Wild Dog Movie
-
అక్కడ ఓడినా ఇక్కడ రికార్డులు తిరగరాస్తున్న వైల్డ్ డాగ్
అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఎన్నో అంచనాల నడుమ మార్చి 2న విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. దీంతో థియేటర్లో విడుదలైన 19 రోజులకే ఇది ఓటీటీ బాట పట్టింది. కంటెంట్ పరంగా బాగున్నా కలెక్షన్ల పరంగా నిరాశపరచిన ‘వైల్డ్ డాగ్’ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మ దులుపుతోంది. వ్యూస్ పరంగా రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. నివేదికల ప్రకారం.. ‘వైల్డ్ డాగ్’ కొద్ది రోజుల్లోనే మిలియన్ల వ్యూ కౌంట్ అందుకోవడం ద్వారా అన్ని దక్షిణ భారత చిత్రాల రికార్డును బద్దలు కొట్టింది. అతి తక్కువ సమయంలోనే ఈ ఘనతను సాధించడం విశేషం. పాన్ ఇండియా రేంజ్ నిర్మాణ విలువలు, కథను నడిపిన తీరు, నాగార్జున నటన ఈ చిత్రానికి హైలెట్‌గా నిలువడంతో ఇతర భాషలలో కూడా ఓటీటీ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తెలుగు వర్షన్లో ఈ చిత్రం వ్యూస్ పరంగా 2 స్థానంలో ఉండగా, తమిళ వెర్షన్కుగానూ 5వ స్థానం దక్కింది. విడుదలై వారం కూడా కాలేదు కాబట్టి ఇంకా వ్యూస్ వచ్చే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. చెప్పాలంటే నాగార్జునకు తమిళనాట పెద్దగా మార్కెట్ లేదు. కానీ, అక్కడి లోకల్ హీరోల సినిమాలను వెనక్కు నెట్టి మరీ ఓ రేంజ్లో వ్యూస్ సొంతం చేసుకుందంటే అర్థం చేసుకోవచ్చు ఈ చిత్రానికి ఒటీటీలో ఎంతటి రెస్పాన్స్ వస్తోందో. ఇక ఇతర భాషల్లో కూడా మంచి స్పందనతో రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంటోంది. టాలీవుడ్లో కొత్తదనాన్ని ఎంకరేజ్ చేయడంలో నాగార్జున ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. అలాగే తన కెరీర్లో ఒకే రకం జోనర్ సినిమాలను కాక భిన్నమైన కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు. ఈ క్రమంలోనే రొమాంటిక్, ఫ్యామిలీ కథల నుంచి ప్రస్తుతం యాక్షన్ నేఫథ్యంలోని కథలను ఎంచుకుంటున్నాడు. అలా చేసిన సినిమానే ‘వైల్డ్ డాగ్’. టెర్రరిజం బ్యాక్‌డ్రాప్‌లో కొత్త దర్శకుడు అషిషోర్ సాల్మన్ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్‌లో నాలుగు భాషల్లో అంటే తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. ( చదవండి: ఆ కారణంతో క్రేజీ ఆఫర్లు వదులుకున్న ‘జాతిరత్నాలు’ హీరోయిన్ ) -
ఈ వీకెండ్లో ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలివే..
దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఎక్కడికి వెళ్లాలన్నా భయం భయంగానే ఉంటోంది. ఇలాంటి సమయంలో ప్రశాంతంగా ఇంట్లోనే కూర్చొని కొత్త సినిమాలకు చూస్తూ ఎంటర్టైన్ అవ్వొచ్చు. ఈ వారం ఓటీటీలో పలు కొత్త సినిమాలు విడుదల కానున్నాయి. ఆ సినిమాలేంటి? ఏ ప్లాట్‌ఫాంలో ఎప్పుడు రిలీజ్ కానున్నాయి వంటి వివరాలు చూసేద్దాం. అక్కినేని నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్‌డాగ్’. ఈ చిత్రంలో కింగ్ నాగ్ ఏసీపీ విజయ్ వర్మగా నటించారు. ఎటువంటి కమర్షియల్ హంగులు లేకపోయినప్పటికీ, సినిమాకు మంచి స్పందన వచ్చింది. దియా మిర్జా, సయామీ ఖేర్, అతుల్ కులకర్ణి, అలీ రెజా తదితరులు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్22న విడుదలయ్యింది. కార్తీ, రష్మిక జంటగా నటించిన చిత్రం 'సుల్తాన్. ‘ఖైదీ’, ‘దొంగ’ వంటి సూపర్ హిట్స్ తర్వాత కార్తీ ఈ మూవీలో నటించారు.తమిళంలో రష్మికకు ఇదే తొలి చిత్రం.బక్కియరాజ్ కణ్ణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యస్.ఆర్. ప్రకాష్ బాబు, యస్.ఆర్. ప్రభు నిర్మించారు.యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా మే 2 ఆహాలో విడుదల కానుంది. బాలీవుడ్ నటి పరిణీతీ చోప్రా కథానాయికగా నటించిన చిత్రం ‘సైనా’. ఈ మూవీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. పాత్ర కోసం పరిణీతి చోప్రా బ్యాడ్మింటన్‌లో మెళకువలన్నీ నేర్చకోవడంతోపాటు సైనా, ఆమె కుటుంబంతో సమయం గడిపిన విషయం తెలిసిందే. అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ బాక్సీఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో ఏప్రిల్23న ఈ చిత్రం రిలీజ్ కానుంది. కన్నడ స్టార్ దర్శన్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం "రాబర్ట్". తెలుగులోనూ ఇదే పేరుతో రిలీజ్ అయ్యింది. అనుకోని పరిస్థితుల్లో కొడుకు ఓ గ్యాంగ్‌స్టర్‌తో పడిన ఇబ్బందుల నుంచే ఎలా భయపడ్డాడు అన్నదే ఈ సినిమా కథ. ఈ ఏడాది రిలీజ్ అయిన భారీ సినిమాల్లో ఇది కూడా ఒకటి. కన్నడలో ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. జగపతి బాబు రవి కిషన్, వినోద్ ప్రభాకర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఏప్రిల్ 25న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాస్ నిర్మించాడు. ‘ఆహా’లో ఏప్రిల్ 23న రిలీజ్ అయ్యింది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో యంగ్ హీరో పవన్‌తేజ్. ఈయన నటించిన డెబ్యూ మూవీ ఈ కథలో పాత్రలు కల్పితం. మేఘనా, లక్కీ, రఘు బాబు, అభయ్ బేతిగంటి ప్రధాన పాత్రలు పోషించారు. తొలి సినిమాతోనే పవన్ తేజ్ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 24న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. -
మంచిని పంచుకుంటే ఆనందమే
‘‘సీసీసీ (కరోనా క్రైసిస్ ఛారిటీ)లో కొంత డబ్బు మిగిలే ఉంది. ఈ నగదును సినీ కార్మికులకు కోవిడ్ వ్యాక్సిన్ వేయించేందుకు వినియోగించాలనుకుంటున్నాం. 24శాఖల యూనియన్స్‌తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం’’ అన్నారు చిరంజీవి. గత ఏడాది కరోనా టైమ్‌లో చిరంజీవి ఆధ్వర్యంలో సీసీసీ ఆరంభమైంది. విరాళాలు సేకరించి, సినీ పేద కార్మికులకు నిత్యావసరాలు అందజేసిన విషయం తెలిసిందే. ‘‘మంచి విషయాన్ని పది మందితో పంచుకోవడంలో ఉండే ఆనందం అంతా ఇంతా కాదు. ‘వైల్డ్ డాగ్’ చూడగానే నాకదే అనిపించింది. తెలుగువాళ్లుగా మనమంతా గర్వపడే గొప్ప సినిమా ఇది’’ అని హీరో చిరంజీవి అన్నారు. నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వైల్డ్ డాగ్’. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 2న రిలీజైంది. ఈ సినిమాని ఆదివారం చిరంజీవి చూశారు. సోమవారం విలేకరుల సమావేశంలో చిరంజీవి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా గురించి నిరంజన్ నాతో చెప్పినప్పుడు సాంగ్స్, రొమాంటిక్ సీన్స్ ఉండవు అన్నాడు. నాగ్ సినిమా అంటే ఇవన్నీ ఊహిస్తాం కానీ అవేవీ లేకుంటే డ్రైగా ఉంటుందనుకున్నాను. కానీ ‘వైల్డ్ డాగ్’ చూసేటప్పుడు ఆద్యంతం ఉత్కంఠగా అనిపించింది. ఇంటర్వెల్ కూడా ఆపకుండా చూశానంటే ఈ సినిమా మీద నా ఆసక్తి చివరిదాకా ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. హిందీ ‘యురి’ సినిమాకు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఇలాంటి సినిమా మనం ఎందుకు తీయలేకపోతున్నాం.. కమర్షియల్ ట్రాక్‌లో పడిపోయామా? అనుకుంటున్న సమయంలో నాగార్జున ‘వైల్డ్ డాగ్’ లాంటి సినిమా చేయడం గర్వంగా ఫీల్ అయ్యా’’ అన్నారు. నాగార్జున మాట్లాడుతూ– ‘‘చిరంజీవి గారు ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా ‘వైల్డ్ డాగ్’ అనడం గర్వంగా అనిపించింది’’ అన్నారు. ‘‘వైల్డ్ డాగ్’ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు మేకర్స్ ఆఫ్ ‘క్షణం, ఘాజీ’ అని వేసుకున్నాం.. చిరంజీవిగారు ఫోన్ చేశాక మా తర్వాతి సినిమాకి మేకర్స్ ఆఫ్ ‘క్షణం, ఘాజీ’తో పాటు ‘వైల్డ్ డాగ్’ అని వేసుకోవాలనిపించింది’’ అన్నారు నిరంజన్ రెడ్డి. అహిషోర్ సాల్మన్ పాల్గొన్నారు. -
పెళ్లి చేసుకోవాలనుకున్నాం.. అంతలోనే గర్భవతినని తెలిసింది!
దియా మీర్జా.. ఇటు వ్యక్తిగత జీవితంలోనూ.. అటు కెరీర్ పరంగానూ మంచి జోష్‌లో ఉన్నారు. ఇటీవల విడుదలైన నాగార్జున వైల్డ్‌డాగ్ మూవీతో తెలుగు తెరపై సందడి చేసిన ఈ హైదరాబాదీ, శుక్రవారం ఓ శుభవార్తను అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. తాను త్వరలోనే తల్లికాబోతున్నానని, మాతృత్వపు మధురిమలు ఆస్వాదించే క్షణాల కోసం ఎదురుచూస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకున్న దియా మీర్జా, ఈ విషయం తెలియజేయగానే, పెళ్లికి ముందే ఆమె గర్భం దాల్చారా అన్న సందేహాలు తలెత్తాయి. ఇదే విషయాన్ని ఇన్‌స్టా వేదికగా ఆమె వద్ద ప్రస్తావించారు నెటిజన్లు. ‘‘జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్న మీకు శుభాకాంక్షలు. అయితే, మహిళా పూజారి సమక్షంలో, ఆమె చదువుతున్న వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకుని అనాదిగా ఆచరిస్తున్న కట్టుబాట్లను తెంచుకుని పురోగమిస్తున్నానని చెప్పిన ఓ మహిళ, పెళ్లికి ముందే గర్భవతినని ఎందుకు చెప్పలేకపోయారు? పెళ్లైన తర్వాతే గర్భం దాల్చాలనే కట్టుబాటును ఆమె అనుసరిస్తున్నారా? వివాహానికి ముందే అమ్మతనాన్ని ఆస్వాదిస్తే తప్పా? అని ఓ ఇన్‌స్టా యూజర్ ప్రశ్నలు సంధించారు. ఇందుకు బదులిచ్చిన దియా.. ‘‘మంచి ప్రశ్న అడిగారు. మా ఇద్దరికి బిడ్డ పుట్టబోతోంది కాబట్టి మేం పెళ్లి చేసుకోలేదు. వివాహ బంధంతో ముడిపడాలని ఎప్పటినుంచో ప్రణాళికలు రచించుకుంటూనే ఉన్నాం. అలాంటి సమయంలోనే మా జీవితంలోకి చిన్నారి రాబోతుందనే విషయం తెలిసింది. గర్భవతిని కాబట్టి హడావుడిగా పెళ్లిచేసుకోలేదు. ఇక ఈ విషయం వివాహానికి ముందే ప్రకటించడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ, అప్పటికే నాకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అంతా సవ్యంగా సాగుతుందా లేదా అన్న విషయంపై స్పష్టత లేదు. అందుకే చెప్పలేదు. నిజానికి నా జీవితంలో అత్యంత సంతోషకరమైన విషయం ఇది. ఇలాంటి ఒకరోజు కోసం నేను ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నా. ఇప్పుడు నా కల నెరవేరింది. మీరనుకుంటున్నట్లుగా తల్లికాబోతున్న విషయాన్ని ఆలస్యంగా ప్రకటించడంలో మరే ఇతర ఉద్దేశం లేదు’’ అని కుండబద్దలుకొట్టారు. ఇక బిడ్డను కనడం జీవితానికి గొప్ప బహుమతి అన్న దియా.. అది, పెళ్లికి ముందా, పెళ్లి తర్వాత అన్న విషయం పూర్తిగా వ్యక్తిగతం అని, సదరు మహిళ నిర్ణయం మీద మాత్రమే ఆధారపడి ఉంటుందని, ఇందుకు సమాజం ఏమనుకుంటుందోనన్న భయాలు అక్కర్లేదని చెప్పుకొచ్చారు. కాగా తొలుత, నిర్మాత సాహిల్ సంఘాను వివాహమాడిన దియా మీర్జా.. ఐదేళ్ల తర్వాత అతడి నుంచి విడిపోయారు. అనంతరం డివోర్సీ అయిన వైభవ్ రేఖీ అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం ముంబైలో జరిగింది. చదవండి: ఆ రెండు లేకుండానే పెళ్లి: ఎందుకో చెప్పిన దియా Wild Dog Movie Review: విజయ్ వర్మ ఇన్వెస్టిగేషన్ అదిరింది -
వైల్డ్‌డాగ్ మూవీపై మెగాస్టార్ ప్రశంసలు
-
వైల్డ్‌డాగ్ మూవీపై చిరు రివ్యూ.. ఆయన ఏమన్నారంటే..
టాలీవుడ్ స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున మధ్య మంచి స్నేహబంధం ఉంది. ఇరువురి కుటుంబాల కార్యక్రమాలు, పార్టీలు వేడుకులకు కుటుంబ సమేతంగా హాజరవుతుంటారు. తాజాగా నాగార్జున వైల్డ్‌డాగ్ విడుదలైన సందర్భంగా చిరు ఇంటికి వెళ్లిగా ఆయన నాగ్ కోసం స్పెషల్‌గా చికెన్ వండిపెట్టారు. అదే విధంగా పర్సనల్ లైఫ్ అయిన ఫ్రొఫెషనల్ లైఫ్లోనైన వీరిద్దరూ ఒకరిఒకరూ మద్దతుగా ఉంటారు. చిరు సినిమాలను నాగ్, నాగ్ సినిమాలను చిరు ప్రమోట్ చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఈ క్రమంలో శుక్రవారం విడుదలై నాగ్ ‘వైల్డ్ డాగ్’ చిత్రంపై చిరు రివ్యూ ఇచ్చారు. ఇది ప్రతి శుక్రవారం విడుదలయ్యే చిత్రం కాదన్నారు. ‘ఇప్పుడే ‘వైల్డ్ డాగ్’ చూసాను. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అతి దారుణమైన టెర్రరిస్ట్ ఘాతుకం వెనుకవున్న కిరాతకులని పట్టుకున్న ఆ ఆపరేషన్ని కళ్ళకి కట్టినట్టుగా చూపించారు. ఆ ఆవేశాన్ని, ప్రాణాలకి తెగించి ఆ నీచుల్ని వెంటాడి వేటాడిన మన రియల్ లైఫ్ హీరోలని, ఆ రియల్ హీరోలని మరింత అద్భుతంగా చూపించిన సోదరుడు నాగార్జున, వైల్డ్ డాగ్ టీం, దర్శకుడు సోలోమోన్, నిర్మాత నిరంజన్ రెడ్డిల మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది ప్రతివారం విడుదలయ్యే చిత్రాల్లోఒకటి కాదని, ప్రతి ఒక్క భారతీయుడు, తెలుగు వారు గర్వంగా చూడాల్సిన చిత్రమంటూ’ అయన ట్విటర్లో రాసుకొచ్చారు. ఇప్పుడే #WildDog చూసాను.తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అతి దారుణమైన టెర్రరిస్ట్ ఘాతుకం వెనుకవున్న కిరాతకులని పట్టుకున్న ఆ ఆపరేషన్ని కళ్ళకి కట్టినట్టుగా చూపించారు. ఆ ఆవేశాన్ని,ప్రాణాలకి తెగించి ఆ నీచుల్ని వెంటాడి వేటాడిన మన రియల్ లైఫ్ హీరోలని, ఆ రియల్ హీరోలని మరింత అద్భుతంగా.. 1/2 — Chiranjeevi Konidela (@KChiruTweets) April 4, 2021 అంతేగాక అక్కినేని కోడలు సమంత సైతం వైల్డ్ డాగ్ మూవీపై తన రివ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. నాగార్జున నటించిన యాక్షన్ థ్రిల్లర్ `వైల్డ్ డాగ్` శుక్రవారం(ఏప్రిల్2)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మగా నాగార్జున కనిపించగా ఆయన సరసన దియా మీర్జా నటించారు. ఈ సినిమాతో అహిషోర్ సాల్మన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. చదవండి: చిరు ఇంటికి నాగార్జున.. వంట చేసిన మెగాస్టార్ మామగారిలా ఎవరూ చేయలేరు : సమంత -
నాన్న బయోపిక్ తీయాలనే ఉంది, కానీ.. : నాగార్జున
‘‘వైల్డ్‌డాగ్’ ప్రతి భారతీయుడూ చూడాల్సిన సినిమా అని అభినందనలు వస్తున్నాయి. ఇందులోని యాక్షన్ సీక్వెన్సెస్ చేయడం నాకు రిస్క్ అనిపించలేదు. నా లైఫే రిస్కీ. ప్రేమించి పని చేసేటప్పుడు శ్రమ ఉండదు. ఏదైనా కొత్తగా సాధించాలనే ఆకలి నాలో ఇంకా ఉంది’’ అని నాగార్జున అన్నారు. నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్‌డాగ్’. నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 2న విడుదలైంది. ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో నాగార్జున మాట్లాడుతూ– ‘‘కోవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో సినిమాను విడుదల చేయాలా? ఆడియన్స్ వస్తారా? అనుకున్నాం. కానీ మంచి సినిమాలకు ప్రేక్షకుల స్పందన ఎప్పుడూ సానుకూలంగా ఉంటుందనే నమ్మకంతో రిలీజ్ చేశాం. ఈ సినిమా రెస్పాన్స్, కలెక్షన్స్ బాగున్నాయని నిర్మాతలు చెబుతుండడం ఆనందంగా ఉంది’’ అన్నారు నాగార్జున. ‘‘ఈ సినిమా సక్సెస్ వెనక టీమ్ అందరి కష్టం ఉంది. నాకు అవకాశం ఇచ్చిన నాగ్ సార్, నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు అహిషోర్. ‘‘బాక్సాఫీస్ కోణంలో ఆలోచించి ఈ సక్సెస్‌మీట్ పెట్టలేదు. మా ప్రయత్నంలో సక్సెస్ అయ్యామని ఈ మీట్ పెట్టాం. మీ బేనర్లో మరో మంచి సినిమా వచ్చిందని అందరూ అంటుంటే సంతోషంగా ఉంది’’ అన్నారు నిరంజన్‌రెడ్డి. ‘‘ఈ సినిమాను గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు అన్వేష్ రెడ్డి. టేస్ట్ అదిరిపోయింది ‘వైల్డ్‌డాగ్’ రిలీజ్ సందర్భంగా కుటుంబసభ్యులందరూ ప్రీమియర్ షోలతో బిజీ అయిపోయారు. ఇంట్లో నేనొక్కడినే ఉన్నాను. అప్పుడు చిరంజీవిగారు ఫోన్ చేసి, ఏం చేస్తున్నావ్? అన్నారు. ఏం లేదని చెప్పాను. రాజమండ్రి నుంచి ‘సీ ఫుడ్’ ఐటమ్స్ వచ్చాయి... రమ్మన్నారు. వెళ్లాను. చిరంజీవిగారు వండి పెట్టారు. టేస్ట్ అదిరిపోయింది. మా పాత సినిమాలు, రిలీజ్ సమయంలో ఉండే టెన్షన్స్ వంటి వాటి గురించి మాట్లాడుకున్నాం. నాన్న బయోపిక్ తీయాలనే ఉంది! మా నాన్నగారి (దివంగత ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు) బయోపిక్ తీయాలనే ఉంది. కానీ ఏమైనా పొరపాట్లు జరుగుతాయా అనే భయం కూడా ఉంది. ‘మనం’ సినిమా తీసే సమయంలో కూడా ఇదే భయం ఉండేది. కానీ భయం ఉన్నప్పుడే మరింత జాగ్రత్తగా పని చేస్తాం. -
'వైల్డ్ డాగ్' సక్సెస్ మీట్
-
`వైల్డ్ డాగ్`మూవీపై సమంత రివ్యూ
హీరోయిన్ సమంత ఈ మధ్య సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది. తాజాగా నాగార్జున నటించిన `వైల్డ్ డాగ్`మూవీపై రివ్యూ ఇచ్చింది. చాలాకాలంగా మంచి యాక్షన్ చిత్రాలను మిస్సవుతున్నానని ఆ లోటును 'వైల్డ్ డాగ్' చిత్రం తీర్చిందని తెలిపింది. ఎమోషనల్, యాక్షన్‌తో హాలీవుడ్ స్టయిల్లో ఈ సినిమా ఉందని చెప్పింది. ఏసీపీ విజయ్‌వర్మ పాత్రను నాగార్జున తప్ప మరెవ్వరు చేయలేరని తన మామగారిపై ప్రశంసల వర్షం కురిపించింది. నాగార్జున నటించిన యాక్షన్ థ్రిల్లర్ `వైల్డ్ డాగ్` శుక్రవారం(ఏప్రిల్2)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మగా నాగార్జున కనిపించగా ఆయన సరసన దియా మీర్జా నటించారు. ఈ సినిమాతో అహిషోర్ సాల్మన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. చదవండి: Wild Dog Movie Review: విజయ్ వర్మ ఇన్వెస్టిగేషన్ అదిరింది ‘వైల్డ్ డాగ్’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే.. Just watched #WildDog .. it is fantastic 🔥🔥🔥... I really have been missing a good action flick .. and I got a Hollywood style ,kickass power packed, emotional, edge of your seat kinda action film .. Just watch it 🙌.. @iamnagarjuna no one else could have pulled this off 🤗❤️ — Samantha Akkineni (@Samanthaprabhu2) April 1, 2021 -
‘వైల్డ్ డాగ్’కి ఊహించని ఎదురుదెబ్బ.. షాక్‌లో చిత్ర యూనిట్!
అక్కినేని నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్‌డాగ్’. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం(ఏప్రిల్ 2)న విడుదలై మిక్స్డ్ టాక్‌తో దూసుకెళ్తుంది. వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన ఈ చిత్రంలో కింగ్ నాగ్ ఏసీపీ విజయ్ వర్మగా అదరగొట్టాడు. గత రెండేళ్లుగా సరైన హిట్ లేక సతమతమవుతున్న కింగ్ నాగ్.. ‘వైల్డ్ డాగ్’తో హిట్ ట్రాక్ ఎక్కాలని చూశాడు. అనుకున్నట్లే మార్నింగ్ షో నుంచే ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. దీంతో కలెక్షన్లు కూడా భారీగా వస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమయంలో ‘వైల్డ్ డాగ్’టీమ్‌కి భారీ షాక్ తగిలింది. పైరసీ భూతం ‘వైల్డ్ డాగ్’ని కూడా వదల్లేదు. సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే .. పైరసీ వీడియో బయటకు వచ్చేసింది. పైరసీని ప్రోత్సహించే కొన్ని వెబ్సైట్లు వైల్డ్ డాగ్ పుల్ మూవీ డౌన్లోడ్ లింక్‌ను శుక్రవారమే పెట్టేశాయి. దీంతో కలెక్షన్లపై ప్రభావం ఉండే ప్రమాదం ఏర్పడింది. వాళ్లు ఫుల్ చేస్తే.. వీళ్లు లీక్ చేశారు వైల్డ్ డాగ్ మూవీ విడుదలకు ఒక్క రోజు ముందు అంటే గురువారమే లీకైపోయిందంటూ చిత్ర నిర్మాణ సంస్థ మ్యాట్నీ మూవీస్ ట్వీట్ చేసింది. అయితే అది అబద్దమని, జనాల్ని ఫూల్స్ చేయడానికే అలా చేశామని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. అయితే ఒక్క రోజు తర్వాత నిజంగానే తమ మూవీ నిజంగానే లీకైపోవడంతో చిత్ర యూనిట్ షాక్‌కు గురైంది. మరి పైరసీ భూతం ఎఫెక్ట్ ‘వైల్డ్ డాగ్’ కలెక్షన్స్‌పై ఏ మేరకు ఉంటుందో చూడాలి. చదవండి: వైల్డ్ డాగ్’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే.. 'వైల్డ్ డాగ్' మూవీ రివ్యూ -
‘వైల్డ్ డాగ్’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..
అక్కినేని నాగార్జున హీరోగా నటించిన తాజా చిత్రం ‘వైల్డ్ డాగ్’కు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. తొలి రోజు దాదాపు రూ. 3.5 కోట్ల వరకు వసూళ్లు చేసినట్లు తెలుస్తుంది. ఇక యూఎస్ఏలో కూడా వైల్డ్ డాగ్ హవా కొనసాగుతుంది. తొలి రోజే అక్కడ 3,967 డాలర్లను వసూలు చేసింది. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో 7.7 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు సమాచారం. నైజాంలో 2.5 కోట్లు, సీడెడ్‌లో 1.2 కోట్లు, ఆంధ్రాలో 4 కోట్ల బిజినెస్ చేసిందట. అలాగే కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 70 లక్షలు, ఓవర్సీస్ హక్కులు రూ.50 లక్షలకు అమ్ముడు పోయినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తానికి ఈ సినిమా 9 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బరిలోకి దిగింది. సేఫ్‌లో జోన్లోకి వెళ్లాలంటే ఇంకా 5.5 కోట్లు వసూలు చేయాల్సింది. అయితే ఈ లక్ష్యాన్ని నాగార్జున ఛేదిస్తాడా అనేది ఈ వీకెండ్లో వెల్లడయ్యే అవకాశం ఉంది. వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన ఈ చిత్రంలో కింగ్ నాగ్ ఏసీపీ విజయ్ వర్మగా అదరగొట్టాడు. ఉగ్రవాదిని పట్టుకునేందుకు హీరో తన టీమ్‌తో ఏం చేశాడనే ఒకే ఒక పాయింట్ చుట్టూ ఈ కథ తిరుగుంది. ఎటువంటి కమర్షియల్ హంగులు లేకపోయినప్పటికీ, సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రానికి అహిషోర్ సాల్మన్ దర్శకత్వం వహించగా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. దియా మిర్జా, సయామీ ఖేర్, అతుల్ కులకర్ణి, అలీ రెజా తదితరులు కీలక పాత్రలో నటించారు. చదవండి: వైల్డ్ డాగ్' మూవీ రివ్యూ చిరు ఇంటికి నాగార్జున.. వంట చేసిన మెగాస్టార్ -
'వైల్డ్ డాగ్' భామ సయామీ ఖేర్ ఫొటోలు
-
'వైల్డ్ డాగ్' మూవీ రివ్యూ
టైటిల్ : వైల్డ్‌డాగ్ జానర్ : యాక్షన్ థ్రిల్లర్ నటీనటులు : నాగార్జున, దియా మిర్జా, సయామీ ఖేర్, అతుల్ కులకర్ణి, అలీ రెజా తదితురులు నిర్మాణ సంస్థ : మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ట్స్ నిర్మాతలు : నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి దర్శకత్వం : అహిషోర్ సాల్మన్ సంగీతం : తమన్ సినిమాటోగ్రఫీ : షానిల్ డియో విడుదల తేది : ఏప్రిల్ 02,2021 వయసు పెరుగుతున్న కొద్దీ మరింత గ్లామర్‌గా రెడీ అవుతూ నిజంగానే మన్మథుడు అనిపించుకుంటున్నాడు కింగ్ నాగార్జున. అందం, ఫిట్‌నెస్‌లో యువ హీరోలకు ధీటుగా కనిపిస్తుంటాడీ స్టార్ హీరో. కెరీర్ స్టార్టింగ్ నుంచే ప్రయోగాలు చేస్తున్న నాగ్.. 35 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో విభిన్న కథా చిత్రాలను చేశాడు. జయాపజయాలను లెక్క చేయకుండా తన పంథాలో దూసుకెళ్తున్నాడు. ఈ మధ్య కాలంలో వరుసగా పరాజయాలను ఎదుర్కొంటోన్న ఈ అక్కినేని హీరో.. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో 'వైల్డ్ డాగ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. నూతన దర్శకుడు అహిషోర్ సాల్మన్ తెరకెక్కించిన ఈ సినిమాపై నాగ్‌తో పాటు ఆయన అభిమానులు కూడా ఎన్నో అశలు పెట్టుకున్నారు. ఇలా ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం(ఏప్రిల్ 02)విడుదలైన ఈ సినిమా నాగార్జునను హిట్ ట్రాక్ ఎక్కించిందా? కింగ్ నాగార్జున చేసిన మరో ప్రయోగాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? నూతన దర్శకుడు అహిషోర్ సాల్మన్ విజయాన్ని అందుకున్నాడా? రివ్యూలో చూద్దాం. కథ విజయ్ వర్మ(నాగార్జున అక్కినేని) ఒక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) అధికారి. సంఘ విద్రోహ శక్తులతో పాటు తీవ్రవాదులను పట్టుకోవడం అతని పని. అయితే ఆయన మాత్రం ఉగ్రవాదులను అరెస్ట్ చేయడం కంటే అంతం చేయడమే ఉత్తమమని భావిస్తాడు. అందుకే డిపార్ట్మెంట్లో ఆయన్ను అంతా ‘వైల్డ్ డాగ్’ అని పిలుస్తుంటారు. అలా అనేకమంది తీవ్రవాదులను ఎన్కౌంటర్ చేసి సస్పెండ్ అవుతాడు విజయ్ వర్మ. ఇదిలా ఉంటే పుణెలోని జాన్స్ బేకరిలో బాంబు బ్లాస్ట్ జరుగుతుంది. ఈ కేసును కేంద్ర హోంశాఖ సీరియస్‌గా తీసుకుంటుంది. కేసును త్వరగా చేధించాలని భావించిన డీఐజీ మోహన్ (అతుల్ కులకర్ణి).. సస్పెండ్ అయిన ఎన్ఐఏ అధికారి విజయ్ వర్మను తిరిగి విధుల్లోకి చేరాలని కోరతాడు. చివరకు విజయ్ వర్మ పెట్టిన కండీషన్‌కు ఎన్ఐఏ అధికారులు ఒప్పుకోవడంతో కేసును టేకప్ చేస్తాడు. తన టీమ్‌తో కలిసి విజయ్‌వర్మ బాంబు బ్లాస్ట్ కేసును దర్యాప్తు చేస్తాడు. ఈ క్రమంలో ఈ బ్లాస్ట్‌ను ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన ఖాలిత్ చేశాడని కనిపెడతారు. అయితే కొన్ని కారణాల వల్ల విజయ్ను మళ్లీ సస్పెండ్ చేస్తారు. అసలు విజయ్‌ని ఎన్ఐఏ అధికారులు ఎందుకు సస్పెండ్ చేశారు? సస్పెండ్ అయినప్పటికీ తన టీమ్‌తో కలిసి ఖాలిత్‌ను ఎలా పట్టుకున్నాడు? విజయ్ లీడ్ చేస్తున్న ఎన్ఐఏ టీమ్‌లో ‘రా’ ఏజెంట్ అయిన ఆర్యా పండిట్ (సయామీ ఖేర్)ఎందుకు జాయిన్ కావాల్సి వచ్చింది? చివరకు ఖాలిత్‌ను విజయ్ వర్మ ఏం చేశాడు అనేదే మిగతా కథ. నటీనటులు ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు కింగ్ నాగార్జున. ‘వైల్డ్‌డాగ్’ మూవీ కూడా ఓ ప్రయోగమనే చెప్పాలి. దేశభక్తి గల ఎన్ఐఏ అధికారి విజయ్ వర్మ పాత్రలో ఒదిగిపోయాడు నాగ్. పోరాట ఘట్టాలను కూడా అవలీలగా చేశాడు. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ ఫైట్ సీన్లో అదరగొట్టాడు. రా ఏజెంట్ ఆర్యాపండిత్ పాత్రలో సయామీ ఖేర్ జీవించేసింది. చేజింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లో నాగార్జునతో పోటీపడి మరీ ఇరగదీసింది. విజయ్ వర్మ టీమ్ సభ్యుడిగా బిగ్‌బాస్ ఫేమ్ అలీరెజా ఒదిగిపోయాడు. నిడివి ఎక్కువగా ఉన్న పాత్ర తనది. విజయ్ వర్మ భార్య ప్రియగా దియా మీర్జా పర్వాలేదనిపించింది. నిడివి చాలా తక్కువైనప్పటికీ ఉన్నంతలో బాగా నటించింది. అతుల్ కులకర్ణి, ప్రకాశ్, ప్రదీప్ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు. విశ్లేషణ హైదరాబాద్‌లోని గోకుల్ చాట్ వద్ద బాంబు పేళ్లుళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఆ నిజ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమే ‘వైల్డ్ డాగ్’. ఇలాంటి కథను అందరికి నచ్చేలా చెప్పడం చాలా కష్టమైన పని. ఎటువంటి కమర్షియల్ హంగులు లేకుండా ఓ సీరియస్ స్టోరీని తెరపై చూపించి మెప్పించడంలో కొంతవరకు సఫలం అయ్యాడు దర్శకుడు అహిషోర్ సాల్మన్. ఉగ్రవాదిని పట్టుకునేందుకు హీరో తన టీమ్‌తో ఏం చేశాడనే ఒకే ఒక పాయింట్ చుట్టూ కథని తిప్పాడు. కథను పక్కదారి పట్టించకుండా కాన్సెప్ట్‌పై ఫోకస్ పెడుతూ సినిమా నడించాడు. ఫస్టాప్ ఎక్కువగా ఎమోషనల్ కంటెంట్‌కు చోటు ఇచ్చిన దర్శకుడు.. సెకండాఫ్ మాత్రం ఎక్కువగా పోరాట ఘట్టాలపైనే దృష్టి పెట్టాడు. సెకండాఫ్ అంతా చాలా సీరియస్‌గా, ఆసక్తికరంగా సాగుతుంది. అయితే ఉగ్రవాదిని పట్టుకునే క్రమంలో విజయ్ వర్మ చేసే కొన్ని విన్యాసాలు మాత్రం రొటీన్‌గా అనిపిస్తాయి. ఇక చివర్లో వచ్చే ట్విస్టులు మాత్రం అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ సినిమాకు మరో ప్రధాన బలం తమన్ నేపథ్య సంగీతం. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో కీలక సన్నివేశాలకు ప్రాణం పోశాడు. ఎడిటింగ్ పర్వాలేదు. సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలకు కత్తెర వేస్తే బాగుండనిపిస్తుంది. యాక్షన్స్ సీన్స్‌ని మలిచిన తీరు, తెరపై చూపించిన విధానం బాగుంది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ నాగార్జున నటన తమన్ నేపథ్య సంగీతం యాక్షన్ సీన్స్ మైనస్ పాయింట్స్ కమర్షియల్ అంశాలు లేకపోవడం ఫస్టాఫ్ -అంజి శెట్టె -
చిరు ఇంటికి నాగార్జున.. వంట చేసిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున మంచి స్నేహితులని అందరికీ తెలిసిందే. ఇరు కుటుంబాల మధ్య కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. అంతేకాదు కరోనా తర్వాత వీళ్లిద్దరే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని విషయాలను చూసుకుంటూ ఉన్నారు. ఇరు కుటుంబాలలో జరిగే వేడుకలల్లో కూడా వీరు పాల్గొంటారు. వైల్డ్‌డాగ్ సినిమా ప్రమోషన్లో బిజీబిజీగా ఉన్న నాగార్జున తాజాగా చిరంజీవి ఇంటికి వెళ్లాడు. దీంతో చిరంజీవి అతిథి నాగార్జున కోసం స్వయంగా ఓ కమ్మని వంట చేశాడు. దీనికి సంబంధించి నాగార్జున ట్విటర్లో చిరంజీవితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశాడు. ‘‘వైల్డ్ డాగ్’ విడుదల నేపథ్యంలో నా ఒత్తిడి తగ్గించేందుకు మెగాస్టార్ స్వయంగా వంటచేశారు. నాకోసం రుచికరమైన విందుని ఏర్పాటు చేశారు. ఈ సాయంత్రం అద్భుతంగా గడిచింది. ధన్యవాదాలు’’ అంటూ నాగార్జున ట్వీట్ చేశారు. ఈ దృశ్యాన్ని చిరంజీవి సతీమణి సురేఖ ఫొటో తీసినట్లు నాగార్జున తెలిపారు. అక్కినేని నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్‌డాగ్’. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు (ఏప్రిల్ 02)న విడుదల కాబోతుంది. A delicious dinner Cooked by the megastar himself to cool my nerves for #WildDog release tomorrow !! Thank you For a wonderful evening @KChiruTweets 🙏 picture courtesy Surekha garu 😊 pic.twitter.com/86FO5aWI1Q — Nagarjuna Akkineni (@iamnagarjuna) April 1, 2021 -
రిలీజ్‌కు ముందే 'వైల్డ్ డాగ్' ఫుల్ మూవీ లీక్!
అక్కినేని నాగార్జున పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్న చిత్రం "వైల్డ్ డాగ్". వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన ఈ సినిమాలో దర్శకుడు సహా అందరూ కొత్తవాళ్లే. దీంతో ఈ సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకువెళ్లేందుకు నాగ్ బాగా కష్టపడుతున్నాడు. మిగతా సినిమాల కంటే భిన్నంగా ప్రమోట్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ కూడా ప్రమోషన్లు బాగానే చేస్తోంది. అందులో భాగంగా సినిమా లీక్ అయిందంటూ ప్రచారం మొదలుపెట్టింది. ఎవరో తమ యూట్యూబ్ ఛానల్‌ను హ్యాక్ చేసి, వైల్డ్ డాగ్ ఫుల్ మూవీని అప్లోడ్ చేశారని ట్వీట్ చేసింది. Someone has taken over our Youtube Channel & Uploaded the Full Movie! Please avoid watching & Catch #Wildog in theatres from tomorrow. Book your tickets now - https://t.co/jD6B8c7z2s#WildDogOnApril2nd - https://t.co/g3gGvSNrHn — Matinee Entertainment (@MatineeEnt) April 1, 2021 ఇంకేముందీ.. రిలీజవకముందే సినిమా ఎలా అప్లోడ్ చేస్తారు? అని తల గోక్కుంటూనే అక్కడి యూట్యూబ్ లింకును క్లిక్ చేస్తున్నారు జనాలు. తీరా లింక్ ఓపెన్ అవగానే అలీ రెజా, సయామీ ఖేర్ ప్రత్యక్షమై "పైరసీ ఆపండి. వైల్డ్‌డాగ్ థియేటర్లోనే చూడండి" అని సెలవిచ్చారు. అలా నాగార్జున ఫ్యాన్స్‌ను ఏప్రిల్ ఫూల్ చేశారు. దీంతో దిమ్మతిరిగిన నెటిజన్లు 'ఇది కనీవినీ ఎరగని ఏప్రిల్ ఫూల్', 'దగా మోసం, అరాచకం..' అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం 'అబ్బో ఇంటర్వెల్లో సీన్ ఉంటుంది మాస్టారూ.. మాటల్లేవ్ చెప్పడానికి..', 'సెకండాఫ్‌లో, క్లైమాక్స్‌లో సన్నివేశాలు అదుర్స్ అంతే..' అంటూ ఫన్నీగా కౌంటర్లు వేస్తున్నారు. కాగా ఈ చిత్రం శుక్రవారం (ఏప్రిల్ 2న) రిలీజ్ అవుతోంది. చదవండి: నా సగం కల పూర్తయింది.. ఇంకో సగం మిగిలి ఉంది నాగ్ సార్ బిర్యాని తెస్తే.. ఓ పట్టుపట్టా: హీరోయిన్ -
‘వైల్డ్‌డాగ్’ తెర వెనుక కథ వీడియో వైరల్
అక్కినేని నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్‌డాగ్’. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం(ఏప్రిల్ 2)న విడుదలవుతోంది. వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన ఈ చిత్రంలో కింగ్ నాగ్ ఏసీపీ విజయ్ వర్మగా నటించాడు. ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గరపడుతుండటంతో మూవీ ప్రమోషన్స్ స్పీడ్ పెంచేసింది చిత్రబృందం. గత చిత్రాలకు భిన్నంగా నాగ్ ‘వైల్డ్‌డాగ్’ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ‘వైల్డ్ డాగ్ పుష్ అప్ ఛాలెంజ్’’ పేరుతో సినీ ప్రముఖులకు పుష్ అప్ చాలెంజ్ విసిరాడు. ఇక తాజాగా ‘వైల్డ్ డాగ్’ వెండితెరపై కనిపించేందుకు చిత్రబృందం ఎంత కష్టపడిందో వివరిస్తూ ఓ వీడియోను ప్రేక్షకులతో పంచుకున్నారు. తెర వెనుక కథ అంటూ నాగార్జున, నిరంజన్ రెడ్డి, అహిషోర్, దియా మీర్జా, సయామీ ఖేర్, అలీరెజా, అతుల్ కులకర్ణి వంటి నటులు తమ అనుభవాలను వివరించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. చదవండి: వారి వల్లే స్టార్ అయ్యా: నాగార్జున మహేశ్ బాబు నిర్మాతగా మరో క్రేజీ ప్రాజెక్ట్ -
నాగార్జున 'వైల్డ్‌డాగ్' మూవీ ప్రెస్‌మీట్ ఫోటోలు
-
వారి వల్లే స్టార్ అయ్యా: నాగార్జున
‘‘ఒకే రకమైన జానర్స్‌లో చేసిన పాత్రలే మళ్లీ మళ్లీ చేస్తే బోర్ కొడుతుంది. కొత్త దర్శకులైతే నా పాత్రలు కూడా కొత్తగా ఉంటాయి. నా నటన కూడా రొటీన్‌గా కాకుండా మారుతుందనే నమ్మకం ఉంది. అందుకే కొత్త డైరెక్టర్స్‌తో పని చేయడానికి ఆసక్తి చూపిస్తాను. నేను ఈ రోజు ఇంత పెద్ద స్టార్ అయ్యానంటే కేవలం కొత్త దర్శకులు, కొత్తదనం వల్లే’’ అని హీరో నాగార్జున అన్నారు. అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్‌డాగ్’. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో నాగార్జున చెప్పిన విశేషాలు. ► వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఇలాంటి సినిమాలో కమర్షియల్ యాక్షన్‌కి వీలుండదు.. అందుకే ఒక కొత్త రకమైన యాక్షన్ ఎపిసోడ్స్‌ని ఈ సినిమాలో పెట్టాం. నాకు ఫిట్నెస్ అంటే ఇష్టం కావడంతో ఇందులో యాక్షన్ సీక్వెన్స్‌కి పెద్దగా కష్టపడలేదు. అయితే మనాలీలో యాక్షన్ సీక్వెన్స్ చేయడం కొంచెం కష్టం అనిపించింది. కానీ ఆ సీక్వెన్స్ ఆడియన్స్‌కి ఎగై్జటింగ్‌గా అనిపిస్తాయి. ► ఈ సినిమాలో ఏసీపీ విజయ్ వర్మగా నటించాను. ఒక మంచి భర్త, మంచి తండ్రితో పాటు మంచి ఎన్ఐఎ టీమ్ లీడర్‌గా కనిపిస్తాను. దేశంలో శాంతి భద్రతకు విఘాతం కలిగించే టెర్రరిస్ట్‌ను పట్టుకోవడమే విజయ్ వర్మ లక్ష్యం. ‘వైల్డ్ డాగ్’ కొత్త కమర్షియల్ ఫిల్మ్. ఈ సినిమా, నా పాత్ర అభిమానులందరికీ నచ్చుతుంది.. వారందరూ గర్వపడతారు. ► ట్రైలర్ చూసి సినిమాకి వెళ్లాలా? వద్దా? అని ప్రేక్షకులు ఓ నిర్ణయానికి వచ్చేస్తున్నారు. అందుకే సినిమాకి ఎంత జాగ్రత్తలు తీసుకున్నామో.. ట్రైలర్‌కి కూడా అంతే జాగ్రత్తలు తీసుకున్నాం. ► నా ప్రతి సినిమాని బాగా ప్రమోట్ చేస్తాను. అయితే ‘వైల్డ్ డాగ్’కి మాత్రం ఇంకొంచెం ఎక్కువ చేస్తున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో నేనొక్కడే అందరికీ తెలుసు. దర్శకుడుతో సహా అందరూ కొత్తవాళ్లే.. పైగా ఇదొక న్యూ ఏజ్ ఫిల్మ్. ► నేను ‘శివ’ సినిమా చేస్తున్నప్పుడు వయొలెన్స్ ఎక్కువగా ఉంది.. మహిళలకు నచ్చదేమో అనుకున్నారు. కానీ, ఆ సినిమాను మహిళలు కూడా బాగా ఆదరించారు. ‘వైల్డ్ డాగ్’ సినిమా కూడా కుటుంబ ప్రేక్షకులకూ చేరువవుతుందనే నమ్మకం ఉంది. ► ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో నాది పవర్ఫుల్ పాత్ర. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నేను, నాగచైతన్య కలిసి చేయనున్న ‘బంగార్రాజు’ స్క్రిప్ట్ రెడీగా ఉంది. నేను, అఖిల్ కలసి ఓ యాక్షన్ మూవీ చేయాలనుంది. నేను నిర్మాతగా రాజ్ తరుణ్ హీరోగా కొత్త దర్శకుడితో ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆ తర్వాత వైష్ణవ్ తేజ్‌తో సినిమా ఉంటుంది. -
రష్మిక వీడియోకి నాగ్ ఇంప్రెస్.. బీట్ చేయాలంటూ ఛాలెంజ్
నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వైల్డ్‌డాగ్’. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రచారాన్ని ముమ్మరం చేసింది చిత్ర యూనిట్. ఇందులో భాగంగా ‘వైల్డ్ డాగ్ పుష్ అప్ ఛాలెంజ్’’ పేరుతో సినీ ప్రముఖులకు పుష్ అప్ చాలెంజ్ విసిరారు. ఈ ఛాలెంజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) ఈ క్రమంలో సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే కన్నడ భామ రష్మిక మందన్నాకు ఈ ఛాలెంజ్‌పై కన్ను పడింది. వెంటనే చాలెంజ్‌ని స్వీకరించి కొన్ని సెకన్ల పాటు పుష్అప్ పొజిషన్లో ఉండి దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రష్మిక వీడియోని నాగార్జున చూశాడు. ఆయన కూడా పుష్అప్ పొజిషన్లో చాలా సేపు ఉన్నారు. దాన్ని బీట్ చేయాలంటూ రష్మికకు మరో ఛాలెంజ్ విసిరారు. ‘యూ నీడ్ టు బీట్ దిస్ డియర్’ అంటూ తన పోస్ట్‌కి ఆమె ట్విటర్ అకౌంట్‌ని ట్యాగ్ చేశారు. ఆయన చేసిన పుష్ అప్ వీడియోని కూడా జత చేశారు. ఇప్పటికే వైల్డ్ డాగ్ యాక్టర్ అలీ రెజాతోపాటు పలువురు ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. You need to beat this dear @iamRashmika !!😄❤️ https://t.co/3wLcJJOPFc pic.twitter.com/IMvs9wk68t — Nagarjuna Akkineni (@iamnagarjuna) March 30, 2021