ఈ హిట్టు నాకు రిలీఫ్‌నిచ్చింది - ఆది | aadi shares his feelings about galipatam movie | Sakshi
Sakshi News home page

ఈ హిట్టు నాకు రిలీఫ్‌నిచ్చింది - ఆది

Published Tue, Aug 12 2014 12:16 AM | Last Updated on Sat, Sep 2 2017 11:43 AM

ఈ హిట్టు నాకు రిలీఫ్‌నిచ్చింది - ఆది

ఈ హిట్టు నాకు రిలీఫ్‌నిచ్చింది - ఆది

‘‘నా గత రెండు చిత్రాలు ఆశించిన ఫలితం సాధించకపోవడంతో కొంత నిరాశపడ్డాను. ఈ చిత్రవిజయంపై మొదట్నుంచీ నాకున్న నమ్మకం నిజమైంది. ఒక్కసారిగా ఒత్తిడి మొత్తం పోయి, హమ్మయ్య అనిపించింది’’ అని హీరో ఆది ఆనందం వ్యక్తం చేశారు. దర్శకుడు సంపత్ నంది నిర్మాతగా మారి, కిరణ్ ముప్పవరపు, విజయ్‌కుమార్ వట్టికూటితో కలిసి నిర్మించిన చిత్రం ‘గాలిపటం’. నవీన్ గాంధీ దర్శకత్వంలో ఆది, ఎరికా ఫెర్నాండెజ్, క్రిస్టినా అఖీవా ముఖ్య తారలుగా రూపొందిన ఈ చిత్రం గత వారం విడుదలైన విషయం తెలిసిందే.

ఈ సినిమా ఆశించిన ఫలితం సాధించిందని సోమవారం హైదరాబాద్‌లో జరిగిన విజయోత్సవ సభలో సంపత్ నంది చెబుతూ -‘‘మామూలుగా ఏ సినిమా చూసినా ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటికొచ్చేటప్పుడు బాగుందనో, చాలా బాగుందనో, మామూలుగా ఉందనో.. చెబుతుంటారు. కానీ, ఈ చిత్రం చూసినవాళ్లు ‘కొత్త’గా ఉంది అంటున్నారు. ఇలాంటి చిత్రాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది’’ అన్నారు. యూత్, ఫ్యామిలీస్ అందరూ ఈ చిత్రాన్ని చూస్తున్నారని నవీన్‌గాంధీ తెలిపారు. కిరణ్ ముప్పవరపు, రాహుల్ రవీంద్రన్, క్రిస్టినీ, భీమ్స్ ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement