Galipatam
-
అరుణతో 'ఆది' నిశ్చితార్థం
యువ కథానాయకుడు ఆది త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రేమ వివాహమో.. పెద్దలు కుదిర్చిన పెళ్లో తెలియదు గానీ, ఆది నిశ్చితార్థం మాత్రం విజయదశమి పర్వదినం రోజున హైదరాబాద్‌లో జరిగింది. అరుణ అనే యువతిని ఆది పెళ్లి చేసుకోబోతున్నాడు. చాలా పరిమిత సంఖ్యలో వచ్చిన బంధుమిత్రుల మధ్య ఆది నిశ్చితార్థం జరిగింది. కాబోయే వధూవరులు ఉంగరాలు మార్చుకున్నారు. డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడిగా, పీజే శర్మ మనవడిగా టాలీవుడ్లో 'ప్రేమ కావాలి' చిత్రంతో తెరంగేట్రం చేసిన ఆది.. ఇటీవల విడుదలైన గాలిపటం సినిమాతో సక్సెస్ కూడా చూశాడు. త్వరలోనే అతడు నటించిన రఫ్ సినిమా కూడా విడుదల కాబోతోంది. ఇప్పుడు మళ్లీ గరమ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఫైట్లు, డాన్సులలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఒరవడి సృష్టించుకున్న ఆది.. ఇప్పుడు పెళ్లికొడుకుగా సరికొత్త పాత్ర పోషించబోతున్నాడు. -
లిప్ లాక్ సీన్ తీసేశాం!
‘‘సందర్భోచితంగా లిప్ లాక్ సీన్ తీశాం. కానీ, యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని ఆదరిస్తుండటంతో పంటి కింద రాయిలా ఉంటుందని తీసేశాం’’ అని ‘గాలిపటం’ చిత్రం దర్శకుడు నవీన్ గాంధీ అన్నారు. దర్శకుడు సంపత్ నంది నిర్మాతగా మారి కిరణ్ ముప్పవరపు, విజయ్‌కుమార్ వట్టికూటితో కలిసి నిర్మించిన ‘గాలిపటం’ గతవారం విడుదలైన విషయం తెలిసిందే. తొలి చిత్రంతోనే అందరి ప్రశంసలు పొందడం ఆనందంగా ఉందని నవీన్ గాంధీ చెబుతూ - ‘‘మాది అనంత్‌పూర్. అక్కడే చదువుకున్నా. ఎమ్ఏ సోషియాలజీ చేశాను. టీచర్‌గా చేయడంతో పాటు కొన్నాళ్లు జర్నలిస్ట్‌గా కూడా చేశాను. అనంతరం గోపీచంద్, రాఘవేంద్రరావు, రాజమౌళి దగ్గర పనిచేశాను. ఛాయాగ్రాహకుడు రాజీవ్ మీనన్ తీసిన వాణిజ్య ప్రకటనలకు సహాయ దర్శకునిగా కూడా చేశాను. నేను, సంపత్ నంది రూమ్ మేట్స్. దర్శకుడు కావాలనే తన ఆశయం ముందు నెరవేరింది. ‘గాలిపటం’తో నా కల కూడా ఫలించింది’’ అని చెప్పారు. ‘గాలిపటం’ క్లయిమాక్స్ చాలా బోల్డ్‌గా ఉందనేవారికి మీ సమాధానం అనడిగితే - ‘‘కొంచెం అడ్వాన్డ్స్‌గా ఉందని చాలామంది అన్నారు. దాన్ని ప్రశంసలా తీసుకున్నాం. ఓ పది, ఇరవయ్యేళ్ల తర్వాత ఎలా ఉంటుందో చూపించాం. ఈ కథకు ఆ ముగింపే కరెక్ట్. నేటి తరం స్వేచ్ఛగా ఉండాలని భావిస్తున్నారు. దాన్నే చూపించాం’’ అన్నారు. ప్రస్తుతం రెండు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయని, వాటి వివరాలు త్వరలో తెలియజేస్తానని నవీన్ తెలిపారు. -
ఓరుగల్లుకొచ్చిన ‘గాలిపటం’
సందడి చేసిన చిత్రం యూనిట్ ఘనంగా సత్కరించిన అభిమానులు, థియేటర్ యాజమాన్యం పోచమ్మమైదాన్ : గాలిపటం చిత్రం యూనిట్ నగరంలో శనివారం సందడి చేసింది. సినిమా విడుదలై విజయవంతంగా రెండో వారం ప్రదర్శింపబడుతున్నందున చిత్రం యూనిట్ ప్రేక్షకులను పలకరించేందుకు వరంగల్‌లోని లక్ష్మణ్ థియేటర్‌కు సాయంత్రం 4 గంటలకు విచ్చేసింది. చిత్ర నిర్మాత సంపత్ నంది, హీరో ఆది, హీరోయిన్ క్రిస్టినా, సంగీత దర్శకుడు బిమ్స్ సిసిరిలియో విచ్చేశారు. ఈ సందర్భంగా థియేటర్లో అభిమానులు బాణసంచా కాల్చి, సంబరాలు నిర్వహించారు. యూనిట్ బృందం సినిమా థియేటర్లో ప్రేక్షకులకు అభివాదం చేశారు. అనంతరం సినిమా నిర్మాత సంపత్ నంది మాట్లాడుతూ తాను దర్శకత్వం వహించి, నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమాలను ఆదరిస్తున్న తెలంగాణ ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపారు. గాలిపటం సినిమాను ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు రుణపడి ఉంటానని అన్నారు. ‘ఫ్యాక్షనిజంలో రెడ్డియిజం.. పవనిజంలో నిజయితీ ఉంటుందని’ సినిమా డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నాడు. సంగీత దర్శకుడు బిమ్స్ సిసిరిలియో ‘పొద్దున్నే ఏంట్రా తినడం పొంగలి’ అనే పాట పాడి ప్రేక్షకులను ఊర్రూతలూగించారు. హీరో ఆది మాట్లాడుతూ డిఫరెంట్ సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ‘అమ్మాయిలు ఆర్టీసీ బస్సుల మాదిరిగా వచ్చిపోతుంటారు’ అనే డైలాగ్ చెప్పి ప్రజలను మంత్రముగ్దులను చేశారు. అనంతరం థియేటర్ యాజమాన్యం సినిమా యూనిట్‌ను ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో థియేటర్ మేనేజర్ రవి, సూపర్వైజర్ సాంబయ్య, పాలిటెక్నిక్ విద్యార్థి జేఏసీ చైర్మన్ మేకల అక్షయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ది చాకోలెట్ రూంలో యూనిట్ సందడి ఎన్జీవోస్కాలనీ : హన్మకొండ నక్కలగుట్టలోని ది చాకోలెట్ రూంలో గాలిపటం చిత్రం యూనిట్ శనివారం సందడి చేసింది. నగరానికి వచ్చిన చిత్ర నిర్మాత, దర్శకుడు సంపత్ నంది, హీరో ఆది, హీరోయిన్ క్రిస్టినాతోపాటు చిత్ర బృందం ది చాకోలెట్ రూంకు వచ్చి అందులోని ఐటెమ్స్ రుచి చూశారు. హీరోయిన్ క్రిస్టినా తనకు ఇష్టమైన ప్యాన్‌కేక్ చాక్లెట్, ఎక్సెస్ కేక్ తిన్నారు. హీరో ఆది ఫ్రైడ్ చికెన్, చాక్లెట్, ఎక్సెస్ కేక్, ఫ్రైడ్ చికెన్ రుచి చూశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెట్రోపాలిటన్ నగరాలకు దీటుగా ఇక్కడ చాకోలెట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తూ నాణ్యమైన తినుబండారాలు అందించడం మంచి పరిణామమన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు రాజేష్, శ్రీధర్ పాల్గొన్నారు. -
కొడుకునే బురిడీ కొట్టించాలని..!!
-
సాక్షిలో గాలిపటాలు
-
ప్రశంసలతో పాటు విమర్శలూ వచ్చాయి!
‘‘నా అభిమానులకు ‘గాలిపటం’ కొత్త అనుభూతిని పంచింది. అంతేకాదు కొత్తగా చాలామంది అభిమానులను నాకు అందించిందీ సినిమా’’ అంటున్నారు ఆది. ఆయన కథానాయకునిగా నవీన్ గాంధీ దర్శకత్వంలో కిరణ్ ముప్పవరపు, విజయ్‌కుమార్ వట్టికూటితో కలిసి సంపత్‌నంది నిర్మించిన ‘గాలిపటం’ ఇటీవలే రిలీజైంది. ఈ సందర్భంగా ఆది ఏమన్నారంటే... నిజాలను సూటిగా చెప్పడంతో... నిజానికి యువతరాన్ని టార్గెట్ చేస్తూ ఈ స్క్రిప్ట్ తయారు చేశారు సంపత్‌నంది. అందులోనే కుటుంబ ప్రేక్షకులకు కావాల్సిన అంశాలను కూడా చొప్పించారు. అయితే... చెప్పాలనుకున్న పచ్చి నిజాలను... సూటిగా చెప్పడంతో కొంతమంది కాస్త ఇబ్బందిగా ఫీలైన మాట నిజం. ఈ సినిమా విడుదలవ్వగానే, నాకు ప్రశంసలతో పాటు కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఇలా పొగడ్తలు, తెగడ్తలూ కలసి రావడం ఒక మంచి సినిమాకే జరుగుతుంది. కన్నడంలో కూడా నటిస్తా... మా ఫ్యామిలీ సినిమా ఎప్పుడు? అని చాలామంది అడుగుతున్నారు. నాన్న, నేను కలిసి మాత్రం ఓ సినిమా చేస్తాం. బహుశా తాతయ్య అందులో నటించలేకపోవచ్చు. ఎందుకంటే... ఆయన కాస్త వీక్‌గా ఉన్నారు. మంచి కథ దొరికితే ఇద్దరం కలిసి నటిస్తాం. అది కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్ అయితే బావుంటుంది. అలాగే... కన్నడంలో ఎప్పుడు నటిస్తారని కూడా చాలామంది అడుగుతున్నారు. కన్నడ పరిశ్రమ అంటే నాకెంతో గౌరవం. ఎందుకంటే... ఆర్థికంగా మేం ఇబ్బందుల్లో ఉన్న సమయంలో నాన్న కన్నడంలో హీరో అయ్యారు. మా కుటుంబం ఈ రోజు ఆర్థికంగా మంచి స్థాయిలో ఉందంటే కారణం కన్నడ పరిశ్రమ. అందుకే... తప్పకుండా కన్నడంలో నటిస్తాను. అయితే... దానికి సమయం ఉంది. ప్రస్తుతం తెలుగులో నా కెరీర్ బావుంది. ఇక్కడ నన్ను నేను నిరూపించుకోవాలి. తర్వాత కన్నడంలో నటిస్తా. -
గాలిపటం టీంతో చిట్‌చాట్
-
గాలిపటం మూవీ స్టిల్స్
-
ఈ కథకు లిప్‌లాక్ కీలకం...
‘సమాజాన్ని ప్రతిబింబించేలా ఇందులో పాత్రలు ఉంటాయి. మా అందరికీ బ్రేక్ రావాలనే ఆశయంతో తీసిన సినిమా కాదు. ప్రేక్షకులకు ఓ మంచి సినిమా ఇవ్వాలనే తపనతో చేశాం. ఈ చిత్రంలో ఓ లిప్ లాక్ సీన్ ఉంది. సెన్సార్ బోర్డ్‌వారు అది తీసేయమన్నారు. కానీ, కథకు కీలకం కాబట్టి, తీయలేదు. అందుకే ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు’’ అని దర్శకుడు సంపత్ నంది చెప్పారు. ఆయన నిర్మాతగా మారి, కిరణ్ ముప్పవరపు, విజయ్‌కుమార్ వట్టికూటితో కలిసి నిర్మించిన చిత్రం ‘గాలిపటం’. ఆది, ఎరికా ఫెర్నాండెజ్, క్రిస్టినా అఖీవా ముఖ్య తారలుగా నవీన్ గాంధీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రం నా కెరీర్‌కి చాలా ముఖ్యం. ఇప్పటివరకు నేను చేసిన అన్ని సినిమాల్లోకెల్లా చాలా సంతోషాన్నిచ్చింది. యవతరానికి బాగా కనెక్ట్ అయ్యే చిత్రం. డైలాగులు బాగున్నాయి. ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం క్లయిమాక్స్, ప్రధమార్ధం’’ అని చెప్పారు. ఇందులో మంచి పాత్ర చేశానని ఎరికా అన్నారు. ‘‘రేసు గుర్రం, దృశ్యం.. ఇలా ఈ మధ్యకాలంలో చివర్లో సున్నా ఉన్న టైటిల్‌తో రూపొందిన సినిమాలన్నీ ఘనవిజయం సాధించాయని, ‘గాలిపటం’ హిట్ ఖాయమని అందరూ అంటున్నారు’’ అని కిరణ్ చెప్పారు. -
గాలిపటం మూవీ న్యూ స్టిల్స్
-
గాలిపటం మూవీ ప్లాటీనమ్ డిస్క్ వేడుక
-
గాలిపటం మూవీ వర్కింగి స్టిల్స్
-
గాలిపటం మూవీ ఆడియో వేడుకా
-
గాలిపటం ఆడియో వేడుక - Part 1
-
గాలిపటం ఆడియో వేడుక - Part 2
-
గాలిపటం మూవీ స్టిల్స్
-
రొమాంటిక్ ‘గాలిపటం’
‘‘మిత్రుడైన నవీన్‌గాంధీ కోసం సంపత్ నంది టీమ్ ఇలాంటి ప్రయత్నం చేయడం నిజంగా అభినందనీయం. ఈ సినిమా మంచి విజయం సాధించి సంపత్ నంది టీమ్‌కి మంచి లాభాలు తెచ్చిపెట్టాలి. అంతేకాదు, త్వరలో సంపత్ నంది దర్శకత్వం వహించనున్న ‘గబ్బర్‌సింగ్-2’ అఖండ విజయాన్ని అందుకోవాలి’’ అని దర్శకుడు వీవీ వినాయక్ ఆకాంక్షించారు. ఆది కథానాయకునిగా నవీన్‌గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘గాలిపటం’. ఎరికా ఫెర్నాండెజ్, క్రిస్టీనా అఖీవా, ప్రీతీ రానా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంపత్ నంది టీమ్‌వర్క్స్ పతాకంపై సంపత్‌నంది, కిరణ్ ముప్పవరపు, విజయ్‌కుమార్ వట్టికూటి కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రచార చిత్రాల ఆవిష్కరణ, వి.వి.వినాయక్, సాయికుమార్ దంపతుల చేతుల మీదుగా హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా సంపత్ నంది మాట్లాడుతూ ‘‘సమకాలీన అంశాలతో తెరకెక్కుతోన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. నా మిత్రుణ్ణి ప్రోత్సహించాలి, కొత్త కళాకారులను పరిశ్రమకు పరిచయం చేయాలనే సంకల్పంతో ఈ సినిమా చేస్తున్నాం’’ అని తెలిపారు. ‘గాలిపటం’ లోగో ఎంత బాగుందో... సినిమా కూడా అంత బాగుంటుందని దర్శకుడు చెప్పారు. ఇప్పటివరకూ తాను చేసిన కథలతో పోల్చి చూస్తే ఇది కొత్తగా ఉంటుందని, తన పాత్రలో భిన్న కోణాలుంటాయని ఆది పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్, కెమెరా: బుజ్జి. -
విభిన్నమైన ‘గాలిపటం’
భిన్నమైన కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘గాలి పటం’. కిరణ్ ముప్పవరపు, విజయ్‌కుమార్ వట్టికూటిలతో కలిసి దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆది, ఎరికా ఫెర్నాండెజ్, క్రిస్టినా అఖీవా, ప్రీతి రానా ఇందులో ప్రధాన పాత్రధారులు. నవీన్ గాంధీ దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార గీతాన్ని హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ -‘‘సంపత్‌నంది దగ్గర దర్శకత్వ శాఖలో చేశాను. దర్శకునిగా నాకు అవకాశమిచ్చిన ఆయనకు కృతజ్ఞతలు. త్వరలో పాటలను, సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ‘‘సంపత్ నంది ఈ సినిమా విషయంలో చాలా శ్రద్ధ కనబరుస్తున్నారు. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలతో పోలిస్తే భిన్నమైన సినిమా ఇది. నా పాత్రలో చాలా కోణాలుంటాయి’’ అని ఆది చెప్పారు. ఇందులో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నానని రాహుల్ రవీంద్రన్ అన్నారు. యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: కె.బుజ్జి, కూర్పు: రాంబాబు. -
నిర్మాతగా సంపత్ నంది
రచయితగా కెరీర్ మొదలుపెట్టి దర్శకునిగా రాణిస్తున్న యువకుడు సంపత్ నంది. డెరైక్ట్ చేసిన రెండు (ఏమైంది ఈ వేళ, రచ్చ) సినిమాలతోనే అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయిన సంపత్ నంది త్వరలో పవన్ కల్యాణ్‌తో ‘గబ్బర్ సింగ్-2’ చేయబోతున్నారు. తన స్నేహితుల కోసం సంపత్ నిర్మాతగా మారారు. నవీన్ గాంధీని దర్శకునిగా పరిచయం చేస్తూ ‘గాలి పటం’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారాయన. ఆది, రాహుల్, ఎరికా ఫెర్నాండెజ్, క్రిస్టినా అఖీవా ఇందులో ముఖ్యతారలు. ఇప్పటికి 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా సంపత్ నంది మాట్లాడుతూ -‘‘నేను దర్శకత్వం వహించిన ‘ఏమైంది ఈ వేళ’ తరహాలో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇది. నవీన్ గాంధీకి దర్శకునిగా చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. త్వరలోనే టైటిల్ లోగో ఆవిష్కరిస్తాం. నా స్నేహితులు కిరణ్ ముప్పవరపు, విజయ్ కుమార్ వట్టికూటితో కలిసి ఈ చిత్రాన్ని ఎల్.ఎ.టాకీస్ పతాకంపై నిర్మిస్తున్నా’’ అని తెలిపారు. పోసాని కృష్ణమురళి, సప్తగిరి, హేమ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: యం.ఎస్. కుమార్. -
'గాలిపటం నాలో నటిని వెలికితీసింది'
గాలిపటం చిత్రంలో తాను గ్లామరస్‌గా కనిపించినా, నటించడానికి తనకు చాలా అవకాశం లభించిందని ఆ సినిమా హీరోయిన్ క్రిస్టీనా అఖీవా చెప్పింది. ఇంతకుముందు యమ్లా పగ్లా దీవానా -2 చిత్రంలో నటించిన ఆమె.. త్వరలో విడుదల కాబోతున్న రొమాంటిక్ డ్రామా చిత్రం 'గాలిపటం'లో హీరోయిన్గా చేసింది. సినిమా కథ తనకు చాలా నచ్చిందని, ఇందులో తాను విదేశాల నుంచి వచ్చిన తెలుగమ్మాయిగా చేస్తున్నానని ఆమె తెలిపింది. ఈ సినిమా ప్రధానంగా భావోద్వేగాల గురించి, నటన గురించే ఉంటుందని క్రిస్టీనా అంటోంది. ఇంతకుముందు తెలుగులో అసలు ఇలాంటి కథలు రాలేదని, ఈ కథ చాలా పురోగామిగా ఉంటుందని చెప్పింది. సర్వసాధారణ లవ్‌స్టోరీలు, ఇప్పటికే కొన్ని వందల సార్లు వచ్చేసిన కథలా ఇది ఏమాత్రం ఉండబోదని, సరికొత్తగా ఉంటుందని తెలిపింది. ఇక ఈ సినిమాలో తనను తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారా అని నరాలు తెగేంత ఉత్కంఠగా ఉందని క్రిస్టీనా అంటోంది. తెలుగులో తనను కూడా ఆదరిస్తారనే భావిస్తోంది. తనతో కలిసి పనిచేసినవాళ్లంతా తనను ఎంతో ఆదరించారని, బయటి అమ్మాయిలా ఏమాత్రం చూడకుండా సొంత మనిషిలాగే భావించారని చెప్పింది. తాను ఈ భాషను, డైలాగులను అర్థం చేసుకోడానికి తనకు చాలా సమయం ఇచ్చారని, దాంతో ఎంతో ఆనందించానని తెలిపింది. అయితే, మన ప్రవర్తనను బట్టే అవతలివాళ్లు మన పట్ల ఎలా ప్రవర్తిస్తారన్నది కూడా ఉంటుందని అనుభవపూర్వకంగా చెప్పింది. సెట్ మీదకు వచ్చినప్పుడు పని గురించే ఆలోచిస్తానని, అందరితో చాలా సంతోషంగా కలిసిపోతానని తెలిపింది. అందుకే అంతా తనకు బాగా సాయం చేశారంది. నవీన్ గాంధీ దర్శకత్వం వహించిన 'గాలిపటం' చిత్రంలో ఆది సరసన క్రిస్టీనా, ఎరికా ఫెర్నాండెజ్ నటించారు.