చావు కబురు చల్లగా: అక్కడ డిజాస్టర్‌.. ఇక్కడ బ్లాక్‌బస్టర్‌ | Chaavu Kaburu Challa Ga Movie Garned 100 Million Viewership In OTT | Sakshi
Sakshi News home page

చావు కబురు చల్లగా: అక్కడ డిజాస్టర్‌.. ఇక్కడ బ్లాక్‌బస్టర్‌

Published Wed, Apr 28 2021 2:26 PM | Last Updated on Wed, Apr 28 2021 5:35 PM

Chaavu Kaburu Challa Ga Movie Garned 100 Million Viewership In OTT - Sakshi

కరోనా కారణంగా ప్రస్తుతం డిజిటల్‌ ప్లాట్‌ఫాం హావా నడుస్తోంది. ఇంట్లో కూర్చోనే ఎంచక్కా కొత్త సినిమాలన్ని చూసేయేచ్చు. అయితే బిగ్‌స్రీన్‌పై భారీ విజయం సాధించిన సినిమాలు ఓటీటీలో నిరాశపరుస్తుంటే.. డిజాస్టర్‌గా నిలిచిన సినిమాలు మాత్రం సూపర్‌ హిట్‌గా నిలుస్తున్నాయి. గత నెల మార్చి 2న విడుదలైన కింగ్‌ నాగార్జున వైల్డ్‌ డాగ్‌ మూవీ బిగ్‌స్రీన్‌పై అంతగా ఆకట్టుకోలేనప్పటికి.. నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రం దుమ్మురేపుతోంది.ఓటీటీలో విడుదలైన కొద్ది రోజుల్లోనే మిలియన్ల వ్యూ కౌంట్ అందుకోని దక్షిణ భారత చిత్రాల రికార్డును బద్దలు కొట్టింది. 

తాజాగా హీరో కార్తికేయ, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠిలు హీరోహీరోయిన్‌లు వచ్చిన ‘చావు కబురు చల్లగా’ చిత్రం కూడా వైల్డ్‌ డాగ్‌ తరహాలో ఓటీటీలో దూసుకుపోతోంది. బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం ఇటీవల ఆహా యాప్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీని కాస్తా ఎడిట్‌ చేసి రిలీజ్‌ చేశారు. విడుదలైన 72 గంటల్లోనే అత్యధిక వేగంగా 100 మిలియన్ మినిట్స్ వ్యూయర్ షిప్ అందుకున్నట్లు తాజాగా ఆహా స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. దీంతో బిగ్‌స్రీన్‌పై నిరాశపరిచిన ఈ మూవీ.. స్మాల్‌స్క్రీన్‌పై బాక్సాఫీసు రేంజ్‌ హిట్‌ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. థీయేటర్లో చూసిన వారు సైతం ఆహాలో ఈ మూవీని చూసేందుకు ఆసక్తిని చూపడం విశేషం.

అంతేగాక ఈ మూవీని  అద్భుతంగా రీఎడిట్ చేసి అందించారంటు పాజిటివ్‌ కామెంటు కూడా వస్తున్నాయి. కాగా కౌశిక్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని బన్నీ వాసు నిర్మించారు. ఈ సినిమా విడుదలైన రోజు కొంత పాజిటివ్ టాక్‌ రాగా.. రెండవ రోజు నుంచి నెగిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. అలాగే కోవిడ్ పరిస్థితులు కూడా ఈ సినిమాను దెబ్బ కొట్టాయి. మొత్తానికి ‘చావు కబురు చల్లగా’ బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని ఇచ్చింది. గీత ఆర్ట్స్ సంయుక్త బ్యానర్ జీఏ2(GA2) నుంచి వచ్చిన ఈ సినిమా భారీగా నష్టాలని మిగిల్చింది. 13.5 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్‌తో మార్కెట్లోకి వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా కేవలం 3.32 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. దాదాపు 10 కోట్ల వరకు నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. 

చదవండి: 
ఓటీటీకి మహర్దశ: కొత్తగా రిలీజయ్యే సినిమాలివే!
అక్క‌డ ఓడినా ఇక్క‌డ రికార్డులు తిర‌గ‌రాస్తున్న వైల్డ్ డాగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement