6 Latest Movies To Releasing This Week In OTT Platforms, Check For Release Dates - Sakshi
Sakshi News home page

ఈ వీకెండ్‌లో ఓటీటీలో రిలీజ్‌‌ అయ్యే సినిమాలివే..

Published Fri, Apr 23 2021 1:23 PM | Last Updated on Fri, Apr 23 2021 4:06 PM

5 New Movies To Watch This Weekend On Indian OTT Platforms - Sakshi

దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోంది. ఎక్కడికి వెళ్లాలన్నా భయం భయంగానే ఉంటోంది. ఇలాంటి సమయంలో ప్రశాంతంగా ఇంట్లోనే కూర్చొని కొత్త సినిమాలకు చూస్తూ ఎంటర్‌టైన్‌ అవ్వొచ్చు. ఈ వారం ఓటీటీలో పలు కొత్త సినిమాలు విడుదల కానున్నాయి. ఆ సినిమాలేంటి? ఏ ప్లాట్‌ఫాంలో ఎప్పుడు రిలీజ్‌ కానున్నాయి వంటి వివరాలు చూసేద్దాం. 

అక్కినేని నాగార్జున హీరోగా అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’. ఈ చిత్రంలో కింగ్‌ నాగ్‌  ఏసీపీ విజయ్‌ వర్మగా నటించారు. ఎటువంటి కమర్షియల్‌ హంగులు లేకపోయినప్పటికీ, సినిమాకు మంచి స్పందన వచ్చింది. దియా మిర్జా, సయామీ ఖేర్, అతుల్‌ కులకర్ణి, అలీ రెజా తదితరులు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్‌22న విడుదలయ్యింది. 

కార్తీ, రష్మిక జంటగా నటించిన చిత్రం 'సుల్తాన్‌. ‘ఖైదీ’, ‘దొంగ’ వంటి సూపర్‌ హిట్స్‌ తర్వాత కార్తీ ఈ మూవీలో నటించారు.తమిళంలో రష్మికకు ఇదే తొలి చిత్రం.బ‌క్కియ‌రాజ్ క‌ణ్ణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను య‌స్‌.ఆర్‌. ప్రకాష్ బాబు, య‌స్‌.ఆర్‌. ప్రభు నిర్మించారు.యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన‌ ఈ సినిమా మే 2 ఆహాలో విడుదల కానుంది.

బాలీవుడ్‌ నటి పరిణీతీ చోప్రా కథానాయికగా నటించిన చిత్రం ‘సైనా’. ఈ మూవీ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ జీవితం ఆధారంగా తెరకెక్కింది. పాత్ర కోసం పరిణీతి చోప్రా బ్యాడ్మింటన్‌లో మెళకువలన్నీ నేర్చకోవడంతోపాటు సైనా, ఆమె కుటుంబంతో సమయం గడిపిన విషయం తెలిసిందే. అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ బాక్సీఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో ఏప్రిల్‌23న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. 

కన్నడ స్టార్‌ దర్శన్‌ హీరోగా నటించిన భారీ బడ్జెట్‌ చిత్రం "రాబర్ట్"‌. తెలుగులోనూ ఇదే పేరుతో రిలీజ్‌ అయ్యింది. అనుకోని పరిస్థితుల్లో కొడుకు ఓ గ్యాంగ్‌స్టర్‌తో పడిన ఇబ్బందుల నుంచే ఎలా భయపడ్డాడు అన్నదే ఈ సినిమా కథ. ఈ ఏడాది రిలీజ్‌ అయిన భారీ సినిమాల్లో ఇది కూడా ఒకటి. కన్నడలో ఈ సినిమా సూపర్‌ సక్సెస్‌ సాధించింది. జగపతి బాబు రవి కిషన్‌,  వినోద్ ప్రభాకర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఏప్రిల్‌ 25న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది. 

‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్‌ కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాస్ నిర్మించాడు. ‘ఆహా’లో ఏప్రిల్‌ 23న రిలీజ్‌ అయ్యింది. 

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో యంగ్‌ హీరో పవన్‌తేజ్‌. ఈయన నటించిన డెబ్యూ మూవీ ఈ కథలో పాత్రలు కల్పితం. మేఘనా, లక్కీ, రఘు బాబు, అభయ్ బేతిగంటి ప్రధాన పాత్రలు పోషించారు. తొలి సినిమాతోనే పవన్‌ తేజ్‌ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ సినిమా ఏప్రిల్‌ 24న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement