List Of Upcoming Movies, Web Series Releases In OTT And Theatre In Sep Last Week - Sakshi
Sakshi News home page

OTT, Theatre Release Movies:ఈ వారం థియేటర్లు, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే..!

Published Mon, Sep 19 2022 11:42 AM | Last Updated on Mon, Sep 19 2022 2:59 PM

 List  Of This week OTT And Theatres Release Movies in Tollywood - Sakshi

టాలీవుడ్‌లో ప్రస్తుతం చిన్న చిత్రాల హవా కొనసాగుతోంది. చిన్న సినిమా అయినా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వారం కూడా అభిమానులకు వినోదం పంచేందుకు పలు చిత్రాలు సిద్ధమవుతున్నాయి. కాగా దసరాకు పెద్ద సినిమాల తాకిడి, థియేటర్ల సమస్య తలెత్తే అవకాశం ఉంది. దీంతో కాస్త ముందుగానే పలువురు యంగ్‌ హీరోలు ఆడియన్స్‌లో పలకరించబోతున్నారు. మరి ఆ చిత్రాలేవి, ఈ వారం థియేటర్లు, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలపై ఓ లుక్కేద్దామా!

కృష్ణ వ్రింద విహారి:
గశౌర్య, షెర్లీ జంటగా నటించిన చిత్రం 'కృష్ణ వ్రింద విహారి'. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనీశ్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహించగా.. మహతి స్వర సాగర్‌ సంగీతమందిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఈనెల 23న థియేటర్లలో ఎంట్రీ ఇవ్వనుంది. 


అల్లూరి:
శ్రీ విష్ణు, కయాదు లోహర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'అల్లూరి'. ఈ సినిమాలో తనికెళ్ల భరణి, సుమన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.  ఈ చిత్రానికి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించగా.. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూర్చారు. ఇటీవల నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ స్టార్‌ హీరో అల్లు అర్జున్ హాజరై చిత్రబృందాన్ని అభినందించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 23న థియేటర్లలో ప్రేక్షకులను పలకరించనుంది. 


 
దొంగలున్నారు జాగ్రత్త: 
సింహా కోడూరి, సముద్రఖని, ప్రీతి అస్రాని ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'దొంగలున్నారు జాగ్రత్త'. ఈ చిత్రానికి సతీశ్ త్రిపుర దర్శకత్వం వహించగా.. కాలభైరవి సంగీత స్వరాలు అందించారు. ఈ వారంలోనే 23వ తేదీన ప్రేక్షకులకు థియేటర్లలో కనువిందు చేయనుంది. 

మాతృదేవోభవ:
పంచానికి అమ్మ విలువను చాటిచెప్పేలా రూపొందించిన చిత్రం మాతృదేవోభవ. ఈ సినిమాలో సుధ, చమ్మక్‌ చంద్ర, రఘుబాబు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కె.హరనాథ్ రెడ్డి దర్శకత్వం వహించగా.. జయసూర్య సంగీత బాణీలు సమకూర్చారు. అయితే ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 500 థియేటర్లలో ఈనెల 24 విడుదల చేయనున్నారు.

పగ పగ పగ: 
ప్రముఖ దర్శకుడు కోటి మొదటిసారి ఓ విలక్షణ పాత్రలో కనిపిస్తున్న చిత్రం పగ పగ పగ. సుంకర బ్రదర్స్ వారి సమర్పణలో అభిలాశ్ సుంకర, దీపిక ఆరాధ్య హీరో, హీరోయిన్లుగా ఈ చిత్రం రాబోతోంది. వినోదాత్మకంగా సాగే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ శ్రీ రవి దుర్గా ప్రసాద్. అయితే ఈ చిత్రాన్ని ఈనెల 22న విడుదల చేయనుండగా ఫస్ట్‌ డే ఫస్ట్‌ షోను ప్రేక్షకులకు ఉచితంగా చూపించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. 


ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు ఇవే!

నెట్‌ఫ్లిక్స్‌

* ద పెర్‌ఫ్యూమర్‌ (హాలీవుడ్‌) సెప్టెంబరు 21

* జంతరా (హిందీ సిరీస్‌) సెప్టెంబరు 23

* ఎల్‌వోయూ (హాలీవుడ్‌) సెప్టెంబరు 23

డిస్నీ+హాట్‌స్టార్‌

* అందోర్‌  (వెబ్‌సిరీస్‌)  సెప్టెంబరు 21

* ద కర్దాషియన్స్‌ (వెబ్‌సిరీస్‌2) సెప్టెంబరు 22 
* బబ్లీ బౌన్సర్‌ (తెలుగు) సెప్టెంబరు 23

ఆహా

* ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో (తెలుగు) సెప్టెంబరు 23

* డైరీ (తమిళ చిత్రం) సెప్టెంబరు 23

అమెజాన్‌ ప్రైమ్‌

* డ్యూడ్‌ (హిందీ సిరీస్‌) సెప్టెంబరు 20
* హుష్‌ హుష్‌ (హిందీ సిరీస్‌) సెప్టెంబరు 22

జీ5

* అతిథి భూతో భవ (హిందీ) సెప్టెంబరు 22
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement