ఇప్పుడు తాజా ట్రెండ్ ప్రకారం థియేటర్లలో సినిమాలన్నీ అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాయి. పెద్ద సినిమాలైతే కనీసం వారం రోజులైనా బాక్సాఫీస్ వద్ద నిలబడుతున్నాయి. కంటెంట్‌తో మరికొన్ని సినిమాలు రెండు, మూడు వారాలపాటు కొనసాగుతున్నాయి. ఆ తర్వాత నెల రోజుల్లోపే ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ఈ ఏడాది కూడా తెలుగులోనూ అలా వచ్చి ఇలా వెళ్లిన సినిమాలు చాలానే ఉన్నాయి.
అలా ఈ ఏడాది ప్రారంభంలో తెలుగులో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం 'తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి'. అసలు ఈ మూవీ ఎప్పుడు వచ్చిందో చాలామందికి తెలియదు. ప్రియదర్శి, శ్రీద, మణికందన్ లాంటి టాలీవుడ్ స్టార్స్ నటించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలో దర్శనమిచ్చింది. ఈ రోజు నుంచే ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.
అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 23న తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ మూవీ టాలీవుడ్‌లో పెద్దగా ఎక్కడా టాక్ వినిపించలేదు. రిలీజైన తొమ్మిది నెలల తర్వాత ఓటీటీకి రావడంతో ఇదేప్పుడు తీశారంటూ ఫ్యాన్స్ తెగ ఆరా తీస్తున్నారు. అయితే పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడంతో మూవీ రిలీజైనట్లు ఎవరికీ తెలియలేదు. కాగా.. ఓ బ్యాంకు దోపిడీ చుట్టూ తిరిగే కథాంశంగా నారాయణ చెన్న దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమాకు వివేక్ రామస్వామి సంగీతమందించారు.
Comments
Please login to add a commentAdd a comment