మన్నించుమా ప్రియా! | Great Love Story of Jimmy morganti | Sakshi
Sakshi News home page

మన్నించుమా ప్రియా!

Published Sun, Aug 23 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 7:56 AM

‘నీ నవ్వుల వెన్నెల్లో వెలిగిపోతాను’ - క్రిస్టినాతో జిమ్మీ

‘నీ నవ్వుల వెన్నెల్లో వెలిగిపోతాను’ - క్రిస్టినాతో జిమ్మీ

గ్రేట్ లవ్ స్టోరీస్
‘‘ఎంత బాగా పాడతాడు!’’ అనుకుంది క్రిస్టినా. అలా  ఆమె అనుకోవడం అది వందోసారి! జిమ్మీ మోర్గంటీ అద్భుతంగా పాడతాడు. ముఖ్యంగా అతను పాడే విషాదగీతం- ‘వెన్ యూ ఆర్ డ్రీమింగ్ విత్ ఏ బ్రోకెన్ హార్ట్’ అంటే ఆమెకి ఎంత ఇష్టమో! క్రిస్టినా, జిమ్మీల మధ్య స్నేహం పెరగడానికి, అది ప్రేమగా మారడానికి, పెళ్లి చేసుకోవాలి అనుకోవడానికి ‘పాట’ మాత్రమే కాదు, వారి అభిరుచులు ఒక్కటి కావడం కూడా కారణం!
 
ఆరోజు న్యూజెర్సీలో...
ఫ్రెండ్స్, బంధువుల కోసం తన ఆంటీవాళ్ల ఇంట్లో విందు ఏర్పాటు చేసింది క్రిస్టినా. ఆ విందులో తన పెళ్లి గురించి ప్రకటించాలనేది ఆమె ప్లాన్. జిమ్మీ మోర్గంటీ పాత, కొత్త పాటలతో ఆ విందును పసందుగా మార్చాడు. అంతలో క్రిస్టినాకి ఓ కోరిక పుట్టింది. ఆ సంతోష సమయంలో సరదాగా స్విమ్ చేయాలని ఆశపడింది. స్విమ్మింగ్ పూల్‌లో దూకింది. ఒక్కసారిగా ఏదో శబ్దం... అంతలోనే నిశ్శబ్దం. జిమ్మీకి అనుమానం వచ్చింది. వెంటనే పూల్‌లోకి దూకేశాడు. అను కున్నట్లే అయింది. క్రిస్టినా మెడకు బల మైన గాయం అయింది. బాధతో విల విలలాడిపోతోంది. జిమ్మీ మనసు అల్లాడి పోయింది. వెంటనే ఆమెను తీసుకుని ఆస్పత్రికి చేరుకున్నాడు.
 
స్విమ్మింగ్‌పూల్‌లో దూకినప్పుడు  క్రిస్టినాకు గచ్చు బలంగా తగిలింది. ఆ షాక్‌లో పక్షవాతం వచ్చింది. వీల్ చెయిర్‌కి పరిమితమైపోయింది. ఆమె పనులు ఆమె చేసుకోలేని పరిస్థితి. దాంతో దుఃఖిస్తూనే ఉండేది. జిమ్ ఆమెను పాటలతో అల రించేవాడు. జోక్స్ చెప్పి నవ్వించేవాడు. ధైర్యం నూరిపోసేవాడు. జీవితం విలువ గురించి చెబుతుండేవాడు. వింటున్నంత సేపూ ధైర్యంగా కనిపించేది. కానీ తర్వాత మళ్లీ నిరాశ, నిస్పృహ!
 
ఒకరోజు క్రిస్టినా కోసం వచ్చాడు జిమ్మీ. ఆమె గదిలో నిద్రపోతోంది. ‘‘తనని డిస్టర్బ్ చేయకు. ఆమె జీవితాన్ని పాడు చేసింది చాలు’’ అన్నాడు క్రిస్టినా మారుతండ్రి. ‘‘నీతో ప్రేమలో పడ్డాకే నా కూతురి పరిస్థితి ఇలా అయింది. పెళ్లయితే ఇంకేమైనా ఉందా! వెళ్లు’’ అని అరిచింది క్రిస్టినా తల్లి.  జిమ్మీ కళ్లు కన్నీటి సంద్రా లయ్యాయి. మౌనంగా వెళ్లిపోయాడు.
   
స్నేహితుల ద్వారా అసలు నిజం తెలిసింది. జిమ్మీని చూడాలంటూ ఏడ్చింది. ఇక తప్పక జిమ్మీని ఇంటికి పిలిపించారు. చాలా రోజుల తరువాత ఒకరినొకరు చూసుకున్నారు. ‘‘నిన్ను విడిచి ఉండలేను’’ అన్నాడు జిమ్ ఆమెను గుండెకు హత్తుకుంటూ!
 
‘‘జిమ్మీ ఇవాళ రాలేదా?’’ అడిగింది క్రిస్టినా. ‘‘రాలేదు’’ అని సమాధానం. వారం రోజుల పాటు అదే సమాధానం. ‘‘మొన్నటి వరకు నేను లేక బతకలేను అన్నాడు. ఇప్పుడు నా పరిస్థితి చూసి ముఖం చాటేశాడు’’ అని కుమిలి పోయింది. కానీ తర్వాత స్నేహితుల ద్వారా అసలు నిజం తెలిసింది. జిమ్మీని చూడాలంటూ ఏడ్చింది. ఇక తప్పక జిమ్మీని ఇంటికి పిలిపించారు. చాలా రోజుల తరువాత ఒకరినొకరు చూసుకున్నారు. ‘‘నిన్ను విడిచి ఉండలేను’’ అన్నాడు జిమ్ ఆమెను గుండెకు హత్తుకుంటూ!
 ఆ రాత్రి క్రిస్టినాకు నిద్ర పట్టలేదు.

‘నేను జిమ్మీని పెళ్లాడడం సరైన నిర్ణయ మేనా? నన్ను చేసుకుని అతనేం సుఖపడ తాడు, నాకు సేవ చేస్తుండడం తప్ప’ అని దుఃఖించింది. ‘నా స్వార్థం కోసం అతడి జీవితాన్ని బలి తీసుకోలేను’ అనుకుంది. ‘‘ఇక జిమ్మీని నా దగ్గరికి రానివ్వొద్దు’’ అని తల్లిదండ్రులను కోరింది. వాళ్లకు అది వేరే విధంగా అర్థమైంది. కానీ నిజానికి ఆమె అనుకుంది వేరు.

నాటి నుంచీ భోజనం మానేసింది క్రిస్టినా. ఇంట్లోవాళ్లు, స్నేహితులు ఎంతో బతిమిలాడారు. కానీ వినలేదు. ‘క్షణ క్షణం బతుకుతూ చావలేను’ అంది. ‘చని పోయే హక్కు నీకు లేదు’ అంటే ‘రైట్- టు-డై’ లా గురించి మాట్లాడేది. రోజులు భారంగా సాగిపోతున్నాయి. క్రిస్టినా శరీరాన్ని కొత్త కొత్త సమస్యలు చుట్టు ముడుతున్నాయి. విషయం తెలిసి జిమ్మీ వచ్చాడు. మనసు మార్చుకోమని కన్నీళ్లతో వేడుకున్నాడు. మౌనంగా ఉండిపోయింది క్రిస్టినా. ఆ తర్వాత మూడు రోజులకి ఆమె స్వరం పూర్తిగా మూగవోయింది. ఆమె కన్ను శాశ్వతంగా మూతపడింది.
 
‘నా కోసం నువ్వు నీ జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను. నన్ను మన్నించు’ అంటూ జిమ్మీకి రాసిన చివరి లేఖలో పేర్కొంది క్రిస్టినా. కానీ ఆమె తప్పుగా ఆలో చించింది. తాను వెళ్లిపోతే జిమ్మీ తనను మర్చిపోతాడనుకుంది. జీవితంలో ముందుకు సాగిపోతాడనుకుంది. అలా జరగలేదు. జిమ్మీ నేటికీ ఆమె ఆరాధన లోనే గడుపుతున్నాడు. ఆమె జ్ఞాపకాలతో జీవచ్ఛవంలా బతుకుతున్నాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement