మై నేమ్‌ ఈజు రాజూ.. సాంగ్‌ లిరిక్స్‌ | Chaavu Kaburu Challaga My Name Iju Raju Song Lyrics in Telugu | Sakshi
Sakshi News home page

మై నేమ్‌ ఈజు రాజూ.. సాంగ్‌ లిరిక్స్‌

Published Tue, Feb 9 2021 1:20 PM | Last Updated on Tue, Feb 9 2021 2:18 PM

Chaavu Kaburu Challaga My Name Iju Raju Song Lyrics in Telugu - Sakshi

పల్లవి
ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టాగా పుట్టావురో..
అట్టా అట్టా అట్టా అట్టా అట్టాగే పోతావురో..
ఇట్టే ఇట్టే ఇట్టే ఇట్టే ఫీలైపోతారేందిరో...
సత్తే సత్తే సత్తే సత్తే సత్తే ఏమౌతాదిరో...
గాల్లో దీపం...గుండెల్లో ప్రాణం...
ఎప్పుడు తుస్సంటుందో ఎవడికి తెలుసును లేరా...
ఒంట్లో జీవం కాదె మన సొంతం
ఉన్నన్నాళ్లు పండగ చేసి పాడెక్కేయిరా..
పోయేవాడిని పోనివ్వక నీ ఏడుపు ఎందుకు రా...
నీ ఆస్తి గీస్తి ఏమైనా ఆడట్టుకుపోతాడా...
కోటల్లోని రారాజైన కాటికి పోవాలా..
నువ్వు నేను ఎవడైనా కట్టెల్లో కాలాల...
మై నేమ్‌ ఈజు రాజూ... బస్తి బాలరాజు...
చావు కబురు చల్లగా చెబుతా ప్రతి రోజూ

చరణం 
చుట్టం చూపుకు వస్తాం
పెట్టిందల్లా తింటాం.
పెర్మనెంటుగా ఆ ఇంట్లోనే బైఠాయిచ్చముగా...
సినిమా పోస్టరు చూస్తాం...
ఓ టికెట్‌ చూసి వెళతాం...
అయిపోయాక కుర్చీ ఖాళీ చెయ్యక తప్పదుగా...
ఆరడుగుల బాడీ అంతే...
అద్దెకు ఉంటున్నామంతే....
ఈ బాడీ కంపనీ వదిలేయాలి టైమే అయిపోతే..
పుట్టేటప్పుడు ఊపేస్తారు నిన్నే ఉయ్యాల..
పోయేటప్పుడు నలుగురు వచ్చీ చక్కా మోయాలా..
ఉన్నన్నాళ్ళు ఆ నలుగురిని సంపాదించాలా...
ఊరాంతా నిను ఊరేగించి టాటా సెప్పాలా...
స్వర్గానికి తొలిమెట్టు నా బండేరా ఒట్టు
ఎవ్వడైనా సచ్చాడంటే నాకే ఫోనూ కొట్టు...

చరణం 
సన్ను డాటరు అవుతాం...
సిస్టరు బ్రదరు అంటాం
అందరితోనూ బంధాలెన్నో కలుపుకుపోతుంటాం
అప్పుల్లో మునిగుంటాం..
అంబానీ కల కంటాం...
చిల్లర కోసం ఎన్నో ఎన్నో వేషాలే వేస్తాం...
ఈ లైఫ్‌ ఒక నాటకమేలే...
మన యాక్టింగులు అయిపోతే..
ఈ ఊరు పేరు మేకప్‌ తీసి చెక్కేయాలంతే...
శివుడాగ్నే లేకుండా చీమైనా కుడుతుందా...
అంటూ మహాబాగా ఏదాంతం సెబుతావంట..
అన్ని ఇచ్చిన ఆ సామె సావుని గిఫ్ట్‌ ఇవ్వంగ...
అయ్యయ్యయ్యో వద్దంటా వేందయ్యా సిత్రంగా..
జజ్జనకా జజ్జనకా తోడుంటా నీ ఎనకా..
పువ్వుల్లోన మోసుకెళ్లి పూడ్చేస్తా పద కొడకా...
మై నేమ్‌ ఈజు రాజూ....బస్తి బాలరాజు..
చావు కబురు చల్లగా చెబుతా ప్రతి రోజూ

చిత్రం: చావు కబురు చల్లగా...!
రచన: కరుణకుమార్‌ అడిగర్ల
గానం: రేవంత్‌
సంగీతం: జేక్స్‌ బిజోయ్‌ 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement