ఓటీటీలో కార్తికేయ హిట్‌ సినిమా.. అధికారిక ప్రకటన | Bhaje Vaayu Vegam OTT Release Date Confirmed | Sakshi
Sakshi News home page

ఓటీటీలో కార్తికేయ హిట్‌ సినిమా.. అధికారిక ప్రకటన

Published Mon, Jun 24 2024 6:40 PM | Last Updated on Mon, Jun 24 2024 7:45 PM

Bhaje Vaayu Vegam Movie OTT Streaming Date Locked

కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భజే వాయు వేగం’. ఎలాంటి అంచనాలు లేకుండా  మే 31న ఈ చిత్రం రిలీజ్ అయింది. అయితే, మొదటి ఆట నుంచి సినిమా బాగుందంటూ విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందాయి. తాజాగా ఈ సినిమా ఓటీటీలో విడుదల కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటించింది.

ప్రశాంత్‌ రెడ్డి తొలిసారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్‌ 28న ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుందని నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటించింది. బెట్టింగ్‌ మాఫియా చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. చిన్న సినిమా అయినా ప్రేక్షకులను మెప్పించడంలో డైరెక్టర్‌ విజయం సాధించాడు. 

ఇందులో  ఐశ్వర్యా మీనన్‌ హీరోయిన్‌గా నటించగా తనికెళ్ల భరణి, రవిశంకర్, సుదర్శన్, కీరోల్స్ చేశారు. ఈ మూవీలో ‘హ్యాపీ డేస్‌’ ఫేమ్‌ రాహుల్‌ టైసన్‌ కూడా ముఖ్య పాత్ర పోషించారు. యువీ క్రియేషన్స్‌ సమర్పణలో యువీ కాన్సెప్ట్స్‌ బ్యానర్‌పై ‘భజే వాయు వేగం’ చిత్రాన్ని తెరకెక్కించారు. సినీ అభిమానులకు ఈ వార​ం మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ అని చెప్పవచ్చు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement