లవ్ లీ యంగ్ హీరో ఆది సాయి కుమార్ కొత్త సినిమా ప్రకటన ఇచ్చేశారు. విలేజ్ ప్రేమకథ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు 'కృష్ణ ఫ్రమ్ బృందావనం' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. దిగంగనా సూర్యవంశీ ఇందులో హీరోయిన్. ఈ చిత్రాన్ని దర్శకుడు వీరభద్రమ్ చౌదరి తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తూము నరసింహా, జామి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు గురువారం నాడు కాకతీయ హిల్స్‌లోని వెంకటేశ్వరుడి సన్నిధిలో ఘనంగా జరిగాయి. పూజా కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ సాయి కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా హీరో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ.. ‘మా మూవీ ఓపెనింగ్‌కు వచ్చిన దిల్ రాజు గారికి, అనిల్ రావిపూడి గారికి థాంక్స్. చుట్టలబ్బాయ్ తరువాత మళ్లీ ఓ సినిమా చేయాలని నేను, వీరభద్రమ్ ప్రయత్నించాం. ఇన్ని రోజులకు మంచి కథ, స్క్రిప్ట్ దొరికింది. మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమా అవుతుంది. కుటుంబమంతా కలిసి చూసి నవ్వుకునేలా ఉంటుంది. జూన్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. క్రేజీ ఫెల్లో సినిమాలో నేను, దిగంగనా సూర్యవంశీ కలిసి నటించాం. మళ్లీ ఇప్పుడు ఈ చిత్రంలో నటిస్తున్నాం. ప్రేమ కావాలి, లవ్ లీ, సుకుమారుడు, ప్యార్ మే పడిపోయానే అంటూ అనూప్ రూబెన్స్ నాకు మంచి సాంగ్స్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా మంచి పాటలు ఇస్తున్నారు. ఈ రోజు అనూప్ గారి పుట్టిన రోజు. మంచి టెక్నీషియన్లు, ఆర్టిస్టులతో రాబోతున్నాం. అన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామ’ని అన్నారు.
సాయి కుమార్ మాట్లాడుతూ.. ‘దిల్ రాజు గారు, అనిల్ రావిపూడి గారు ఎంత బిజీగా ఉన్నా అడిగిన వెంటనే వచ్చినందుకు థాంక్స్. వీరభద్రమ్ గారికి ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టం. మేం చేసిన చుట్టలబ్బాయ్ బాగా ఆడింది. ఆయన కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలను తీస్తుంటారు. కృష్ణ ఫ్రమ్ బృందావనం కూడా ఫ్యామిలీతో చూడదగ్గ చిత్రంగా ఉంటుంది. ఆదికి అనూప్ రూబెన్స్ ఎప్పుడూ కూడా బెస్ట్ ఆల్బమ్స్ ఇస్తూనే వచ్చారు. ఈ సినిమాలోనూ మంచి పాటలు ఉండబోతున్నాయి. ఎంతో ప్యాషన్ ఉన్న నిర్మాతలు మంచి కథతో చేస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
దిగంగనా సూర్యవంశీ మాట్లాడుతూ.. ‘ఆది గారితో ఇది వరకు నేను క్రేజీ ఫెల్లో సినిమా చేశాను. మళ్లీ ఆది గారితో కలిసి నటిస్తుండటం ఆనందంగా ఉంది. వీరభద్రమ్ గారు చెప్పిన కథ చాలా బాగా నచ్చింది. ఇందులో నా పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment