అరుణతో 'ఆది' నిశ్చితార్థం | hero aadi engaged with aruna in hyderabad | Sakshi
Sakshi News home page

అరుణతో 'ఆది' నిశ్చితార్థం

Published Sat, Oct 4 2014 6:07 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

అరుణతో 'ఆది' నిశ్చితార్థం - Sakshi

అరుణతో 'ఆది' నిశ్చితార్థం

యువ కథానాయకుడు ఆది త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రేమ వివాహమో.. పెద్దలు కుదిర్చిన పెళ్లో తెలియదు గానీ, ఆది నిశ్చితార్థం మాత్రం విజయదశమి పర్వదినం రోజున హైదరాబాద్లో జరిగింది. అరుణ అనే యువతిని ఆది పెళ్లి చేసుకోబోతున్నాడు. చాలా పరిమిత సంఖ్యలో వచ్చిన బంధుమిత్రుల మధ్య ఆది నిశ్చితార్థం జరిగింది. కాబోయే వధూవరులు ఉంగరాలు మార్చుకున్నారు.

డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడిగా, పీజే శర్మ మనవడిగా టాలీవుడ్లో 'ప్రేమ కావాలి' చిత్రంతో తెరంగేట్రం చేసిన ఆది.. ఇటీవల విడుదలైన గాలిపటం సినిమాతో సక్సెస్ కూడా చూశాడు. త్వరలోనే అతడు నటించిన రఫ్ సినిమా కూడా విడుదల కాబోతోంది. ఇప్పుడు మళ్లీ గరమ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఫైట్లు, డాన్సులలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఒరవడి సృష్టించుకున్న ఆది.. ఇప్పుడు పెళ్లికొడుకుగా సరికొత్త పాత్ర పోషించబోతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement