Lavanya Tripati
-
Lavanya Tripathi Konidela Photos: మెగా కోడలి లేటెస్ట్ పిక్స్ చూశారా? (ఫోటోలు)
-
విశాఖకు రానున్న లావణ్య త్రిపాఠి.. అందరికీ ఆహ్వానం అంటూ ప్రకటన
జాతీయ పరిశుభ్రత దినోత్సవ వేడుకలో భాగంగా ఈ నెల 28న విశాఖలో బీచ్ క్లీనింగ్ డ్రైవ్ చేపట్టనున్నారు 'మిస్ పర్ఫెక్ట్' టీమ్. ఈ మెగా క్లీనింగ్ డ్రైవ్‌నకు హీరోయిన్ లావణ్య త్రిపాఠి హాజరుకానున్నారు. వైఎంసీఏ బీచ్ వద్ద స్థానికులతో కలసి పరిశుభ్రం చేయనున్నారు. పరిశుభ్రత పట్ల నిబద్దత కలిగిన మహిళ పాత్రలో లావణ్య త్రిపాఠి 'మిస్ పర్ఫెక్ట్' అనే వెబ్ సిరీస్‌లో నటించారు. డిస్నీ హాట్ స్టార్‌లో ఫిబ్రవరి 2న ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా లావణ్య త్రిపాఠి జనవరి 28న ఉదయం 6గంటలకు విశాఖలోని వైఎంసీఏ బీచ్ వద్దకు రానుంది. ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొనాలని అనుకునే వారందరూ కూడా ఆ సమయంలో అక్కడికి రావచ్చని మేకర్స్ ప్రకటించారు. 'మిస్ పర్ఫెక్ట్' వెబ్ సిరీస్‌లో లావణ్య త్రిపాఠి పోషించిన పాత్ర అందరినీ మెప్పిస్తుంది. ఈ సిరీస్‌లో పరిశుభ్రతకు మారుపేరుగా లావణ్య జీవితం ఉంటుంది. అంతే కాకుండా ఎంతో ఉల్లాసంగా ఉన్న ఆమె జీవితం ఊహించని మలుపు ఎలా తిరుగుతుంది అనేదే ఈ సిరీస్. ఇది ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేసే హాస్యభరితమైన పిల్లి- ఎలుక గేమ్‌లా ఉంటుంది. క్లీన్‌నెస్ డ్రైవ్ ఈవెంట్ జాతీయ పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా లావణ్య విశాఖకు రానుంది. ఈ వెబ్ సిరీస్‌ను ,అందరినీ ఆకట్టుకుంటుందని డిస్నీ+ హాట్‌స్టార్ పేర్కొంది. అన్నపూర్ణ స్టూడియోస్ సహకారంతో, తెరకెక్కిన ఈ 'మిస్ పర్ఫెక్ట్' ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇందులో లవ్ స్టోరీతో పాటు మంచి కామెడీ కూడా ఉంటుంది. నవ్వులతో నిండిన ప్రపంచంలోకి మనోహరమైన ప్రయాణాన్ని అందిస్తుంది. పరిశుభ్రతకు అంబాసిడర్‌గా, లావణ్య త్రిపాఠి కనిపిస్తోంది. పర్యావరణ నిర్వహణ గురించి అందరిలో స్ఫూర్తిని నింపేందుకు ఆమె వైజాక్ రానుంది. దీంతో 28న విశాఖలో జరగనున్న బీచ్ క్లీన్ డ్రైవ్ కార్యక్రమంలో ఆమె పాల్గొననుంది. లావణ్యతో పాటు అభిజిత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాడు. -
అరవింద డిజైన్ స్టూడియోను ప్రారంభించిన లావణ్య త్రిపాఠి (ఫొటోలు)
-
చావు కబురు చల్లగా: అక్కడ డిజాస్టర్.. ఇక్కడ బ్లాక్‌బస్టర్
కరోనా కారణంగా ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫాం హావా నడుస్తోంది. ఇంట్లో కూర్చోనే ఎంచక్కా కొత్త సినిమాలన్ని చూసేయేచ్చు. అయితే బిగ్‌స్రీన్‌పై భారీ విజయం సాధించిన సినిమాలు ఓటీటీలో నిరాశపరుస్తుంటే.. డిజాస్టర్‌గా నిలిచిన సినిమాలు మాత్రం సూపర్ హిట్‌గా నిలుస్తున్నాయి. గత నెల మార్చి 2న విడుదలైన కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ మూవీ బిగ్‌స్రీన్‌పై అంతగా ఆకట్టుకోలేనప్పటికి.. నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రం దుమ్మురేపుతోంది.ఓటీటీలో విడుదలైన కొద్ది రోజుల్లోనే మిలియన్ల వ్యూ కౌంట్ అందుకోని దక్షిణ భారత చిత్రాల రికార్డును బద్దలు కొట్టింది. తాజాగా హీరో కార్తికేయ, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠిలు హీరోహీరోయిన్లు వచ్చిన ‘చావు కబురు చల్లగా’ చిత్రం కూడా వైల్డ్ డాగ్ తరహాలో ఓటీటీలో దూసుకుపోతోంది. బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం ఇటీవల ఆహా యాప్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీని కాస్తా ఎడిట్ చేసి రిలీజ్ చేశారు. విడుదలైన 72 గంటల్లోనే అత్యధిక వేగంగా 100 మిలియన్ మినిట్స్ వ్యూయర్ షిప్ అందుకున్నట్లు తాజాగా ఆహా స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. దీంతో బిగ్‌స్రీన్‌పై నిరాశపరిచిన ఈ మూవీ.. స్మాల్‌స్క్రీన్‌పై బాక్సాఫీసు రేంజ్ హిట్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. థీయేటర్లో చూసిన వారు సైతం ఆహాలో ఈ మూవీని చూసేందుకు ఆసక్తిని చూపడం విశేషం. అంతేగాక ఈ మూవీని అద్భుతంగా రీఎడిట్ చేసి అందించారంటు పాజిటివ్ కామెంటు కూడా వస్తున్నాయి. కాగా కౌశిక్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని బన్నీ వాసు నిర్మించారు. ఈ సినిమా విడుదలైన రోజు కొంత పాజిటివ్ టాక్ రాగా.. రెండవ రోజు నుంచి నెగిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. అలాగే కోవిడ్ పరిస్థితులు కూడా ఈ సినిమాను దెబ్బ కొట్టాయి. మొత్తానికి ‘చావు కబురు చల్లగా’ బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని ఇచ్చింది. గీత ఆర్ట్స్ సంయుక్త బ్యానర్ జీఏ2(GA2) నుంచి వచ్చిన ఈ సినిమా భారీగా నష్టాలని మిగిల్చింది. 13.5 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్‌తో మార్కెట్లోకి వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా కేవలం 3.32 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. దాదాపు 10 కోట్ల వరకు నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. చదవండి: ఓటీటీకి మహర్దశ: కొత్తగా రిలీజయ్యే సినిమాలివే! అక్కడ ఓడినా ఇక్కడ రికార్డులు తిరగరాస్తున్న వైల్డ్ డాగ్ -
ఈ సినిమా చేయడం నా అదృష్టం
సందీప్ కిషన్, లావణ్యా త్రిపాఠీ జంటగా డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద ్, అభిషేక్ అగర్వాల్, సందీప్‌కిషన్ , దయా పన్నెం నిర్మించిన ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ నేడు రిలీజవుతోంది. సందీప్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దేశభక్తితో కూడిన స్పోర్ట్స్ సినిమాలను ఇండియన్స్ అందరూ చూస్తారు. అలాంటి ఓ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం ఇది. వరంగల్‌లో ఉండే రాకేష్ అనే వ్యక్తి కొంతమందికి హాకీ ట్రైనింగ్ ఇస్తున్నాడు. కానీ సరైన సౌకర్యాలు లేవు. వారికి కొంత ఆర్థిక సహాయం అందించడంతో పాటు సినిమా లాభాల్లో కొంత పిల్లల చదువు కోసం వినియోగిస్తాం’’ అన్నారు. ‘‘కథపై నమ్మకంతో మంచి ప్రయత్నం చేశాం’’ అన్నారు వివేక్ కూచిభొట్ల. -
సక్సెస్ అయితేనే మాట్లాడతారు: సందీప్ కిషన్
‘‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ సినిమా తర్వాత హాకీ క్రీడను ఎక్కువమంది ఇష్టపడతారా? అంటే అది నేను చెప్పలేను. ‘చెక్ దే’ సినిమా తర్వాత హాకీ గురించి, ‘ఒక్కడు’ సినిమా తర్వాత కబడ్డీ గురించి, ‘సై’ సినిమా సమయంలో రగ్బీ గురించి చెప్పుకున్నారు. కానీ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ సినిమా ద్వారా కొందరిలోనైనా ఓ ఆలోచన కలుగుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సందీప్ కిషన్ . డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో సందీప్, లావణ్యా త్రిపాఠీ జంటగా రూపొందిన చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. టీవీ విశ్వప్రసాద్, దయా వన్నెం, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదల కానుంది. సందీప్ కిషన్ చెప్పిన విశేషాలు... ► నా కెరీర్లో 25వ చిత్రం ఇది. కొత్త దర్శకులతోనే ఎక్కువ సినిమాలు చేశాను. కొత్త దర్శకుడు జీవన్ తో ఇలాంటి స్పోర్ట్స్ ఫిల్మ్ చేయడం రిస్క్ అనిపించలేదు. సినిమా విజయంపై నమ్మకంగా ఉన్నాం. ► స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ అంటే ఎక్కువ కష్టపడాలి. ఈ సినిమా కోసం ఆరు నెలలు శిక్షణ తీసుకున్నాను. హాకీ ప్లేయర్స్ బాడీ లాంగ్వేజ్, స్టైలిష్ లుక్స్ కోసం మ్యాచ్‌లు చూశాను. ► ఏ రంగంలోనైనా ప్రతిభకు, కష్టానికి ఒక్కోసారి విలువ, గుర్తింపు ఉండవు. సక్సెస్ అయితేనే మాట్లాడతారు. కానీ మన వంతుగా మనం వంద శాతం కష్టపడాలి. ప్రొడక్షన్స్ అనేది క్రియేటివ్ జాబ్. ప్రస్తుతం నా ప్రొడక్షన్ లో ‘వివాహ భోజనంబు’ సినిమా చేస్తున్నాం. ‘రౌడీ బేబీ’, మహేశ్ కోనేరు నిర్మాణంలో ఒక సినిమా, ఏకే ఎంటర్టైన్మెంట్స్లో మరో సినిమాలో పాత్రపోషణ చేస్తున్నాను. -
ఆ పాత్రలు చేసీ చేసీ బోర్ కొట్టింది
‘‘ఈ మధ్య కాలంలో నేనెక్కువ సినిమాలు కమిట్ కాలేదు. దానికి ముఖ్య కారణం ఆ పాత్రలన్నీ నేను గతంలో చేసినట్టుగా అనిపించడమే. రెగ్యులర్ పాత్రలు చేసీ చేసీ బోర్ కొట్టింది. ఏదైనా చాలెంజింగ్‌గా చేయాలనుకుంటున్న సమయంలో ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ నా వద్దకు వచ్చింది’’ అని లావణ్యా త్రిపాఠి అన్నారు. సందీప్ కిషన్, లావణ్యా త్రిపాఠి జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. డెన్నీస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో ఈ సినిమాను టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం నిర్మించారు. ఈ సినిమా మార్చి 5న విడుదల కానున్న సందర్భంగా లావణ్యా త్రిపాఠి చెప్పిన విశేషాలు. – ఈ సినిమా పాయింట్‌ను ఒకసారి సందీప్ కిషన్ నాతో పంచుకున్నారు. చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. ఇందులో నేను, సందీప్ ఇద్దరం హాకీ క్రీడాకారులుగా కనిపిస్తాం. తమిళ సినిమాకు ఇది రీమేక్ అయినా తెలుగు నేటివిటీకు తగ్గట్టు మార్పులు చేశారు. ఈ సినిమాలో నేను చేసిన పాత్ర నా నిజజీవితానికి దగ్గరగా అనిపించింది. పాత్రలోకి సులభంగా ఒదిగిపోయాను. హాకీ క్రీడాకారుల బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో గమనించాను. శిక్షణ తీసుకున్నాను. పాత హకీ మ్యాచ్‌లు చూశాను. ► ఓ డైలాగ్ చెప్పి, ఎక్స్ప్రెషన్ ఇచ్చి వెళ్లిపోయే పాత్రలు బోర్ కొట్టేశాయి. ఓ పాత్ర కోసం మానసికంగా, శారీరకంగా కష్టపడాలి అనిపించింది. అందుకే హాకీ బ్యాట్ తీసుకుని మైదానంలోకి అడుగుపెట్టాను. చెమటలు పట్టేలా శ్రమించా. ఈ పాత్ర నాకు చాలా సంతప్తినిచ్చింది. ∙హాకీ ప్లేయర్ పాత్ర కోసం ప్రత్యేకమైన కసరత్తులు ఏం చేయలేదు. ఫిట్నెస్ మీద ఎప్పుడూ దృష్టిపెడతాను. ఈ పాత్రకు తగ్గట్టు కొన్ని వర్కౌట్స్ చేశా. స్కూల్లో బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్ ఎక్కువగా ఆడేదాన్ని. స్కూల్లో హాకీ ఉండేది కాదు. కానీ ఈ సినిమా చేశాక స్కూల్స్‌లో హాకీని కూడా భాగం చేస్తే బావుంటుందనిపించింది. రాజకీయాల వల్ల ఎంత ప్రతిభ ఉన్న క్రీడాకారులైనా కొన్నిసార్లు నష్టపోతుంటారు అనే పాయింట్‌ని ఈ సినిమాలో చెప్పాం. ► సందీప్‌తో గతంలో ‘మాయవన్ ’ అనే సినిమా చేశా. తను మంచి కోస్టార్. షూటింగ్ చేస్తున్నప్పుడే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం కలిగింది. ► ఇంకొన్నేళ్ల పాటు సినిమాలే చేయాలనుకుంటున్నాను. ఓటీటీలో అప్పుడే చేయాలనుకోవడం లేదు. విలన్ గా యాక్ట్ చేయాలనుంది. అప్పుడే మన సామర్థ్యం తెలుస్తుంది. కొన్ని స్క్రిప్ట్‌లు విన్నాను. వాటి వివరాలు త్వరలోనే ప్రకటిస్తాను. -
కదిలే కాలాన్ని అడిగా...
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ, లావణ్యా త్రిపాఠి జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఈ సినిమాతో కౌశిక్ పెగళ్లపాటి దర్శకునిగా పరిచయమవుతున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌పై ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ‘కదిలే కాలాన్ని అడిగా..’ అంటూ సాగే రెండో పాటని ఈ నెల 23న విడుదల చేస్తున్నట్లు కార్తికేయ, లావణ్య ఉన్న ఓ పోస్టర్‌తో ప్రకటించారు. కౌశిక్ పెగళ్లపాటి మాట్లాడుతూ– ‘‘చావు కబురు చల్లగా’ చిత్రం టైటిల్, కార్తికేయ ‘బస్తి బాలరాజు’ ఫస్ట్ లుక్, క్యారెక్టర్ వీడియో, లావణ్య ఫస్ట్ లుక్, టీజర్ గ్లింప్స్, మైనేమ్ ఈజ్ రాజు.. అనే పాటకు అనూహ్య స్పందన లభించింది. మార్చి 19న ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజాయ్, కెమెరా: కరమ్ చావ్లా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: రాఘవ కరుటూరి, శరత్ చంద్ర నాయుడు. -
ఆకట్టుకుంటున్న ‘చావు కబురు చల్లగా’ టీజర్
‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ, ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠిలు జంటగా దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి రూపొందిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఈ చిత్రంలో కౌశిక్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌లుక్, టైటిల్‌కు ప్రేక్షకుల నుంచి అనుకొని రీతిలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజా టీజర్ విడుదల చేసింది. ‘మీ ఆస్పత్రి సిస్టర్’ అంటగా అని సాగే డైలాగ్‌తో ఈ టీజర్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ లావణ్య త్రిపాఠి వెంట పడుతూ తనని ఏడుపిస్తున్న కొన్ని సీన్లతో ఉన్న ఈ టీజర్‌తో దర్శకుడు యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కాగా అల్లు ఆరవింద్ గీతా ఆర్ట్స్-2 బ్యానర్లో బన్ని వాసు నిర్మిస్తున్న ‘చావు కబురు చల్లగా’ మూవీ వేసవిలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. -
‘అందాల రాక్షసి’ బర్త్‌డే.. చీర కట్టులో..
సాక్షి, హైదరాబాద్: ‘అందాల రాక్షసి’.. బ్యూటీ లావణ్య త్రిపాఠి నేడు 30వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. డిసెంబర్ 15 ఆమె బర్త్‌డే సందర్భంగా హీరో అల్లు శీరిష్‌తో పాటు ప్రముఖ నటీనటులు ఆమెకు బర్త్‌డే విషెష్ తెలుపుతున్నారు. అంతేగాక అభిమానుల నుంచి కూడా లావణ్యకు సోషల్ మీడియాలో బర్త్‌డే విషెస్ వెల్లువెత్తున్నాయి. కాగా అందాల రాక్షసితో టాలీవుడ్ వెండితెరపై మెరిసిన లావణ్య త్రిపాఠి ఆ తర్వాత స్టార్హీరోయిన్గా ఎదిగారు. Happy birthday Lavanya! Keep making faces and dont become normal. Have a great year ahead. All the best for A1 Express & CKC! @Itslavanya pic.twitter.com/YT1cjGsOdq — Allu Sirish (@AlluSirish) December 15, 2020 హీరో నాని, దర్శకుడు మారుతి కాంబినేషన్లో వచ్చిన ‘భలే భలే మాగాడివోయ్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘మన్మధుడు’ నాగార్జున అక్కినేని సరసన ‘సోగ్గాడే చిన్నినాయన’లో నటించి టాలీవుడ్లో అగ్రనటిగా రాణిస్తున్నారు. ఇక ఈ రోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా లావణ్య చీర కట్టులో మెరిసిపోతున్న కొన్ని హాట్ ఫొటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) -
మన యుద్ధం మనమే చేయాలి..
