Bhaje Vayu Vegam Movie
-
ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ తెలుగు సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
చాన్నాళ్ల తర్వాత థియేటర్లు కళకళలాడుతున్నాయి. 'కల్కి' దెబ్బకు చాలాచోట్ల హౌస్‌ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి. ఇప్పటికే హిట్ టాక్ రావడంతో చూసినవాళ్లు తెగ ఆనందపడిపోతున్నారు. చూడనివాళ్లు ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్‌పై 'కల్కి' మేజిక్ చూసేద్దామా అనే ఆత్రుతలో ఉన్నారు. దీనికి డబుల్ బొనాంజా అన్నట్లు ఓటీటీలోనూ క్రేజీ తెలుగు సినిమాలు మూడు వచ్చేశాయి. 'కల్కి'తో పాటు వీకెండ్లో వీటిని కూడా చూసేసే ప్లాన్ చేసుకోండి.పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ చేసిన హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ 'సత్యభామ'. పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టోరీతో తీసిన ఈ చిత్రానికి పాజిటివ్ టాకే వచ్చింది గానీ రెగ్యులర్ థ్రిల్లర్ టెంప్లేట్ కథ కావడం మైనస్ అయిందని చెప్పొచ్చు. ఇది ఇప్పుడు ఎలాంటి ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. థ్రిల్లర్ మూవీతో టైమ్ పాస్ చేద్దామనుకునేవాళ్లు దీనిపై లుక్కేయండి.(ఇదీ చదవండి: 'కల్కి' మూవీలో కృష్ణుడిగా చేసిన నటుడెవరో తెలుసా?)'ఆర్ఎక్స్ 100' తర్వాత సరైన హిట్ లేక ఇబ్బందిపడిన కార్తికేయకు సంతృప్తి ఇచ్చిన మూవీ 'భజే వాయు వేగం'. గత నెల చివర్లో వచ్చి అనుహ్యంగా హిట్ కొట్టిన థ్రిల్లర్ మూవీ ఇది. అన్నదమ్ముల బాండింగ్ నేపథ్య కథతో తీసిన ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి.చాన్నాళ్ల తర్వాత నవదీప్ 'లవ్ మౌళి' అనే బోల్డ్ మూవీతో హీరోగా రీఎంట్రీ ఇచ్చాడు. కాకపోతే ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్లు బోల్డ్‌నెస్‌లో శృతిమించిపోయారు. అయితే యువతకు మాత్రమే కొంతలో కొంతమేర నచ్చిన ఈ చిత్రం.. 'కల్కి' రిలీజ్ రోజే ఆహా ఓటీటీలో రిలీజైంది. యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చూడాలనుకుంటే ఇది మీకు ఛాయిస్ అవ్వొచ్చు.(ఇదీ చదవండి: పేరు మార్చుకున్న ప్రభాస్.. 'కల్కి'లో ఇది గమనించారా?) -
థియేటర్లలో కల్కి.. ఓటీటీకి వస్తోన్న సినిమాలేవో తెలుసా?
వీకెండ్ వస్తోందంటే చాలు ఏ సినిమా థియేటర్లో రిలీజవుతోంది? ఏయే సినిమాలు ఓటీటీకి వస్తున్నాయి? అంటూ ఒకటే చర్చ. అయితే ఈ వారంలో థియేటర్లలో రిలీజయ్యే చిత్రాల గురించి ఆరా తీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపించేది ఆ సినిమా ఒక్క పేరే. అదే ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీ. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు ఇండియా వ్యాప్తంగా కల్కిమేనియా నడుస్తోంది. దీంతో థియేటర్స్ హౌస్‌ఫుల్‌గా దర్శనమిస్తున్నాయి.అయితే మరోవైపు ఈ వీకెండ్ ఓటీటీ సినిమాలు ఏంటనేది ఆడియన్స్ ఆరా తీస్తున్నారు. సినీ ప్రియులను అలరించేందుకు కార్తికేయ హీరోగా ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం భజే వాయు వేగం, నవదీప్ నటించిన సినిమా లవ్ మౌళి ఓటీటీ సందడి చేసేందుకు సిద్ధమైపోయాయి. వీటితో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ చిత్రం గురువాయుర్ అంబలనాదయిల్ స్ట్రీమింగ్కు రానుంది. మరీ ఈ వీకెండ్ ఓటీటీకి వచ్చేస్తోన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లపై మీరు ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్ ఏ ఫ్యామిలీ ఎఫైర్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 28ఓనింగ్ మ్యాన్ హట్టన్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 28ద విర్ల్ విండ్ (కొరియన్ సిరీస్) - జూన్ 28భజే వాయు వేగం(తెలుగు సినిమా)- జూన్ 28అమెజాన్ప్రైమ్సివిల్ వార్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 28శర్మజీ కీ బేటీ (హిందీ సినిమా) - జూన్ 28జీ5 రౌతూ కా రాజ్ (హిందీ) జూన్ 28డిస్నీ+హాట్‌స్టార్ ఆవేశం (హిందీ డబ్బింగ్ మూవీ) - జూన్ 28ఆపిల్ టీవీ ప్లస్ ఫ్యాన్సీ డ్యాన్స్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 28 వండ్ల (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 28సైనా ప్లే హిగ్యుటా (మలయాళ సినిమా) - జూన్ 28 -
ఓటీటీలో కార్తికేయ హిట్ సినిమా.. అధికారిక ప్రకటన
కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భజే వాయు వేగం’. ఎలాంటి అంచనాలు లేకుండా మే 31న ఈ చిత్రం రిలీజ్ అయింది. అయితే, మొదటి ఆట నుంచి సినిమా బాగుందంటూ విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందాయి. తాజాగా ఈ సినిమా ఓటీటీలో విడుదల కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.ప్రశాంత్ రెడ్డి తొలిసారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 28న ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. బెట్టింగ్ మాఫియా చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. చిన్న సినిమా అయినా ప్రేక్షకులను మెప్పించడంలో డైరెక్టర్ విజయం సాధించాడు. ఇందులో ఐశ్వర్యా మీనన్ హీరోయిన్గా నటించగా తనికెళ్ల భరణి, రవిశంకర్, సుదర్శన్, కీరోల్స్ చేశారు. ఈ మూవీలో ‘హ్యాపీ డేస్’ ఫేమ్ రాహుల్ టైసన్ కూడా