Christina
-
ఆహా నా డ్రెస్ అంటా.... ఏఐ డ్రెస్ అంటా...
గూగుల్ సాప్ట్వేర్ ఇంజనీర్ క్రిస్టినా ఎర్నెస్ట్ సృష్టించిన ‘వరల్డ్స్ ఫస్ట్ ఏఐ డ్రెస్’ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ రోబోటిక్ మిదాస్ డ్రెస్ వీడియో 3.6 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. ఈ బ్లాక్ డ్రెస్‌లో ఎన్నో రోబోటిక్ పాములు ఉన్నాయి. చాలామంది ఈ డ్రెస్‌కు ‘ఎక్స్ట్రార్డినరీ’ అని కితాబు ఇవ్వగా కొద్దిమంది మాత్రం ‘బోరింగ్’ అని పెదవి విరిచారు. -
హెన్నీ క్రిస్టీనా కుల ధ్రువీకరణను మళ్లీ తేల్చండి
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా పరిషత్ (జెడ్పీ) చైర్పర్సన్ హెన్నీ క్రిస్టీనా, ఆమె భర్త కత్తెర సురేష్ కుమార్ల కులాన్ని మరోసారి తేల్చాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. వారి కుల ధ్రువీకరణపై పిటిషనర్ తాజాగా సమర్పించే ఆధారాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పింది. ఈ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. నిర్ణయం తీసుకునే ముందు క్రిస్టీనా, సురేష్‌ల వాదన కూడా వినాలని కలెక్టర్‌కు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ దొనడి రమేశ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. క్రిస్టీనా, సురేష్ ఎస్సీలు కారని, అయినా ఎస్సీలుగా చలామణి అవుతున్నారని, వారి కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కొల్లిపర గ్రామానికి చెందిన మండ్రు సరళకుమారి గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ మంగళవారం మరోసారి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. క్రిస్టీనా, సురేష్ కుమార్ బాప్టిజం తీసుకోవడం ద్వారా క్రైస్తవ మతంలోకి మారారని, అందువల్ల వారికి ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని తెలిపారు. వారికిచ్చిన కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయాలన్న పిటిషనర్ ఫిర్యాదును కలెక్టర్ తోసిపుచ్చారన్నారు. వారు బాప్టిజం తీసుకున్నట్లు అప్పట్లో ఆధారాలు దొరకలేదని, ఇప్పుడు ఆ ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. -
సమాన ప్యాకేజీ ఇవ్వాలి: మేరుగ
అమరావతి : తుళ్లూరు మండలం లింగాయపాలెంలో అసైన్డ్ భూములను వైఎస్సార్సీపీ నేతలు మేరుగ నాగార్జున, హెన్ని క్రిష్టినా పరిశీలించారు. అనంతరం క్రిస్టినాతో కలిసి మేరుగ నాగార్జున విలేకరులతో మాట్లాడారు. 50 ఏళ్ల నుంచి అసైన్డ్ భూమలు సాగు చేసుకుంటుంటే..ఎంజాయ్ మెంట్ సర్వే చెయ్యకుండా అధికారులు ప్రభుత్వ భూములుగా చూపిస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వివరించారు. వెంటనే దళితులు సాగు చేసుకుంటున్న భూములను వెంటనే ఎంజాయ్ మెంట్ సర్వే చెయ్యాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే 41 జీవోను రద్దు చెయ్యాలని కోరారు. అసైన్డ్ భూములకు పట్టా భూమితో సమానంగా ప్యాకేజి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితులకు చంద్రబాబు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే ఎంజాయ్ మెంట్ సర్వే చేసి దళితులకు న్యాయం చెయ్యకపోతే సీఆర్డీఏ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరికలు పంపారు. -
మన్నించుమా ప్రియా!
గ్రేట్ లవ్ స్టోరీస్ ‘‘ఎంత బాగా పాడతాడు!’’ అనుకుంది క్రిస్టినా. అలా ఆమె అనుకోవడం అది వందోసారి! జిమ్మీ మోర్గంటీ అద్భుతంగా పాడతాడు. ముఖ్యంగా అతను పాడే విషాదగీతం- ‘వెన్ యూ ఆర్ డ్రీమింగ్ విత్ ఏ బ్రోకెన్ హార్ట్’ అంటే ఆమెకి ఎంత ఇష్టమో! క్రిస్టినా, జిమ్మీల మధ్య స్నేహం పెరగడానికి, అది ప్రేమగా మారడానికి, పెళ్లి చేసుకోవాలి అనుకోవడానికి ‘పాట’ మాత్రమే కాదు, వారి అభిరుచులు ఒక్కటి కావడం కూడా కారణం! ఆరోజు న్యూజెర్సీలో... ఫ్రెండ్స్, బంధువుల కోసం తన ఆంటీవాళ్ల ఇంట్లో విందు ఏర్పాటు చేసింది క్రిస్టినా. ఆ విందులో తన పెళ్లి గురించి ప్రకటించాలనేది ఆమె ప్లాన్. జిమ్మీ మోర్గంటీ పాత, కొత్త పాటలతో ఆ విందును పసందుగా మార్చాడు. అంతలో క్రిస్టినాకి ఓ కోరిక పుట్టింది. ఆ సంతోష సమయంలో సరదాగా స్విమ్ చేయాలని ఆశపడింది. స్విమ్మింగ్ పూల్‌లో దూకింది. ఒక్కసారిగా ఏదో శబ్దం... అంతలోనే నిశ్శబ్దం. జిమ్మీకి అనుమానం వచ్చింది. వెంటనే పూల్‌లోకి దూకేశాడు. అను కున్నట్లే అయింది. క్రిస్టినా మెడకు బల మైన గాయం అయింది. బాధతో విల విలలాడిపోతోంది. జిమ్మీ మనసు అల్లాడి పోయింది. వెంటనే ఆమెను తీసుకుని ఆస్పత్రికి చేరుకున్నాడు. స్విమ్మింగ్‌పూల్‌లో దూకినప్పుడు క్రిస్టినాకు గచ్చు బలంగా తగిలింది. ఆ షాక్‌లో పక్షవాతం వచ్చింది. వీల్ చెయిర్‌కి పరిమితమైపోయింది. ఆమె పనులు ఆమె చేసుకోలేని పరిస్థితి. దాంతో దుఃఖిస్తూనే ఉండేది. జిమ్ ఆమెను పాటలతో అల రించేవాడు. జోక్స్ చెప్పి నవ్వించేవాడు. ధైర్యం నూరిపోసేవాడు. జీవితం విలువ గురించి చెబుతుండేవాడు. వింటున్నంత సేపూ ధైర్యంగా కనిపించేది. కానీ తర్వాత మళ్లీ నిరాశ, నిస్పృహ! ఒకరోజు క్రిస్టినా కోసం వచ్చాడు జిమ్మీ. ఆమె గదిలో నిద్రపోతోంది. ‘‘తనని డిస్టర్బ్ చేయకు. ఆమె జీవితాన్ని పాడు చేసింది చాలు’’ అన్నాడు క్రిస్టినా మారుతండ్రి. ‘‘నీతో ప్రేమలో పడ్డాకే నా కూతురి పరిస్థితి ఇలా అయింది. పెళ్లయితే ఇంకేమైనా ఉందా! వెళ్లు’’ అని అరిచింది క్రిస్టినా తల్లి. జిమ్మీ కళ్లు కన్నీటి సంద్రా లయ్యాయి. మౌనంగా వెళ్లిపోయాడు. స్నేహితుల ద్వారా అసలు నిజం తెలిసింది. జిమ్మీని చూడాలంటూ ఏడ్చింది. ఇక తప్పక జిమ్మీని ఇంటికి పిలిపించారు. చాలా రోజుల తరువాత ఒకరినొకరు చూసుకున్నారు. ‘‘నిన్ను విడిచి ఉండలేను’’ అన్నాడు జిమ్ ఆమెను గుండెకు హత్తుకుంటూ! ‘‘జిమ్మీ ఇవాళ రాలేదా?’’ అడిగింది క్రిస్టినా. ‘‘రాలేదు’’ అని సమాధానం. వారం రోజుల పాటు అదే సమాధానం. ‘‘మొన్నటి వరకు నేను లేక బతకలేను అన్నాడు. ఇప్పుడు నా పరిస్థితి చూసి ముఖం చాటేశాడు’’ అని కుమిలి పోయింది. కానీ తర్వాత స్నేహితుల ద్వారా అసలు నిజం తెలిసింది. జిమ్మీని చూడాలంటూ ఏడ్చింది. ఇక తప్పక జిమ్మీని ఇంటికి పిలిపించారు. చాలా రోజుల తరువాత ఒకరినొకరు చూసుకున్నారు. ‘‘నిన్ను విడిచి ఉండలేను’’ అన్నాడు జిమ్ ఆమెను గుండెకు హత్తుకుంటూ! ఆ రాత్రి క్రిస్టినాకు నిద్ర పట్టలేదు. ‘నేను జిమ్మీని పెళ్లాడడం సరైన నిర్ణయ మేనా? నన్ను చేసుకుని అతనేం సుఖపడ తాడు, నాకు సేవ చేస్తుండడం తప్ప’ అని దుఃఖించింది. ‘నా స్వార్థం కోసం అతడి జీవితాన్ని బలి తీసుకోలేను’ అనుకుంది. ‘‘ఇక జిమ్మీని నా దగ్గరికి రానివ్వొద్దు’’ అని తల్లిదండ్రులను కోరింది. వాళ్లకు అది వేరే విధంగా అర్థమైంది. కానీ నిజానికి ఆమె అనుకుంది వేరు. నాటి నుంచీ భోజనం మానేసింది క్రిస్టినా. ఇంట్లోవాళ్లు, స్నేహితులు ఎంతో బతిమిలాడారు. కానీ వినలేదు. ‘క్షణ క్షణం బతుకుతూ చావలేను’ అంది. ‘చని పోయే హక్కు నీకు లేదు’ అంటే ‘రైట్- టు-డై’ లా గురించి మాట్లాడేది. రోజులు భారంగా సాగిపోతున్నాయి. క్రిస్టినా శరీరాన్ని కొత్త కొత్త సమస్యలు చుట్టు ముడుతున్నాయి. విషయం తెలిసి జిమ్మీ వచ్చాడు. మనసు మార్చుకోమని కన్నీళ్లతో వేడుకున్నాడు. మౌనంగా ఉండిపోయింది క్రిస్టినా. ఆ తర్వాత మూడు రోజులకి ఆమె స్వరం పూర్తిగా మూగవోయింది. ఆమె కన్ను శాశ్వతంగా మూతపడింది. ‘నా కోసం నువ్వు నీ జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను. నన్ను మన్నించు’ అంటూ జిమ్మీకి రాసిన చివరి లేఖలో పేర్కొంది క్రిస్టినా. కానీ ఆమె తప్పుగా ఆలో చించింది. తాను వెళ్లిపోతే జిమ్మీ తనను మర్చిపోతాడనుకుంది. జీవితంలో ముందుకు సాగిపోతాడనుకుంది. అలా జరగలేదు. జిమ్మీ నేటికీ ఆమె ఆరాధన లోనే గడుపుతున్నాడు. ఆమె జ్ఞాపకాలతో జీవచ్ఛవంలా బతుకుతున్నాడు. -
ఓరుగల్లుకొచ్చిన ‘గాలిపటం’
సందడి చేసిన చిత్రం యూనిట్ ఘనంగా సత్కరించిన అభిమానులు, థియేటర్ యాజమాన్యం పోచమ్మమైదాన్ : గాలిపటం చిత్రం యూనిట్ నగరంలో శనివారం సందడి చేసింది. సినిమా విడుదలై విజయవంతంగా రెండో వారం ప్రదర్శింపబడుతున్నందున చిత్రం యూనిట్ ప్రేక్షకులను పలకరించేందుకు వరంగల్‌లోని లక్ష్మణ్ థియేటర్‌కు సాయంత్రం 4 గంటలకు విచ్చేసింది. చిత్ర నిర్మాత సంపత్ నంది, హీరో ఆది, హీరోయిన్ క్రిస్టినా, సంగీత దర్శకుడు బిమ్స్ సిసిరిలియో విచ్చేశారు. ఈ సందర్భంగా థియేటర్లో అభిమానులు బాణసంచా కాల్చి, సంబరాలు నిర్వహించారు. యూనిట్ బృందం సినిమా థియేటర్లో ప్రేక్షకులకు అభివాదం చేశారు. అనంతరం సినిమా నిర్మాత సంపత్ నంది మాట్లాడుతూ తాను దర్శకత్వం వహించి, నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమాలను ఆదరిస్తున్న తెలంగాణ ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపారు. గాలిపటం సినిమాను ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు రుణపడి ఉంటానని అన్నారు. ‘ఫ్యాక్షనిజంలో రెడ్డియిజం.. పవనిజంలో నిజయితీ ఉంటుందని’ సినిమా డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నాడు. సంగీత దర్శకుడు బిమ్స్ సిసిరిలియో ‘పొద్దున్నే ఏంట్రా తినడం పొంగలి’ అనే పాట పాడి ప్రేక్షకులను ఊర్రూతలూగించారు. హీరో ఆది మాట్లాడుతూ డిఫరెంట్ సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ‘అమ్మాయిలు ఆర్టీసీ బస్సుల మాదిరిగా వచ్చిపోతుంటారు’ అనే డైలాగ్ చెప్పి ప్రజలను మంత్రముగ్దులను చేశారు. అనంతరం థియేటర్ యాజమాన్యం సినిమా యూనిట్‌ను ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో థియేటర్ మేనేజర్ రవి, సూపర్వైజర్ సాంబయ్య, పాలిటెక్నిక్ విద్యార్థి జేఏసీ చైర్మన్ మేకల అక్షయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ది చాకోలెట్ రూంలో యూనిట్ సందడి ఎన్జీవోస్కాలనీ : హన్మకొండ నక్కలగుట్టలోని ది చాకోలెట్ రూంలో గాలిపటం చిత్రం యూనిట్ శనివారం సందడి చేసింది. నగరానికి వచ్చిన చిత్ర నిర్మాత, దర్శకుడు సంపత్ నంది, హీరో ఆది, హీరోయిన్ క్రిస్టినాతోపాటు చిత్ర బృందం ది చాకోలెట్ రూంకు వచ్చి అందులోని ఐటెమ్స్ రుచి చూశారు. హీరోయిన్ క్రిస్టినా తనకు ఇష్టమైన ప్యాన్‌కేక్ చాక్లెట్, ఎక్సెస్ కేక్ తిన్నారు. హీరో ఆది ఫ్రైడ్ చికెన్, చాక్లెట్, ఎక్సెస్ కేక్, ఫ్రైడ్ చికెన్ రుచి చూశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెట్రోపాలిటన్ నగరాలకు దీటుగా ఇక్కడ చాకోలెట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తూ నాణ్యమైన తినుబండారాలు అందించడం మంచి పరిణామమన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు రాజేష్, శ్రీధర్ పాల్గొన్నారు.