కార్తీకేయ., ఆది చేజారినట్టేనా..?
స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. స్టార్ ఇమేజ్ కోసం చాలా రోజులుగా పోరాడుతున్న యంగ్ హీరో ఆది. కెరీర్లో ప్రేమకావాలి, లవ్లీ లాంటి హిట్ సినిమాలు ఉన్నా కమర్షియల్ స్టార్గా ప్రూవ్ చేసుకునే సినిమాలు మాత్రం ఇంత వరకు రాలేదు. దీంతో తెలుగుతో పాటు కన్నడ మార్కెట్ మీద కూడా దృష్టి పెట్టిన ఆది ఓ రీమేక్ సినిమాతో సాండల్వుడ్లో ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేసుకున్నాడు.
కానీ ఆది ఆశలు నేరవేరేలా కనిపించటం లేదు. తెలుగులో నిఖిల్ హీరోగా తెరకెక్కిన కార్తీకేయ సినిమాను కన్నడ రీమేక్ చేయాలని ప్లాన్ చేశాడు ఆది. అయితే ఆ సినిమాను ఇప్పుడు మరో నటుడు అభిషేక్ వర్మ హీరోగా రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ప్రస్తుతం రవిబాబు దర్వకత్వంలో తెరకెక్కుతున్న అదిగో సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న అభిషేక్ వర్మ, కార్తీకేయ రీమేక్తో సాండల్వుడ్లో ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేసుకున్నాడు.
ఈ సినిమాను అభిషేక్ వర్మ తండ్రి స్వయంగా నిర్మించాలని భావిస్తున్నాడు. ఇప్పటికే ప్రయత్నాలు కూడా మొదలైపోయాయి, ఈ రీమేక్ కోసం కన్నడ నాట బాగా పాపులర్ అయిన క్రేజీ టైటిల్ను రిజిస్టర్ చేయించారట. 'కుమారస్వామి' పేరుతో ఈ సినిమా రీమేక్కు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న టాక్ వినిపిస్తొంది.