అక్కినేని నాగార్జున హీరోగా నటించిన తాజా చిత్రం ‘వైల్డ్ డాగ్’కు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. తొలి రోజు దాదాపు రూ. 3.5 కోట్ల వరకు వసూళ్లు చేసినట్లు తెలుస్తుంది. ఇక యూఎస్‌ఏలో కూడా వైల్డ్ డాగ్ హవా కొనసాగుతుంది. తొలి రోజే అక్కడ 3,967 డాలర్లను వసూలు చేసింది. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో 7.7 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు సమాచారం. నైజాంలో 2.5 కోట్లు, సీడెడ్‌లో 1.2 కోట్లు, ఆంధ్రాలో 4 కోట్ల బిజినెస్ చేసిందట.
అలాగే కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 70 లక్షలు, ఓవర్సీస్ హక్కులు రూ.50 లక్షలకు అమ్ముడు పోయినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తానికి ఈ సినిమా 9 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బరిలోకి దిగింది. సేఫ్‌లో జోన్‌లోకి వెళ్లాలంటే ఇంకా 5.5 కోట్లు వసూలు చేయాల్సింది. అయితే ఈ లక్ష్యాన్ని నాగార్జున ఛేదిస్తాడా అనేది ఈ వీకెండ్‌లో వెల్లడయ్యే అవకాశం ఉంది.
వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన ఈ చిత్రంలో కింగ్ నాగ్ ఏసీపీ విజయ్ వర్మగా అదరగొట్టాడు. ఉగ్రవాదిని పట్టుకునేందుకు హీరో తన టీమ్‌తో ఏం చేశాడనే ఒకే ఒక పాయింట్ చుట్టూ ఈ కథ తిరుగుంది. ఎటువంటి కమర్షియల్ హంగులు లేకపోయినప్పటికీ, సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రానికి అహిషోర్ సాల్మన్ దర్శకత్వం వహించగా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. దియా మిర్జా, సయామీ ఖేర్, అతుల్ కులకర్ణి, అలీ రెజా తదితరులు కీలక పాత్రలో నటించారు.
చదవండి:
వైల్డ్ డాగ్' మూవీ రివ్యూ
చిరు ఇంటికి నాగార్జున.. వంట చేసిన మెగాస్టార్
Comments
Please login to add a commentAdd a comment