chaavu Kaburu Challaga Movie
-
చావు కబురు చల్లగా: అక్కడ డిజాస్టర్.. ఇక్కడ బ్లాక్‌బస్టర్
కరోనా కారణంగా ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫాం హావా నడుస్తోంది. ఇంట్లో కూర్చోనే ఎంచక్కా కొత్త సినిమాలన్ని చూసేయేచ్చు. అయితే బిగ్‌స్రీన్‌పై భారీ విజయం సాధించిన సినిమాలు ఓటీటీలో నిరాశపరుస్తుంటే.. డిజాస్టర్‌గా నిలిచిన సినిమాలు మాత్రం సూపర్ హిట్‌గా నిలుస్తున్నాయి. గత నెల మార్చి 2న విడుదలైన కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ మూవీ బిగ్‌స్రీన్‌పై అంతగా ఆకట్టుకోలేనప్పటికి.. నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రం దుమ్మురేపుతోంది.ఓటీటీలో విడుదలైన కొద్ది రోజుల్లోనే మిలియన్ల వ్యూ కౌంట్ అందుకోని దక్షిణ భారత చిత్రాల రికార్డును బద్దలు కొట్టింది. తాజాగా హీరో కార్తికేయ, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠిలు హీరోహీరోయిన్లు వచ్చిన ‘చావు కబురు చల్లగా’ చిత్రం కూడా వైల్డ్ డాగ్ తరహాలో ఓటీటీలో దూసుకుపోతోంది. బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం ఇటీవల ఆహా యాప్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీని కాస్తా ఎడిట్ చేసి రిలీజ్ చేశారు. విడుదలైన 72 గంటల్లోనే అత్యధిక వేగంగా 100 మిలియన్ మినిట్స్ వ్యూయర్ షిప్ అందుకున్నట్లు తాజాగా ఆహా స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. దీంతో బిగ్‌స్రీన్‌పై నిరాశపరిచిన ఈ మూవీ.. స్మాల్‌స్క్రీన్‌పై బాక్సాఫీసు రేంజ్ హిట్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. థీయేటర్లో చూసిన వారు సైతం ఆహాలో ఈ మూవీని చూసేందుకు ఆసక్తిని చూపడం విశేషం. అంతేగాక ఈ మూవీని అద్భుతంగా రీఎడిట్ చేసి అందించారంటు పాజిటివ్ కామెంటు కూడా వస్తున్నాయి. కాగా కౌశిక్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని బన్నీ వాసు నిర్మించారు. ఈ సినిమా విడుదలైన రోజు కొంత పాజిటివ్ టాక్ రాగా.. రెండవ రోజు నుంచి నెగిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. అలాగే కోవిడ్ పరిస్థితులు కూడా ఈ సినిమాను దెబ్బ కొట్టాయి. మొత్తానికి ‘చావు కబురు చల్లగా’ బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని ఇచ్చింది. గీత ఆర్ట్స్ సంయుక్త బ్యానర్ జీఏ2(GA2) నుంచి వచ్చిన ఈ సినిమా భారీగా నష్టాలని మిగిల్చింది. 13.5 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్‌తో మార్కెట్లోకి వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా కేవలం 3.32 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. దాదాపు 10 కోట్ల వరకు నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. చదవండి: ఓటీటీకి మహర్దశ: కొత్తగా రిలీజయ్యే సినిమాలివే! అక్కడ ఓడినా ఇక్కడ రికార్డులు తిరగరాస్తున్న వైల్డ్ డాగ్ -
ఈ వీకెండ్లో ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలివే..
దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఎక్కడికి వెళ్లాలన్నా భయం భయంగానే ఉంటోంది. ఇలాంటి సమయంలో ప్రశాంతంగా ఇంట్లోనే కూర్చొని కొత్త సినిమాలకు చూస్తూ ఎంటర్టైన్ అవ్వొచ్చు. ఈ వారం ఓటీటీలో పలు కొత్త సినిమాలు విడుదల కానున్నాయి. ఆ సినిమాలేంటి? ఏ ప్లాట్‌ఫాంలో ఎప్పుడు రిలీజ్ కానున్నాయి వంటి వివరాలు చూసేద్దాం. అక్కినేని నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్‌డాగ్’. ఈ చిత్రంలో కింగ్ నాగ్ ఏసీపీ విజయ్ వర్మగా నటించారు. ఎటువంటి కమర్షియల్ హంగులు లేకపోయినప్పటికీ, సినిమాకు మంచి స్పందన వచ్చింది. దియా మిర్జా, సయామీ ఖేర్, అతుల్ కులకర్ణి, అలీ రెజా తదితరులు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్22న విడుదలయ్యింది. కార్తీ, రష్మిక జంటగా నటించిన చిత్రం 'సుల్తాన్. ‘ఖైదీ’, ‘దొంగ’ వంటి సూపర్ హిట్స్ తర్వాత కార్తీ ఈ మూవీలో నటించారు.తమిళంలో రష్మికకు ఇదే తొలి చిత్రం.బక్కియరాజ్ కణ్ణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యస్.ఆర్. ప్రకాష్ బాబు, యస్.ఆర్. ప్రభు నిర్మించారు.యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా మే 2 ఆహాలో విడుదల కానుంది. బాలీవుడ్ నటి పరిణీతీ చోప్రా కథానాయికగా నటించిన చిత్రం ‘సైనా’. ఈ మూవీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. పాత్ర కోసం పరిణీతి చోప్రా బ్యాడ్మింటన్‌లో మెళకువలన్నీ నేర్చకోవడంతోపాటు సైనా, ఆమె కుటుంబంతో సమయం గడిపిన విషయం తెలిసిందే. అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ బాక్సీఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో ఏప్రిల్23న ఈ చిత్రం రిలీజ్ కానుంది. కన్నడ స్టార్ దర్శన్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం "రాబర్ట్". తెలుగులోనూ ఇదే పేరుతో రిలీజ్ అయ్యింది. అనుకోని పరిస్థితుల్లో కొడుకు ఓ గ్యాంగ్‌స్టర్‌తో పడిన ఇబ్బందుల నుంచే ఎలా భయపడ్డాడు అన్నదే ఈ సినిమా కథ. ఈ ఏడాది రిలీజ్ అయిన భారీ సినిమాల్లో ఇది కూడా ఒకటి. కన్నడలో ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. జగపతి బాబు రవి కిషన్, వినోద్ ప్రభాకర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఏప్రిల్ 25న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాస్ నిర్మించాడు. ‘ఆహా’లో ఏప్రిల్ 23న రిలీజ్ అయ్యింది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో యంగ్ హీరో పవన్‌తేజ్. ఈయన నటించిన డెబ్యూ మూవీ ఈ కథలో పాత్రలు కల్పితం. మేఘనా, లక్కీ, రఘు బాబు, అభయ్ బేతిగంటి ప్రధాన పాత్రలు పోషించారు. తొలి సినిమాతోనే పవన్ తేజ్ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 24న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. -
‘ఆహా’లో ‘చావు కబురు చల్లగా’, ఎప్పుడంటే..
‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాస్ నిర్మించాడు. ఎన్నో అంచనాల మధ్య మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇక అది అలా ఏంటే.. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ చిత్రం ‘ఆహా’లో ఏప్రిల్ 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆహా సినిమా ట్రైలర్‌ని విడుదల చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు కౌశిక్ మాట్లాడుతూ 'చావు కబురు చల్లగా'ను ఓ రియలిస్టిక్ పాయింట్‌తో తెరకెక్కించామని, అయితే ఈ సినిమా థియేటర్స్ విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయిందన్నారు. ఓటీటీ కోసం సినిమాను కొద్దిగా ఎడిట్ చేశామని చేప్పాడు. ప్రేక్షకులు చెప్పిన పాయింట్స్‌ను పరిగణలోకి తీసుకుని రీ ఎడిట్ చేశాం. థియేటర్ కంటే బెటర్ కట్ చేశాం. థియేటర్ కంటే ఆహాలో ఇంకా బాగుంటుందని పేర్కోన్నాడు. -
క్షమించండి, మరో చాన్స్ ఇవ్వండి: కార్తికేయ
ప్రేమతో మీ కార్తీక్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టాడు యంగ్ హీరో కార్తికేయ. కానీ ఈ సినిమా ఉందన్న విషయం కూడా చాలా మందికి తెలీదు. తర్వాత చేసిన ఆర్ఎక్స్100 సూపర్ డూపర్ హిట్ కావడంతో చిన్నపాటి స్టార్ అయిపోయాడు. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో వరుస సినిమాలు చేసుకుంటూ పోయాడు. కానీ అవన్నీ డిజాస్టర్లుగా మిగిలాయి. అయితే ఈసారి గీతా ఆర్ట్స్ అనే పెద్ద బ్యానర్లో సినిమా చేస్తుండటంతో హిట్టు పడటం ఖాయం అని అంతా ఫిక్సయ్యారు. కానీ అంచనాలను తారుమారు చేస్తూ చావు కబురు చల్లగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఎన్నో ఆశలతో థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకుడు తీరా సినిమా చూశాక ఉసూరుమంటూ నిట్టూరుస్తున్నాడు. వారి నిరుత్సాహాన్ని పసిగట్టిన కార్తికేయ అభిమానులను క్షమించమని కోరుతూ ట్వీట్ చేశాడు. "చావు కబురు చల్లగా సినిమా నాలో కొత్త నటుడిని పరిచయం చేసింది. బస్తీ బాలరాజుగా ఎన్నో హృదయాలకు నన్ను దగ్గర చేసింది. ఈ సినిమా నచ్చని అందరూ చిన్న తప్పులున్నా క్షమించేసి ఇంకో అవకాశం ఇవ్వండి. తప్పకుండా దాన్ని సరిదిద్దుకుని మళ్లీ పుంజుకుంటా"నని కోరాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. దీనిపై ఆయన అభిమానులు స్పందిస్తూ కెరీర్లో ఇలాంటి ఒడిదుడుకులు సాధారణమేనని, త్వరలో తప్పకుండా హిట్ కొడుతావ్ అని కామెంట్లు చేస్తున్నారు. #ChaavuKaburuChallaga a movie that explored a new actor in me,got me closer to the hearts of many.Been reading your messages,made me proud of #Basthibalaraju.. And movie nachani andaru chinna thappulunna kshaminchesi inkoka chance ivandi,will definitely rectify and bounce back😊 pic.twitter.com/mf7qE0ACH6 — Kartikeya (@ActorKartikeya) March 29, 2021 చదవండి: 'సరిగ్గా నడిపితే ఎలాంటి కబుర్లు వినాల్సిన పని లేదు' శ్రేయా ఘోషల్ బేబీ బంప్ ఫోటోలు వైరల్ -
బస్తి బాలరాజ్ & టీమ్
-
హీరో కార్తికేయకు ఊహించని షాకిచ్చిన పోలీసులు
హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటా నటించిన చిత్రం 'చావు కబురు చల్లగా'. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై వచ్చిన ఈ సినిమాపై విడుదలకు ముందే పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాలో కార్తికేయ శవాలు మోసే బస్తీ బాలరాజు పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం సైబరాబాద్ పోలీసులు హీరో కార్తికేయ(బస్తీ బాలరాజు)కు ఫన్నీగా వార్నింగ్ ఇచ్చారు. చావు కబురు చల్లగా సినిమాలోని కార్తికేయ, లావణ్య త్రిపాఠి బైక్‌పై వెళ్తున్న సన్నివేశానికి సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ..'హెల్మెట్ పెట్టుకుని, సరిగ్గా నడిపితే ఎలాంటి కబుర్లు వినాల్సిన పని లేదు బస్తీ బాలరాజు గారు' అంటూ ట్వీట్ చేశారు. దీన్ని కార్తికేయ, లావణ్య త్రిపాఠిలకు ట్యాగ్ చేశారు. హెల్మెట్లు పెట్టుకొని, సరిగ్గా నడిపితే ఎలాంటి కబుర్లు వినాల్సిన పని లేదు బస్తీ బాలరాజు గారు @ActorKartikeya @Itslavanya @Koushik_psk #ChaavuKaburuChallaga pic.twitter.com/XPDTfV3bm0 — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) March 19, 2021 ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఎప్పటికప్పుడు వినూత్నంగా ఆలోచించే సైబరాబాద్ పోలీసులు..లేటెస్ట్గా చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సినిమా పోస్టర్‌ను వాడి హెల్మెట్ ఆవశ్యకత గురించి చెప్పడం నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. కౌశిక్ పెగల్లపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, బన్నీ వాసు నిర్మించారు. ఈ సినిమాలో కార్తికేయ బస్తీ బాలరాజు పాత్రలో నటించగా, లావణ్య..నర్సుగా నటించింది. సీనియర్ నటి ఆమని కీలక పాత్ర పోషించగా, యాంకర్ అనసూయ స్పెషల్ సాంగ్‌లో అలరించింది. చదవండి : ‘చావు కబురు చల్లగా’ మూవీ రివ్యూ (చిల్లర ట్రిక్స్ ప్లే చేయొద్దు: బన్నీ వాసు ఫైర్) -
‘చావు కబురు చల్లగా’ మూవీ రివ్యూ
టైటిల్ : చావు కబురు చల్లగా జానర్ : రొమాంటిక్ కామెడీ డ్రామా నటీనటులు : కార్తికేయ, లావణ్య త్రిపాఠి, ఆమని, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, భద్రం తదితరులు నిర్మాణ సంస్థ : జీఏ2 పిక్చర్స్ నిర్మాత : బన్నీవాసు దర్శకత్వం : కౌశిక్ పెగళ్లపాటి సంగీతం : జాక్స్ బిజోయ్ సినిమాటోగ్రఫీ : కర్మ్ చావ్లా ఎడిటర్ : జీ సత్య విడుదల తేది : మార్చి 19, 2021 'ఆర్ఎక్స్100’ సినిమాతో టాలీవుడ్లోకి దూసుకొచ్చిన యువకెరటం కార్తికేయ. ఆ ఒక్క సినిమాతో కార్తికేయ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తొలి నుంచి వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నాడు. నటుడిగా తనని తాను నిరూపించుకోవడానికి విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. అయితే ఈ యంగ్ హీరో ఇటీవల చేసిన ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఆర్ఎక్స్ 100 తర్వాత చేసిన హిప్పీ, గుణ 369, 90 ఎంఎల్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ‘చావు కబురు చల్లగా..’ అనే వెరైటీ టైటిల్, కొత్త గెటప్‌తో శుక్రవారం (మార్చి 19)ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ అంచనాలు పెంచేశాయి. ఇక మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో హైప్ క్రియేట్ అయింది. ఓ కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కార్తికేయను హిట్ ట్రాక్ ఎక్కించిందా? తొలి ప్రయత్నంలో కౌశిక్ పెగళ్లపాటి ఏ మేరకు ఆకట్టుకున్నాడు? రివ్యూలో చూద్దాం. కథ బస్తీ బాలరాజు (కార్తికేయ) శవాలను మోసుకెళ్లే వాహన డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. సిటీలో ఎవరైనా చనిపోతే తన వాహనంలో స్మశానానికి తీసుకెళ్లి, వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తుంటాడు. అతని తల్లి గంగమ్మ(ఆమని) మార్కెట్లో మొక్కజొన్న పొత్తులు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంటుంది. ఇదిలా ఉంటే ఒక రోజు ఒక శవాన్ని శ్మనానవాటికకు తరలించాలని బాలరాజుకు ఫోన్ కాల్ వస్తుంది. అక్కడికి వెళ్లిన బాలరాజు భర్తను కొల్పోయిన యువతి మల్లిక(లావణ్య త్రిపాఠి)ని చూసి ప్రేమలో పడతాడు. అంత్యక్రియల సమయంలోనే మల్లికను పెళ్లి చేసుకుంటానని వారి బంధువుల ముందే చెప్తాడు. కానీ దానికి మల్లికతో పాటు ఆమె అత్తమామలు కూడా నిరాకరిస్తారు. అయినప్పటకీ బాలరాజు మల్లిక వెంటపడుతూనే ఉంటాడు. కట్ చేస్తే.. టీవీలు రిపేరు చేసే మోహన్(శ్రీకాంత్ అయ్యంగార్)తో గంగమ్మ చనువుగా ఉండటం చూసి బాలరాజు బాధపడతాడు. ఈ వయసులో తన తల్లి మరో వ్యక్తితో వివాహయేతర సంబంధం కొనసాగించడం నచ్చక తల్లిపై కోపం పెంచుకుంటాడు. తన తల్లి కంటే భర్తను కోల్పోయిన మల్లిక చాలా గొప్పది అని భావిస్తాడు. అసలు గంగమ్మ మరో వ్యక్తితో ఎందుకు చనువుగా ఉంది? భర్తను కోల్పోయిన మల్లిక ప్రేమను బస్తీ బాలరాజు ఎలా దక్కించుకున్నాడు? అనేదే మిగతా కథ. నటీనటులు బస్తీ బాలరాజు అనే ఊరమాస్ క్యారెక్టర్లో కార్తికేయ ఒదిగిపోయాడు. చదువు సంద్యాలేక, బస్తీల్లో ఉండే యువకులు ఎలా ప్రవర్తిస్తారో బాలరాజు క్యారెక్టర్ గుర్తు చేస్తుంది. సినిమా భారాన్ని తన భుజాల మీద వేసుకొని మెప్పించాడు. ఎమోషనల్ సీన్లలో కూడా అద్భుతంగా నటించాడు. ఇక భర్తను కోల్పోయిన మల్లిక పాత్రలో లావణ్య త్రిపాఠి అద్భుతంగా నటించింది. పూర్తి డీ గ్లామరైజ్డ్ పాత్ర ఆమెది. ఓ కొత్త పాత్రలో లావణ్య త్రిపాఠిని చూడొచ్చు. ఇక కార్తికేయ తర్వాత ఈ సినిమాలో బాగా పండిన పాత్ర ఆమనిది. గంగమ్మ పాత్రలో ఆమె నటించడం కంటే జీవించేశారని చెప్పొచ్చు. గంగమ్మ క్యారెక్టరైజేషన్ సినిమాకు చాలా ఫ్లస్ పాయింట్. కోడలి మేలు కోరే మామ పాత్రలో మురళీశర్మ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. శ్రీకాంత్ అయ్యంగార్, భద్రం తదితరులు తమ పాత్ర పరిధిమేరకు నటించారు. విశ్లేషణ చావు నుంచి తప్పించుకోలేమనేది జగమెరిగిన సత్యం. పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు చావక తప్పదు. అలా అని చనిపోయిన వారిని గుర్తుచేసుకుంటూ ప్రతి రోజు బాధపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా భర్తను కోల్పోయిన మహిళలు అయితే ఇక తమ జీవితం ఇంతే అనుకుంటూ అదే బాధలో ఉంటారు. కానీ అదే జీవితం కాదు. పోయినవారిని ఎలాగో తీసుకురాలేము. ఉన్నవారిని సంతోషంగా చూసుకుంటూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలి. అప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు. ఇదే విషయాన్ని ‘చావు కబురు చల్లగా’సినిమాతో చెప్పాలనుకున్నాడు దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి. తొలి చిత్రంతోనే ఓ కొత్త కాన్సెప్ట్‌ని టాలీవుడ్‌కి పరిచయం చేశాడు. కానీ దర్శకుడు అనుకున్న కథను మాత్రం తెరపై చూపించడంలో విఫలమయ్యాడు. సినిమా కథలో బలమున్నా..స్క్రీన్‌ప్లేను శక్తివంతంగా రాసుకోలేకపోయాడు. స్ర్కీన్‌ప్లే రొటీన్‌గా సాగుతుంది. ఫస్టాఫ్ అంతా రోటీన్ కామెడీతో నడిపించి ప్రేక్షకుడికి సహనానికి పరీక్ష పెట్టాడు. బాలరాజు మల్లిక వెనుకపడే సన్నివేశాలు కూడా నత్తనడకగా, రొటీన్‌గా అనిపిస్తాయి. ఇక సెకండాఫ్ మాత్రం పర్వాలేదనిపిస్తుంది. హీరో తల్లి మరో వ్యక్తితో ఎందుకు చనువుగా ఉందో వివరించిన తీరు ప్రశంసనీయం. కొన్ని ఎమోషనల్ సీన్లు బాగా పండించారు. అలాగే భర్తను కోల్పోయిన యువతని హీరో ప్రేమించడం అనే కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తుంది. స్క్రీన్‌ప్లే బలంగా రాసుకుని ఉంటే సినిమా స్థాయి మరోలా ఉండేది. జోక్స్, బిజోయ్ సంగీతం బాగుంది. సినిమాలోని పాటలు అలరించడంతో పాటు ఆలోచింపజేసేవిగా ఉంటాయి. ఎడిటర్ జీ సత్య తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. చాలా సన్నివేశాలను ఇంకాస్త క్రిస్ప్‌గా కట్ చేస్తే బాగుండనిపిస్తుంది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ కార్తికేయ, లావణ్య త్రిపాఠి, ఆమని నటన పాటలు సెకండాఫ్ మైనస్ పాయింట్స్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ స్లోనేరేషన్ - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘ఆర్ఎక్స్ 100’ ఫీలింగ్ మళ్లీ కలిగింది
‘‘కథల ఎంపికలో నా జడ్జ్మెంట్ తప్పయి నా సినిమాలు కొన్ని ఫ్లాప్ అయ్యాయి. హిట్ సినిమా కంటే ఫ్లాప్ సినిమానే ఎక్కువ నేర్పిస్తుంది’’ అని అన్నారు కార్తికేయ. కౌశిక్ దర్శకత్వంలో కార్తికేయ హీరోగా రూపొందిన చిత్రం ‘చావు కబురు చల్లగా..’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా కార్తికేయ చెప్పిన విశేషాలు. ► గీతా ఆర్ట్స్ నుంచి 2019లో ఫోన్ కాల్ వచ్చింది. చాలా ఎగ్జయిట్ అయ్యాను. కథ వినడానికి దర్శకుడు కౌశిక్‌ను కలిశాను. కథ వినేప్పుడు చిన్న వయసులోనే దర్శకుడిగా కౌశిక్ ఇంత ఫిలాసఫీ ఎలా మాట్లాడగలుగుతున్నాడని షాక్ అయ్యాను. ఇందులో శవాలబండిని నడిపే బస్తీ బాలరాజు పాత్ర చేశాను. శవాన్ని తీసుకెళ్ల డానికి చావు ఇంటికి వెళ్లి, చనిపోయిన వ్యక్తి భార్యను ఇష్టపడతాడు బాలరాజు. ఆ తర్వాత జరిగే విషయాలు థ్రిల్లింగ్‌గా ఉంటాయి. ► మనం చావు అంటే చాలా భయపడిపోతాం. కానీ బతుకు ఇచ్చిన దేవుడే, చావును కూడా ఇచ్చాడన్న విషయాన్ని మర్చిపోతున్నాం. ఇలాంటి ఫిలాసఫీ బస్తీ బాలరాజు పాత్రలో ఉంటుంది. అందుకే ఈ పాత్రను మిస్ చేసుకోకూడదని ఓకే చెప్పాను. కామెడీ, ఎమోషన్స్ రెండూ మిళితమై ఉన్న సినిమా ఇది. ఈ సినిమా తర్వాత నాకు నెక్ట్స్ లెవల్ స్క్రిప్ట్స్ వస్తాయని నమ్ముతున్నాను. కొత్త దర్శకుడైన కౌశిక్ ఓ డిఫరెంట్ పాయింట్‌ను చక్కగా డీల్ చేశాడు. ► ప్రస్తుతం నేను ఉన్న పొజిషన్లో హిట్ అవసరమే. ‘ఆర్ఎక్స్ 100’ సినిమా టైమ్‌లో నా చుట్టూ ఉన్న పాజిటివ్‌నెస్‌ను మళ్లీ ఇప్పుడు ‘చావుకబురు చల్లగా.. ’కి ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా ఆడియన్స్‌కు నచ్చుతుందనే అనుకుంటున్నాను. సినిమాలు సెట్ చేసిపెట్టడానికి నాకు ఇండస్ట్రీలో ఎవరూ లేరు. కెరీర్ బిగినింగ్ స్టేజ్‌లో ఉన్నాను. తెలియనివి నేర్చుకుంటూ, చేసిన తప్పులు చేయకుండా ముందుకు సాగిపోతాను. నా వంతుగా సిన్సియర్‌గా కష్టపడతాను. ► నాని ‘గ్యాంగ్‌లీడర్’ సినిమాలో విలన్ రోల్ కొత్తగా ఉందనిపించి చేశాను. ఇప్పుడు అజిత్‌గారి తమిళ సినిమా ‘వలిమై’లో విలన్ గా చేస్తున్నాను. హెచ్. వినోద్ (‘వలిమై’ డైరెక్టర్)గారి ‘ఖాకీ’ సినిమా నాకు బాగా నచ్చింది. అందుకే ‘వలిమై’కి ఓకే చెప్పా. సుకుమార్ రైటింగ్స్‌లో ఓ సినిమా చేస్తున్నాను. -
ఫ్రైడే మూవీస్: ఈ వారం 3 భారీ సినిమాలు.. విజేత ఎవరు?
శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలు విడుదలవుతూనే ఉంటాయి. అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకులను అలరించి కాసులను సొమ్ము చేసుకుంటాయి. మరికొన్ని ఫ్లాపులను మూటగట్టుకొని పోతాయి. అందుకే శుక్రవారం నిర్మాతకు టెన్షన్ డేగా మారుతుంది. గత వారం టాలీవుడ్లో నాలుగు సినిమాలు.. జాతిరత్నాలు, శ్రీకారం, గాలి సంపత్, లవ్ లైఫ్ అండ్ పకోడి సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో జాతిరత్నాలు పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇక ఈ శుక్రవారం (మార్చి 19)కూడా పలు భారీ చిత్రాలు విడుదల కాబోతుంది. మంచు విష్ణు ’మోసగాళ్ళు’, కార్తికేయ ‘చావు కబురు చల్లగా’, ఆది సాయికుమార్ ‘శశి’ తో పాటు ‘ఇదే మా కథ’, ‘ఈ కథలో పాత్రలు కల్పితం’లాంటి చిన్న సినిమా కూడా శుక్రవారం విడుదల అవుతున్నాయి. ఐటి స్కామ్ నేపథ్యంలో వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘మోసగాళ్లు’. ఇందులో కాజల్, మంచు విష్ణు అక్కాతమ్ముళ్లుగా నటిస్తున్నారు. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించారు. ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు విష్ణు నిర్మించి ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో శుక్రవారం విడుదల అవుతుంది. యంగ్ హీరో కార్తికేయ, హీరోయిన్ లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం 'చావు కబురు చల్లగా’. గీతాఆర్ట్స్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి భర్త కోల్పోయిన వితంతువుగా కనిపిస్తోంది. హీరో కార్తికేయ అంబులెన్స్ డ్రైవర్ గా పని చేస్తుంటారు. వీరిద్దరి మధ్య చోటుచేసుకునే ఒక విచిత్రమైన ప్రేమకథా నేపథ్యంలో చావు కబురు చల్లగా సినిమా తెరకెక్కుతోంది. ప్రేమ కావాలి ఫేమ్ ఆది హీరోగా నటించిన చిత్రం ‘శశి’. శ్రీనివాస్ నాయుడు రూపొందించిన ఈ చిత్రంలో ఆది సరసన సురభి నటిస్తున్నారు. ప్రేమలో పడ్డ ఓ మధ్యతరగతి కుర్రాడి ఇబ్బంది ఎలా ఉంటుంది? ప్రేమ తర్వాత కుటుంబంతో, స్నేహితులతో అతనికి రిలేషన్స్ ఎలా మారతాయి? అనే అంశాలతో ‘శశి’ సినిమా తెరకెక్కింది. మరి ఈ నాలుగు చిత్రాల్లో ఏ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. -
అందుకే సౌందర్య ఎక్స్పోజింగ్ చేయలేదు : ఆమని
సౌందర్య.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు ఇది. ఈ పేరు వినబడగానే చీరకట్టులో ఓ అందమైన యువతి రూపం కళ్లముందు కదులుతుంది. అభినవ సావిత్రి అనే బిరుదు సొంతం చేసుకున్న ఈ మహానటి.. ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూ చనిపోయే వరకు నెంబర్ వన్ హీరోయిన్గా కొనసాగింది. కానీ దురదృష్టవశాత్తు కేవలం 31 ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసింది. మరణించి 17 ఏళ్లవుతున్నా కూడా ఇప్పటికీ ఆమెను మరిచిపోలేకపోతున్నారు అభిమానులు. దానికి కారణం ఆమె ఆందం కాదు కేవలం నటన మాత్రమే. ఎలాంటి గ్లామర్ ఎక్స్పోజింగ్ ఇవ్వకుండా.. కేవలం యాక్టింగ్‌తో కోట్లాది అభిమానులను సంపాదించుకుంది సౌందర్య. ఒకవైపు.. రమ్యకృష్ణ, మీనా లాంటి స్టార్ హీరోయిన్లు తమ అందాలను బయటపెడుతూ గట్టి పోటీ ఇచ్చినా.. సౌందర్య మాత్రం కేవలం చీరకట్టులో తెరపై కనిపించి మెప్పించింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వందల చిత్రాల్లో నటించిన సౌందర్య ఎక్స్‌పోజింగ్‌కు ఎందుకు దూరంగా ఉందో ఆమె స్నేహితురాలు, సీనియర్ నటి ఆమని ఇటీవల వెల్లడించింది. కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘చావు కబురు చల్లగా..’. ఈ మూవీలో ఆమని కీలక పాత్రలో నటించింది. మూవీ ప్రమోషన్లో భాగంగా తాజాగా ఓ ఇంటర్యూ ఇచ్చిన ఆమని.. సౌందర్యతో తనకు ఉన్న అనుబంధం, ఆమె ఎక్స్పోజింగ్ ఎందుకు చేయలేదనే విషయాన్ని తెలిపింది. ‘ఒకసారి ఇద్దరమే షూటింగ్లో ఉన్నపుడు.. ఎక్స్పోజింగ్ గురించి అడిగాను. వెంటనే.. ఎందుకే ఎక్స్పోజ్ చేయాలి? రేపు పెళ్లై భర్త పక్కనే ఉన్నపుడు మన సినిమాలు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? మన ఫ్యామిలీకి ఎలా అనిపిస్తుంది? డబ్బుల కోసం ఇలా చేస్తే రేపు ఎలా? అని తిరిగి తననే ప్రశ్నించేదని ఆమని చెప్పుకొచ్చింది. ఒక నియమం పెట్టుకొని ఎక్స్‌పోజింగ్‌కు సౌందర్య దూరంగా ఉందని, అందులో తప్పులేదని ఆమెని తెలిపింది. చదవండి: వరుణ్ పెళ్లిపై నాగబాబు కామెంట్.. ఆ అమ్మాయి అయినా ఓకేనట జెనీలియా చేతికి గాయం: భర్త సపర్యలు -
నరేష్‌తో లిప్‌లాక్‌పై నటి ఆమని కామెంట్
నటి ఆమని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అప్పట్లో శుభలగ్నం, మావిడాకులు, మిస్టర్ పెళ్ళాం.. వంటి సినిమాల్లోని ఆమె పాత్రల్లో ఎప్పటికీ గుర్తిండిపోతాయి. అనేక హిట్ చిత్రాల్లో నటించి సహజమైన తన నటనతో అందరి మన్ననలు అందుకున్నారు. కెరీర్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే సినిమాల నుంచి తప్పుకొని వ్యక్తిగత జీవితంలో బిజీ అయిపోయారు. అయితే చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమని.. ఇప్పుడు మళ్లీ వరస సినిమాలు చేస్తున్నారు. ఇటీవల శ్రీకారం సినిమాలో శర్వానంద్ తల్లిగా నటించారు. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లోనూ నటిస్తున్నారు. అలాగే అల్లు శిరీష్, నవీన్ చంద్రకు మదర్ క్యారెక్టర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమని చావు కబురు చల్లగా సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. యంగ్ హీరో కార్తీకేయ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆమని హీరో తల్లిగా కనిపించనున్నారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముదుకు రానుంది. ఈ క్రమంలో ఆమని ఇటీవల ఓ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె లిప్ లాక్స్, బోల్డ్ సీన్స్, సినిమాల్లో తల్లి పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. చందమామ కథలు సినిమాలో నటుడు నరేష్‌తో ఆమె చేసిన ఓ బోల్డ్ సీన్ గురించి చర్చించారు. చిత్రంలో సన్నివేశం డిమాండ్ చేసినప్పుడు బోల్డ్ సన్నివేశాల్లో నటించడం తప్పేం కాదన్నారు. ‘నేను నా వృత్తిలో భాగంగా చేశాను. నరేష్ గారు సీనియర్ నటుడు, ధైర్యంగా సన్నివేశాన్ని చేయటానికి అంగీకరించి ఆయన తన గౌరవాన్ని చాటుకున్నారు.’ అని పేర్కొన్నారు. కాగా చందమామ కథలు చిత్రంలో ఆమని.. నరేష్‌తో లిప్ లాక్ సీన్ లో నటించి అందరినీ షాక్‌కు గురిచేసింది. చదవండి: జెనీలియా చేతికి గాయం: భర్త సపర్యలు వరుణ్ పెళ్లిపై నాగబాబు కామెంట్.. ఆ అమ్మాయి అయినా ఓకేనట -
చిల్లర ట్రిక్స్ ప్లే చేయొద్దు: బన్నీ వాసు ఫైర్
'చావు కబురు చల్లగా' సినిమా ఓటీటీ బాట పడుతుందనే ఊహాగాలపై సీరియస్ అయ్యాడు నిర్మాత బన్నీ వాసు. సినిమా రిలీజ్ అవకముందే ఓటీటీలోకి వెళ్తుందని అసత్య ప్రచారాలు చేస్తున్నవారి మీద గరమయ్యాడు. "ఇది సందర్భమో కాదో, తెలీదు.. ఏ సినిమా బాగా ఆడినా ఇండస్ట్రీలో అందరం హ్యాపీగా ఫీలవుతాం. ఈమధ్య రెండు సినిమాలు(శ్రీకారం, జాతిరత్నాలు) కూడా చాలా బాగా ఆడుతున్నాయి. నాకు బుక్ అయిన థియేటర్లలో నేను పక్కకు జరిగి మరీ ఆ సినిమాలకు ఇస్తున్నాం. అలాంటి మంచి వాతావరణం ఇండస్ట్రీలో ఉంది. కానీ ఈ రెండ్రోజుల్లో నేను బాగా హర్టైన విషయం ఏంటంటే.. వాళ్లు కొత్తగా వచ్చారో తెలీదు. ఎన్ని సినిమాలు చేశారో తెలీదు.. కానీ, ఈ సినిమా రెండు వారాల్లో ఓటీటీలోకి వెళ్లిపోతుందంటూ పీఆర్వోల ద్వారా తప్పుడు వార్తను జనాల్లోకి పాస్ చేస్తున్నారు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమై ఉంటుంది. వాళ్ల పేరు చెప్పడం నాకిష్టం లేదు. హెల్దీగా పోటీపడుదాం. మీరు మంచి సినిమాలు తీయండి, మేము మంచి సినిమాలు తీస్తాను. ఎవరి సినిమా బాగుంటే వారిది ఆడుతుంది. ఎలాగో సినిమా బాగుంటే మీడియా వాళ్లు మమ్మల్ని పొగుడుతారు, లేదంటే ఏకుతారు. ఇలాంటి చీప్ ట్రిక్స్ రాజకీయాల్లో చూశాం. వారు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్లుగా.. చావు కబురు చల్లగా సినిమా రెండు వారాల్లోనో, మూడు వారాల్లోనో ఓటీటీలో వచ్చేది కాదు. ఒకవేళ ఓటీటీలో రిలీజ్ చేయాలనుకుంటే కోవిడ్ టైమ్‌లోనే ఆహాకు ఇచ్చేవాడిని. కానీ మాకు థియేటర్ అంటేనే ఇష్టం. మీరు చిల్లర ట్రిక్స్ ప్లే చేయొద్దు.. ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఆలోచిస్తాం" అని బన్నీ వాసు చెప్పుకొచ్చాడు. కాగా, చావు కబురు చల్లగా సినిమా మార్చి 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. చదవండి: 'అక్టోబరు నుంచి డేట్స్ ఉంచమని ఫోన్ చేశాను' -
చావు కబురు చల్లగా: స్టెప్పులు, సెల్ఫీలు..
సాక్షి, విజయనగరం: ‘చావు కబురు చల్లగా...’ చిత్ర యూనిట్ నగరంలో మంగళవారం సందడి చేసింది. ఈ నెల 19న విడుదల కానున్న ఈచి త్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ యాత్ర లో భాగంగా వారు ఇక్కడి ఎస్వీసీ రంజనీ థియేటర్‌కు వచ్చారు. హీరో, హీరోయిన్లు కార్తికేయ, లావణ్యా త్రిపాఠి ఈ సందర్భంగా ప్రేక్షకులతో ఆడిపాడి అలరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన తీన్మార్ డప్పులకు కార్తికేయ లయబద్ధంగా స్టెప్పులేశారు. అభిమానులతో సెలీ్ఫలు దిగారు. అనంతరం కార్తికేయ మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాతో తనకు ఎంతో అనుబంధం ఉందనీ, ఆర్ ఎక్స్ 100 చిత్రంతో చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఇక్కడి నుంచే వచ్చాయన్నారు. నూటికి నూరు శాతం ఈ చిత్రం చరిత్రలో నిలిచిపోనుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. హీరోయిన్ లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ చిత్రంలో మంచి ఫీల్ ఉందన్నారు. ఇది ఒక సందేశాత్మక చిత్రంగా నిలిచి పోతుందని పేర్కొన్నారు. దర్శకుడు పి.కౌశిక్ మాట్లాడుతూ హీరో, హీరోయిన్లు చిత్రానికి పూర్తి న్యాయం చేశారని తెలిపారు. కార్యక్రమంలో థియేటర్ మేనేజరు భాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: భర్త చనిపోయిన అమ్మాయిని హీరో ప్రేమిస్తే.. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
'చావు కబురు చల్లగా' గ్రాండ్ రిలీజ్ టూర్
-
'చావు కబురు చల్లగా' వైష్ణవ్‌తో చేద్దామనుకున్నా
‘‘కౌశిక్ ‘చావు కబురు చల్లగా’ పాయింట్ చెప్పినప్పుడు ప్రేక్షకులకు నచ్చుతుందా? అనిపించింది. పూర్తి కథ విన్నాక రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉంది.. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ముందుకెళ్లాం’’ అని నిర్మాత ‘బన్నీ’ వాసు అన్నారు. కార్తికేయ, లావణ్యా త్రిపాఠీ జంటగా కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌పై ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘బన్నీ’ వాసు విలేకరులతో చెప్పిన విశేషాలు. ‘చావు కబురు చల్లగా’ని వైష్ణవ్ తేజ్‌తో చేద్దామనుకున్నాను. అయితే ‘ఉప్పెన’ పూర్తయ్యే వరకు ఏ కమిట్మెంట్ పెట్టుకోలేనని సున్నితంగా చెప్పాడు.. నిజమే కదా అనిపించింది. బస్తీ బాలరాజు పాత్రలో కార్తికేయని తీసుకుంటే బాగుంటుందని కౌశిక్ చెప్పాడు. ‘ఈ సినిమాకి ఎంత సమయం పడుతుందో తెలియదు.. పూర్తయ్యే వరకు వేరే కమిట్మెంట్ పెట్టుకోకూడదు?’ అని కార్తికేయతో చెబితే, సరే అన్నాడు. నా సినిమాలు పూర్తవడానికి ఏడాది, అంతకు మించి సమయం పడుతుంటుంది. సినిమా పూర్తయ్యాక ఫస్ట్ కాపీ చూసి, ఎక్కడైనా సరిగ్గా రాలేదనిపిస్తే మళ్లీ షూట్ చేస్తాం. ‘చావు కబురు చల్లగా’కి గుమ్మడికాయ కొట్టినా, మళ్లీ మూడు రోజులు షూటింగ్ చేశాం. ‘గీత గోవిందం’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలకు కూడా ఏడాదికి పైగానే పట్టింది. అన్ని రోజుల పాటు విజయ్ దేవరకొండ, అఖిల్ వేరే సినిమా చేయలేదు. అందుకే నాతో రెండో సినిమా చేయడానికి హీరోలు ఇష్టపడరేమో (నవ్వుతూ). క్లాస్ స్టోరీని మాస్ ప్రేక్షకులకు కూడా చేరువయ్యేలా ఎలా తీయాలని ఆలోచిస్తా. పాయింట్ క్లాస్‌గానే ఉంటుంది. కానీ ట్రీట్మెంట్ మాత్రం యూనివర్సల్‌గా ఉంటుంది. అదే నా విజయ రహస్యం. సినిమాలను డైరెక్టుగా ఓటీటీల్లో రిలీజ్ చేయడం వల్ల నిర్మాతలకు ఒకేసారి డబ్బు వస్తుంది కానీ పెద్దగా లాభం ఉండదు. థియేటర్లో విడుదల చేస్తే.. హిట్ టాక్ వచ్చిందంటే కలెక్షన్లు పెరుగుతాయి. ఆ లాభాలన్నీ నిర్మాతలకే వస్తాయి. కరోనా సమయంలో ఓటీటీలకు కంటెంట్ బాగా అవసరం కావడంతో ఎక్కువ డబ్బు ఇచ్చి సినిమాలు కొన్నారు. కానీ, ఇప్పుడు తక్కువ ధరకే అడుగుతున్నారు. సినిమాని థియేటర్లో విడుదల చేసిన 50రోజుల (చిన్న చిత్రాలు) నుంచి 75 రోజు (పెద్ద చిత్రాలు)లకు కానీ ఓటీటీకి ఇవ్వకూడదు. రిలీజైన రెండు వారాలకే ఓటీటీలో వస్తే ప్రేక్షకులు థియేటర్లకు రారు. ఓటీటీ వ్యాపారం కూడా తక్కువగా ఉంటుంది. అప్పుడు హీరోల స్టార్డమ్ కూడా పడిపోతుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్ వల్ల నిర్మాతలకు, హీరోలకూ నష్టమే తప్ప లాభం ఉండదు. చదవండి: ప్రకాశ్‌రాజ్‌తో నటించాలంటే భయం: ఆమని -
సగంలోనే ఓకే చెప్పేశా: లావణ్య త్రిపాఠి
‘‘భలే భలే మగాడివోయ్’, ‘శ్రీరస్తు శుభమస్తు’ తర్వాత గీతా ఆర్ట్స్‌లో నేను చేసిన మూడో చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఈ బ్యానర్లో మూడు సినిమాలు చేసినందుకు హ్యాపీ’’ అని లావణ్యా త్రిపాఠీ అన్నారు. కార్తికేయ, లావణ్య జంటగా కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ‘చావు కబురు చల్లగా’ ఈ 19న విడుదలవుతోంది. లావణ్యా త్రిపాఠీ మాట్లాడుతూ –‘‘కౌశిక్ ఈ కథ చెబుతున్నప్పుడు కొత్తగా అనిపించడంతో సగం వినగానే నటించేందుకు ఒప్పుకున్నాను. ప్రతి మనిషికీ చావు తప్పుదు. అది వచ్చినప్పుడు బాధపడడం ఎందుకు? అనే పాయింట్‌తో సినిమా ఉంటుంది. ఇందులో నేను భర్తను పోగొట్టు కున్న అమ్మాయిగా నటించాను’’ అన్నారు. చదవండి: నా కొడుకుతో సహా బిగ్‌బాస్‌కు వెళ్తా!: నటి -
ప్రకాశ్‌రాజ్‌తో నటించాలంటే భయం: ఆమని
‘‘ఇన్నేళ్ల నా సినీ కెరీర్లో ఏ సినిమాకూ ముందు రోజు స్క్రిప్ట్ తీసుకెళ్లి డైలాగులు నేర్చుకున్నది లేదు. ‘చావు కబురు చల్లగా’లో వైజాగ్ యాసలో పెద్ద పెద్ద మాస్ డైలాగ్స్ చెప్పాల్సి రావడంతో రాత్రిళ్లు బట్టీపట్టి ఉదయం షూటింగ్లో పాల్గొనేదాన్ని. ఈ పాత్ర ఛాలెంజింగ్‌గా అనిపించింది’’ అని నటి ఆమని అన్నారు. కార్తికేయ, లావణ్యా త్రిపాఠీ జంటగా కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం 19న విడుదలవుతోంది. ఈ చిత్రంలో హీరో తల్లి పాత్రలో నటించిన ఆమని మాట్లాడుతూ– ‘‘అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమా చేస్తున్నప్పుడు ‘చావు కబురు చల్లగా’లో నటించమని బన్నీ వాసు అనడంతో కథ, నా పాత్ర ఏంటని అడగకుండా ఒప్పుకున్నా. ఇందులోని సన్నివేశాలు చూస్తే కౌశిక్ అనుభవం ఉన్న దర్శకునిలా తీశాడు. నేను ఎంతోమందితో నటించా. కానీ ప్రకాశ్‌రాజ్‌గారితో నటించడం భయం. ఆయన ఎంత పెద్ద డైలాగ్ అయినా ఒకే ఒక్క టేక్‌లో చేస్తారు. ఆయనతో నటించేటప్పుడు నాకు రెండో టేక్ తీసుకోవాలంటే భయం. విలన్ పాత్ర చేయాలన్నది నా కల. నేను హీరోయిన్గా ఉన్నప్పుడు ఇప్పుడు నటీనటులకు ఉన్నన్ని సౌకర్యాలు లేవు. అప్పుట్లో షాట్ గ్యాప్‌లో చెట్లకింద కూర్చుని సరదాగా మాట్లాడుకునేవాళ్లం. దీంతో నటీనటుల మధ్య బాండింగ్ బాగుండేది. ఇప్పుడు షాట్ గ్యాప్ వస్తే క్యారవాన్‌లోకి వెళ్లిపోతున్నారు. లేకుంటే మొబైల్స్‌తో బిజీ అయిపోతున్నారు’’ అన్నారు. చదవండి: ఆ అభినందనలను ఎప్పటికీ మర్చిపోలేను: రాజేంద్ర ప్రసాద్ శుభలగ్నం మేడమ్ అని పలకరిస్తుంటారు -
‘చావు కబురు చల్లగా’ శివర్రాతి గిఫ్ట్ వచ్చేసింది
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ కుర్ర హీరో కార్తికేయ, హీరోయిన్ లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం 'చావు కబురు చల్లగా' మూవీ టీం శివరాత్రి గిఫ్ట్ ఇచ్చేసింది. ఈ సినిమాలోని నాలుగోపాటను గురువారం రిలీజ్ చేసింది. బుల్లితెర బ్యూటీ అనసూయ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజా గా ఈ సినిమాకి సంభిందించి ‘ఫిక్స్ అయిపో’ ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తనదైన స్టయిల్లో ఆలపించిన ఈ గీతం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, మూడు పాటలు ఈ సినిమాపై భారీ హైప్‌నే క్రియేట్ చేశాయి. (ఏం సక్కగున్నావ్రో.. అందరి కళ్లు బన్నీ పైనే!) కౌశిక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆమని, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, భద్రం, మహేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాలో కార్తికేయ స్వర్గపురి వాహనం డ్రైవర్‌గా, లావణ్య నర్సుగా కనిపిచనున్నారు. ఈ సినిమా మార్చి 19న విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. -
'చావు కబురు చల్లగా' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
ఏం సక్కగున్నావ్రో.. అందరి కళ్లు బన్నీ పైనే!
‘‘కోవిడ్ తర్వాత థియేటర్స్‌కు ఆడియన్స్ వస్తారా? అనే డౌట్ ఉండేది. మీరు సినిమా తీయండి మేం వస్తాం అని... అది ‘క్రాక్’ సినిమాతో కావొచ్చు.. ‘ఉప్పెన’తో కావొచ్చు. మాకు భరోసా ఇచ్చిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ప్రేక్షకుల దీవెనలు ఉన్నంత కాలం ఇండస్ట్రీ బాగుంటుంది. నా జీవితంలో నేను సంపాదించుకున్నది నా అభిమానులనే. వారు గర్వపడేలా నేను కష్టపడతానని ప్రామిస్ చేస్తున్నాను’’ అని అన్నారు అల్లు అర్జున్ . కార్తికేయ, లావణ్యా త్రిపాఠి జంటగా కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘చావు కబురు చల్లగా...’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో అల్లు అర్జున్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాని నేను చూశాను. బాగుంటుందని గ్యారంటీ ఇవ్వగలను. ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా ఉంటుంది. వాసుతో ‘గంగోత్రి’ సినిమా నుంచి నా అసోషియేషన్ కొనసాగుతోంది. వాసుకి సినిమా నచ్చడం చాలా అరుదు. తను ఏదైనా ఒక సినిమాను సెలక్ట్ చేసుకుంటే అందులో విషయం ఉంటుంది. ఈ కథ నవదీప్ వల్ల గీతా ఆర్ట్స్‌కి చేరింది. అందరూ ఎంత బాగా చేసినా అందరికీ హిట్ ఇచ్చేది డైరెక్టరే. కౌశిక్‌లో మంచి మెచ్యూరిటీ ఉంది. కార్తికేయ ‘ఆర్ఎక్స్ 100’ సినిమా చూశాను. ‘చావుకబురు..’లో బస్తీ బాలరాజుగా తన యాక్టింగ్ అద్భుతంగా ఉంది. బిజోయ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. గీతా ఆర్ట్స్‌లో లావణ్యాకు ఈ సినిమా హ్యాట్రిక్ అవుతుంది. ‘పుష్ప’ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. తగ్గేదే లేదు’’ అన్నారు. ‘‘గీతా ఆర్ట్స్ సినిమా అని కాదు.. వాసు స్నేహితుడిగా అల్లు అర్జున్ ఈ కార్యక్రమానికి వచ్చాడు. కార్తికేయ అమేజింగ్ యాక్టర్. కౌశిక్ మంచి రైటర్. మా సంస్థలో ఎక్కువకాలం ఉండేవారిలో కౌశిక్ ఉంటాడు. ‘‘ఆహా’ ప్లాట్‌ఫామ్‌ను స్టార్ట్ చేయడానికి వాసు ముఖ్యకారణం. గీతా ఆర్ట్స్‌కు మంచి సపోర్టివ్‌గా ఉంటున్నాడు’’ అన్నారు అల్లు అరవింద్. చదవండి: బన్నీ తెలుగమ్మాయే కావాలన్నాడు: సుకుమార్ ‘‘స్టార్ హీరోలను నా సినిమా రిలీజ్ ఫంక్షన్స్‌కు అతిథిగా పిలిపించుకునే అవకాశం రాలేదు. ఈ సినిమాకు బన్నీగారు వచ్చినందుకు సంతోషంగా ఉంది. గోడదూకి ‘ఆర్య 2’ సినిమాకు వెళ్లాను. ‘రేసుగుర్రం’ సినిమాకు థియేటర్స్‌లో ఆడియన్స్‌లా స్టెప్పులేశాను. ఇప్పుడు బన్నీగారి ప్రొడక్షన్లో సినిమా చేయడం సంతోషంగా ఉంది. అరవింద్‌గారి ప్రొడక్షన్లో రజనీకాంత్, చిరంజీవి, పవన్ కల్యాణ్, ఆమిర్‌ఖాన్ వంటి పెద్ద పెద్ద స్టార్లు గీతా ఆర్ట్స్‌లో నటించారు. వారికి ఎలాంటి గౌరవం దక్కిందో నాకూ అలాంటిదే దక్కింది. కౌశిక్ మంచి డైరెక్టర్ అవుతాడు. ఇక లావణ్యను ‘అందాల రాక్షసి’గా కాదు.. ‘మల్లిక’గా గుర్తుపెట్టుకుంటారు. ఈ సినిమా నన్ను ఎక్కడికి తీసుకువెళుతుందో తెలియదు. కానీ ఈ సినిమా హిట్ సాధిస్తుందని అందరూ నమ్ముతున్నారు. నేనూ నమ్ముతున్నాను’’ అన్నారు కార్తికేయ. చదవండి: అల్లు అర్జున్ను కలిసి ‘కేజీఎఫ్’ డైరెక్టర్.. ఫొటో వైరల్ ‘‘సినిమా చూసి బన్నీ ఇచ్చిన కాంప్లిమెంట్స్ను మర్చిపోలేను. అవకాశం ఇచ్చిన అల్లు అరవింద్‌గారికి ధన్యవాదాలు. బస్తీ బాలరాజుగా కార్తికేయ చితక్కొ ట్టాడు. నవదీప్గారి వల్ల వాసూగారితో పరిచయం కలిగింది. నేను చెప్పిన కథ నచ్చి వాసూగారు అవకాశం ఇచ్చారు’’ అన్నారు కౌశిక్. ‘‘కార్తికేయ హీరోగా, విలన్ గా చేస్తున్నాడు. హీరోగా మంచి పాత్రలు సెలక్ట్ చేసుకుంటూ కెరీర్లో ముందుకు వెళ్లు. ‘చావు కబురు చల్లగా...’ సూపర్‌హిట్ అవుతుంది’’ అని అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. ‘‘అరవింద్‌గారు, బన్నీగారు లేకుంటే నేనీ స్థాయికి వచ్చేవాడిని కాదు. హీరోగా కార్తికేయ, దర్శకుడిగా కౌశిక్ మంచి స్థాయికి వెళతారు. ఇలాంటి డిఫరెంట్ కథను ఇచ్చినందుకు కౌశిక్‌కు, విడో క్యారెక్టర్ చేసిన లావణ్యాగారికి థ్యాంక్స్’’ అన్నారు నిర్మాత ‘బన్నీ’ వాసు. ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి బన్నీ.. ఐకానిక్ మాస్ స్టార్! ‘స్టైలిష్ స్టార్‌గా కాదు... ఐకానిక్ మాస్ స్టార్లా బన్నీని ఫ్యాన్స్ గుర్తుపెట్టుకునేలా ‘పుష్ప’ సినిమా ఉంటుంది. కొత్త కథల ఎంపికలో అల్లు అరవింద్‌గారి జడ్జ్‌మెంట్‌కు ఓ నమస్కారం. కార్తికేయ భవిష్యత్‌లో మంచి స్టార్ అవుతాడు. ‘గీతగోవిందం’ గీసిన గీతను ఈ సినిమా దాటిపోవాలని కోరుకుంటున్నాను’’ అని సుకుమార్ అన్నారు. లావణ్యా త్రిపాఠి, అల్లు అర్జున్, కార్తికేయ, అల్లు అరవింద్, బన్నీ వాసు, కౌశిక్, అనసూయ -
సినిమాల శాంపిల్ రెడీ.. చూసేందుకు మీరు సిద్ధమా
కంప్యూటర్ వదలి నాగలి పట్టి, వ్యవసాయానికి శ్రీకారం చుట్టాడు ఓ యువకుడు. చావు కబురు చల్లగా చెబుతాడు మరో యువకుడు. గ్రామంలో జరిగే ఊహించని పరిణామాలకు భయపడతారు గ్రామప్రజలు. ఒక గ్యాంగ్‌స్టర్ అండర్‌వరల్డ్‌ని శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? ఈ నాలుగు కథలూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈలోపు నాలుగు సినిమాలకు సంబంధించిన చిన్న శాంపిల్‌ని ట్రైలర్, టీజర్ రూపంలో చూపించాయి ఆయా నిర్మాణసంస్థలు. శర్వానంద్ నటించిన ‘శ్రీకారం’, కార్తికేయ చేసిన ‘చావు కబురు చల్లగా..’, సముద్రఖని ‘ఆకాశవాణి’, రామ్‌గోపాల్‌వర్మ ‘డి కంపెనీ’ సినిమాలకు సంబంధించి కొత్త విశేషాలు బయటకొచ్చాయి. జోడీ కుదిరింది ‘‘రామ్‌తో కలిసి సినిమా చేయబోతున్నందుకు సూపర్ డూపర్ ఎగ్జయిటెడ్‌గా ఉన్నాను’’ అన్నారు ‘ఉప్పెన’ ఫేమ్ కృతీ శెట్టి. రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి ఓ సినిమా నిర్మించనున్న విషయం తెలిసిందే. ఇందులో కథానాయికగా ‘ఉప్పెన’ ఫేమ్ కృతీ శెట్టి పేరుని పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆమెనే ఎంపిక చేసినట్లు శుక్రవారం చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. మట్టికి.. మనిషికి మధ్య ప్రేమకథ ఉద్యోగం చేస్తున్న కంపెనీ యూఎస్ బ్రాంచ్‌కి మేనేజర్ కావాల్సిన యువకుడు వ్యవసాయం కోసం పొలంలో కాలు పెట్టాడు. నాగలి పట్టాడు. మట్టికి మనిషికి మధ్య ఉన్న ప్రేమకథను మరోసారి గుర్తు చేయడానికి శ్రీకారం చూట్టాడు. శర్వానంద్, ప్రియాంకా అరుళ్ మోహన¯Œ హీరో హీరోయిన్లుగా కిశోర్ దర్శకత్వం వహించిన ‘శ్రీకారం’ సినిమా ట్రైలర్ విడుదలైంది. కిశోర్ దర్శకత్వంలో గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. బస్తీ ప్రేమకథ అబ్బాయి శవాలబండి డ్రైవర్. అమ్మాయి నర్స్. అబ్బాయికి అమ్మాయిపై లవ్వు. కానీ అమ్మాయికి అబ్బాయంటే కోపం. మరి.. ప్రేమకథ ఎలా ముగిసింది? అనే ప్రశ్నకు ‘చావు కబురు చల్లగా..’లో సమాధానం దొరుకుతుంది. కార్తికేయ, లావాణ్యా త్రిపాఠీ జంటగా అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన చిత్రం ‘చావు కబురు చల్లగా..’. కౌశిక్ దర్శకుడు. ఈ నెల 19న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇందులో బస్తీ బాలరాజుగా కార్తికేయ, మల్లిక పాత్రలో లావణ్యా త్రిపాఠీ నటించారు. గ్రామంలో అలజడి అడవికి దగ్గరగా ప్రశాంతంగా ఉన్న ఓ గ్రామంలో ఊహించని అలజడి రేగుతుంది. భయంతో గ్రామస్తులు రాత్రివేళ దేనికోసమో అన్వేషిస్తుంటారు. ఆ గ్రామంలో ఏం జరిగింది? అనే మిస్టరీ వీడాలంటే ‘ఆకాశవాణి’ చూడాల్సిందే. సముద్రఖని, వినయ్ వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్ ప్రధాన పాత్రల్లో అశ్వి¯Œ గంగరాజు దర్శకత్వంలో పద్మనాభరెడ్డి నిర్మించిన చిత్రం ‘ఆకాశవాణి’. దీని టీజర్‌ను దర్శకుడు రాజమౌళి రిలీజ్ చేశారు. ఆ స్థాయికి ఎలా ఎదిగాడు? రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘డి– కంపెనీ’. అక్షత్ కాంత్, ఇర్రా మోర్, నైనా గంగూలీ, రుద్ర కాంత్ ప్రధాన పాత్రల్లో స్పార్క్ సాగర్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ‘‘గ్యాంగ్‌స్టర్ స్థాయి నుంచి అండర్ వరల్డ్‌ని శాసించే స్థాయికి దావూద్ ఇబ్రహీం ఎలా ఎదిగాడు? 1993లో ముంబయ్‌లో జరిగిన బాంబు పేలుళ్ల సూత్రధారి ఎవరు? అనే అంశాలను ప్రస్తావించాం. ఈ 26న తెలుగు, హిందీలో చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
‘చావు కబురు చల్లగా’ ట్రైలర్ వచ్చేసిందోచ్!
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తోన్న చిత్రం సినిమా ‘చావు కబురు చల్లగా’. విభిన్న కథాంశంతో వస్తున్న ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. ఈ క్రమంలో శుక్రవారం చావు కబురు చల్లగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో బస్తీ బాలరాజు పాత్రలో కార్తికేయ, డాక్టర్ మల్లికగా లావణ్య తమ నటనతో ఆకట్టుకుంటున్నారు. కార్తికేయ చెప్పే డైలాగులు బాగున్నాయి. కాగా దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు ఆరవింద్ గీతా ఆర్ట్స్-2 బ్యానర్లో బన్ని వాసు నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలకు విశేష స్పందన లభిస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ‘పైన పటారం.. లోన లొటారం’ అనే పాట అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సాంగ్‌లో బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ ఆడిపాడారు. కాగా మార్చి 9న జరగబోయే చావు కబురు చల్లగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ రాబోతున్నారు. ఇదిలా ఉండగా ఢిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాతో అభిమానుల్లో అంచనాలు భారీగానే నెలకొన్నాయి. సినిమా రిలీజ్ కోసం ష్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చదవండి: 'ఆయన ఫ్యాన్స్ కోసం ఏమైనా చేస్తాడు' -
అది ఐటెం సాంగ్ కాదమ్మ.. అనసూయ కౌంటర్
అనసూయ భరద్వాజ్.. పరిచయం అక్కర్లేని పేరు. బుల్లితెర, వెండి తెర మీద యాంకర్‌గా, నటిగా తన సత్తా చాటుతున్నారు అనసూయ. ఓ పక్క ‘క్షణం’, ‘రంగస్థలం’ వంటి చిత్రాల్లో నటనకు ప్రాధన్యమున్న పాత్రలు చేస్తూనే.. మరో వైపు ప్రత్యేక గీతాల్లో కనిపిస్తున్నారు. ఇక బుల్లి తెర మీద యాంకర్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా చావు కబురు చల్లగా చిత్రంలో అనసూయ ప్రత్యేక గీతంలో కనిపించారు. పైన పటారం.. లోన లోటారం అంటూ సాగే ఈ పాటలో అనసూయ, కార్తికేయతో కలిసి చిందేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ ట్విట్టర్ యూజర్ అనసూయను ఉద్దేశించి ‘‘ఐటెం సాంగ్స్ చేయను అన్నారు కదా.. మరి ఇదేంటి అండి.. అయినా ఆ లిరిక్స్ ఏంది’’ అంటూ అనసూయను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. సదరు యూజర్‌కి అనసూయ స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చారు. ‘‘నా కెరీర్ నా నమ్మకాల మీద, చాయిసెస్ మీద నిర్మితమై ఉంటుంది తప్ప.. ఎవరో రాసిన దాని మీద కాదు’’ అంటూ రిపై ఇచ్చారు. ఈ మేరకు అనసూయ ‘‘అది ఐటెం సాంగ్ కాదు.. అసలు ఐటెం సాంగ్ అంటూ ఏది లేదమ్మ. ఒక పాటకున్న క్యాస్ట్ కాకుండా.. స్పెషల్‌గా ఎవరన్న కావాలి అనుకున్నప్పుడు స్పెషల్ సాంగ్ వస్తుంది. ఒకప్పుడు అమ్మాయిని వస్తువుగా భావించే వాళ్లు ఇచ్చిన పేరు అది. అంతేకాదు ఆ లిరిక్స్ వల్లనే నేను ఈ స్పెషల్ సాంగ్ ఒప్పుకున్నాను’’ అన్నారు. అంతేకాదు ‘‘నేను స్పెషల్ సాంగ్ చేయ్యను అని ఎక్కడా అనలేదు. దయచేసి ఇలాంటి విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్‌గా నన్నే అడగండి. నా గురించి మీకు ఎలాంటి సందేహాలున్నా .. నన్ను అడగండి. ఇప్పుడు చేసినంత వెటకారంగా కాకపోయినా.. నిజాయతీగా ఏమన్నా తెలుసుకోవాలంటే నేను తప్పకుండా సమాధానం చెప్తాను. అంతేకాని ‘‘సమాచారం ప్రకారం’’ అంటూ రాసే వార్తలను నమ్మకండి. నా కెరీర్ నా నమ్మకాలు, చాయిస్‌ల మీద కొనసాగుతుంది తప్ప ఎవరో రాసినదాని మీద కాదు’’ అంటూ ట్వీట్ చేశారు అనసూయ. దీనిపై నెటిజనుల చాలా బాగా చెప్పారు అంటూ కామెంట్ చేస్తున్నారు. కార్తికేయ, లావణ్యా త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘చావుకబురు చల్లగా’. కౌశిక్ పెగళ్లపాటి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మాతగా జీఏ2 పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. Hello!!😊Adi “item” song kadu..asalu “item” song anedi edi ledamma..oka paata ki unna cast kakunda special ga evaranna kavali anukunnappudu “special” song ostundi Okappudu ammai ni vastuvu la treat chesevallu ichina peru adi And aa Lyrics valle nenu ee special song oppukunnanu 😊 https://t.co/JP2Ak0ZeVB — Anasuya Bharadwaj (@anusuyakhasba) March 2, 2021 చదవండి: అనసూయ మాస్ సాంగ్.. దుమ్ములేపేసింది! ఓ మై గాడ్! ఇది మీకెక్కడ దొరికింది?: అనసూయ -
'ఆయన ఫ్యాన్స్ కోసం ఏమైనా చేస్తాడు'
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ తాజాగా నటిస్తున్న చిత్రం 'చావు కబురు చల్లగా'. మర్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్నారు. వరస విజయాలతో దూసుకుపోతున్న ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. బుల్లితెర యాంకర్ అనసూయ భరధ్వాజ్ స్పెషల్ సాంగ్‌లో అలరించనున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్డేట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ‘చావు కబురు చల్లగా’ ప్రమోషన్లలో టాలీవుడ్ స్టార్ హీరో భాగం కానున్నాడు. మార్చి 9న జరగబోయే ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా సినిమా నిర్మాత బన్నివాస్ అల్లు అర్జున్‌కు ఇష్టమైన మిత్రుడు. దీంతో వీళ్లిద్దరి మధ్య ఉన్న స్నేహం కారణంగానే బన్నీ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు రానున్నట్లు టాక్. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎవరు అతిథిగా వస్తున్నారనే దానిపై హీరో, హీరోయిన్ ఇతర నటులతో కలిసి ఓ వీడియోను రూపొందించారు. ఇందులో ఆయన వస్తున్నాడా.. నిజంగా ఒప్పుకున్నాడా.. అయినా ఫ్యాన్స్ కోసం ఏమైనా చేస్తాడులే.. ఇప్పుడు సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ సాధించినట్లు అనిపిస్తుందని వీరంతా ఎగ్జాయిట్గా ఫీల్ అవుతున్నారు. దీంతో అల్లు అర్జున్ రావడం ఖాయం అయిపోయింది. ఈ క్రమంలో ‘ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విచ్చేస్తున్న అల్లు అర్జున్‌కు మా బాలరాజు గాడి నుంచి చాలా చాలా థ్యాంక్యూ’ అంటూ హీరో కార్తీకేయ మంగళవారం ట్వీట్ చేశాడు. ఇక చాల రోజులుగా హిట్ కోసం ఎదురు చూస్తున్న కార్తీకేయకు ఈ సినిమా కీలకంగా మారనుంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ చేతుల మీదుగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుగబోతుంది. ఇంకేముందీ.. బన్నీ అడుగుపెట్టాక సినిమాపై హైప్ పెరగడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. మరి అల్లు అర్జున్ రాక కార్తికేయకు ఏమేరకు కలిసి వస్తుందో చూడాలి. Na movie pre-release event ki he is coming..."AA" oohe chala baundi..❤️❤️#ChaavuKaburuChallaga https://t.co/EXE1bEpt1l — Kartikeya (@ActorKartikeya) March 1, 2021 చదవండి: ‘జయమ్మ’కు బంపర్ ఆఫర్: స్టార్ హీరో మూవీలో! అనసూయ మాస్ సాంగ్.. ఇరగదీసింది! -
అనసూయ మాస్ సాంగ్.. దుమ్ములేపేసింది!
సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే(ఆర్ఎక్స్ 100) యూత్‌ను అట్రాక్ట్ చేశాడు యంగ్ హీరో కార్తికేయ. ఆ తర్వాత గుణ 369, 90 ఎంఎల్, హిప్పీ లాంటి డిఫరెంట్ సినిమాలు చేసినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అనంతరం నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’లో విలన్‌గా నటించి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఈ క్రమంలో ప్రస్తుతం ‘చావుకబురు చల్లగా’ అనే సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో కార్తికేయకు జంటగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై యువదర్శకుడు కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుండగా.. జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ ఓ స్పెషల్ సాంగ్‌లో అలరించనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ పాటకు సంబంధించిన ప్రోమోను చిత్రయూనిట్ విడుదల చేసింది. పైనపటారం..ఈడ లోన లొటారం..విను బాసు చెబతాను లోకం వయ్యారం’ అంటూ సాగే ఈ సాంగ్‌లో అనసూయ ఫుల్ అవుడ్ అండ్ అవుట్ మాస్ స్టెప్పులతో అదరగొట్టింది. ఇక ఈ సినిమాను మార్చి19న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. ఇక సినిమాలో లావణ్య త్రిపాఠి నర్సుగా నటిస్తుండగా, బస్తీ బాలరాజు పాత్రలో మార్చురీ వ్యాన్ నడిపే డ్రైవర్‌గా కార్తికేయ కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన హీరో, హీరోయిన్ల ఫస్ట్ లుక్ పోస్టర్లకు విశేష స్పందన లభించింది. చదవండి: ఓ మై గాడ్! ఇది మీకెక్కడ దొరికింది?: అనసూయ క్రేజీ ఆఫర్: స్టార్ హీరోతో అనసూయ!