ఓరుగల్లుకొచ్చిన ‘గాలిపటం’ | Noise Galipatam image of the unit | Sakshi
Sakshi News home page

ఓరుగల్లుకొచ్చిన ‘గాలిపటం’

Published Sun, Aug 17 2014 3:39 AM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM

ఓరుగల్లుకొచ్చిన ‘గాలిపటం’ - Sakshi

ఓరుగల్లుకొచ్చిన ‘గాలిపటం’

  •      సందడి చేసిన చిత్రం యూనిట్
  •      ఘనంగా సత్కరించిన అభిమానులు, థియేటర్ యాజమాన్యం
  • పోచమ్మమైదాన్ :  గాలిపటం చిత్రం యూనిట్ నగరంలో శనివారం సందడి చేసింది. సినిమా విడుదలై విజయవంతంగా రెండో వారం ప్రదర్శింపబడుతున్నందున చిత్రం యూనిట్ ప్రేక్షకులను పలకరించేందుకు వరంగల్‌లోని లక్ష్మణ్ థియేటర్‌కు సాయంత్రం 4 గంటలకు విచ్చేసింది. చిత్ర నిర్మాత సంపత్ నంది, హీరో ఆది, హీరోయిన్ క్రిస్టినా, సంగీత దర్శకుడు బిమ్స్ సిసిరిలియో విచ్చేశారు. ఈ సందర్భంగా థియేటర్‌లో అభిమానులు బాణసంచా కాల్చి, సంబరాలు నిర్వహించారు. యూనిట్ బృందం సినిమా థియేటర్‌లో ప్రేక్షకులకు అభివాదం చేశారు.

    అనంతరం సినిమా నిర్మాత సంపత్ నంది మాట్లాడుతూ తాను దర్శకత్వం వహించి, నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమాలను ఆదరిస్తున్న తెలంగాణ ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపారు. గాలిపటం సినిమాను ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు రుణపడి ఉంటానని అన్నారు. ‘ఫ్యాక్షనిజంలో రెడ్డియిజం.. పవనిజంలో నిజయితీ ఉంటుందని’ సినిమా డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నాడు. సంగీత దర్శకుడు బిమ్స్ సిసిరిలియో ‘పొద్దున్నే ఏంట్రా తినడం పొంగలి’ అనే పాట పాడి ప్రేక్షకులను ఊర్రూతలూగించారు.

    హీరో ఆది మాట్లాడుతూ డిఫరెంట్ సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ‘అమ్మాయిలు ఆర్టీసీ బస్సుల మాదిరిగా వచ్చిపోతుంటారు’ అనే డైలాగ్ చెప్పి ప్రజలను మంత్రముగ్దులను చేశారు. అనంతరం థియేటర్ యాజమాన్యం సినిమా యూనిట్‌ను ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో థియేటర్ మేనేజర్ రవి, సూపర్‌వైజర్ సాంబయ్య, పాలిటెక్నిక్ విద్యార్థి జేఏసీ చైర్మన్ మేకల అక్షయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
     
    ది చాకోలెట్ రూంలో యూనిట్ సందడి

    ఎన్జీవోస్‌కాలనీ : హన్మకొండ నక్కలగుట్టలోని ది చాకోలెట్ రూంలో గాలిపటం చిత్రం యూనిట్ శనివారం సందడి చేసింది. నగరానికి వచ్చిన చిత్ర నిర్మాత, దర్శకుడు సంపత్ నంది, హీరో ఆది, హీరోయిన్ క్రిస్టినాతోపాటు చిత్ర బృందం ది చాకోలెట్ రూంకు వచ్చి అందులోని ఐటెమ్స్ రుచి చూశారు. హీరోయిన్ క్రిస్టినా తనకు ఇష్టమైన ప్యాన్‌కేక్ చాక్‌లెట్, ఎక్సెస్ కేక్ తిన్నారు.
     
    హీరో ఆది ఫ్రైడ్ చికెన్, చాక్‌లెట్, ఎక్సెస్ కేక్, ఫ్రైడ్ చికెన్ రుచి చూశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెట్రోపాలిటన్ నగరాలకు దీటుగా ఇక్కడ చాకోలెట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తూ నాణ్యమైన తినుబండారాలు అందించడం మంచి పరిణామమన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు రాజేష్, శ్రీధర్ పాల్గొన్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement