విభిన్నమైన ‘గాలిపటం’ | Different kite | Sakshi
Sakshi News home page

విభిన్నమైన ‘గాలిపటం’

Published Wed, May 28 2014 11:14 PM | Last Updated on Sat, Sep 2 2017 7:59 AM

విభిన్నమైన ‘గాలిపటం’

విభిన్నమైన ‘గాలిపటం’

భిన్నమైన కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘గాలి పటం’. కిరణ్ ముప్పవరపు, విజయ్‌కుమార్ వట్టికూటిలతో కలిసి దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆది, ఎరికా ఫెర్నాండెజ్, క్రిస్టినా అఖీవా, ప్రీతి రానా ఇందులో ప్రధాన పాత్రధారులు. నవీన్ గాంధీ దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార గీతాన్ని హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ -‘‘సంపత్‌నంది దగ్గర దర్శకత్వ శాఖలో చేశాను.
 
 దర్శకునిగా నాకు అవకాశమిచ్చిన ఆయనకు కృతజ్ఞతలు. త్వరలో పాటలను, సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ‘‘సంపత్ నంది ఈ సినిమా విషయంలో చాలా శ్రద్ధ కనబరుస్తున్నారు. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలతో పోలిస్తే భిన్నమైన సినిమా ఇది. నా పాత్రలో చాలా కోణాలుంటాయి’’ అని ఆది చెప్పారు. ఇందులో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నానని రాహుల్ రవీంద్రన్ అన్నారు. యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: కె.బుజ్జి, కూర్పు: రాంబాబు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement