ప్రశంసలతో పాటు విమర్శలూ వచ్చాయి! | Exclusive Interview With Actor Aadi | Sakshi
Sakshi News home page

ప్రశంసలతో పాటు విమర్శలూ వచ్చాయి!

Published Wed, Aug 13 2014 10:34 PM | Last Updated on Sat, Sep 2 2017 11:50 AM

ప్రశంసలతో పాటు విమర్శలూ వచ్చాయి!

ప్రశంసలతో పాటు విమర్శలూ వచ్చాయి!

‘‘నా అభిమానులకు ‘గాలిపటం’ కొత్త అనుభూతిని పంచింది. అంతేకాదు కొత్తగా చాలామంది అభిమానులను నాకు అందించిందీ సినిమా’’ అంటున్నారు ఆది. ఆయన కథానాయకునిగా నవీన్ గాంధీ దర్శకత్వంలో కిరణ్ ముప్పవరపు, విజయ్‌కుమార్ వట్టికూటితో కలిసి సంపత్‌నంది నిర్మించిన ‘గాలిపటం’ ఇటీవలే రిలీజైంది. ఈ సందర్భంగా ఆది ఏమన్నారంటే...
 
 నిజాలను సూటిగా చెప్పడంతో...
 నిజానికి యువతరాన్ని టార్గెట్ చేస్తూ ఈ స్క్రిప్ట్ తయారు చేశారు సంపత్‌నంది. అందులోనే కుటుంబ ప్రేక్షకులకు కావాల్సిన అంశాలను కూడా చొప్పించారు. అయితే... చెప్పాలనుకున్న పచ్చి నిజాలను... సూటిగా చెప్పడంతో కొంతమంది కాస్త ఇబ్బందిగా ఫీలైన మాట నిజం. ఈ సినిమా విడుదలవ్వగానే, నాకు ప్రశంసలతో పాటు కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఇలా పొగడ్తలు, తెగడ్తలూ కలసి రావడం ఒక మంచి సినిమాకే జరుగుతుంది.
 
 కన్నడంలో కూడా నటిస్తా...
 మా ఫ్యామిలీ సినిమా ఎప్పుడు? అని చాలామంది అడుగుతున్నారు. నాన్న, నేను కలిసి మాత్రం ఓ సినిమా చేస్తాం. బహుశా తాతయ్య అందులో నటించలేకపోవచ్చు. ఎందుకంటే... ఆయన కాస్త వీక్‌గా ఉన్నారు. మంచి కథ దొరికితే ఇద్దరం కలిసి నటిస్తాం. అది కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్ అయితే బావుంటుంది. అలాగే... కన్నడంలో ఎప్పుడు నటిస్తారని కూడా చాలామంది అడుగుతున్నారు. కన్నడ పరిశ్రమ అంటే నాకెంతో గౌరవం. ఎందుకంటే... ఆర్థికంగా మేం ఇబ్బందుల్లో ఉన్న సమయంలో నాన్న కన్నడంలో హీరో అయ్యారు. మా కుటుంబం ఈ రోజు ఆర్థికంగా మంచి స్థాయిలో ఉందంటే కారణం కన్నడ పరిశ్రమ. అందుకే... తప్పకుండా కన్నడంలో నటిస్తాను. అయితే... దానికి సమయం ఉంది. ప్రస్తుతం తెలుగులో నా కెరీర్ బావుంది. ఇక్కడ నన్ను నేను నిరూపించుకోవాలి. తర్వాత కన్నడంలో నటిస్తా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement