్యతలు తలకెత్తుకొని, స్వయంగా నిర్మించిన సినిమా. వివరంగా కథ చెప్పాలంటే, అనగనగా ఒక ఊరు. అందులో బలరామ్ (తనికెళ్ళ భరణి), మూర్తి (సీనియర్ నరేశ్)లవి పక్క పక్క ఇళ్ళు. బలరామ్ కొడుకు వరాల బాబు అలియాస్ వరం (ఆది). మూర్తి కొడుకు రవి (చైతన్యకృష్ణ). పక్కింటి రవి బాగా చదువుతున్నాడనీ, ప్రయోజకుడనీ చిన్నప్పటి నుంచి పోలికలు తేవడంతో రవి అంటే వరానికి పడదు. దానికితోడు మూర్తి కూడా తన కొడుకు గురించి నలుగురితో గొప్పగా చెబుతూ ఉంటాడు. పెద్దయిన మన హీరో వరం చివరకు ‘మీ అందరితో గొప్పవాణ్ణి అనిపించుకుంటా’ అంటూ తన ఫ్రెండ్ (‘షకలక’ శంకర్)తో కలసి, సిటీకి బస్సెక్కేస్తాడు. అక్కడ బురఖాలోని అమ్మాయి (అదా శర్మ)ను చూసి ప్రేమి స్తాడు. ఆ అమ్మాయి కోసం ఏమైనా చేయడానికి సిద్ధమంటాడు. అదే సమయంలో బిజూ (కబీర్ దుహన్ సింగ్) అనుచరులు (సత్యప్రకాశ్ వగైరా) ఒక ఫోటో చేతిలో పెట్టుకొని, వెతుకుతుంటారు. ఆ వెతుకుతు న్నది ఎవరి కోసమనేది సస్పెన్స్‌గా నడుస్తుంటుంది. వారు ఎవరి కోసం, ఎందుకు వెతుకుతున్నారనే ఆసక్తికరమైన ట్విస్ట్ దగ్గర ఇంటర్వెల్ కార్డు పడుతుంది. సెకండాఫ్‌లో ఈ సస్పెన్స్ స్టోరీలోని ఒక్కో కోణం గురించి విడతలవారీగా వేర్వేరు ఫ్లాష్ బ్యాక్‌లతో విషయం బయటకు రావడం మొదలవు తుంది. హీరో తాను సిటీకి రావడం వెనుక ఉన్న అసలు కథ వివరిస్తాడు. తర్వాత కథాక్రమంలో - హీరో ప్రేమిస్తున్న హీరోయిన్‌కూ, విలన్లు వెతుకుతున్న వ్యక్తికీ లింక్ ఏమిటనే మరో ఇంట్రెస్టింగ్ కథ బయటకొస్తుంది. అవన్నీ ఏమిటన్నది తెరపై చూడాల్సిన విషయాలు. ‘లవ్లీ రాక్‌స్టార్’ బిరుదుతో ముందుకొచ్చిన ఆది ఇటీవలి చిత్రాలన్నిటి యువ హీరోల ఫక్కీలోనే... హుషారుగా నర్తించారు. ఫైట్లు చేశారు. కథలో ట్విస్టులకు అదాశర్మ, కీలకపాత్రగా సీనియర్ నరేశ్, కామెడీకి పోసాని, ‘థర్టీ ఇయర్స్’ పృథ్వి- ఇలా చాలామంది ఈ సినిమాలో ఉన్నారు. ఆమిర్‌ఖాన్ ‘పీకే’ సిన్మాకూ, పాత్రకూ పేరడీగా బ్రహ్మానందం చేసిన కామెడీ, హీరో ఫ్రెండ్‌గా ‘షకలక’ శంకర్ కొన్నిచోట్లా బాగా నవ్విస్తారు. సినిమా చివరలో వచ్చే మంచి సెంటిమెంట్ కోణానికి నరేశ్ నటన కలిసొచ్చింది. గతంలో ‘పెళ్ళయిన కొత్తలో’ లాంటి చిత్రాలకు బాణీలు కూర్చిన యువ సంగీత దర్శకుడు అగస్త్య చాలాకాలం తర్వాత మళ్ళీ వినిపించిన చిత్రం ఇది. ‘గరవ్ు గరవ్ు...’ లాంటి మాస్ గీతాలు, ‘సహారా సహారా సమీరా’ లాంటి సాఫ్ట్ పాటలు, ‘ఒయ్యారిభామా సయ్యాడదామా’ లాంటి బీట్లూ ఉన్నాయి. సమయ, సందర్భాల ఆలోచన లేకుండా వాటిని విని, చూసి ఆనందించాలి. గతంలో పలు హిందీ చిత్రాలకు ఛాయాగ్రహణం అందించిన కెమేరామన్ టి. సురేందర్‌రెడ్డి అనుభవం సినిమాకు పనికొచ్చేదే. చంద్రసిద్ధార్థ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆ నలుగురు’కి కథారచయిత మదన్. ఆ తరువాత దర్శకుడిగా మారి, ‘పెళ్ళయిన కొత్తలో’, ‘ప్రవరాఖ్యుడు’ అందించిన ఆయన చావో, రేవోగా భావించి, ఈ ‘గరం’ కోసం సర్వశక్తులూ ఒడ్డారు. సామాన్య జనం మెచ్చడం కోసం అన్ని రకాల విన్యాసాలూ చేశారు. ఫస్టాఫ్ అంతా క్యారెక్టర్ల పరిచయం, కథకు తగ్గ పునాది సెట్ చేయడానికి పనికొచ్చింది. తొలి గంటలోనే ఐటమ్ సాంగ్ సహా మూడు పాటలు, రెండు ఫైట్లు వచ్చేస్తాయి. ఇక, అసలు కథ ఇంటర్వెల్ దగ్గర్నుంచి ఊపందుకుంటుంది. తీసుకున్న పాయింట్ కొత్తగా ఉన్నా, మాస్కు దూరం జరగకుండా అలవాటైన చిత్రాల ధోరణిలో వెళ్ళాలని చేసిన ప్రయత్నంగా ఈ ‘గరం’ చిత్రం ఒక మాస్ మసాలా! -
ఆ వీడియోలు చూస్తే టెన్షన్ మొత్తం ఎగిరిపోతుంది!
‘‘ఆదికి మంచి హిట్ రావాలని చాలామంది కోరుకుంటున్నారు. ఆ కోరికను ‘గరం’ నెరవేరుస్తుంది’’ అంటున్నారు ఆది. మదన్ దర్శకత్వంలో ఆయన నటించిన ‘గరం’ నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. యూత్, మాస్, ఫ్యామిలీస్‌ని ఆకట్టుకునే లవబుల్ ఎంటర్టైనర్ ఇదని ఆది పేర్కొన్నారు. ‘సాక్షి’తో ఆయన చెప్పిన ముచ్చట్లు... మీదేమో ‘పక్కింటి అబ్బాయి’ ఇమేజ్. మరి... మీకు ‘గరం’ టైటిల్ ఎలా సూటబుల్ అనుకున్నారు? యాక్చువల్‌గా ఈ సినిమాకి ముందు ‘పక్కింటి అబ్బాయి’ టైటిల్ పెడదామనుకున్నాం. మరీ సాఫ్ట్‌గా ఉందని పెట్టలేదు. ‘గరం’ టైటిల్‌తో సినిమా చేసినప్పటికీ ఫ్యామిలీస్‌కి ఇంకా దగ్గరైపోతాను. క్యారెక్టర్ అలా ఉంటుంది. ఇందులో నా పాత్ర పేరు వరాలబాబు. వంద మందిలో 80 మంది కుర్రాళ్లు వరాలబాబులా ఉంటారు. అందుకని యూత్‌కి కూడా ఇంకా దగ్గరవుతాను. ఆది బాగా యాక్ట్ చేస్తాడు.. బాగుంటాడనే పేరు తెచ్చుకున్నప్పటికీ రావాల్సిన స్థాయి మీకింకా రాలేదేమో అనిపిస్తోంది..? ఒకే సినిమాతో చిరంజీవిగారు, మహేశ్‌బాబు, రామ్‌చరణ్ అయిపోవాలంటే కష్టం. మా డాడీ, రవితేజ గారు కష్టపడి స్లోగా ఎదిగినవాళ్లే. ఇప్పుడు నాకొచ్చిన స్థాయికి నేను హ్యాపీగానే ఉన్నాను. వాస్తవానికి ఇలా సినిమా సినిమాకీ మెల్లిగా ఎదగడమే కరెక్ట్ అని నా ఫీలింగ్. ఓవర్‌నైట్ స్టార్డమ్ అనేది వచ్చినంత వేగంగానే వెళ్లిపోతుంది. ‘ఆది బాగా చేస్తాడు.. బాగుంటాడు’ అనే పాజిటివ్ ఒపీనియన్ తెచ్చుకోవడం అనేది నా కెరీర్‌కి బలమైన బేస్మెంట్లాంటిది. స్క్రిప్ట్ సెలక్షన్లో కొన్ని తప్పులు చేస్తున్నాడని కొంతమంది అనుకుంటు న్నారు తప్ప, నా మీద వేరే విధంగా బ్యాడ్ ఒపీనియన్ లేదు. అందుకే, ఇకపై స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో కేర్ తీసుకోవాలనుకుంటున్నా. పవన్ కల్యాణ్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, ప్రభాస్... ఇలా చాలామంది హీరోలకు ఏడో సినిమా హిట్. మరి.. ‘గరం’ మీకు ఏడో సినిమానే కదా..? నాకు ఏడో నంబర్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఏడుకొండలవాడంటే నాకు నమ్మకం. ఈ రోజు ఉదయం (గురువారం) గుడికి వెళ్లి, వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాను. ఇక.. సెవన్త్ నంబర్ సెంటిమెంట్ గురించి చెప్పాలంటే.. నాకా నంబర్ హ్యాపీయే. సెంటిమెంట్ వర్కవుట్ అయితే బాగానే ఉంటుంది. ఆ సెంటిమెంట్‌ని పక్కన పెడితే.. మంచి కథ-దర్శకుడితో సినిమా చేస్తే ఏడో సినిమా కాకపోయినా హిట్టవుతుంది. ‘గరం’లో మంచి కంటెంట్ ఉంది. మదన్‌గారు మంచి దర్శకుడు. చూసినవాళ్లందరూ చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. మీ నాన్న సాయికుమార్ తాను పడిన కష్టాల గురించి చెబుతుంటారా? నాన్నగారి కష్టాలను నేను స్వయంగా చూశాను. మా బాబాయ్ (రవిశంకర్, అయ్యప్ప పి. శర్మ)ల కష్టం కూడా తెలుసు. సోలో హీరోగా అవకాశం తెచ్చుకోవడం కోసం నాన్నగారు పడిన తపన తెలుసు. ‘పోలీస్ స్టోరీ’ హిట్టయ్యాక ఆ విజయం తాలూకు విలువ తెలుసు. మా నాన్నగారు సో గ్రేట్. ఎందుకంటే మా తాతగారు నాన్నకు ఇచ్చినది ఏమీ లేదు. తాతగారు (పీజే శర్మ) కూడా చాలా కష్టాలు పడ్డారు. నాన్నగారు పదో తరగతి టైమ్ నుంచే సంపాదించడం మొదలుపెట్టారు. తాతయ్య, నాన్న కలిసి మా అత్తయ్య పెళ్లి చేశారు. తోడబుట్టిన వాళ్లందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి మా నాన్నగారు. నాన్నగారి జీవితాన్ని విశ్లేషిస్తే మొత్తం త్యాగాలే ఉంటాయి. తోడబుట్టినవాళ్లు బాగుండాలనీ, ఇప్పుడు నా కెరీర్ బాగుండాలనీ.. ఇలా ఎప్పటికప్పుడు నాన్నగారు కుటుంబం కోసం ఆరాటపడుతుంటారు. మరి.. ఆయన కష్టపడి సంపాదించిన డబ్బుని ఇప్పుడిలా మీ సినిమాకి పెట్టుబడిగా పెట్టిన విషయంలో మీకు టెన్షన్ అనిపించడం లేదా? టెన్షన్ ఉంది. సేమ్ టైమ్ కాన్ఫిడెన్స్ కూడా ఉంది. మంచి కథతో సినిమా చేశాం. పబ్లిసిటీ బాగా చేశాం. నాన్నగారికి ఒక ప్రాజెక్ట్‌ని ప్రజల దగ్గరకు ఎలా తీసుకెళ్లాలో బాగా తెలుసు. రాజీపడకుండా నిర్మించారు. అంతే రాజీపడకుండా ప్రమోట్ చేశారు. నా గత చిత్రాలతో పోల్చితే పబ్లిసిటీ వైజ్‌గా ఈ సినిమా చాలా భారీగా ఉంది. మార్నింగ్ షోకే మంచి టాక్ వస్తే చాలు.. ఇక ఎవరూ ఆపలేరు. అది జరుగుతుందనే నమ్మకంతోనే నాన్నగారు రాజీపడలేదు. పాటలను ఇక్కడే తీద్దామని నేనంటే, నో కాంప్రమైజ్ అంటూ.. మూడు పాటలను ఇటలీలో తీద్దామన్నారు. అలాగే, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ల విషయంలో రాజీపడకుండా, మోస్ట్ వాంటెడ్ అనదగ్గ వాళ్లనే తీసుకున్నారు. నా గత చిత్రాల్లో ఏదో ఒక విషయంలో రాజీ పడాల్సి వచ్చేది. నాన్నగారే నిర్మాత కావడంవల్ల ఆ అవసరంలేకుండా పోయింది. మీ వయసుకి తగ్గట్టుగా మంచి లవ్‌స్టోరీలు చేయొచ్చు కదా..? ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, ఆషికీ లాంటి లవ్ స్టోరీస్ చేయాలనే ‘ప్యార్ మే పడిపోయానె’ చేశాను. కానీ, అది ఎక్కడో తడబడింది. ఇప్పటికీ నాకో లవ్‌స్టోరీ చేయాలని ఉంది. కానీ, మంచి కథ, దర్శకుడు కుదరాలి. పాటలు, ఫైట్లు అంటూ కమర్షియల్ మూవీస్‌కే పరిమితమవుతున్నారెందుకు? చిన్నప్పుడు నేను విపరీతంగా సినిమాలు చూసేవాణ్ణి. ఫైట్స్, సాంగ్స్ లేని సినిమాలకు తీసికెళితే చూడబుద్ధయ్యేది కాదు. హీరో అనేవాడు డ్యాన్సులు చేయాలి.. ఫైట్స్ చేయాలని అనుకునేవాణ్ణి. చిరంజీవిగారు, బాలకృష్ణగారు, నాగార్జునగారు, వెంకటేశ్‌గార్ల సినిమాలు చూసేవాణ్ణి. ‘గ్యాంగ్ లీడర్’, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ని ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు. హీరో డల్‌గా ఉంటే నాకు నచ్చదు. చాలా ఎనర్జిటిక్‌గా ఉండాలనుకుంటాను. అందుకే, ఎక్కువగా ఎనర్జిటిక్ క్యారెక్టర్స్ ఎంపిక చేసుకుంటాను. ఇంతకీ మీ పాప ముచ్చట్లు చెబుతారా? నా మిసెస్, పాప ఇంకా రాజమండ్రిలో మా అత్తగారింట్లోనే ఉన్నారు. పాప పుట్టి రెండు నెలలు అయ్యుంటుంది. నేను మాత్రం తనతో ఓ పది రోజులు ఉండి ఉంటానేమో. ఎప్పటికప్పుడు వీడియో తీసి మా ఆవిడ పంపిస్తుంటుంది. ‘గరం’ షూటింగ్, ప్రమోషన్స్‌తో బిజీగా ఉండి, పాపను చాలానే మిస్సయ్యాను. పాప వీడియోలు చూస్తే నా టెన్షన్ మొత్తం ఎగిరిపోతుంది. -
సాయికుమార్, ఆది వల్లే ఆ షాక్ నుంచి తేరుకున్నా!
‘ఆ నలుగురు’ సినిమా ఒక్కటి చాలు... రచయితగా మదన్ టాలెంట్ గురించి చెప్పడానికి. ‘పెళ్లైన కొత్తలో’ చిత్రంతో దర్శకునిగా కూడా భేష్ అనిపించుకున్నారాయన. ఆది, అదా శర్మ జంటగా ఆయన డెరైక్ట్ చేసిన ‘గరం’ ఈ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా మదన్‌తో జరిపిన భేటీ... * మీ ఇమేజ్ దృష్ట్యా ‘గరం’ టైటిల్‌తో మీ నుంచి సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదు? (నవ్వుతూ) యాక్చువల్‌గా నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. శ్రీనివాస్ గవిరెడ్డి ఈ లైన్ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. గరం అంటే కోపానికి పర్యాయ పదం అనుకుంటారు. ఇందులో రొమాన్స్ ఉంది. ఆ ఫీల్‌ని కూడా గరం అనొచ్చు. ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కూడా అలా అనొచ్చు. ఈ సినిమాలో ప్రేమ, రొమాన్స్, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. * ఈ సినిమా మధ్యలో ఆగడం, ఆ తర్వాత సాయికుమార్ టేకప్ చేయడం.. ఈ ప్రాసెస్ గురించి చెబుతారా? 2014లో ఓ షెడ్యూల్ చేశాం. ఆ తర్వాత జరిగిన యాక్సిడెంట్ వల్ల సినిమా ఆగింది. ఒక మంచి కథతో తీస్తున్న సినిమా ఆగడం నచ్చక హీరో ఆది తన తండ్రి సాయికుమార్ని ఒప్పించి, ఈ చిత్రాన్ని నిర్మించేలా చేశాడు. సాయికుమార్ ప్రాజెక్ట్‌ని టేకప్ చేశాక కేక్ వాక్‌లా అయ్యింది. నిర్మాతలు సురేఖ, వసంతా శ్రీనివాస్‌ల సహకారం మర్చిపోలేనిది. ఏది అడిగినా కాదన కుండా సమకూర్చి, సినిమా బాగా రావడానికి కారణమయ్యారు. మళ్లీ నా కెరీర్లో సాయికుమార్ అంతటి బెస్ట్ ప్రొడ్యూసర్ దొరుకుతారో లేదో? * ఇంతకూ ఆ యాక్సిడెంట్ గురించి చెప్పలేదు? ‘గరం’ ప్రాజెక్ట్ సెట్ అవ్వడానికి కారణం నా మిత్రుడు నాగిరెడ్డి. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత, నా రైట్ హ్యాండ్లాంటివాడు. ఈ చిత్రానికి సంబంధించిన పనుల మీద వెళుతూ జరిగిన యాక్సిడెంట్లో చనిపోయాడు. నేను చాన్నాళ్లు ఆ షాక్‌లోనే ఉండిపోయాను. సాయికుమార్, ఆది, నా కుటుంబ సభ్యులు, మిత్రుల వల్లే ఆ షాక్ నుంచి బయటపడగలిగాను. ఆది నమ్మకమే స్ఫూర్తిగా... ఈ సినిమా కోసం ఇటలీలోని గోర్మిటి అనే ఎత్తై ప్రదేశంలో ఒక సీన్ తీశాం. ఎముకలు కొరికే చలి. ఒంటి మీద పల్చని షర్ట్, ఫ్యాంట్‌తో ఆది ఆ సీన్ చేయాలి. మేమంతా కింద ఉన్నాం. తను పైకి ఎక్కాడు. ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకూ అక్కడే నిలబడ్డాడు. వాతావరణం అనుకూలించక ఆ రోజు షాట్ తీయలేదు. మర్నాడు మేం ఎక్కడ ఆ షాట్ వద్దంటామేమోనని ముందే కొండ ఎక్కేశాడు. అంత డెడికేషన్. ఈ చిత్రంపై ఆది పట్టుదల, నమ్మకం నాకు చాలా స్ఫూర్తిగా నిలిచాయి. కచ్చితంగా మా అందరికీ మంచి ఫలితం దక్కుతుందనే నమ్మకం ఉంది. * మంచి కంటెంట్‌తో సినిమాలు తీసే దర్శకుడు మీరు. మరి.. ఆదిలాంటి కమర్షియల్ హీరోకి కావాల్సిన ఎలిమెంట్స్ ఈ కథలో ఉన్నాయా? ‘పెళ్లైన కొత్త’లోని తీసుకుంటే.. వైవాహిక అనుబంధాన్ని కమర్షియల్‌గానే డీల్ చేశాను. బేసిక్‌గా నేను సోల్ లేకుండా సినిమా చేయడానికి ఇష్టపడను. ‘గరం’ ప్రేమ నేపథ్యంలో సాగే చిత్రం. వరాలు పాత్రను ఆది నరనరాన జీర్ణించు కుని చేశాడు. ఇప్పటివరకు చేసిన చిత్రాల ద్వారా ఆది బాగా డ్యాన్సులు, ఫైట్లు చేయగలడని ప్రూవ్ చేసుకున్నాడు. నటనాపరంగా కూడా మంచి మార్కులే తెచ్చుకున్నాడు. ఈ సినిమా నటుడిగా తనకు ఇంకా మంచి పేరు తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది. డైలాగ్ డెలివరీకి ప్రత్యేకంగా ప్రశంసలు లభిస్తాయి. ఆది హార్డ్ వర్క్, నమ్మకమే ఈ సినిమా. * సినిమా సినిమాకీ గ్యాప్ తీసుకుంటున్నారు.. కారణం ఏంటి? ఒకానొక దశలో సినిమా పరిశ్రమ నుంచి వెళ్లిపోదామనుకున్నాను. దానికో కారణం ‘ప్రవరాఖ్యుడు’ ఆశించిన ఫలితం ఇవ్వకపోవడం. ఆ సినిమా విడుదలైన రెండో రోజుకే రాజకీయాలపరంగా ఏర్పడిన పరిస్థితుల కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. అప్పటికి ఆంధ్రా సైడ్ మంచి టాక్ వచ్చింది. ఆ తర్వాత అక్కడా థియేటర్లు మూతపడ్డాయి. ఒక మంచి సినిమా అలా ఇగ్నోర్ అయిపోయినందుకు బాధపడ్డా. సినిమాలు ఎందుకులే? అనుకోవడానికి అదో కారణం. ఆ తర్వాత చేసిన రెండు వ్యాపారాలు వర్కవుట్ కాలేదు. దాంతో సినిమా పరిశ్రమే కరెక్ట్ అనిపించింది. * మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించలేదనే బాధ ఏదైనా ఉందా? మొదట్లో ఉండేది. ఆ తర్వాత అలా ఆశించడం సరికాదని తెలుసుకున్నా. గుర్తింపు రావడం అంటే ఏంటి? నలుగురూ అభినందించడమే కదా. ఇప్పుడు నేనో మంచి సినిమా చూశాననుకోండి.. ‘బాగుంది’ అనుకుంటాను తప్ప స్వయంగా ఫోన్ చేసి చెప్పను. అంటే.. ఆ సినిమా తీసినవాళ్లకు గుర్తింపు లేనట్లా? అలాగే నాకు స్వయంగా ఫోన్ చేయకపోయినా మనసులో అభినందించి ఉండొచ్చు. అసలెవరూ గుర్తించకపోతే అప్పుడు మన ఎఫర్ట్‌లో లోపం ఉన్నట్లు లెక్క. * మీ తదుపరి చిత్రాలు? ‘గరం’ మీద ఆధారపడి ఉంటుంది. ఆ సినిమాకి వచ్చే మార్కెట్‌ని బట్టి నాకు ఫోన్ కాల్స్ వస్తాయి (నవ్వుతూ). -
మరో రెండు వారాలు.. అదే జోరు..
ఇటీవల కాలంలో ఒకే రోజు రెండు మూడు సినిమాలు విడుదల కావడం మామూలైపోయింది. సంక్రాంతి బరిలో నాలుగు పెద్ద సినిమాలు పోటీ పడటం, దాదాపు అన్నీ మంచి కలెక్షన్లు సాధించటంతో, చాలామంది దర్శక నిర్మాతలు పోటీకే రెడీ అవుతున్నారు. ఎక్కువసార్లు వాయిదా వేయటం కన్నా బరిలో దిగి తేల్చుకోవటమే కరెక్ట్ అని భావిస్తున్నారు. అదే బాటలో మరో రెండువారాల పాటు తెలుగు వెండితెర మీద చిన్న సినిమాల జాతర కనిపించనుంది. ఈ వారం రెండు స్ట్రయిట్ సినిమాలతో పాటు మరో రెండు అనువాద చిత్రాలు వెండితెర మీద సందడి చేశాయి. అయితే ఈ సినిమాల రిజల్ట్ ఏంటో ఇంకా తేలకముందే వచ్చేవారం మరో మూడు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన రెండో సినిమా స్పీడున్నోడుతో పాటు, చాలారోజులుగా వాయిదా పడుతూ వస్తున్న వంశీ వెన్నెల్లో హాయ్ హాయ్, తమిళ్లో ఘనవిజయం సాధించిన కథాకళి చిత్రాలు ఫిబ్రవరి 5న రిలీజ్ అవుతున్నాయి. ఫిబ్రవరి 12న కూడా ఇదే స్థాయిలో పోటీ పడుతున్నారు చిన్న చిత్రాల నిర్మాతలు. భలే భలే మగాడివోయ్‌తో భారీ హిట్ కొట్టిన నాని కృష్ణగాడి వీర ప్రేమగాథతో రెడీ అవుతుంటే. సాయికుమార్ తనయుడు తొలిసారిగా సొంత నిర్మాణసంస్థలో తెరకెక్కిన గరం సినిమాను రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు. ఈ ఇద్దరితో తలపడటానికి మంచు వారబ్బాయి కూడా రెడీ అవుతున్నాడు. డిఫరెంట్ లుక్‌తో మనోజ్ హీరోగా తెరకెక్కిన శౌర్య సినిమా కూడా అదే రోజు రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇలా మూడు సినిమాలు ఒకేసారి రిలీజ్ కావటం చిన్న సినిమాలకు అంత మంచిది కాదంటున్నారు విశ్లేషకులు. పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజ్ అయినా.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, అదే స్థాయిలో ఓపెనింగ్స్ ఉంటాయి కాబట్టి గట్టెక్కెస్తాయి. కానీ చిన్న సినిమాల విషయంలో అలాంటి పరిస్థితి ఉండదు. సినిమాలో కంటెంట్ ఉండటంతో పాటు సరైన సమయంలో రిలీజ్ అయితే తప్ప కలెక్షన్లు సాధించే అవకాశం ఉండదు. మరి ఇలా ఒకేసారి బరిలో దిగుతున్న చిన్న సినిమాలు ఎంత వరకు ఆకట్టుకుంటాయో చూడాలి. -
ఆల్ ది బెస్ట్
పరీక్షలు బాగా రాసినప్పుడు ఫలితం బాగుంటుందనే నమ్మకం కలుగుతుంది. ఆది ఆ నమ్మకంతోనే ఉన్నారు. అదా శర్మతో కలిసి మదన్ డెరైక్షన్‌లో ‘గరం’ అనే పరీక్ష రాశారు ఆది. ఈ చిత్రాన్ని పరీక్ష అని ఆది ఎందుకు అంటున్నారంటే కథ విపరీతంగా నచ్చి, తన తండ్రి సాయికుమార్ని ఒప్పించి, నిర్మించేలా చేశారు. వసంతా శ్రీనివాస్ సమర్పణలో శ్రీనివాస సాయి స్క్రీన్స్ పతాకంపై పి. సురేఖ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయికుమార్ మాట్లాడుతూ - ‘‘ఆది నటించిన 7వ చిత్రమిది. తన కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. అన్ని కమర్షియల్ హంగులూ ఉన్నాయి. తొలిసారి అమెరికా, కెనడాలో ఈ చిత్రం భారీగా విడుదలవుతోంది. 2016వ సంవత్సరం చాలా మంచి ఊపుతో మొదలైంది. కొత్త ఏడాదిలో విడుదలైన సినిమాలన్నీ మంచి విజయం సాధించాయి. అన్ని సినిమాలూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే వాణ్ణి నేను’’ అన్నారు. ‘‘మంచి సినిమా చేశాం. విడుదల దగ్గర పడుతోంటే నెర్వస్‌గా, ఎగ్జయి టింగ్‌గా ఉంది. సినిమా సమస్యల్లో ఉన్నప్పుడు నాన్న నా భుజం తట్టి ప్రోత్సహించారు. చిత్రం చూసిన ప్రేక్షకులు డిజప్పాయింట్ కారు’’ అని ఆది పేర్కొన్నారు. సీనియర్ నరేష్ మాట్లాడుతూ - ‘‘పదహారు రకాల కూరలతో విందు భోజనం చేసినట్లుంటుందీ చిత్రం. ప్రతి ప్రేక్షకుడూ ఈ కథలో తనను తాను చూసుకుంటాడు. నేను చేసిన తండ్రి పాత్రకు మంచి పేరొస్తుంది. ఫ్యామిలీస్‌తో అందరూ చూసే మంచి సినిమా ఇది. సాయికుమార్ ‘బెస్ట్ ఫాదర్’. ఆది అందమైన హీరో. మంచి మనసున్న వాడు. కెరీర్‌వైజ్‌గా తనను మరో పదిమెట్లు ఎదిగేలా చేసే సినిమా ఇది. అతని కెరీర్ బెస్ట్ఫిల్మ్కు నా ఆల్ ది బెస్ట్’’ అని పేర్కొన్నారు. అదా శర్మ, సహ నిర్మాత బాబ్జీ పాల్గొన్నారు. సంగీతం: అగస్త్య, కెమెరా: సురేందర్ రెడ్డి. -
సంక్రాంతి మూడ్‌లో ఎయిర్ పోర్ట్
సంక్రాంతి పండక్కి రెల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లే కాదు ఎయిర్ పోర్ట్‌లు కూడా కిక్కిరిసి కనిపిస్తున్నాయి. దీంతో సెలబ్రిటీలకు కూడా క్యూలో నిలబడటం తప్పేలా లేదు. ఈ రోజు( మంగళవారం) శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో పరిస్థితి ఎలా ఉందో తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు హీరో ఆది. భారీ క్యూ లైన్ల ముందు నిలబడి సెల్పీ దిగి ట్వీట్ చేశాడు. ఎయిర్ పోర్ట్‌లో కూడా సంక్రాంతి మూడ్ అంటూ సరదాగా కామెంట్ చేశాడు. ఈ మధ్యే తండ్రిగా ప్రమోషన్ పొందిన ఆది ప్రస్తుతం తన తాజా చిత్రం 'గరం' రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు సాఫ్ట్ చిత్రాలకు మాత్రమే దర్శకత్వం వహించిన మదన్ ఈ సినిమాతో తొలిసారిగా మాస్ ఫార్ములాను ట్రై చేస్తున్నాడు. అంతేకాదు ఈ ఏడాది తండ్రి సాయి కుమార్ తో కలిసి నటించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు ఈ యంగ్ హీరో. Happy holidays airport all in sankranti mood :) pic.twitter.com/caeqne97Lx — Actor Aadi (@Aadi_Offl) January 12, 2016 -
చుట్టాలబ్బాయి పుట్టినరోజు
యంగ్ హీరో ఆది తన పుట్టిన రోజును మరింత ఆనందంగా జరుపుకుంటున్నాడు. తన లేటెస్ట్ సినిమా ఆడియో రిలీజ్‌తో పాటు మరో రెండు విశేషాలు ఈ రోజు(బుధవారం) పుట్టిన రోజుకు ఉన్నాయి. గత ఏడాది రాజమండ్రి అమ్మాయి అరుణను పెళ్లి చేసుకున్న ఆది, గత వారం తండ్రిగా ప్రొమోషన్ పొందాడు. అంతేకాదు ఆది తండ్రి ప్రముఖ నటుడు సాయికుమార్ లీడ్ రోల్లో తెరకెక్కిన కన్నడ సినిమా 'రంగితరంగ' ఈ ఏడాది ఆస్కార్ రేసులో నిలవటంతో ట్రిపుల్ హ్యాపీగా తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నాడు. ఆది పుట్టిన రోజు సందర్భంగా 'గరం' చిత్ర ఆడియో ఇవాళ సాయంత్రం గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. దీంతో పాటు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న మరో సినిమా 'చుట్టాలబ్బాయి' ఫస్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేసి, ఆది అభిమానులకు గిఫ్ట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఇలా యమా హ్యాపీగా ఉన్న ఆది జీవితంలోకి మంచి సక్సెస్ కూడా రావాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు శ్రేయోభిలాషులు. -
ఆ మ్యాజిక్కే వేరు!
ఆది ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉన్నాడు. నాలుగు రోజుల క్రితం తండ్రిగా ప్రమోటయ్యాడు. అందుకే ఈ రోజు జరుపుకునే తన బర్త్‌డేను చాలా స్పెషల్‌గా ఫీలవుతున్నాడు. ‘తండ్రి హోదాలో నేను ఫస్ట్ బర్త్‌డే జరుపుకోబోతున్నాను’’ అని సంబరపడిపోతూ చెప్పాడు ఆది. మదన్ దర్శకత్వంలో ఆది నటించిన ‘గరం’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆది చెప్పిన బర్త్‌డే కబుర్లు... ♦ ఫస్ట్ టైమ్ ఆ యాసలో మాట్లాడా... ‘గరం’ నాకు ఏడో సినిమా. తొలుత వేరే నిర్మాత మొదలుపెట్టారు. ఆయన తప్పుకోవడంతో మేమే టేకోవర్ చేశాం. అమ్మ పి.సురేఖ నిర్మాతగా ఈ సినిమా ప్రొడ్యూస్ చేశాం. కథ మాకు అంత బాగా న చ్చింది. మదన్‌కు క్లాస్ డెరైక్టర్ అనే ఇమేజ్ ఉంది. కానీ ఆయనలో కూడా మంచి మాస్ డెరైక్టర్ ఉన్నాడని ఈ సినిమా నిరూపిస్తుంది. ఇందులో నా పాత్ర పేరు వరాలబాబు. ముక్కుసూటిగా ఉండే పల్లెటూరు కుర్రాడినన్నమాట. ‘ప్రేమిస్తే చెప్పేయ్..బాధ అనిపిస్తే ఏడ్చేయ్... కోపం వస్తే కొట్టేయ్’ అనే టైప్ క్యారెక్టర్ నాది. నేను ఫస్ట్ టైమ్ తూర్పుగోదావరి జిల్లా యాసలో మాట్లాడాను. ఈ యాస కోసం చాలా కసరత్తులు చేశా. రవితేజ సినిమాలు, రామ్ నటించిన ‘కందిరీగ’ సినిమా చూడమని చాలా మంది సలహా ఇచ్చారు.అవి చూశాను గానీ, నా స్టయిల్ నే ఫాలో అయిపోయాను. నా శ్రీమతిది రాజమండ్రి. అక్కడి వాళ్ల మాటల్లో చిన్నపాటి వెటకారం ఉంటుంది. చాలా సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువ. మా మావగారైతే బాగా జోక్స్ పేలుస్తుంటారు. ♦ మా పేరెంట్స్ మీద గౌరవం పెరిగింది నా పెళ్లి తర్వాత రిలీజవుతున్న సినిమా ఇదే. అలాగే మా పాప పుట్టాక వస్తున్న మూవీ కూడా ఇదే. నా కూతురు లక్ ఇస్తుందని నమ్ముతున్నా. మా పాపకు ఏం పేరు పెట్టాలనే విషయంలో చాలా పేర్లు పరిశీలిస్తున్నాం. పాప పుట్టాక మా పేరెంట్స్ మీద ఇంకా గౌరవం పెరిగింది. అమ్మా, నాన్న ఎంత బాగా పెంచితే నేనీ స్థాయిలో ఉన్నానా..అనిపిస్తోంది. ఫాదర్‌హుడ్ అనే మ్యాజిక్కే వేరు. ఐయామ్ ఎంజాయింగ్ ఫాదర్‌హుడ్. ♦ కథల ఎంపిక కష్టమే! ప్రస్తుతం వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో ‘చుట్టాలబ్బాయి’ చేస్తున్నా. ఇంకా చాలా అవకాశాలొస్తున్నాయి కానీ, బెటర్వి రావడం లేదు. ఏడాదికి 300 సినిమాలు రిలీజవుతుంటే... అందులో 8-9 సినిమాలు మాత్రమే విజయం సాధిస్తున్నాయి. సో...కథలు ఎంపిక చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటోంది. -
యంగ్ హీరో ఆదికి తండ్రిగా ప్రమోషన్
త్వరలో గరం సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్న యంగ్ హీరో ఆది.. సినిమా రిలీజ్ కు ముందే మరో శుభవార్త చెప్పాడు. గురువారం మధ్యాహ్నం ఆది భార్య అరుణ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆది దంపతులకు ఆడబిడ్డ పుట్టింది. తల్లి, బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. కొడుకును హీరోగా నిలబెట్టడం కోసం సాయికుమార్ తొలిసారి నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా గరం త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటివరకు లవర్ బోయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఆది ఈ సినిమాతో మాస్ హీరోగా మారాలని ట్రై చేస్తున్నాడు. మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అదాశర్మ హీరోయిన్ గా నటించింది. అగస్త్య సంగీతం అందించారు. -
సీనియర్ యాక్టర్ కొత్త క్యారెక్టర్
నటుడిగా ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన నటుడు సాయికుమార్. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా, విలన్‌గా అలరించిన సాయి కుమార్, ఇప్పుడు తన కుమారుడి కోసం కొత్త అవతారం ఎత్తాడు. హీరోగా ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడుతున్న తనయుడు ఆదిని ప్రమోట్ చేయటం కోసం నిర్మాతగా మారాడు ఈ సీనియర్ నటుడు. ప్రస్తుతం ఆది హీరోగా 'గరం' సినిమాను నిర్మిస్తున్నాడు సాయికుమార్. ఈ సినిమాకు నిర్మాతగా సాయికుమార్ భార్య సురేఖ వ్యవహరిస్తున్నారు. ఆదికి జంటగా ఆదాశర్మ నటిస్తున్న ఈ సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఇంట్రస్టింగ్ పాయింట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా, ఆది కెరీర్‌కు మంచి బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాడు సాయికుమార్. రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, రొమాన్స్ లాంటి అన్ని రకాల ఎలిమెంట్స్ ఈ సినిమాలో పర్ఫెక్ట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అంతేకాదు సినిమా రిలీజ్ విషయంలో కూడా బడా డిస్ట్రిబ్యూటర్స్ సాయం తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. మరి నటుడిగా మంచి విజయాలు సాధించిన సాయికుమార్, నిర్మాతగా ఎంత వరకు సక్సెస్ అవుతాడో చూడాలి. -
చుట్టాలబ్బాయి కథ
‘ప్రేమ కావాలి’, ‘లవ్లీ’ చిత్రాలతో లవర్ బోయ్ ఇమేజ్ను సంపాదించుకున్న ఆది నటిస్తున్న తాజా చిత్రం ‘చుట్టాలబ్బాయి’. ‘పూలరంగడు’, ‘అహ నా పెళ్లంట’ చిత్రాల ఫేమ్ వీరభద్రమ్ దర్శకత్వంలో రాము తాళ్లూరి, వెంకట్ తలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నమితా ప్రమోద్ కథానాయిక. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఆది కెరీర్లో ఇది ఓ డిఫరెంట్ మూవీ అవుతుంది. అన్ని వర్గాలను ఆకట్టుకునే చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహణం: ఎస్.అరుణ్‌కుమార్, మాటలు: భవానీ ప్రసాద్. -
ప్రణీత చుట్టాలబ్బాయిగా ఆది
చెన్నై: అత్తారింటికి దారేది చిత్రంలో బొంగరాలాంటి కళ్లు తిప్పిన ప్రణీత తాజాగా ఆదితో జోడి కట్టనుంది. దర్శకుడు వీరభద్ర చౌదరి దర్శకత్వంలో చుట్టాలబ్బాయి చిత్రం షూటింగ్ ఈ నెలలో ప్రారంభం కానుంది. ఆ తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని ఆ చిత్ర యూనిట్ ఆదివారం చెన్నైలో తెలిపారు. ఈ చిత్రాన్ని వెంకట్ తలారి నిర్మిస్తున్నారు. అలాగే ఎస్ ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీత అందిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో వీరభద్ర చౌదరి సునీల్ హీరోగా నటించిన పూలరంగడు చిత్రానికి దర్శకత్వం వహించాడు. -
హీరో ఆది వివాహ వేడుక
-
ప్రతి అక్కా... తమ్ముడూ చూడాల్సిన సినిమా
‘‘నా కెరీర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమా ‘రఫ్’. రెండో వారం కూడా వసూళ్లు ఆశాజనకంగా ఉన్నాయి. ఈ విజయానికి కారణం నిర్మాత అభిలాష్. సినిమాపై నమ్మకంతో భారీ పబ్లిసిటీ ఇచ్చి... నైజాంలో స్వయంగా ఆయనే 130 థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేశారు’’ అని ఆది అన్నారు. ఆది, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా సి.హెచ్.సుబ్బారెడ్డి దర్శకత్వంలో అభిలాష్ మాధవరం నిర్మించిన చిత్రం ‘రఫ్’. ఈ చిత్రం సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆది మాట్లాడారు. ‘‘దర్శకుడు సుబ్బారెడ్డి నన్ను చాలా కొత్తగా ప్రెజెంట్ చేశాడు. ఈ సినిమాలో నేను అందంగా కనబడ్డానంటే కారణం కెమెరామేన్ సెంథిల్. మణిశర్మ సంగీతం ఈ సినిమాకు చాలా హెల్ప్ అయ్యింది. ఇందులో శ్రీహరి అసిస్టెంట్‌గా శివారెడ్డి ఆకట్టుకున్నారు. ఇంత మంచి సందర్భంలో శ్రీహరిగారు లేకపోవడం బాధాకరం’’ అని ఆవేదన వెలిబుచ్చారు ఆది. వరుసగా సినిమాలు తీస్తూ, ఇదే రంగంలో కొనసాగాలనే భావనను ఈ సినిమా విజయం తనకు కలిగించిందని నిర్మాత అభిలాష్ అన్నారు. ‘‘ప్రతి అక్కా, తమ్ముడూ చూడాల్సి సినిమా ఇది. ఎన్నో అవరోధాలను అధిగమించి ఈ చిత్రాన్ని విడుదల చేశాం. శ్రీహరిగారు చనిపోవడంతో ఈ సినిమాపై ఆశలు వదులుకున్నాం. కానీ... నిర్మాత అభిలాష్ భుజం తట్టి ముందుకు నడిపించారు. లవర్‌బోయ్ ఆదితో మాస్ ఎంటర్టైనర్ ఏంటి? అన్న వాళ్లందరికీ ఈ సినిమా వసూళ్లే సమాధానాలు’’ అని దర్శకుడు చెప్పారు. ప్రేక్షకుల మధ్య కూర్చొని ఈ సినిమా చూశాననీ, పాటలకు, డైలాగులకు మంచి స్పందన లభిస్తోందని రకుల్ ప్రీత్‌సింగ్ చెప్పారు. ఈ మధ్య కాలంలో కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న సినిమా ఇదేనని శివారెడ్డి అన్నారు. ఇంకా కాశీవిశ్వనాథ్, దిల్ రమేశ్ కూడా మాట్లాడారు. -
విజయనగరంలో చూస్తే సినిమా హిట్..
విజయనగరం : విజయనగరంలోనే సినిమా చూస్తే విజయం వరిస్తుందని సినీనటుడు సాయికుమార్ అన్నారు. ఆయన తనయుడు ఆది హీరోగా నటించిన 'రఫ్' చిత్రాన్ని శుక్రవారం సాయికుమార్ స్థానిక ఎన్‌సిఎస్ థియేటర్లో చూశారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ తనకు, తన తండ్రికి విజయనగరం అంటే ఎనలేని మక్కువ అని, ఈ జిల్లాలో సినిమా చూస్తే తప్పక విజయం సాధింస్తుందన్న ప్రగాఢ నమ్మకం ఉందన్నారు. రఫ్ సినిమా చాలా చక్కగా వచ్చిందని, కుటుంబ సమేతంగా చూడాల్సిన చిత్రమన్నారు. కచ్చితంగా ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లో రఫ్ చిత్రం వందరోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని సెంటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో సినిమా ఆడుతున్నట్లు తనకు తెలిసిందని, చాలా ఆనందంగా ఉందని సాయికుమార్ తెలిపారు. -
రైట్లో ‘రఫ్’ హంగామా
భూపాలపట్నం (రాజానగరం) :‘రఫ్’ సినిమా హీరో, ప్రముఖ నటుడు సాయికుమార్ తనయుడు ఆది మంగళవారం రైట్ కళాశాలలో సందడి చేశారు. వర్థమాన దర్శకుడు సుబ్బారెడ్డి దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఈ సినిమా ప్రమోషన్ వర్కలో భాగంగా విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ సినిమాలోని పాటలు, డైలాగ్స్, డాన్స్‌లపై ఇంతవరకూ వివిధ కళాశాలల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచినవారికి ఇక్కడ ఫైనల్స్ నిర్వహించారు. అమలాపురం సమీపంలోని భట్నవిల్లి, దివాన్‌చెరువు సమీపంలోని పాలచర్లలో ఉన్న బీవీసీ కళాశాలల విద్యార్థులు, రైట్ కళాశాల విద్యార్థులు దీనికి హాజరయ్యారు. రేడియో మిర్చి నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలకు హీరో ఆది చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ఆది, ఆయన బృందం కొద్దిసేపు నృత్యాలు చేసి అలరించారు. పాత్ర ఏదైనా నటనే ముఖ్యం : ఆది పాత్ర ఏదైనా తనకు నటనే ముఖ్యమని హీరో ఆది అన్నారు. రైట్ ఇంజనీరింగ్ కళాశాలకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేకంగా ఫలానా పాత్ర చేయాలన్న అభిలాష తనకు లేదని, వచ్చిన పాత్రకు ఎంతవరకూ న్యాయం చేశానన్నదే ముఖ్యమని అన్నారు. ఇంతవరకూ ఐదు సినిమాలు చేశానని, ‘రఫ్’ ఆరోదని చెప్పారు. అన్ని సినిమాలూ నచ్చినవే అయినా, ‘లవ్ లీ’ అంటే మరింత ఇష్టమన్నారు. కథనుబట్టి టైటిల్ పెట్టారు కానీ, ‘రఫ్’ సినిమా అన్ని వర్గాలనూ అలరిస్తుందని చెప్పారు. గోదావరి అందాల గురించి విన్నానే తప్ప చూసే అవకాశం ఇంతవరకూ దక్కలేదన్నారు. అయితే రాజమండ్రి అమ్మాయినే వివాహం చేసుకోనున్నందున ఇకపై ఈ అందాలను తిలకించేందుకు ఎక్కువ సమయం ఉంటుందని చెప్పారు. సినీ హీరోలను చూసి, తాము కూడా సిక్స్‌ప్యాక్ షేప్ కోసం చాలామంది ప్రయత్నిస్తారని, అది మంచిది కాదని, ఆ సాహసం చేయవద్దని ఆది హితవు పలికారు. -
అప్పుడు రకుల్‌ని వద్దనుకున్నాం : ఆది
‘‘ఏ పాత్రనైనా చేయగలనని నిరూపించుకోవడంతో పాటు.. హీరో అని మాత్రమే కాకుండా ‘స్టార్’ అనిపించుకోవాలన్నదే నా లక్ష్యం. దానికోసం ఎంత కష్టపడటానికైనా వెనకాడను’’ అని హీరో ఆది అన్నారు. ‘ప్రేమ కావాలి’ నుంచి ‘గాలిపటం’ వరకు ఆది చేసిన చిత్రాలు తనకు ‘లవర్ బోయ్’ ఇమేజ్‌ని తెచ్చాయి. ‘రఫ్’లో లవర్ బోయ్‌గా మాత్రమే కాదు.. మాస్‌గా కనిపించనున్నారు. ఆది, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా సుబ్బారెడ్డి దర్శకత్వంలో సుదర్శనరావు మాధవరం సమర్పణలో అభిలాష్ మాధవరం నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆది మనోభావాలు ఈ విధంగా... ఈ చిత్రంలో నా పాత్రలో మాస్ టచ్ ఉంటుంది. లవర్‌బోయ్‌గా, యాక్షన్ హీరోగా కనిపిస్తాను. సినిమా మొత్తం ఆసక్తికరంగా ఉంటుంది. తదుపరి సీన్ ఏంటి? అని ఎవరూ ఊహించలేరు. స్క్రీన్‌ప్లే అంత పకడ్బందీగా ఉంటుంది. లవర్‌బోయ్ ఇమేజ్ మార్చుకోవాలనే టార్గెట్‌తోనే ఈ చిత్రం ఎంపిక చేయలేదు. ఎవరైనాసరే వాళ్లల్లో ఉన్న ప్లస్ పాయింట్స్‌ని హైలైట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. నేను డాన్సులు, ఫైట్స్ బాగా చేయగలను. అందుకని ఈ రెండింటికీ ప్రాధాన్యం ఉన్న చిత్రంలో చేయాలనుకున్నా. నా గత చిత్రాలు ‘ప్యార్ మే పడిపోయానె’, ‘గాలిపటం’లో ఫైట్స్‌కి స్కోప్ దొరకలేదు. దాంతో ‘లవ్, యాక్షన్ మూవీస్ చేస్తే బాగుంటుంది’ అని నాన్నగారికి, నాకు ఫోన్స్ వచ్చాయి. ఆ మాటలను దృష్టిలో పెట్టుకుని ‘రఫ్’ని ఎంపిక చేసుకున్నా. ఓ మంచి కమర్షియల్ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాను. ఈ చిత్రంతో ఆ బ్రేక్ వస్తుందనే నమ్మకం ఉంది. ఇందులో ఐదారు ఫైట్స్ ఉన్నాయి. వీటిలో వైజాగ్‌లో తీసిన ఫైట్ చాలా భారీగా ఉంటుంది. దానికి నిర్మాణ వ్యయం కూడా ఎక్కువే అయ్యింది. క్లయిమాక్స్ ఫైట్ దాన్ని మించి ఉండాలనుకున్నాం. అందుకే సిక్స్ ప్యాక్ చేశాను. ఈ ప్యాక్‌కి ఎనిమిది, తొమ్మిది నెలలు పట్టింది. షూటింగ్ ఆలస్యం కావడానికి ఇదొక కారణం. సుబ్బారెడ్డి ఈ కథ చెప్పిన తీరు చూసి, తను బాగా తెరకెక్కిస్తాడనే నమ్మకం కలిగింది. ఆ నమ్మకం నిజమైంది. ఇప్పటివరకు నేను చేసిన చిత్రాలన్నిటికన్నా నిర్మాణ వ్యయం పరంగా పెద్ద సినిమా ఇది. నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు. ఈ చిత్రానికి మణిశర్మగారు పాటలు స్వరపరచిన విషయం తెలిసిందే. ‘అందరి హీరోలతో నాకు హిట్స్ ఉన్నాయి. నీతో కూడా ఓ హిట్ వస్తే లెక్క సరిపోతుంది’ అన్నారు. ఆయన అన్నట్లుగానే పాటలు హిట్టయ్యాయి. రీ-రికార్డింగ్ అయితే బ్రహ్మాండంగా చేశారు. సెంథిల్, అరుణ్‌కుమార్ వంటి గొప్ప టెక్నీషియన్స్ పనిచేయడం ఈ చిత్రానికి ప్లస్ అయ్యింది. నా చిత్రాలపరంగా నేనెంత శ్రద్ధ వహిస్తానో నాన్నగారు కూడా అంతే శ్రద్ధ వహిస్తారు. సినిమా ఎలా వస్తోందో తెలుసుకుంటారు. విడుదలయ్యాక రిపోర్ట్ ఎలా ఉందో ఫోన్ చేసి, అడుగుతుంటారు. నా సినిమా హిట్టయితే నాన్న కళ్లల్లో కనిపించే ఆనందం చూసి, ఎగ్జయిట్ అవుతాను. అందుకే, నాన్న కళ్లల్లో ఆనందం చూడటం కోసం ఈ సినిమా హిట్టవ్వాలని కోరుకుంటున్నా. ‘ప్రేమ కావాలి’లో నా సరసన రకుల్ ప్రీత్ సింగే నటించాల్సి ఉంది. కానీ, అప్పుడు తనింకా చదువుకుంటోంది. వరుసగా డేట్స్ ఇవ్వలేని పరిస్థితిలో తనుండటంతో వద్దనుకున్నాం, ఇప్పుడీ చిత్రానికి మా జంట కుదిరింది. వరుస విజయాలతో రకుల్ యూత్‌కి బాగా దగ్గరైంది. ఈ సినిమా ఓపెనింగ్స్‌కి తన క్రేజ్ కూడా ఉపయోగపడుతుందంటే అతిశయోక్తి కాదు. -
సుకుమార్ నిర్మాతగా 'కుమారి 21F' ప్రారంభం
-
అదే ఆదికి వచ్చి ఉంటుంది : సూర్య
‘‘బాక్సింగ్‌లో కిందపడితే ఓడిపోయినట్లు కాదు. లేవలేనప్పుడే నిజంగా ఓడిపోయినట్లు. అలా లేచి నిలబడిన తర్వాత ఇచ్చే రఫ్ పంచ్ విజయానికి కారణం అవుతుంది. ఆ పంచ్లా ఈ ‘రఫ్’ సక్సెస్ కావాలి. ఫైట్ మాస్టర్ పాండ్యన్ దగ్గర ఆది, కార్తీ శిక్షణ తీసుకుంటున్నప్పుడు చూసేవాణ్ణి. చాలా కష్టపడి నేర్చుకునేవాడు. ఈ ప్రచార చిత్రాలు ఆదిలోని ఎనర్జీని, ప్రతిభను తెలియజేస్తున్నాయి. డైలాగ్స్ చెప్పడంలో సాయికుమార్‌గారు స్పెషలిస్ట్. అదే ఆదికి వచ్చి ఉంటుంది’’ అని హీరో సూర్య అన్నారు. ఆది, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఎమ్. సుదర్శనరావు మాధవరం సమర్పణలో అభిలాష్ మాధవరం నిర్మించిన చిత్రం ‘రఫ్’. సీహెచ్ సుబ్బారెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిశర్మ పాటలు స్వరపరిచారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ఆడియో వేడుకలో పాల్గొన్న సూర్య పాటల సీడీని ఆవిష్కరించి, దర్శకుడు వంశీ పైడిపల్లికి ఇచ్చారు. ప్రచార చిత్రాలను బోయపాటి శ్రీను ఆవిష్కరించారు. ఈ వేడుకలో అతిథులుగా పాల్గొన్న రానా, ‘అల్లరి’ నరేశ్, నితిన్, దశరథ్, సంపత్ నంది, వీరభద్రం, కేవీవీ సత్యనారాయణ తదితరులు చిత్రబృందానికి శుభాకాంక్షలందజేశారు. ఆది మాట్లాడుతూ -‘‘సూర్యగారు ఈ వేడుకకు రావడం, మణిశర్మగారు స్వరపరచిన పాటలకు డాన్స్ చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్’’ అని దర్శక, నిర్మాతలు చెప్పారు. సాయికుమార్ మాట్లాడుతూ - ‘గతంలో సూర్య తండ్రి శివకుమార్ చేసిన పాత్రలకు డబ్బింగ్ చెప్పేవాణ్ణి, నేను డబ్బింగ్ మానేసిన తర్వాత సూర్య హీరో అయ్యారు. లేకపోతే ఆయనక్కూడా చెప్పి ఉండేవాణ్ణి. ఈ చిత్రం ఆదికి కమర్షియల్ హీరోగా మంచి బ్రేక్ ఇస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
నాకిది ఫస్ట్ యాక్షన్ మూవీ : ఆది
‘ప్రేమ, వినోదం, యాక్షన్ సన్నివేశాల మేళవింపుతో ఆద్యంతం ఆసక్తికరంగా ఉండే సినిమా ఇది. నాకిది ఫస్ట్ యాక్షన్ మూవీ. ముందు రామ్‌చరణ్, బన్నీ అనుకుని దర్శకుడు నాతో ఈ సినిమా చేశారు’’ అని ఆది చెప్పారు. ఆది, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా సీహెచ్ సుబ్బారెడ్డి దర్శకత్వంలో అభిలాష్ మాధవరం నిర్మిస్తున్న ‘రఫ్’ చిత్రం టీజర్‌ను దర్శకుడు సురేందర్‌రెడ్డి హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ -‘‘సుబ్బారెడ్డి నాతో కలిసి చాలాకాలం పనిచేశారు. స్వతహాగా ఆయన చాలా రఫ్. ఈ సినిమాతో ఆదిని ఓ స్థాయికి తీసుకెళ్తాడనే నమ్మకముంది’’ అన్నారు. సాయికుమార్ మాట్లాడుతూ -‘‘సురేందర్‌రెడ్డి సినిమాతోనే ఆది పరిచయం కావాల్సింది. కానీ మిస్సయ్యింది. చిరంజీవికి ‘ఖైదీ’, నాకు ‘పోలీస్ స్టోరీ’ ఎలాంటి గుర్తింపు తీసుకొచ్చిందో, ఆదికి ఈ సినిమా అంత పేరు తెస్తుందనే నమ్మకముంది’’ అని చెప్పారు. ఆది ఈ సినిమా కోసం చాలా శ్రమించాడని రకుల్ ప్రీత్‌సింగ్ అన్నారు. మణిశర్మ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని, టీమ్‌వర్క్‌తో ఈ సినిమా చేశామని దర్శక నిర్మాతలు తెలిపారు. రాజ్‌కుమార్, బిఏ రాజు, అరుణ్‌కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
రఫ్ మూవీ టీజర్ లాంఛ్
-
టాలీవుడ్ హీరో ఆది నిశ్చితార్థం
-
ఆది పెళ్లి ముహూర్తం కుదిరింది!!
డైలాగ్ కింగ్ సాయికుమార్ కుమారుడు, టాలీవుడ్ హీరో ఆది డిసెంబర్ 13న పెళ్లి చేసుకోబోతున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన అరుణతో విజయదశమి రోజు నిశ్చితార్థం చేసుకున్న ఆది పెళ్లి ముహూర్తాన్ని రెండు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. నిశ్చితార్థం చాలా నిరాడంబరంగా జరిగిందని, పరిశ్రమకు చెందిన తన స్నేహితులను కూడా తాను ఎంగేజిమెంటుకు పిలవలేదని ఆది చెప్పాడు. డిసెంబర్ 13వ తేదీన హైదరాబాద్‌లోనే తన పెళ్లి జరగనుందని, దానికి మాత్రం దాదాపు ప్రతి ఒక్కరినీ తాను ఆహ్వానిస్తానని తెలిపాడు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన అరుణ తల్లిదండ్రులిద్దరూ న్యాయవాదులేనని ఆది అన్నాడు. తన అక్కడ అత్తమామల ద్వారా ఈ సంబంధం వచ్చిందని వివరించాడు. దాంతో ఆది ప్రేమ వివాహం చేసుకుంటున్నాడన్న కథనాలకు ఫుల్ స్టాప్ పడింది. ప్రస్తుతం ఆది నటించిన 'రఫ్' సినిమా విడుదల కావాల్సి ఉంది. 'ప్రేమకావాలి'తో తెరంగేట్రం చేసిన ఆది.. ఇటీవలే 'గాలిపటం' సినిమాతో మంచి విజయాన్ని సాధించి ఉత్సాహం మీద ఉన్నాడు. -
అరుణతో 'ఆది' నిశ్చితార్థం
యువ కథానాయకుడు ఆది త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రేమ వివాహమో.. పెద్దలు కుదిర్చిన పెళ్లో తెలియదు గానీ, ఆది నిశ్చితార్థం మాత్రం విజయదశమి పర్వదినం రోజున హైదరాబాద్‌లో జరిగింది. అరుణ అనే యువతిని ఆది పెళ్లి చేసుకోబోతున్నాడు. చాలా పరిమిత సంఖ్యలో వచ్చిన బంధుమిత్రుల మధ్య ఆది నిశ్చితార్థం జరిగింది. కాబోయే వధూవరులు ఉంగరాలు మార్చుకున్నారు. డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడిగా, పీజే శర్మ మనవడిగా టాలీవుడ్లో 'ప్రేమ కావాలి' చిత్రంతో తెరంగేట్రం చేసిన ఆది.. ఇటీవల విడుదలైన గాలిపటం సినిమాతో సక్సెస్ కూడా చూశాడు. త్వరలోనే అతడు నటించిన రఫ్ సినిమా కూడా విడుదల కాబోతోంది. ఇప్పుడు మళ్లీ గరమ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఫైట్లు, డాన్సులలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఒరవడి సృష్టించుకున్న ఆది.. ఇప్పుడు పెళ్లికొడుకుగా సరికొత్త పాత్ర పోషించబోతున్నాడు. -
పెళ్లికొడుకు కాబోతున్న ఆది?
డైలాగ్ కింగ్ సాయికుమార్ కుమారుడిగా తెరంగేట్రం చేసిన ఆది.. త్వరలోనే పెళ్లికొడుకు కాబోతున్నాడట. అతడి మహిళా అభిమానులకు ఇది పెద్ద షాకే అయినా.. అందుకు మరో మూడు నాలుగు నెలల వరకు సమయం ఉందన్నది మాత్రం కొంత ఊరటనిచ్చే అంశం. ఈ విషయాన్ని ఆది గానీ, అటు సాయికుమార్ గానీ ఇంతవరకు నిర్ధారించలేదు. అయితే ఫిలింనగర్ మొత్తం ఇప్పుడు ఇదే విషయాన్ని చర్చించుకుంటున్నారు. ఒక అమ్మాయిని ఆది ఇష్టపడ్డాడని, ఆ పెళ్లికి ఇరువైపుల పెద్దలు కూడా అంగీకరించి పెళ్లి చేయిస్తున్నారని చెబుతున్నారు. బహుశా త్వరలోనే సాయికుమార్ ఈ అంశంపై ఓ ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. -
గరం చిత్ర ప్రారంభోత్సవం
-
ఓరుగల్లుకొచ్చిన ‘గాలిపటం’
సందడి చేసిన చిత్రం యూనిట్ ఘనంగా సత్కరించిన అభిమానులు, థియేటర్ యాజమాన్యం పోచమ్మమైదాన్ : గాలిపటం చిత్రం యూనిట్ నగరంలో శనివారం సందడి చేసింది. సినిమా విడుదలై విజయవంతంగా రెండో వారం ప్రదర్శింపబడుతున్నందున చిత్రం యూనిట్ ప్రేక్షకులను పలకరించేందుకు వరంగల్‌లోని లక్ష్మణ్ థియేటర్‌కు సాయంత్రం 4 గంటలకు విచ్చేసింది. చిత్ర నిర్మాత సంపత్ నంది, హీరో ఆది, హీరోయిన్ క్రిస్టినా, సంగీత దర్శకుడు బిమ్స్ సిసిరిలియో విచ్చేశారు. ఈ సందర్భంగా థియేటర్లో అభిమానులు బాణసంచా కాల్చి, సంబరాలు నిర్వహించారు. యూనిట్ బృందం సినిమా థియేటర్లో ప్రేక్షకులకు అభివాదం చేశారు. అనంతరం సినిమా నిర్మాత సంపత్ నంది మాట్లాడుతూ తాను దర్శకత్వం వహించి, నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమాలను ఆదరిస్తున్న తెలంగాణ ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపారు. గాలిపటం సినిమాను ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు రుణపడి ఉంటానని అన్నారు. ‘ఫ్యాక్షనిజంలో రెడ్డియిజం.. పవనిజంలో నిజయితీ ఉంటుందని’ సినిమా డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నాడు. సంగీత దర్శకుడు బిమ్స్ సిసిరిలియో ‘పొద్దున్నే ఏంట్రా తినడం పొంగలి’ అనే పాట పాడి ప్రేక్షకులను ఊర్రూతలూగించారు. హీరో ఆది మాట్లాడుతూ డిఫరెంట్ సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ‘అమ్మాయిలు ఆర్టీసీ బస్సుల మాదిరిగా వచ్చిపోతుంటారు’ అనే డైలాగ్ చెప్పి ప్రజలను మంత్రముగ్దులను చేశారు. అనంతరం థియేటర్ యాజమాన్యం సినిమా యూనిట్‌ను ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో థియేటర్ మేనేజర్ రవి, సూపర్వైజర్ సాంబయ్య, పాలిటెక్నిక్ విద్యార్థి జేఏసీ చైర్మన్ మేకల అక్షయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ది చాకోలెట్ రూంలో యూనిట్ సందడి ఎన్జీవోస్కాలనీ : హన్మకొండ నక్కలగుట్టలోని ది చాకోలెట్ రూంలో గాలిపటం చిత్రం యూనిట్ శనివారం సందడి చేసింది. నగరానికి వచ్చిన చిత్ర నిర్మాత, దర్శకుడు సంపత్ నంది, హీరో ఆది, హీరోయిన్ క్రిస్టినాతోపాటు చిత్ర బృందం ది చాకోలెట్ రూంకు వచ్చి అందులోని ఐటెమ్స్ రుచి చూశారు. హీరోయిన్ క్రిస్టినా తనకు ఇష్టమైన ప్యాన్‌కేక్ చాక్లెట్, ఎక్సెస్ కేక్ తిన్నారు. హీరో ఆది ఫ్రైడ్ చికెన్, చాక్లెట్, ఎక్సెస్ కేక్, ఫ్రైడ్ చికెన్ రుచి చూశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెట్రోపాలిటన్ నగరాలకు దీటుగా ఇక్కడ చాకోలెట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తూ నాణ్యమైన తినుబండారాలు అందించడం మంచి పరిణామమన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు రాజేష్, శ్రీధర్ పాల్గొన్నారు. -
ప్రశంసలతో పాటు విమర్శలూ వచ్చాయి!
‘‘నా అభిమానులకు ‘గాలిపటం’ కొత్త అనుభూతిని పంచింది. అంతేకాదు కొత్తగా చాలామంది అభిమానులను నాకు అందించిందీ సినిమా’’ అంటున్నారు ఆది. ఆయన కథానాయకునిగా నవీన్ గాంధీ దర్శకత్వంలో కిరణ్ ముప్పవరపు, విజయ్‌కుమార్ వట్టికూటితో కలిసి సంపత్‌నంది నిర్మించిన ‘గాలిపటం’ ఇటీవలే రిలీజైంది. ఈ సందర్భంగా ఆది ఏమన్నారంటే... నిజాలను సూటిగా చెప్పడంతో... నిజానికి యువతరాన్ని టార్గెట్ చేస్తూ ఈ స్క్రిప్ట్ తయారు చేశారు సంపత్‌నంది. అందులోనే కుటుంబ ప్రేక్షకులకు కావాల్సిన అంశాలను కూడా చొప్పించారు. అయితే... చెప్పాలనుకున్న పచ్చి నిజాలను... సూటిగా చెప్పడంతో కొంతమంది కాస్త ఇబ్బందిగా ఫీలైన మాట నిజం. ఈ సినిమా విడుదలవ్వగానే, నాకు ప్రశంసలతో పాటు కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఇలా పొగడ్తలు, తెగడ్తలూ కలసి రావడం ఒక మంచి సినిమాకే జరుగుతుంది. కన్నడంలో కూడా నటిస్తా... మా ఫ్యామిలీ సినిమా ఎప్పుడు? అని చాలామంది అడుగుతున్నారు. నాన్న, నేను కలిసి మాత్రం ఓ సినిమా చేస్తాం. బహుశా తాతయ్య అందులో నటించలేకపోవచ్చు. ఎందుకంటే... ఆయన కాస్త వీక్‌గా ఉన్నారు. మంచి కథ దొరికితే ఇద్దరం కలిసి నటిస్తాం. అది కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్ అయితే బావుంటుంది. అలాగే... కన్నడంలో ఎప్పుడు నటిస్తారని కూడా చాలామంది అడుగుతున్నారు. కన్నడ పరిశ్రమ అంటే నాకెంతో గౌరవం. ఎందుకంటే... ఆర్థికంగా మేం ఇబ్బందుల్లో ఉన్న సమయంలో నాన్న కన్నడంలో హీరో అయ్యారు. మా కుటుంబం ఈ రోజు ఆర్థికంగా మంచి స్థాయిలో ఉందంటే కారణం కన్నడ పరిశ్రమ. అందుకే... తప్పకుండా కన్నడంలో నటిస్తాను. అయితే... దానికి సమయం ఉంది. ప్రస్తుతం తెలుగులో నా కెరీర్ బావుంది. ఇక్కడ నన్ను నేను నిరూపించుకోవాలి. తర్వాత కన్నడంలో నటిస్తా. -
ఈ హిట్టు నాకు రిలీఫ్‌నిచ్చింది - ఆది
‘‘నా గత రెండు చిత్రాలు ఆశించిన ఫలితం సాధించకపోవడంతో కొంత నిరాశపడ్డాను. ఈ చిత్రవిజయంపై మొదట్నుంచీ నాకున్న నమ్మకం నిజమైంది. ఒక్కసారిగా ఒత్తిడి మొత్తం పోయి, హమ్మయ్య అనిపించింది’’ అని హీరో ఆది ఆనందం వ్యక్తం చేశారు. దర్శకుడు సంపత్ నంది నిర్మాతగా మారి, కిరణ్ ముప్పవరపు, విజయ్‌కుమార్ వట్టికూటితో కలిసి నిర్మించిన చిత్రం ‘గాలిపటం’. నవీన్ గాంధీ దర్శకత్వంలో ఆది, ఎరికా ఫెర్నాండెజ్, క్రిస్టినా అఖీవా ముఖ్య తారలుగా రూపొందిన ఈ చిత్రం గత వారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆశించిన ఫలితం సాధించిందని సోమవారం హైదరాబాద్‌లో జరిగిన విజయోత్సవ సభలో సంపత్ నంది చెబుతూ -‘‘మామూలుగా ఏ సినిమా చూసినా ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటికొచ్చేటప్పుడు బాగుందనో, చాలా బాగుందనో, మామూలుగా ఉందనో.. చెబుతుంటారు. కానీ, ఈ చిత్రం చూసినవాళ్లు ‘కొత్త’గా ఉంది అంటున్నారు. ఇలాంటి చిత్రాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది’’ అన్నారు. యూత్, ఫ్యామిలీస్ అందరూ ఈ చిత్రాన్ని చూస్తున్నారని నవీన్‌గాంధీ తెలిపారు. కిరణ్ ముప్పవరపు, రాహుల్ రవీంద్రన్, క్రిస్టినీ, భీమ్స్ ఆనందం వ్యక్తం చేశారు. -
'గాలిపటం' సక్సెస్ మీట్
-
రాఖీ కట్టి రూ.3 లక్షలు కొట్టేసింది
అన్న చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. సోదరీమణులు రాఖీలు కట్టి స్వీట్లు పంచి పెట్టడం, అన్నదమ్ములు బహుమతులు ఇవ్వడం ఈ పండుగ సంప్రదాయం. సాధారణ ప్రజల నుంచి సెలబ్రెటీల వరకూ సోదరులు తమ స్థాయిలో అక్కాచెల్లెళ్లకు బహుమతులు ఇస్తుంటారు. అయితే కొంతమంది సరదాగానే తమ సోదరుల నుంచి ముక్కు పిండి మరీ బహుమతులు వసూలు చేస్తుంటారు. ఇక సెలబ్రెటీల విషయానికి వస్తే టాలీవుడ్ హీరో మంచు విష్ణు రాఖీ బహుమతిపై స్పందించాడు. ''మామూలుగానే లక్ష్మి మా నుంచి గిప్ట్‌లు డిమాండ్ చేస్తుంది. ఇక రాఖీ పండుగకి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. లాస్ట్ ఇయర్ రాఖీ కట్టి రూ.3 లక్షలు డిమాండ్ వసూలు చేసింది. దాంతో ఆమె తనకు కాల్సినవి కొనుక్కుంది. ఒకవేళ మనోజ్ ఆ సమయంలో వేరే ప్రాంతంలో ఉంటే, అతని కోటా కూడా నా నుంచే వసూలు చేస్తుంది'' అని విష్ణు మురిపెంగా చెప్పటం విశేషం. హీరో ఆది తన అక్క జ్యోతిర్మయికి రాఖీ సందర్భంగా ఈసారి కారు ప్రజెంట్ చేయబోతున్నాడు. సినిమా ప్రమోషన్ సందర్భంగా ఈసారి తన సోదరి దగ్గరకు బెంగళూరు వెళ్లలేకపోతున్నానని, అలాగే ఆమె కూడా కుటుంబంతోను, డాక్టర్ కావడంతో తన వృత్తిలోను బిజీగా ఉన్నందున కలవలేకపోయినట్లు తెలిపారు. అయితే జ్యోతిర్మయి తనకు రాఖీ పంపిందని, ఈసారి ఆమెను కలిసినప్పుడు కారును గిప్ట్గా ఇవ్వనున్నట్లు చెప్పాడు. ఇష్క్‌తో లైమ్‌లైట్‌లోకి వచ్చిన యువ హీరో నితిన్ తన సోదరి నిఖితకు ఫర్నిచర్ ప్రజెంట్ చేస్తున్నాడు. తామిద్దరూ రెగ్యులర్‌గా కలుస్తామని, తన సోదరి ఇటీవలే గెటెడ్ కమ్యూనిటీలో విల్లా కొనుగోలు చేసిందని... ఆ ఇంటికి కావల్సిన ఫర్నిచర్‌తో పాటు అవసరమైనవి కొనిపెడుతున్నట్లు నితిన్ తెలిపాడు. రన్ రాజా రన్ అంటూ దూసుకొచ్చిన హీరో శర్వానంద్....తన యంగర్ సిస్టర్స్‌తో ధూమ్ ధామ్‌గా రాఖీ పౌర్ణమిని జరుపుకున్నాడు. ఓ అక్క యూఎస్‌లో, మిగతా ఇద్దరు హైదరాబాద్‌లోనే ఉంటారని తెలిపాడు. అక్క అక్కడ నుంచి తనకు రాఖీ పంపిందని, ఇక మిగతా ఇద్దరితో కలిసి డిన్నర్‌కి వెళ్లి ఎంజాయ్ చేసినట్లు తెలిపాడు. అక్క చెల్లెళ్లతో కలిసి గడిపేందుకు, గిప్ట్‌లు ఇచ్చేందుకు రాఖీ పండుగ చక్కని అవకాశమని శర్వానంద్ తెలిపాడు. వచ్చే వారం తన సోదరి దగ్గరకు యూఎస్ వెళుతున్నట్లు చెప్పాడు. -
గాలిపటం మూవీ స్టిల్స్
-
గాలిపటం మూవీ న్యూ స్టిల్స్
-
గాలిపటం మూవీ ప్లాటీనమ్ డిస్క్ వేడుక
-
గాలిపటం మూవీ వర్కింగి స్టిల్స్
-
‘గాలిపటం’ భారం కాదు... బాధ్యత
‘‘దర్శకునిగా నా వయసు రెండు సినిమాలు. ఇంత తక్కువ సమయంలోనే ఓ సినిమా నిర్మాణ బాధ్యతలు తలకెత్తుకున్నాను. ‘గాలిపటం’ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయాలనుకున్నప్పుడు... ఓ వైపు పెద్ద సినిమా చేస్తూ, మరో వైపు ఈ చిన్న సినిమాను నిర్మించడం భారమవుతుందని నా శ్రేయోభిలాషులు అన్నారు. అయితే... నేను ఈ సినిమాను భారంగా భావించడం లేదు. బాధ్యతగా ఫీలవుతున్నాను. ఎందుకంటే... నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు అండగా నిలిచిన నా మిత్రులకు ఏదైనా చేయాలనుకునే తలంపుతో నేను నిర్మిస్తున్న సినిమా ఇది’’ అని సంపత్ నంది అన్నారు. ఆది, ఎరికా ఫెర్నాండెజ్, క్రిస్టినా అఖీవా, ప్రీతీరానా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘గాలిపటం’ చిత్రానికి నవీన్ గాంధీ దర్శకుడు. కిరణ్ ముప్పవరపు, విజయ్‌కుమార్ వట్టికూటిలతో కలిసి సంపత్‌నంది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు వి.వి.వినాయక్ పాటల సీడీని ఆవిష్కరించి సంపత్ నందికి అందించారు. దర్శకుడు హరీశ్ శంకర్ ప్రచార చిత్రాలను విడుదల చేశారు. పదికాలాల పాటు నిలిచిపోయే సినిమా ఇదని ఆది చెప్పారు. సంపత్ నందితో తనది పన్నెండేళ్ల ప్రయాణమని, ‘గాలిపటం’ ద్వారా తనకు అద్భుతమైన అవకాశం ఇచ్చాడని సంగీత దర్శకుడు భీమ్స్ ఆనందం వెలిబుచ్చారు. ఇంకా దర్శక, నిర్మాతలు కూడా మాట్లాడారు. -
గాలిపటం మూవీ ఆడియో వేడుకా
-
గాలిపటం మూవీ స్టిల్స్
-
‘రఫ్’ కుర్రాడి రొమాన్స్
ఇప్పటివరకు చేసిన చిత్రాల ద్వారా లవర్‌బోయ్‌లా కనిపించిన ఆది, ఈసారి రఫ్‌గా కనిపించనున్నారు. ఆది, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా ‘రఫ్’ పేరుతో రూపొందుతోన్న ఈ చిత్రంలో శ్రీహరి ప్రత్యేక పాత్ర పోషించారు. ఎమ్. సుదర్శనరావు సమర్పణలో శ్రీదేవి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సీహెచ్. సుబ్బారెడ్డి దర్శకత్వంలో అభిలాష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఓ కొత్త కోణంలో ఆది కనిపించబోతున్న సినిమా ఇది. ఇటీవల స్విట్జర్లాండ్‌లో రెండు పాటలు చిత్రీకరించాం’’ అని చెప్పారు. ‘‘బుల్లెట్‌లాంటి కుర్రాడి కథ ఇది. టైటిల్ ‘రఫ్’ అయినప్పటికీ కుటుంబ సమేతంగా చూసే విధంగా ఉంటుంది. ఒక పాట మినహా ఈ సినిమా పూర్తయ్యింది. ఈ నెలలోనే పాటలను, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: మరుధూరి రాజా, సంగీతం: మణిశర్మ, కెమెరా: సెంథిల్‌కుమార్. -
విభిన్నమైన ‘గాలిపటం’
భిన్నమైన కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘గాలి పటం’. కిరణ్ ముప్పవరపు, విజయ్‌కుమార్ వట్టికూటిలతో కలిసి దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆది, ఎరికా ఫెర్నాండెజ్, క్రిస్టినా అఖీవా, ప్రీతి రానా ఇందులో ప్రధాన పాత్రధారులు. నవీన్ గాంధీ దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార గీతాన్ని హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ -‘‘సంపత్‌నంది దగ్గర దర్శకత్వ శాఖలో చేశాను. దర్శకునిగా నాకు అవకాశమిచ్చిన ఆయనకు కృతజ్ఞతలు. త్వరలో పాటలను, సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ‘‘సంపత్ నంది ఈ సినిమా విషయంలో చాలా శ్రద్ధ కనబరుస్తున్నారు. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలతో పోలిస్తే భిన్నమైన సినిమా ఇది. నా పాత్రలో చాలా కోణాలుంటాయి’’ అని ఆది చెప్పారు. ఇందులో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నానని రాహుల్ రవీంద్రన్ అన్నారు. యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: కె.బుజ్జి, కూర్పు: రాంబాబు. -
ప్యార్ మే పడిపోయానే..!
-
నన్ను కన్నడంలోకి రమ్మంటున్నారు!
ప్రేమకావాలి, లవ్లీ, సుకుమారుడు... ఈ మూడు సినిమాలతోనే ప్రామిసింగ్ హీరోల జాబితాలో చేరిపోయారు ఆది. అటు తాత పీజే శర్మ, ఇటు తండ్రి సాయికుమార్ వారసత్వాన్ని నిలబెట్టారు. ఆది హీరోగా రవి చావలి దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన ‘ప్యార్ మే పడిపోయానే’ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు ఆది. ఆ వివరాలివి... ‘సుకుమారుడు’ నాకో గుణపాఠం ‘సుకుమారుడు’ నిర్మాణంలో ఉన్నప్పుడే నా శ్రేయోభిలాషులు చాలామంది... ‘నీకు ప్రేమకథలే బాగుంటాయి. ఇలాంటి సినిమాలు అచ్చిరావు’ అని చెప్పారు. వాళ్లు చెప్పినట్లుగానే... ‘సుకుమారుడు’ సరిగ్గా ఆడలేదు. నిజంగా అది నాకో గుణపాఠం. నా సినీ జీవితంలో విజయాలుగా చెప్పుకునే ప్రేమకావాలి, లవ్లీ సినిమాలు ప్రేమకథలే. అందుకే... ‘సుకుమారుడు’ తర్వాత ప్రేమకథనే చేయాలనుకున్నాను. సరిగ్గా ఆ సమయంలోనే రవిచావలి నాకీ కథ చెప్పారు. వెంటనే అంగీకారం తెలిపా. ముందు అలా, తర్వాత ఇలా... ప్రేమ విఫలమైతే... హృదయం బద్దలైపోయినట్లు భావించడం, నిరాశ నిస్పహలకు లోనుకావడం... ఇందులోని నా పాత్రకు అస్సలు నచ్చదు. కానీ... తర్వాత ప్రేమ లేకపోతే... బతకలేనంత స్థాయికి వస్తా. రవి చావలి సినిమాలు ఎక్కువ శాతం సామాజిక దృక్పథంతో సాగుతాయి. కానీ ఈ సినిమాలో అలాంటివేం ఉండవ్. కేవలం ప్రేమ, వినోదం మాత్రమే ఉంటుంది. రాధామోహన్ నిజంగా సాహసవంతమైన నిర్మాత. విడుదల విషయంలో మూడ్రోజుల క్రితం నిర్ణయం తీసుకొని ధైర్యంగా విడుదల చేస్తున్నారు. ఆరుపలకల దృఢకాయునిగా మారా నేను ఆరు పలకల దృఢకాయునిగా మారిన మాట నిజం. అయితే... అది ‘ప్యార్ మే పడిపోయానే’ కోసం కాదు. ‘రఫ్’ సినిమా కోసం. కథ రీత్యా ఆ సినిమాకు ఆరు పలకల దేహం అవసరం. అందుకే చేశా. లొకేషన్లో నా దృఢకాయానికి మంచి స్పందన వచ్చింది. ప్రేక్షకులు కూడా మెచ్చుకుంటారనుకుంటున్నా. నాన్నతో కలిసి నటిస్తా... కానీ! చాలామంది ‘మీ నాన్నతో కలిసి ఎప్పుడు నటిస్తావు’ అని అడుగుతున్నారు. కలిసి నటించాలని కథ వెతుక్కోకూడదు. మేం ఇద్దరం కలిసి నటించేంత మంచి కథ కుదరాలి. అందులో నాన్న పాత్ర... ఆయన ఇమేజ్‌కి తగ్గట్టుగా శక్తిమంతంగా ఉండాలి. నా ఇమేజ్‌కి తగ్గట్టుగా నా పాత్ర కుదరాలి. ఇవన్నీ కుదరాలంటే... సాధారణమైన విషయం కాదు. నాన్న కన్నడంలో పెద్ద స్టార్ కావడంతో నన్ను కూడా కన్నడ పరిశ్రమకు పరిచయం చేయడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. కానీ... దానికి చాలా సమయముంది. ఇప్పుడు కనుక నేను కన్నడంలో నటించాలనే నిర్ణయం తీసుకుంటే... ‘తెలుగులో నెట్టుకురాలేక కన్నడ బాట పట్టాడు’ అనే విమర్శలొస్తాయి. అందుకే... ముందు ఇంట గెలిచి, తర్వాత రచ్చ గెలుస్తా. -
'ప్యార్ మే పడిపోయానే' టీంతో చిట్ చాట్
-
'ప్యార్ మే పడిపోయానే' మూవీ న్యూ స్టిల్స్
-
సన్‌స్క్రీన్ లోషన్ అవసరం లేని బాల్యం...
వేసవి జ్ఞాపకం ‘ప్రేమకావాలి’, ‘లవ్లీ’, ‘సుకుమారుడు’ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మదిని గెలుచుకున్నారు ఆది(ఆదిత్య). ‘ప్యార్ మే పడిపోయానే’, ‘గాలిపటం’ సినిమా షూటింగ్‌లతో బిజీ బిజీగా ఉన్న ఆది బాల్యంలో తన వేసవి ముచ్చట్ల గురించి ఇలా తెలిపారు... ‘నా చిన్నప్పుడు 7వ తరగతి వరకు చెన్నైలోనే ఉన్నాం. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చేశాం. ఇప్పుడంటే ఎండలో తిరిగితే నల్లబడతామని మానేస్తాం. తప్పదంటే సన్‌స్క్రీన్ లోషన్ రాసుకొని వెళతాం. కానీ, చిన్నప్పుడు అలా కాదు.. ఎండలో విపరీతంగా తిరిగేసేవాళ్లం. నాన్నగారు(సాయికుమార్) సినిమా షూటింగ్స్ కారణంగా బిజీగా ఉండేవారు. అందుకే ఊళ్లు వెళ్లేవాళ్లం కాదు. బోర్ కొడుతుందని కొన్ని రోజులు సమ్మర్ క్యాంప్‌కి వెళ్లేవాడిని. మా నాన్నగారికి ఇద్దరు చెల్లెళ్లు, ముగ్గురు అన్నదమ్ములు. వారు పిల్లలతో సహా వేసవిలో మా ఇంటికే వచ్చేవారు. మా పిల్లల సంఖ్యే 15 వరకు ఉండేది. ఇంకా తాతగారు, నానమ్మ... అంతమందితో వేసవిలో ఇల్లంతా పండగ వాతావరణమే! వీరికి తోడు బయట మా స్నేహితులు... అంతా కలిసి బయట క్రికెట్, బ్యాడ్మింటన్.. పగలు ఇంట్లోనే క్యారమ్స్, చెస్... ఆడేవాళ్లం. మారుతీ వ్యాన్‌లో అందరం కలిసి సినిమాలకు, షికార్లకు వెళ్లేవాళ్లం. ఆటలు, అల్లరి, షికార్లతో.. సెలవులు ఇట్టే గడిచిపోయేవి. తర్వాత అంతా వెళ్లిపోయేవారు. ఇల్లంతా బోసిపోయినట్టుగా అనిపించేది. మళ్లీ త్వరగా వేసేవి వచ్చేస్తే బాగుండు అనుకునేవాడిని. పెద్దయ్యాక వేసవి సెలవుల ఎంజాయ్మెంట్ అంతగా ఉండదు. ఈ మధ్యే కొత్తగా ఇల్లు కొనుక్కున్నాం. ఇంటి పనుల్లో అందరం బిజీ. ఈ నెల 23న బంధువులు, వారి పిల్లలు మా కొత్తింటికి వస్తున్నారు. వాళ్లతో మళ్లీ నా చిన్ననాటి వేసవిని గుర్తుతెచ్చుకుంటూ ఆనందించనున్నాను.’ -
‘ప్యార్...’ ఆదికి సరికొత్త మలుపు!
‘‘ ‘లవ్లీ’ తర్వాత నేను చేసిన పూర్తి స్థాయి ప్రేమకథ ఇది. అనూప్ సంగీతం ఇందులో కీలకపాత్ర పోషిస్తుంది. అతనితో నాకిది నాలుగో సినిమా’’ అని ఆది చెప్పారు. ఆది, శాన్వి జంటగా రవి చావలి దర్శకత్వంలో కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ‘ప్యార్ మే పడిపోయానే’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని ఆవిష్కరించిన అనంతరం మంచు మనోజ్ మాట్లాడుతూ -‘‘నా ‘పోటుగాడు’లోని పాట ఈ సినిమాకు టైటిల్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు సాయికుమార్‌గారు చాలా స్పెషల్. ఈ సినిమా ఆదికి పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు. సాయికుమార్ మాట్లాడుతూ -‘‘రవి చావలి దర్శకత్వంలో నాకు నంది, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వచ్చాయి. అటువంటి దర్శకునితో ఆది పని చేస్తున్నందుకు చాలా హ్యాపీ. ఈ సినిమా ఆదికి మంచి మలుపు అవుతుంది’’ అని పేర్కొన్నారు. తాను పని చేసిన నిర్మాతల్లో రాధామోహన్ వన్ ఆఫ్ ది బెస్ట్ అని అనూప్ రూబెన్స్ తెలిపారు. ఈ సినిమా ‘లవ్లీ’ కంటే పెద్ద హిట్ కావాలని బి. జయ ఆకాంక్షించారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమనేని, అచ్చిరెడ్డి, సందీప్ కిషన్, కేవీవీ సత్యనారాయణ, దశరథ్, వరుణ్ సందేశ్, నాని, సంపత్ నంది, మల్టీ డెమైన్షన్ వాసు, రకుల్ ప్రీత్‌సింగ్ తదితరులు మాట్లాడారు. -
ప్యార్ మే పడిపోయానే మూవీ స్టిల్స్
-
ప్రేమలో పడిపోయారు!
ప్రేమకథలకు ట్రెండ్‌తో సంబంధం లేదు. మంచి కథాంశంతో తెరకెక్కిస్తే విజయం ఖాయం. ఆ నమ్మకంతోనే శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె. రాధామోహన్ ‘ప్యార్ మే పడిపోయానే’ చిత్రం నిర్మిస్తున్నారు. ఆది, శాన్వి జంటగా రవి చావలి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం రీ-రికార్డింగ్ జరుపుకుంటోంది. ఈ నెల 13న పాటలను, 25న సినిమాని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఓ క్యూట్ లవ్‌స్టోరీ తీద్దామనుకుంటున్న సమయంలో రవి చావలి ఈ కథ చెప్పారు. ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే కథతో ఈ చిత్రం చేశాం. ఇప్పటివరకు ఆది నటించిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. ఈ చిత్రానికి అనూప్ అద్భుతమైన పాటలిచ్చారు’’ అన్నారు. ఇదొక మంచి మ్యూజికల్ లవ్‌స్టోరీగా నిలుస్తుందనే నమ్మకం ఉందని, చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎం.ఎస్. కుమార్ తెలిపారు. -
'ప్యార్ మే పడిపోయానే' మూవీ స్టిల్స్
-
ప్యార్ మే పడిపోయానే...
‘లవ్లీ’ పెయిర్ ఆది, శాన్వీ జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్యార్ మే పడిపోయానే’. రవి చావలి దర్శకుడు. కె.కె.రాధామోహన్ నిర్మాత. ఈ సినిమా 90 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. పాటలు, పాటలకు సంబంధించిన సన్నివేశాలు మాత్రమే మిగిలివున్నాయని, ఈ నెల చివరి వారంలో మొదలయ్యే మూడో షెడ్యూల్లో వాటిని పూర్తి చేస్తామని నిర్మాత చెప్పారు. భిన్నమైన ఈ ప్రేమకథను రవి చావలి అద్భుతంగా డీల్ చేస్తున్నారని, అనూప్ రూబెన్స్ సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ అని ఆది అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: టి.సురేందర్‌రెడ్డి, కూర్పు: కె.వి.కృష్ణారెడ్డి, కళ: కె.వి.రమణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.ఎస్.కుమార్. -
ప్రేమలో పడిపోయాడే...
సామాన్యుడు, శ్రీమన్నారాయణ తదితర చిత్రాల దర్శకుడు రవి చావలి దర్శకత్వంలో ‘లవ్లీ’ పెయిర్ ఆది, శాన్వి నటిస్తున్న చిత్రం ‘ప్యార్ మే పడిపోయానె’. కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘మా సంస్థ నుంచి వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రమిది. రవి చావలి చెప్పిన కథ అద్భుతంగా ఉండటంతో చిత్రాన్ని స్టార్ట్ చేశాం. ‘లవ్లీ’ తర్వాత ఆది, శాన్వి కలిసి నటిస్తున్న ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుంది’’ అని నమ్మకం వ్యక్తం చేశారు. హీరోగా తనకు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందని, ప్రస్తుతం జరుగుతున్న తొలి షెడ్యూల్ డిసెంబర్ 8 వరకూ జరుగుతుందని ఆది తెలిపారు. ఆదితో మళ్లీ కలిసి నటించడం పట్ల శాన్వి ఆనందం వ్యక్తం చేశారు. అలీ, కాశీ విశ్వనాథ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: టి.సురేందర్‌రెడ్డి, కూర్పు: కె.వి.కృష్ణారెడ్డి, కళ: కె.వి.రమణ, కార్యనిర్వాహక నిర్మాత: ఎం.ఎస్.కుమార్. -
‘రఫ్’ ఆడించే కుర్రాడు ప్రేమలో పడితే..!
కోపం వస్తే రఫ్ ఆడించే కుర్రాడు ఓ అందమైన అమ్మాయితో ప్రేమలో పడతాడు. ప్రేమ కోసం ఎంతకైనా తెగించే తత్త్వం అతనిది. ఇంతకూ అతని ప్రేమకు అడ్డుపడింది ఎవరు? వారిని అతనేం చేశాడు? ఈ నేపథ్యంలో ఆది హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘రఫ్’. రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయిక. సీహెచ్ సుబ్బారెడ్డి దర్శకత్వంలోశ్రీదేవి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మాధవరం అభిలాష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఆది మాట్లాడుతూ -‘‘నా గత చిత్రాలతో పోలిస్తే మ్యూజికల్‌గా పెద్ద హిట్ అవుతుంది. మణిశర్మ మంచి సంగీతాన్నిచ్చారు’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఈ సినిమాలో శ్రీహరిది కీలకపాత్ర. ఆయన మీద 23 సీన్లు తీశాం’’ అని తెలిపారు. సినిమా పూర్తి కావచ్చిందని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సెంథిల్‌కుమార్, అరుణ్‌కుమార్, మాటలు: మరుధూరి రాజా. -
'గాలిపటం నాలో నటిని వెలికితీసింది'
గాలిపటం చిత్రంలో తాను గ్లామరస్‌గా కనిపించినా, నటించడానికి తనకు చాలా అవకాశం లభించిందని ఆ సినిమా హీరోయిన్ క్రిస్టీనా అఖీవా చెప్పింది. ఇంతకుముందు యమ్లా పగ్లా దీవానా -2 చిత్రంలో నటించిన ఆమె.. త్వరలో విడుదల కాబోతున్న రొమాంటిక్ డ్రామా చిత్రం 'గాలిపటం'లో హీరోయిన్గా చేసింది. సినిమా కథ తనకు చాలా నచ్చిందని, ఇందులో తాను విదేశాల నుంచి వచ్చిన తెలుగమ్మాయిగా చేస్తున్నానని ఆమె తెలిపింది. ఈ సినిమా ప్రధానంగా భావోద్వేగాల గురించి, నటన గురించే ఉంటుందని క్రిస్టీనా అంటోంది. ఇంతకుముందు తెలుగులో అసలు ఇలాంటి కథలు రాలేదని, ఈ కథ చాలా పురోగామిగా ఉంటుందని చెప్పింది. సర్వసాధారణ లవ్‌స్టోరీలు, ఇప్పటికే కొన్ని వందల సార్లు వచ్చేసిన కథలా ఇది ఏమాత్రం ఉండబోదని, సరికొత్తగా ఉంటుందని తెలిపింది. ఇక ఈ సినిమాలో తనను తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారా అని నరాలు తెగేంత ఉత్కంఠగా ఉందని క్రిస్టీనా అంటోంది. తెలుగులో తనను కూడా ఆదరిస్తారనే భావిస్తోంది. తనతో కలిసి పనిచేసినవాళ్లంతా తనను ఎంతో ఆదరించారని, బయటి అమ్మాయిలా ఏమాత్రం చూడకుండా సొంత మనిషిలాగే భావించారని చెప్పింది. తాను ఈ భాషను, డైలాగులను అర్థం చేసుకోడానికి తనకు చాలా సమయం ఇచ్చారని, దాంతో ఎంతో ఆనందించానని తెలిపింది. అయితే, మన ప్రవర్తనను బట్టే అవతలివాళ్లు మన పట్ల ఎలా ప్రవర్తిస్తారన్నది కూడా ఉంటుందని అనుభవపూర్వకంగా చెప్పింది. సెట్ మీదకు వచ్చినప్పుడు పని గురించే ఆలోచిస్తానని, అందరితో చాలా సంతోషంగా కలిసిపోతానని తెలిపింది. అందుకే అంతా తనకు బాగా సాయం చేశారంది. నవీన్ గాంధీ దర్శకత్వం వహించిన 'గాలిపటం' చిత్రంలో ఆది సరసన క్రిస్టీనా, ఎరికా ఫెర్నాండెజ్ నటించారు.