ముఖ్య పాత్ర పోషించారు. యువీ క్రియేషన్స్ సమర్పణలో యువీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై ‘భజే వాయు వేగం’ చిత్రాన్ని తెరకెక్కించారు. సినీ అభిమానులకు ఈ వారం మంచి ఎంటర్టైన్మెంట్ అని చెప్పవచ్చు. You showered us with love in theaters 🫶🏻 here we are sending back the love straight to your home on June 28th @NetflixIndia 🤩#BhajeVaayuVegam pic.twitter.com/ghGf79KdNj— Kartikeya (@ActorKartikeya) June 24, 2024 -
'భజే వాయువేగం' సినిమా రివ్యూ
ఈ వేసవి అంతా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో సరైన సినిమా పడలేదు. అలాంటిది ఈ వారం ఏకంగా మూడు తెలుగు మూవీస్ రిలీజ్ అయ్యాయి. వాటిలో అందరి దృష్టి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' పైనే ఉంది. కానీ యూవీ క్రియేషన్స్ తీసిన 'భజే వాయువేగం' కూడా ఓ మాదిరి అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రివ్యూ)కథేంటి?వెంకట్ (కార్తికేయ) చిన్నప్పుడే తల్లిదండ్రులు అప్పుల బాధతో చనిపోతారు. అనాథగా మారిన ఇతడిని, తండ్రి స్నేహితుడు (తనికెళ్లి భరణి) దత్తత తీసుకుంటాడు. తన సొంత కొడుకు రాజు(రాహుల్ టైసన్)లానే వెంకట్‌ని కూడా పెంచి పెద్ద చేస్తాడు. సిటీలో అద్దె ఇంట్లో ఉండే అన్నదమ్ములిద్దరూ.. ఉద్యోగాలు చేస్తున్నామని చెప్పి తండ్రిని మోసం చేస్తుంటారు. ఓ రోజు తండ్రి ఆరోగ్యం విషమించడంతో డబ్బుల కోసం వెంకట్ బెట్టింగ్ వేస్తాడు. అందులో గెలుస్తాడు. కానీ విలన్ గ్యాంగ్ ఇతడిని మోసం చేస్తారు. దీంతో ఊహించని పరిస్థితుల్లో వాళ్లపై పగ తీర్చుకోవాల్సి వస్తుంది. మరి చివరకు ఏమైంది? వెంకట్ తాను అనుకున్నది సాధించాడా? లేదా? ఇతడితో డేవిడ్ (రవి శంకర్), జార్జ్ (శరత్ లోహిత్స్వ)కి సంబంధమేంటి? అనేదే మెయిన్ స్టోరీ.ఎలా ఉందంటే?'భజే వాయు వేగం' గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే బెట్టింగ్స్‌లో గెలుస్తూ బతికేసే ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు.. ఊహించని విధంగా కెరీర్, వ్యక్తిగత, రాజకీయ పరంగా సమస్యల్లో ఇరుక్కుని ఎలా గెలిచి నిలబడ్డాడు అనేదే కథ. ఓవరాల్‌గా చూస్తే డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్. కథ పరంగా చూస్తే కొన్ని సీన్స్ ఊహించేలా ఉన్నప్పటికీ, స్క్రీన్ ప్లే బాగుంది. పెద్దగా ల్యాగ్ చేయకుండా వచ్చిన సీన్స్ టైటిల్‌కి తగ్గ న్యాయం చేశాయి.ఫస్టాప్ విషయానికొస్తే.. పోలీస్ స్టేషన్లో హీరో అరెస్ట్ అయి ఉండే సీన్‌తో మూవీ మొదలైంది. ఆ తర్వాత ఏడాది వెనక్కి వెళ్లి.. హీరో గతమేంటి? అతడి చుట్టూ ఉండే వాతావరణం ఏంటనేది చూపించారు. స్టోరీ సెటప్ కోసం ఫస్టాప్ అంతా ఉపయోగించుకున్నారు. కానీ హీరోహీరోయిన్ లవ్ ట్రాక్ పరమ రొటీన్‌గా అనిపించింది. రెండు పాటలు ఓకే గానీ హీరోహీరోయిన్ మధ్య కెమిస్ట్రీ అస్సలు వర్కౌట్ కాలేదు. ఓ మాదిరిగా వెళ్తున్న మూవీ కాస్త ఇంటర్వెల్ వచ్చేసరికి ఆసక్తికరంగా మారింది. అక్కడి నుంచి చివరివరకు చాలా బాగా తీశారు. కానీ క్లైమాక్స్ మాత్రం రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో ముగించారు. అది కాస్త అసంతృప్తిగా అనిపించింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)ఎవరెలా చేశారు?'ఆర్ఎక్స్ 100'తో చాలా ఫేమ్ తెచ్చుకున్న కార్తికేయ.. ఆ తర్వాత మాత్రం సరైన హిట్ పడక ఎదురుచూపులు చూస్తున్నాడు. 'భజే వాయువేగం' అతడికి హిట్ ఇచ్చినట్లే! బాధ, ప్రతీకారం లాంటి ఎమోషన్స్ బాగా పలికించాడు. హీరోయిన్ ఐశ్వర్య మేనన్ యాక్టింగ్ చేసేంత స్కోప్ ఈ మూవీలో దక్కలేదు. కాకపోతే ఈమె పాత్రని కూడా కథలో భాగం చేయడం కొంత ఉపశమనం. ఇక హీరోతో పాటు సరిసమానంగా ఉండే అన్న పాత్ర చేసిన రాహుల్ టైనస్.. న్యాయం చేశాడు. ఎమోషనల్ సీన్స్‌లో బాగా ఫెర్ఫార్మ్ చేశాడు. విలన్‌గా చేసిన రవిశంకర్ యధావిధిగా అదరగొట్టేశాడు. తనికెళ్ల భరణి లాంటి సీనియర్ ఉన్నప్పటికీ ఆయన తగ్గ సీన్స్ పడలేదు. మిగిలిన పాత్రధారులు ఓకే.టెక్నికల్ విషయాలకొస్తే.. డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి అదరగొట్టేశాడు. తొలి మూవీనే కమర్షియల్‌గా తీస్తున్నప్పటికీ అనవసర సీన్స్ జోలికి పోకుండా డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ డెలివరీ చేశాడు. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి తగ్గట్లు ఉన్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే 'భజే వాయువేగం'.. మరీ సూపర్‌గా కాకపోయినా మిమ్మల్ని పక్కాగా థ్రిల్ చేసే మూవీ.-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
Kartikeya Gummakonda: ప్రేక్షకులు అప్పుడే హీరోలా చూస్తారు
‘‘ఇప్పుడున్న నా ఇమేజ్‌కు సరైన మూవీ ‘భజే వాయు వేగం’. హీరో అంటే మనం ΄ోల్చుకునేలా ఉండాలి. అతనికి ఎదురయ్యే సమస్యలు, వాటిని పరిష్కరించేందుకు ఎంచుకునే మార్గాలు స్ఫూర్తిదాయకంగా ఉండాలని భావిస్తాను. అప్పుడే అతన్ని ప్రేక్షకులు హీరోలా చూస్తారు. హీరోగా నాకు కొంచెం సామాజిక బాధ్యత ఉంది. అది నేను చేసే పాత్రల మీద రిఫ్లెక్ట్ అవుతుంటుంది’’ అని హీరో కార్తికేయ గుమ్మకొండ అన్నారు. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన చిత్రం ‘భజే వాయు వేగం’. ‘హ్యాపీ డేస్’ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్ర చేశారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం రేపు రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ– ‘‘లాక్ డౌన్ టైమ్‌లో ‘భజే వాయు వేగం’ కథ వినిపించాడు ప్రశాంత్ రెడ్డి. ఈ కథ వినగానే కార్తీ హీరోగా నటించిన ‘ఖైదీ’ టైపులో ఊహించుకున్నాను. ‘ఖైదీ’లో ఉన్నంత యాక్షన్ ఉండదు కానీ, హీరోయిజం, యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్, లవ్ అన్నీ కుదిరాయి. యూవీ క్రియేషన్స్‌లో సినిమా అనగానే మేకింగ్, ΄ోస్ట్ ్ర΄÷డక్షన్, రిలీజ్ అన్నీ సరిగ్గా జరుగుతాయనే నమ్మకం వచ్చింది. ‘భజే వాయు వేగం’లో ఫస్టాఫ్‌లో ఎమోషన్ ఉన్న హీరోను చూస్తారు.సెకండాఫ్‌లో ఆ ఎమోషన్ వల్ల ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాడనేది చూపించాం. ఈ సినిమా క్రెడిట్ వంద శాతం దర్శకుడిదే. హీరోగా చేస్తున్న టైమ్‌లో ‘గ్యాంగ్ లీడర్, వలిమై’ చిత్రాల్లో విలన్‌గా నటించినందుకు ఫీల్ అవడం లేదు. ఆ సినిమాల ద్వారా నాకు అమెరికాలో, తమిళ పరిశ్రమలో గుర్తింపు దక్కింది. ‘గ్యాంగ్ లీడర్’ తర్వాత తెలుగు, తమిళంలో విలన్‌గా చాన్స్ వచ్చినా పాత్రలు నచ్చక చేయలేదు. నా తర్వాతి సినిమాని కూడా ప్రశాంత్ రెడ్డితోనే చేయాలనుకుంటున్నాను’’ అన్నారు. -
రాజమౌళి పేరు చెప్పే అర్హత నాకిప్పుడు లేదు: డైరెక్టర్
‘మా ఊర్లో(మెదక్) రాజమౌళి దర్శకత్వం వహించిన ‘సై’ సినిమా షూటింగ్ జరిగింది. అది చూసిన తర్వాతే నాకు ఇండస్ట్రీలోకి రావాలనే కోరిక ఏర్పడింది. రాజమౌళి గారిని ఆదర్శంగా తీసుకొనే ఇండస్ట్రీలోకి వచ్చాను. ఈ విషయం చెప్పేందుకు ఇప్పుడు నాకున్న అర్హత సరిపోదు. నా సినిమా(భజే వాయు వేగం) విడుదలై అందరికి నచ్చితే.. అప్పుడు రాజమౌళి గారే నా ఇన్స్పిరేషన్ అని గర్వంగా చెబుతా’అని అన్నాడు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘భయే వాయు వేగం’. కార్తికేయ గుమ్మకొండ, ఐశ్వర్య మీనన్ హీరోహీరోయిన్లుగా నటించారు. మే 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రశాంత్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇒ యూవీ క్రియేషన్స్‌తో నాకు చాలా అనుబంధం ఉంది. రన్ రాజా రన్ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేశాను. ఆ తర్వాత సాహోకు కంటిన్యూ అయ్యాను. కోవిడ్ కు ముందు భజే వాయు వేగం ఓకే అయ్యింది. కార్తికేయ అప్పడు చావు కబురు చల్లగా, రాజా విక్రమార్క చేస్తున్నాడు. కోవిడ్ వల్ల ఏడాదిన్నర టైమ్ వేస్టయింది. "భజే వాయు వేగం" సినిమా షూటింగ్ మొదలుపెట్టి 70 పర్సెంట్ కంప్లీట్ చేసిన తర్వాత కార్తికేయ బెదురులంక షూటింగ్ కు వెళ్లాడు. అది ఫినిష్ చేసి వచ్చాక మా "భజే వాయు వేగం" కంప్లీట్ చేశాం.⇒ ‘భజే వాయు వేగం’ కథ ప్రకారం ఫస్టాఫ్ కు ఒక పర్ ఫార్మర్ కావాలి. సెకండాఫ్ లో హీరోయిజం ఎలివేట్ కావాలి. అలా చూస్తే కార్తికేయ నాకు బెస్ట్ ఆప్షన్ అనిపించాడు. అతను పర్ ఫార్మెన్స్ చేస్తాడు, హీరో పర్సనాలిటీ ఉంటుంది. కార్తికేయను ఎంచుకోవడానికి కారణమిదే. అలాగే హీరోయిన్ ఒక మిడిల్ క్లాస్ లొకాలిటీలో పెరిగే సంప్రదాయబద్దమైన అమ్మాయి. ఐశ్వర్య మీనన్ ప్రొఫైల్ చూస్తుంటే మొత్తం హాఫ శారీ, చీరకట్టులో ఫొటోస్ తో కనిపించింది. ఆమె ఈ మూవీలో ఇందు క్యారెక్టర్ కు కరెక్ట్ ఆప్షన్ గా భావించా.⇒ ఈ సినిమా కొంత డిలే కావడానికి కారణాలు ఉన్నాయి. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎడిట్ చేసిన వెర్షన్ ఫుటేజ్ పోయింది. మళ్లీ ఆ ఎడిటింగ్ కోసం మూడు నెలల టైమ్ అదనంగా పట్టింది. పోస్ట్ ప్రొడక్షన్ లో క్వాలిటీ కోసం కొంత టైమ్ అదనంగా తీసుకున్నాం. ఫస్ట్ సినిమాకు ఇలా కొంత డిలే కావడం ప్రెజర్ గానే ఉండేది.⇒ ట్రైలర్ లో ఫాదర్ సెంటిమెంట్ అనేది రివీల్ చేశాం. అయితే ఫాదర్ సెంటిమెంట్ అనే కాన్సెప్ట్ ఎప్పుడూ ఓల్డ్ కాదు. ట్రైలర్ చివరలో మీ నాన్న కాదు మా నాన్న అని రాహుల్ కార్తికేయతో చెప్పడం కూడా కథ తెలిసిపోయిందని కొందరు కామెంట్ చేశారు. కానీ మీకు ట్రైలర్ చూపించింది రేపు థియేటర్ లో చూడబోయే కథకు చాలా వేరియేషన్స్ ఉంటాయి. కథను రివీల్ చేయకూడదనే ట్రైలర్ లో ఎలాంటి ట్విస్ట్ లు చూపించలేదు. ⇒ ఊరి నుంచి పట్టణానికి మనమంతా ఏదో ఒకటి సాధించాలని వస్తాం. అలా వచ్చిన క్రమంలో ఇక్కడ కొన్ని పోగొట్టుకుంటాం. కొన్ని సంపాదిస్తాం. చివరకు మన గోల్ రీచ్ అయ్యామా లేదా అనేది చూసుకుంటాం. అనుకున్నది సాధించని వాళ్లూ ఉంటారు. హీరో అలా ఒక గోల్ మీద సిటీకి వస్తాడు. అతను తన గోల్ గురించి ప్రయత్నిస్తున్న టైమ్ లో వేరే సమస్యలు చుట్టుముడతాయి. తన లక్ష్యం వదిలేసి వీటిని సాల్వ్ చేసేందుకు వెళ్తుంటాడు. ప్రేక్షకులకు మాత్రం అతని గోల్ వేరు కదా అనిపిస్తుంటుంది.⇒ సినిమా సెకండాఫ్ లో ఛేజింగ్ లా స్క్రీన్ ప్లే ఉంటుంది. సెకండాఫ్ లో మీరు ఫోన్ వైపు చూడరనే నమ్మకం ఉంది. అంత గ్రిప్పింగ్ గా ఉంటుంది. స్పీడ్ లాంటి టైటిల్ మా మూవీకి పెట్టుకోవచ్చు. అయితే ఇంగ్లీష్ టైటిల్ ఎందుకని భజే వాయు వేగం అని పెట్టాం. మా యూవీ వారికి కూడా బాగా నచ్చింది. వెంటనే రిజిస్టర్ చేయించాం. అఖిల్ తో యూవీలో సినిమా చేయబోతున్న డైరెక్టర్ అనిల్ ఈ సినిమా చూసి టైటిల్ సజెస్ట్ చేశాడు.⇒ ఈ సినిమా బీజీఎం కోసం స్పెషల్ కేర్ తీసుకున్నా. దాదాపు మూడు నెలలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసమే టైమ్ కేటాయించా. కపిల్ అని కొత్త అతను బీజీఎం ఇచ్చాడు. రాధన్ సాంగ్ చేశాడు. అతను చెన్నైలో ఉంటే నేను అక్కడికి ఇక్కడికి తిరగడానికి టైమ్ ఉండదని రాధన్ తో బీజీఎం చేయించలేదు. సెకండాఫ్ లో ఒక్క సాంగ్ ఉండదు. స్క్రీన్ ప్లే రేసీగా వెళ్తుంటుంది. కథ స్పీడ్ గా వెళ్తే ఆడియెన్స్ ఎవరూ అక్కడ పాట ఉండాలని కోరుకోరు. పైగా దాన్నో స్పీడ్ బ్రేకర్ లా భావిస్తారు.⇒ ఆడియెన్స్ రీల్స్ చూసే ట్రెండ్ లోకి వచ్చారు. ఒక్క క్షణం బోర్ కొట్టినా రీల్ మార్చేస్తారు. ఇలాంటి టైమ్ లో సినిమా చిన్న గ్యాప్ ఇవ్వకుండా ఆడియెన్ ను ఎంగేజ్ చేయాలనేది నా ఆలోచన. "భజే వాయు వేగం" సినిమాకు అదే ఫాలో అయ్యి రూపొందించాం. మనం అతన్ని హీరో అని పిలుస్తున్నాం కాబట్టి హీరో ఒక పెద్ద లక్ష్యంతో ఉండాలని నేను అనుకుంటా. ప్రేక్షకులకు హీరోకు కనెక్ట్ అవుతారు. వాళ్లకు స్ఫూర్తినిచ్చేలా హీరో క్యారెక్టర్ ఉండాలి.⇒ అసిస్టెంట్ డైరెక్టర్ గా నేర్చుకున్న దానికంటే ఓ సినిమాకు డైరెక్షన్ చేస్తే వెయ్యింతలు పని నేర్చుకోవచ్చు. సినిమాను అనేక దశల్లో బెటర్ మెంట్ చేసుకోవచ్చు. మిగతా ఏ క్రియేటివ్ జాబ్ లోనూ ఇలాంటి అవకాశం ఉండకపోవచ్చు.⇒ ప్రస్తుతం కొన్ని స్క్రిప్ట్స్ నా దగ్గర ఉన్నాయి. భజే వాయు వేగం సినిమా రిలీజ్ అయ్యాక నా కొత్త మూవీ అనౌన్స్ చేస్తా.