– కార్తికేయ గుమ్మకొండ
‘‘ఇప్పుడున్న నా ఇమేజ్‌కు సరైన మూవీ ‘భజే వాయు వేగం’. హీరో అంటే మనం ΄ోల్చుకునేలా ఉండాలి. అతనికి ఎదురయ్యే సమస్యలు, వాటిని పరిష్కరించేందుకు ఎంచుకునే మార్గాలు స్ఫూర్తిదాయకంగా ఉండాలని భావిస్తాను. అప్పుడే అతన్ని ప్రేక్షకులు హీరోలా చూస్తారు. హీరోగా నాకు కొంచెం సామాజిక బాధ్యత ఉంది. అది నేను చేసే పాత్రల మీద రిఫ్లెక్ట్ అవుతుంటుంది’’ అని హీరో కార్తికేయ గుమ్మకొండ అన్నారు.
ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన చిత్రం ‘భజే వాయు వేగం’. ‘హ్యాపీ డేస్’ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్ర చేశారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం రేపు రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ– ‘‘లాక్ డౌన్ టైమ్‌లో ‘భజే వాయు వేగం’ కథ వినిపించాడు ప్రశాంత్ రెడ్డి.
ఈ కథ వినగానే కార్తీ హీరోగా నటించిన ‘ఖైదీ’ టైపులో ఊహించుకున్నాను. ‘ఖైదీ’లో ఉన్నంత యాక్షన్ ఉండదు కానీ, హీరోయిజం, యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్, లవ్ అన్నీ కుదిరాయి. యూవీ క్రియేషన్స్‌లో సినిమా అనగానే మేకింగ్, ΄ోస్ట్ ్ర΄÷డక్షన్, రిలీజ్ అన్నీ సరిగ్గా జరుగుతాయనే నమ్మకం వచ్చింది. ‘భజే వాయు వేగం’లో ఫస్టాఫ్‌లో ఎమోషన్ ఉన్న హీరోను చూస్తారు.
సెకండాఫ్‌లో ఆ ఎమోషన్ వల్ల ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాడనేది చూపించాం. ఈ సినిమా క్రెడిట్ వంద శాతం దర్శకుడిదే. హీరోగా చేస్తున్న టైమ్‌లో ‘గ్యాంగ్ లీడర్, వలిమై’ చిత్రాల్లో విలన్‌గా నటించినందుకు ఫీల్ అవడం లేదు. ఆ సినిమాల ద్వారా నాకు అమెరికాలో, తమిళ పరిశ్రమలో గుర్తింపు దక్కింది. ‘గ్యాంగ్ లీడర్’ తర్వాత తెలుగు, తమిళంలో విలన్‌గా చాన్స్ వచ్చినా పాత్రలు నచ్చక చేయలేదు. నా తర్వాతి సినిమాని కూడా ప్రశాంత్ రెడ్డితోనే చేయాలనుకుంటున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment