
చింతపల్లి పోలీస్‌స్టేషన్‌లో సినిమా షూటింగ్‌లో పాల్గొన్న నటులు
చింతపల్లి (పాడేరు): స్థానిక పోలీస్ స్టేషన్‌లో గురువారం సినిమా షూటింగ్ నిర్వహించారు. ప్రముఖ నటుడు సాయికుమార్ తనయుడు ఆది హీరోగా, షాషా హీరోయిన్‌గా తెరకెక్కిస్తున్న నూతన చిత్ర నిర్మాణం గత కొద్ది రోజులుగా ఒక్కడ జరుగుతోంది. విలేజ్ వినాయకుడు చిత్రంలో నటించిన కృష్ణుడు, కేరింతలు చిత్రంలో నటించిన నూకరాజు, హీరోయిన్ షాషా, ఛత్రపతి ఫేం మనోజ్‌నందంలపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో పలు సన్నివేశాలు చిత్రీకరించారు. ఉగ్రవాదులు పోలీసులకు మధ్య జరిగిన పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు. అడవి సాయికిరణ్ ఈ చిత్రానికి నిర్మాత, దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. మరికొద్ది రోజులు పాటు ఈ ప్రాంతంలో పలు సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు ఆయన తెలిపారు.