‘‘కోవిడ్ తర్వాత థియేటర్స్‌కు ఆడియన్స్ వస్తారా? అనే డౌట్ ఉండేది. మీరు సినిమా తీయండి మేం వస్తాం అని... అది ‘క్రాక్’ సినిమాతో కావొచ్చు.. ‘ఉప్పెన’తో కావొచ్చు. మాకు భరోసా ఇచ్చిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ప్రేక్షకుల దీవెనలు ఉన్నంత కాలం ఇండస్ట్రీ బాగుంటుంది. నా జీవితంలో నేను సంపాదించుకున్నది నా అభిమానులనే. వారు గర్వపడేలా నేను కష్టపడతానని ప్రామిస్ చేస్తున్నాను’’ అని అన్నారు అల్లు అర్జున్ . కార్తికేయ, లావణ్యా త్రిపాఠి జంటగా కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘చావు కబురు చల్లగా...’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో అల్లు అర్జున్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాని నేను చూశాను. బాగుంటుందని గ్యారంటీ ఇవ్వగలను. ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా ఉంటుంది. వాసుతో ‘గంగోత్రి’ సినిమా నుంచి నా అసోషియేషన్ కొనసాగుతోంది. వాసుకి సినిమా నచ్చడం చాలా అరుదు. తను ఏదైనా ఒక సినిమాను సెలక్ట్ చేసుకుంటే అందులో విషయం ఉంటుంది. ఈ కథ నవదీప్ వల్ల గీతా ఆర్ట్స్‌కి చేరింది. అందరూ ఎంత బాగా చేసినా అందరికీ హిట్ ఇచ్చేది డైరెక్టరే. కౌశిక్‌లో మంచి మెచ్యూరిటీ ఉంది.
కార్తికేయ ‘ఆర్‌ఎక్స్ 100’ సినిమా చూశాను. ‘చావుకబురు..’లో బస్తీ బాలరాజుగా తన యాక్టింగ్ అద్భుతంగా ఉంది. బిజోయ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. గీతా ఆర్ట్స్‌లో లావణ్యాకు ఈ సినిమా హ్యాట్రిక్ అవుతుంది. ‘పుష్ప’ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. తగ్గేదే లేదు’’ అన్నారు. ‘‘గీతా ఆర్ట్స్ సినిమా అని కాదు.. వాసు స్నేహితుడిగా అల్లు అర్జున్ ఈ కార్యక్రమానికి వచ్చాడు. కార్తికేయ అమేజింగ్ యాక్టర్. కౌశిక్ మంచి రైటర్. మా సంస్థలో ఎక్కువకాలం ఉండేవారిలో కౌశిక్ ఉంటాడు. ‘‘ఆహా’ ప్లాట్‌ఫామ్‌ను స్టార్ట్ చేయడానికి వాసు ముఖ్యకారణం. గీతా ఆర్ట్స్‌కు మంచి సపోర్టివ్‌గా ఉంటున్నాడు’’ అన్నారు అల్లు అరవింద్.
చదవండి: బన్నీ తెలుగమ్మాయే కావాలన్నాడు: సుకుమార్
‘‘స్టార్ హీరోలను నా సినిమా రిలీజ్ ఫంక్షన్స్‌కు అతిథిగా పిలిపించుకునే అవకాశం రాలేదు. ఈ సినిమాకు బన్నీగారు వచ్చినందుకు సంతోషంగా ఉంది. గోడదూకి ‘ఆర్య 2’ సినిమాకు వెళ్లాను. ‘రేసుగుర్రం’ సినిమాకు థియేటర్స్‌లో ఆడియన్స్‌లా స్టెప్పులేశాను. ఇప్పుడు బన్నీగారి ప్రొడక్షన్‌లో సినిమా చేయడం సంతోషంగా ఉంది. అరవింద్‌గారి ప్రొడక్షన్‌లో రజనీకాంత్, చిరంజీవి, పవన్ కల్యాణ్, ఆమిర్‌ఖాన్ వంటి పెద్ద పెద్ద స్టార్లు గీతా ఆర్ట్స్‌లో నటించారు. వారికి ఎలాంటి గౌరవం దక్కిందో నాకూ అలాంటిదే దక్కింది. కౌశిక్ మంచి డైరెక్టర్ అవుతాడు. ఇక లావణ్యను ‘అందాల రాక్షసి’గా కాదు.. ‘మల్లిక’గా గుర్తుపెట్టుకుంటారు. ఈ సినిమా నన్ను ఎక్కడికి తీసుకువెళుతుందో తెలియదు. కానీ ఈ సినిమా హిట్ సాధిస్తుందని అందరూ నమ్ముతున్నారు. నేనూ నమ్ముతున్నాను’’ అన్నారు కార్తికేయ.
చదవండి: అల్లు అర్జున్‌ను కలిసి ‘కేజీఎఫ్’ డైరెక్టర్.. ఫొటో వైరల్
‘‘సినిమా చూసి బన్నీ ఇచ్చిన కాంప్లిమెంట్స్‌ను మర్చిపోలేను. అవకాశం ఇచ్చిన అల్లు అరవింద్‌గారికి ధన్యవాదాలు. బస్తీ బాలరాజుగా కార్తికేయ చితక్కొ ట్టాడు. నవదీప్‌గారి వల్ల వాసూగారితో పరిచయం కలిగింది. నేను చెప్పిన కథ నచ్చి వాసూగారు అవకాశం ఇచ్చారు’’ అన్నారు కౌశిక్. ‘‘కార్తికేయ హీరోగా, విలన్ గా చేస్తున్నాడు. హీరోగా మంచి పాత్రలు సెలక్ట్ చేసుకుంటూ కెరీర్‌లో ముందుకు వెళ్లు. ‘చావు కబురు చల్లగా...’ సూపర్‌హిట్ అవుతుంది’’ అని అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. ‘‘అరవింద్‌గారు, బన్నీగారు లేకుంటే నేనీ స్థాయికి వచ్చేవాడిని కాదు. హీరోగా కార్తికేయ, దర్శకుడిగా కౌశిక్ మంచి స్థాయికి వెళతారు. ఇలాంటి డిఫరెంట్ కథను ఇచ్చినందుకు కౌశిక్‌కు, విడో క్యారెక్టర్ చేసిన లావణ్యాగారికి థ్యాంక్స్’’ అన్నారు నిర్మాత ‘బన్నీ’ వాసు.
ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బన్నీ.. ఐకానిక్ మాస్ స్టార్!
‘స్టైలిష్ స్టార్‌గా కాదు... ఐకానిక్ మాస్ స్టార్‌లా బన్నీని ఫ్యాన్స్ గుర్తుపెట్టుకునేలా ‘పుష్ప’ సినిమా ఉంటుంది. కొత్త కథల ఎంపికలో అల్లు అరవింద్‌గారి జడ్జ్‌మెంట్‌కు ఓ నమస్కారం. కార్తికేయ భవిష్యత్‌లో మంచి స్టార్ అవుతాడు. ‘గీతగోవిందం’ గీసిన గీతను ఈ సినిమా దాటిపోవాలని కోరుకుంటున్నాను’’ అని సుకుమార్ అన్నారు.
లావణ్యా త్రిపాఠి, అల్లు అర్జున్, కార్తికేయ, అల్లు అరవింద్, బన్నీ వాసు, కౌశిక్, అనసూయ
Comments
Please login to add a commentAdd a comment