‘‘ఆడవాళ్లందర్లోనూ అన్యాయాన్ని ఎదిరించగల దుర్గాదేవి అవతారముంది. అది తెలుసుకుని, ఆ శక్తిని బయటకు తీస్తేనే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఎదుర్కోగలం’’ అంటున్నారు రాశీ ఖన్నా, లావణ్యా త్రిపాఠి, అదా శర్మా, మెహరీన్, నభా నటేశ్. సమాజంలో స్త్రీ నెగ్గుకురావాలంటే దుర్గాదేవిలా మారాల్సి ఉంటుందా? ఆడవాళ్లకు పలు సమస్యలు ఉంటాయి. అవకాశం వస్తే మీరు పూర్తిగా నిర్మూలించాలనుకునే సమస్య ఏంటి? చెడును ఎదుర్కోవడానికి మీరు దుర్గాదేవిలా మారిన సందర్భాలేమైనా? దసరా పండగ సెలబ్రేషన్ గురించి? వంటి ప్రశ్నలకు రాశీ, అదా, లావణ్య, మెహరీన్, నభా చెప్పిన అభిప్రాయాలు దసరా ప్రత్యేకం. హద్దు దాటితే సహించను – మెహరీన్ ► తన క్యారెక్టర్ని తక్కువ చేసినా, తన ఆత్మస్థైర్యాన్ని తగ్గించేలా ఉన్నా, అనవసరమైన నిందలకు గురైనా తప్పకుండా దుర్గాదేవిలా మారాల్సిందే. ఏం జరిగినా సరే ఒకరి క్యారెక్టర్‌ను తక్కువ చేసి మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదు. ఆడవాళ్లను అగౌరవపర్చకూడదు. ► అసమానతను నిర్మూలించాలనుకుంటున్నాను. ఆడవాళ్లను బలహీనమైనవాళ్లలా చూస్తారెందుకో అర్థం కాదు. శారీరకంగా మగవాళ్ల అంత బలంగా ఆడవాళ్లు ఉండకపోవచ్చు. కానీ మానసికంగా ఆడవాళ్లు ఎంత బలవంతులో అందరికీ తెలుసు. శారీరకంగానూ మాకు వీలైనంతగా చేస్తూనే ఉంటాం. ఎంతో సమర్థవంతంగా ఇంటి పనిని, ప్రొఫెషనల్ పనిని బ్యాలెన్స్ చేయగలం. మల్టీటాస్క్ చేయగలం. స్త్రీ, పురుషులందరూ సమానమే అనే భావన పెంపొందించాలి అందరిలో. ► నేను చాలా సైలెంట్‌గా ఉంటాను. ఓపిక ఎక్కువ. నా పనేదో నేను చూసుకునే మనస్తత్వం. కానీ దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా. ఆ లిమిట్ వరకూ నేను కామ్‌గా ఉంటాను. అన్యాయంగా ప్రవర్తించినా, అగౌరవపరిచినా అస్సలు సహించలేను. ఆ పరిస్థితిని చక్కబెట్టేందుకు నిలబడతాను. ► పండగ వస్తుందంటే నాకు భలే సంతోషమేస్తుంది. స్నేహితులు, బంధువులను కలవచ్చు. ప్రస్తుతం అందరం ఎప్పుడూ చూడని పరిస్థితుల్లో ఉన్నాం. ఎక్కువమందితో కలిసి పండగలు జరుపుకునే పరిస్థితిలో లేము. ఇలాంటి సమయాల్లో ఒకరికోసం ఒకరు నిలబడదాం. మన కళ్లు కూడా ఆయుధమే – అదా శర్మ ► ప్రతీ ఒక్కరిలోనూ దుర్గాదేవి ఉంటుంది. కానీ కొందరు తెలుసుకోగలుగుతారు. కొందరికి తెలియదు.. అంతే. మన లోపల శక్తి దాగి ఉంటుంది. సమయం, సందర్భం వచ్చినప్పుడు అదే బయటకు వస్తుంది. రావాలి కూడా. ► ఆడవాళ్లే ఆడవాళ్లకు శత్రువులు కావడం చూస్తుంటాం. ఒకరిని ఒకరు తక్కువ చేయడం తీసేయాలనుకుంటున్నాను. ఒక స్త్రీ మరో స్త్రీ కోసం నిలబడాలి. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ కలసి పైకి ఎదగాలి. ► చాలాసార్లు మారాను. కర్రను కూడా ఆయుధంగా చేసుకున్న సందర్భాలున్నాయి. కొన్నిసార్లు కళ్లను కూడా ఆయుధాలుగా మార్చుకోవచ్చు. ► దసరా పండగకి ఇంట్లోనే ఉంటున్నాను. ఇంటి ముందు రంగోలీ వేస్తాను. ఇంటిని పూలతో అలంకరిస్తాను. ఇష్టమైన వంటకాలు చేసుకుని తింటాము. అందుకే తొమ్మిది అవతారాలు – నభా నటేశ్ ► ప్రతి ఒక్కరికి తనలో ఉన్న ప్లస్, మైనస్ కచ్చితంగా తెలియాలి. వాళ్ల బలమేంటో తెలుసుకుని బలహీనతలను తొలగించుకోవటం కోసం ఫైట్ చెయ్యాలి. దుర్గాదేవి ప్రపంచంలోని అందరికీ సమానమే, అందరికీ అమ్మే. దుర్గాదేవి అంటే ప్రపంచానికే శక్తి. ఆమె తెచ్చిన విజయంతోనే ప్రపంచానికి వెలుగొచ్చింది. అందుకే ప్రతి ఒక్కరూ.. ముఖ్యంగా ఆడవాళ్లు ఏం చేయాలనుకుంటున్నారో, ఏం సాధించాలనుకుంటున్నారో తెలుసుకుని దానికోసం జీవితంలో కష్టపడాలి. దుర్గాదేవి చేసింది అదే. నాకు కావాల్సిందేంటో నాకు కచ్చితంగా తెలుసు, దానికోసం నేను అమ్మవారిలా ఫైట్ చేస్తాను. అదే నా బలం ఆనుకుంటాను. ► అమ్మవారు ఈ తొమ్మిది రోజుల్లో తొమ్మిది రూపాల్లో తను సాధించాలనుకున్నది సాధించింది. అందుకే ఈ తొమ్మిది రోజులూ అమ్మవారిని తొమ్మిది రకాలుగా తయారుచేసి ఎంతో భక్తి శ్రద్ధలతో, నమ్మకంతో ఉంచి పూజ చేస్తారు. నేను పుట్టి పెరిగింది శృంగేరిలో. దేశంలోని శారదా శక్తి పీఠాల్లో అది కూడా ఒకటి. నవరాత్రి సమయంలో గుళ్లో అమ్మవారిని రోజుకో రూపంలో ప్రత్యేకంగా అలంకరిస్తారు. నేను ప్రతిరోజూ గుడికి వెళ్లి ఆ అలంకారాలను చూసి భక్తితో మొక్కుతాను. ఆ అమ్మవారి అలంకారాలు ఎంత అందంగా ఉంటాయో మాటల్లో చెప్పలేను. చిన్నప్పుడు అలా గుడికి వెళ్లి ఆడుకుంటూ సెలబ్రేషన్స్‌లో పిల్లలందరం పాల్గొనేవాళ్లం. ఇప్పుడు అవన్నీ గుర్తుకు వస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇప్పటికీ పండగలంటే నాకు చాలా శ్రద్ధ. వీలు కుదిరినంతవరకూ పూజలు చేస్తుంటాను. మన యుద్ధం మనమే చేయాలి – రాశీ ఖన్నా ► మనందరిలోనూ దుర్గాదేవి అవతారం ఉంటుంది. ప్రస్తుతం బయట ఉన్న పరిస్థితుల్ని చూస్తుంటే ఒక్కోసారి ఆ అవతారాన్ని బయటకు తీస్తేనే బతకగలం అనిపిస్తుంది. ఎప్పుడూ అమాయకంగా కూర్చోలేం కదా. కలియుగంలో మన యుద్ధం మనమే చేయాలి. ► మానభంగం, లింగ వివక్ష అనేది సమాజంలో లేకుండా చేయాలన్నది నా కోరిక. మన ఇష్టమొచ్చినప్పుడు, ఇష్టమొచ్చిన బట్టలు వేసుకొని బయటకు వెళ్లడానికి ఎందుకు భయపడాలి? అబ్బాయిలకు చిన్నప్పటి నుంచే అమ్మాయిల్ని ఎలా గౌరవించాలో నేర్పుదాం. రేప్ కేసుల్లో దోషుల మీద ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలి. ఇప్పటికీ సమానత్వం కోసం పోరాడుతూనే ఉన్నాం. లింగ బేధాలు లేకుండా సమాన అవకాశాలు ఇవ్వగలగాలి? ► నా కోసం నేను నిలబడాల్సిన పరిస్థితులు కొన్ని వచ్చాయి. నిలబడ్డాను. మా ఇంట్లో నాకు చిన్నప్పటినుంచీ ‘నీకు కావాల్సిన దానికోసం నువ్వు ఫైట్ చేయ్’ అని చెబుతూ వచ్చారు. ఏదైనా ఇష్యూ వస్తే నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడటానికే ఇష్టపడతాను. ముసుగులో మాట్లాడటానికి ఇష్టపడను. నాకోసం నేను నిలబడాల్సి వస్తే కచ్చితంగా ధైర్యంగా నిలబడతాను. ► చిన్నప్పటి నుంచి ఫ్యామిలీతోనే జరుపుకునేదాన్ని. కానీ సినిమాల్లోకి వచ్చాక పండగలకు ఇంట్లో ఉండటం తక్కువైంది. షూటింగ్స్ హడావిడిలో ఉంటాం. చిన్నప్పుడు అమ్మానాన్నలతో కలసి రామ్‌లీలా చూడటానికి మా ఇంటి (ఢిల్లీ) దగ్గర ఉన్న గ్రౌండ్‌కి వెళ్లేదాన్ని. మాది చాలా పెద్ద కుటుంబం. పండగ వస్తే చాలు అందరం కలిసే వాళ్లం. పని వల్ల హైదరబాద్‌లోనే ఉండిపోతే ఇవన్నీ గుర్తొస్తుంటాయి. అదే నా సూపర్ పవర్ – లావణ్యా త్రిపాఠి ► ఈ భూమ్మీద పుట్టిన ప్రతి స్త్రీలో దుర్గా మాత ఉంటుంది. అందుకే ప్రతి స్త్రీలో శక్తి దాగుందని నేను నమ్ముతాను. మగపిల్లలు సూపర్‌హీరోస్ అయినట్లే అమ్మాయిలు అవసరమొచ్చినప్పుడు ధైర్యంగా ఉండగలరు. అలాగే తమ గొంతును ప్రపంచానికి గట్టిగా వినిపించగలరు. తన అనుకున్నవారి కోసం నిలబడి ఫైట్ చేయగలరు. మనం చేయాల్సిందల్లా ఆడపిల్లలపై నమ్మకాన్ని ఉంచటం అంతే. నేను వ్యక్తిగతంగా దుర్గామాతను నమ్ముతాను, నన్ను నేను దుర్గగా అనుకుంటాను. దుర్గ అంటే కోపం, భయం, ప్రేమ మాత్రమే కాదు ఆలోచనాపరమైన శక్తిని ఇస్తుంది. ప్రతి ఒక్కరి గురించి ఆమె ఆలోచిస్తుందని నాకు అనిపిస్తుంది. ► మనకొచ్చే ప్రతి సమస్యకు కోపం పరిష్కారం కాదు. స్త్రీ అనే కాదు ప్రతి ఒక్కరూ యాంగర్ మేనేజ్మెంట్ చేయాలి. నేను చాలా కామ్‌గా, కూల్‌గా ఉంటాను. ఎంత కష్టమైన పరిస్థితులు వచ్చినా కూడా నెమ్మదిగా ఉంటాను. పరిష్కరించుకుంటాను కూడా. అదే నా సూపర్‌పవర్. నా కోపాన్ని ఎప్పుడూ నేను కంట్రోల్లో పెట్టుకుంటాను. ► మా ఇంట్లో చిన్నపిల్లలకు పండగ విశేషాలు చెప్పడం నా అలవాటు. నేను నా మేనకోడలికి కొంచెం క్రియేటివ్‌గా స్కెచ్‌తో బొమ్మలేసి, రాక్షస సంహారం ఎందుకు జరిగింది? దసరా పండగ ఎందుకు చేసుకుంటాం? అనే విషయాలు చెప్పాను. రాక్షసునిపై సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి చేసుకుంటాం అని చెప్పాను. అలా చెప్తేనే కదా మన సంస్కృతి సంప్రదాయాలు వృద్ధి చెందుతాయి. -
బాలరాజు.. ‘మల్లిక’ వచ్చేసింది
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ యువ హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఈ సినిమాలో కార్తికేయ ‘బస్తీ బాలరాజు’ పాత్రలో కనపించనున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శనివారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. హీరోయిన్గా నటిస్తున్న లావణ్య త్రిపాఠి సంబంధించిన పాత్రను పరిచయం చేసింది. లావణ్య ఇందులో ‘ మల్లిక’ పాత్రలో కనిపించనున్నారు. ఫప్ట్ లుక్ పోస్టర్‌ను లావణ్య తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘చావు కబురు చల్లగా’ మూవీలో ఇదే నా ఫస్ట్ లుక్’ అంటూ కాప్షన్ జత చేశారు. నీలం రంగు చుడీదార్ ధరించి ఉన్న ఈ కొత్త లుక్‌లో లావణ్య నెటిజన్లను ఆకట్టుకున్నారు. ఇప్పటికే కార్తికేయ ‘బస్తీ బాలరాజు’ ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు అల్లు అరవింద్ బ్యానర్ గీతా ఆర్ట్స్‌పై బన్నీ వాసు నిర్మాతగా వ్యహరిస్తున్నారు. నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కిస్తున్నారు. This character is ❤️ https://t.co/YMv5bj1PEk — LAVANYA (@Itslavanya) October 24, 2020 -
‘చావు కబురు చల్లగా’ ఫస్ట్ లుక్కు విశేష స్పందన
టాలీవుడ్ యువ నటుడు కార్తికేయ నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ రోజుతో అతడు 29వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. దీంతో అటు సినీ ప్రముఖుల నుంచి, ఇటు అభిమానుల నుంచి కార్తికేయకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వరుణ్ తేజ్, మంచు లక్ష్మీ, అనుప్ రూబెన్స్, ప్రియదర్శి, గీతా అర్ట్స్, బ్రహ్మజీ, లావణ్య త్రిపాఠి వంటి నటులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ రోజు కార్తికేయ తన పుట్టిన రోజుతో పాటు మరో శుభవార్తను అభిమానులకు అందించారు. (ఎన్ఐఏ ఆఫీసర్) కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఈ సినిమా నుంచి నేడు ఫస్ట్ గ్లిమ్స్‌ను విడుదల చేశారు. హీరో కార్తికేయ పోషించిన ‘బస్తీ బాలరాజు’ ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఈ వీడియోలో కార్తికేయ గెటప్, యాస, డైలాగ్ డెలవరి బాగుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. అలాగే దీనిని చూస్తుంటే కార్తికేయ గత చిత్రాలకు ఈ సినిమా పూర్తి భిన్నంగా వుండబోతుందని అర్థమవుతోంది. (మరోసారి ప్లాస్మా దానం చేసిన కీరవాణి) ఈ సినిమాను అల్లు అరవింద్ బ్యానర్ గీతా ఆర్ట్స్‌పై బన్నీ వాసు నిర్మాతగా, లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్నారు. నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ నెల 21న కార్తికేయ బర్త్‌డే సందర్బంగా సోషల్ మీడియా వేదికగా గీతా ఆర్ట్స్ వారు కార్తికేయ ని ఏం వరం కావాలో కోరుకోమని సెప్టెంబర్ 17న అన్నారు. దానికి కార్తికేయ నాకు టీజర్ విడుదల చేయమని అడిగాడు. దీంతో వెంటనే దర్శకుడు సర్ప్రైజ్ అంటూ ఎనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు 11.47 నిమిషాలకి విడుదల చేసిన ఈ విడియో చూసిన నెటిజన్లు నిజంగా సర్ప్రైజ్ అయ్యారు. -
చావు కబురు చల్లగా
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించనున్న చిత్రం ‘చావుకబురు చల్లగా’. కౌశిక్ పెగళ్లపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ సమర్పణలో జిఏ2 పతాకంపై ‘బన్ని’ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా గురువారం ప్రారంభమైంది. మొదటి సన్నివేశానికి హీరో అల్లు అర్జున్ కుమారుడు అల్లు ఆయాన్ కెమెరా స్విచ్చాన్ చేయగా, అల్లు అరవింద్ మనమరాలు బేబి అన్విత క్లాప్ ఇచ్చింది. ఈ సన్నివేశానికి అల్లు అరవింద్ దర్శకత్వం వహించారు. ‘‘ఈ చిత్రంలో కార్తికేయ బస్తి బాలరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ నెల 19న రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఆమని, శ్రీకాంత్ అయ్యంగర్, మహేష్, భద్రం తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: సునీల్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాఘవ కరుటూరి. -
స్ట్రైకింగ్‌కి సిద్ధం
హాకీ స్టిక్ పట్టుకొని గ్రౌండ్లో సిద్ధంగా ఉన్నారు లావణ్యా రావ్. బాల్ రావడం ఆలస్యం నేరుగా గోల్ కొట్టాలని వెయిట్ చేస్తున్నారు. తన గేమ్‌ని చూడటానికి కొంచెం టైమ్ ఉంది. సందీప్ కిషన్, లావణ్యా త్రిపాఠి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం నిర్మిస్తున్నారు. హాకీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సందీప్, లావణ్య హాకీ క్రీడా కారులుగా కనిపిస్తారు. ఆదివారం లావణ్య త్రిపాఠి పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమాలో తన లుక్‌ను రిలీజ్ చేశారు. ‘‘లావణ్య రావ్ అనే హాకీ ప్లేయర్ పాత్ర చేయడం చాలా సంతోషంగా, ఎగ్జయి టింగ్‌గా ఉంది. ఈ పాత్ర నా కెరీర్లో స్పెషల్‌గా ఉండబోతోంది’’ అన్నారు లావణ్య. ఈ చిత్రానికి సంగీతం: హిప్ హాప్ తమిళ, సహ–నిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
ఈ విజయానికి మూడు ప్రధాన కారణాలు
‘‘మా సినిమాకు హెల్ప్ చేయడానికి దేవుడిలా వచ్చిన చిరంజీవిగారు, ప్రేక్షకుల మౌత్ టాక్, మీడియా సపోర్ట్... మా ‘అర్జున్ సురవరం’ చిత్రం విజయం సాధించడానికి ఈ మూడు ప్రధాన కారణాలు’’ అని అన్నారు నిఖిల్. టి. సంతోష్ దర్శకత్వంలో నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా బి.మధు సమర్పణలో రాజ్ కుమార్ ఆకెళ్ల నిర్మించిన చిత్రం ‘అర్జున్ సురవరం’. నవంబరు 29న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో నిఖిల్ మాట్లాడుతూ–‘‘మా సినిమాను నమ్మి, ప్రమోట్ చేసిన నిర్మాతలకు ధన్యవాదాలు. నటనలోనే కాదు.. ప్రమోషన్స్‌లోనూ కోపరేట్ చేసిన లావణ్యాత్రిపాఠికి ధన్యవాదాలు’’ అని అన్నారు. ‘‘ఎంతో కష్టపడ్డాం. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఫైనల్‌గా విజయం సాధించాం. సంతోషంగా ఉంది. ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు సంతోష్. ‘‘మోసం విశ్వవ్యాప్తమైనప్పుడు నిజం చెప్పడం విప్లవాత్మకమైన చర్య అని జార్జ్ ఆర్వెల్ చెప్పిన కొటేషన్ ఈ సినిమాకు స్ఫూర్తి’’ అన్నారు రాజ్‌కుమార్. ఇంతటి ఘనవిజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు లావణ్యా త్రిపాఠి. ‘‘అనుక్షణం సినిమా గురించి ఆలోచించే వ్యక్తి నిఖిల్. తనను చూసి చాలా నేర్చుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద విజయం సాధించడం హ్యాపీ’’ అన్నారు నటుడు రాజ్ తరుణ్. నిర్మాతలు ‘ఠాగూర్’ మధు, సుధాకర్ రెడ్డి, ఏషియన్ సునీల్, అభిషేక్ అగర్వాల్ నటీనటులు సత్య, కేదార్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
మా ప్రేమ పుట్టింది ముంబైలో
‘‘నేను మోడలింగ్ నుంచి వచ్చాను. అందుకే ప్రతి సినిమాలో స్టయిలిష్‌గా కనిపిస్తాను. అది నా నటనలోనూ కనిపించేలా చూసుకోవడం నా బాధ్యత’’ అన్నారు నటుడు తరుణ్ రాజ్ అరోరా. నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా టి.సంతోష్ తెరకెక్కించిన చిత్రం ‘అర్జున్ సురవరం’. ‘ఠాగూర్’ మధు సమర్పణలో రాజ్‌కుమార్ ఆకెళ్ల నిర్మించిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాలో విలన్‌గా నటించిన తరుణ్ రాజ్ అరోరా మాట్లాడుతూ – ‘‘అస్సామ్‌లో పుట్టాను. చెన్నైలో చదువుకున్నాను. బెంగళూర్‌లో మోడలింగ్ చేశా. సౌత్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. హిందీలో ఎక్కువ సినిమాలు చేసినా నన్ను సౌత్ యాక్టర్‌గా గుర్తిస్తున్నారు. ‘అర్జున్ సురవరం’ ఒరిజినల్ చిత్రం ‘కణిదన్’లో నేనే నటించాను. తెలుగు వెర్షన్లో సెంటిమెంట్ యాడ్ చేశారు. చూసినవాళ్లందరూ సినిమా బావుంది అంటున్నారు. భావం, భావోద్వేగాలు ఎక్కడైనా ఒక్కటే. నటనకి భాషతో సంబంధం లేదు. ప్రస్తుతం హిందీలో ‘లక్ష్మీ బాంబ్, మలయాళంలో ‘మామాంగం’, తమిళంలో ‘దగాల్తీ’ సినిమాలు చేస్తున్నాను. నా భార్య అంజలా జవేరి నేను చేసిన సినిమాలను బాగా ఎంజాయ్ చేస్తుంది. మేమిద్దరం ముంబైలో ప్రేమలో పడ్డాం. ముందు నేనే తనకి ప్రపోజ్ చేశాను. కావాలనే పిల్లలు వద్దనుకున్నాం. మేం ఒకరినొకరం పిల్లలుగా చూసుకుంటాం’’ అన్నారు. -
డైరెక్టర్ కాకుంటే రిపోర్టర్ అయ్యేవాణ్ణి
‘‘ఇతర ఇండస్ట్రీ ప్రేక్షకులతో పోల్చినప్పుడు తెలుగు ప్రేక్షకులు భావోద్వేగభరిత అంశాలను ఇష్టపడతారు. మంచి సినిమాలను బాగా ప్రోత్సహిస్తారు. కంటెంట్ ఉన్న సినిమాలకు మంచి కలెక్షన్స్ వస్తాయి. కన్నడ ఇండస్ట్రీలో నాకు అవకాశం వచ్చినప్పటికీ నేను వదలుకున్నాను. తెలుగు ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం’’ అని టి. సంతోష్ అన్నారు. నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా టి. సంతోష్ దర్శకత్వంలో ‘ఠాగూర్’ మధు సమర్పణలో రాజ్‌కుమార్ ఆకెళ్ల నిర్మించిన చిత్రం ‘అర్జున్ సురవరం’. గత శుక్రవారం (నవంబరు 29) విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా టి. సంతోష్ చెప్పిన విశేషాలు... ► ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘సెవెన్త్ సెన్స్, తుపాకీ’ సినిమాలకు దర్శకత్వ శాఖలో పని చేశాను. ఆ తర్వాత ‘కణిదన్’ సినిమాకి దర్శకత్వం వహించాను. ఈ సినిమాను చూసి మురుగదాస్‌గారు మెచ్చుకున్నారు.. తెలుగు రీమేక్ అవకాశం వస్తే వదులుకోవద్దన్నారు. ► ‘కణిదన్’ సినిమా చూసిన నిఖిల్..నిర్మాత థానుగారి ద్వారా నన్ను సంప్రదించారు. ► నిఖిల్ అంకితభావం ఉన్న నటుడు. ఈ పాత్ర కోసం బరువు పెరిగారు. తెలుగు స్క్రిప్ట్‌పై వర్క్ చేశాం కాబట్టే అవుట్‌పుట్ బాగా వచ్చిందనిపిస్తోంది. తమిళ వెర్షన్ కన్నా, తెలుగు వెర్షన్లోనే ఎక్కువ ఎమోషన్స్‌ను జోడిస్తే వర్కౌట్ అయ్యింది.. టీమ్ అందరూ సహకరించారు. ఈ సినిమా విడుదల ఆలస్యం కావడం బాధించింది. ► నేను డైరెక్టర్ని కాకపోయి ఉంటే రిపోర్ట్‌ని అయ్యి ఉండేవాణ్ణి. అందుకే జర్నలిజం నేపథ్యంలో ‘కణిదన్’లాంటి కథ రాసుకున్నాను. భవిష్యత్‌లో సీక్వెల్ గురించి ఆలోచిస్తా. నా తర్వాతి చిత్రం గురించి త్వరలో వెల్లడిస్తా. -
ఇది సినిమా కాదు.. ఒక అనుభవం
‘‘ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల్లో ‘అర్జున్ సురవరం’ హాట్ టాపిక్ అయింది. ఈ సినిమా చేస్తున్నప్పుడు నేను, మా డైరెక్టర్ సంతోష్ వాదించుకునేవాళ్లం. ఈ సక్సెస్ తనదే. ఈ విజయం నా ముఖంలో నవ్వు తెచ్చింది’’ అని నిఖిల్ అన్నారు. టి. సంతోష్ దర్శకత్వంలో నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘అర్జున్ సురవరం’. ‘ఠాగూర్’ మధు సమర్పణలో రాజ్‌కుమార్ ఆకెళ్ల నిర్మించారు. తమిళ చిత్రం ‘కణిదన్’కి తెలుగు రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా సక్సెస్ మీట్‌ను శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా తొలి రోజు 4.1 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ‘అర్జున్ సురవరం’ సినిమా కాదు.. ఒక అనుభవం. మీడియా పవర్ చూపించే సినిమా. ఈ సినిమా వల్ల మా టీమ్ అందరం గౌరవం పొందుతున్నాం. సినిమా కొన్న బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు. అల్లు అరవింద్‌గారు పర్సనల్‌గా అభినందించారు. చిరంజీవిగారికి స్పెషల్ థ్యాంక్స్. రిలీజ్లు వాయిదా పడి హిట్ కొట్టిన సినిమాలు తక్కువ. మేం హిట్ సాధించాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా చేయడానికి మా టీమ్ అందరం చాలా కష్టపడ్డాం. ఇంతమంచి సక్సెస్ అందించిన ఆడియన్స్‌కి థ్యాంక్స్. మా సినిమాను చూసి అభినందించిన చిరంజీవిగారికి ధన్యవాదాలు’’ అన్నారు రాజ్‌కుమార్ ఆకెళ్ల. ‘‘నేను రాసిన ప్రతీ సీన్‌ను తన నటనతో అద్భుతంగా ఎలివేట్ చేశాడు నిఖిల్. ‘ఠాగూర్’ మధు, రాజ్‌కుమార్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు టి. సంతోష్. ‘‘పరీక్షలు రాసి చాలా రోజులు ఎదురు చూశాం. ఫైనల్‌గా ప్రేక్షకులు పాస్ అన్నారు. చాలా సంతోషం’’ అన్నారు నాగినీడు. ‘‘అనుకున్నదానికంటే ప్రేక్షకులు ఎక్కువ రెస్పాన్స్ అందించారు. దర్శకుడు చాలా కష్టపడ్డారు’’ అన్నారు లావణ్యా త్రిపాఠి. -
నిద్ర లేని రాత్రులు గడిపాను
‘‘నేను ఇప్పటివరకూ 17 సినిమాల్లో నటించా. సినిమా విడుదల విషయంలో ఎప్పుడూ ఇబ్బందులు రాలేదు. ‘కార్తికేయ, స్వామిరారా’ సినిమాల విడుదలకు కాస్త ఆలస్యం అయింది.. అంతే. ‘అర్జున్ సురవరం’ సినిమా ఈ ఏడాది మే 1న విడుదల కావాల్సింది. కానీ, కొందరివల్ల విడుదల కాలేదు. అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా? లేదా? అనే భయం వేసింది. ఇంటికెళ్లి ఏడ్చాను.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను’’ అన్నారు నిఖిల్. టి. సంతోష్ దర్శకత్వంలో నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా తెరకెక్కిన చిత్రం ‘అర్జున్ సురవరం’. ‘ఠాగూర్’ మధు సమర్పణలో రాజ్‌కుమార్ ఆకెళ్ల నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిఖిల్ చెప్పిన విశేషాలు. ► మా సినిమా బిజినెస్ బాగా జరిగింది. కానీ, నిర్మాతలకు, థియేటర్స్ ఓనర్స్‌కి మధ్య ఉండేవారు మా సినిమాని వాడేసుకున్నారు. ఈ విషయంలో నేను, నిర్మాతలు ఏమీ చేయలేకపోయాం. సమస్యలన్నీ పరిష్కరించేందుకు సమయం పట్టింది. అందుకే నేను కూడా నా పారితోషికంలో 50 శాతం మాత్రమే తీసుకున్నా. ఈ సినిమాకి లాభాలొస్తే నిర్మాతలే నాకు ఇస్తారు. ► ‘అర్జున్ సురవరం’లో నిజాయతీ కలిగిన అర్జున్ అనే జర్నలిస్ట్ పాత్ర చేశా. నేను, లావణ్య, ‘వెన్నెల’ కిషోర్, సత్య ఓ యంగ్ టీమ్. అనుకోకుండా ఓ సమస్యలో ఇరుక్కునే మేం దాన్ని ఎలా పరిష్కరించామన్నదే ఈ చిత్రకథ. సమాజానికి సందేశంతో పాటు క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉంటుంది. కొందరి చర్యల వల్ల గ్రాడ్యుయేట్స్, వారిపై ఆధారపడ్డ తల్లిదండ్రులు ఎలా ఇబ్బందులు పడుతున్నారనే విషయాలు చెప్పాం. ఈ చిత్రం తమిళ సినిమాకి రీమేక్ అయినా కొన్ని మార్పులు చేశాం. ► ముందు మా చిత్రానికి ‘ముద్ర’ అని టైటిల్ అనుకున్నాం. అదే టైటిల్‌తో వేరే సినిమా విడుదలవుతోందని తెలిసి, మార్చాం. ఈ చిత్రంలో నా పేరు అర్జున్. సురవరం ప్రతాపరెడ్డిగారు ప్రముఖ జర్నలిస్ట్. ఆయన స్ఫూర్తితో సురవరం అనే పేరు తీసుకుని ‘అర్జున్ సురవరం’ అని పెట్టాం. ఈ టైటిల్‌కి జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. దర్శకుడు టి. సంతోష్ ఓ రాక్షసుడు. కొన్ని సీన్స్‌ని 30 నుంచి 40 టేక్‌లు కూడా చేశారు. అందుకే కొంచెం బడ్జెట్ కూడా ఎక్కువ అయింది. వాళ్ల నాన్నగారు జర్నలిస్టు. అందుకే ఆయనకు జర్నలిజంపై మంచి అవగాహన ఉంది. ► నేను నాలుగో తరగతి చదువుతున్నప్పుడు హరిహర కళాభవన్‌లో స్కూల్ చిల్డ్రన్ కల్చరల్ ప్రోగ్రామ్‌కి చిరంజీవిగారు వచ్చారు. అప్పటికే చాలా సమయం కావడంతో నా ప్రదర్శన చూడకుండానే ఆయన వెళ్లిపోయారు. ఆయన నా డ్యాన్సులు చూసి ఉంటే నన్ను సినిమాల్లోకి తీసుకెళతారేమో అనుకునేవాణ్ణి (నవ్వుతూ). ► రోజుకు పది నుంచి పదిహేను కథలు వింటున్నాను. అలాగని ప్రతి సినిమా చేసుకుంటూ వెళ్లలేను కదా? ‘హ్యాపీడేస్’ సినిమా చేసే ముందే మా అమ్మగారు ‘కుటుంబమంతా కలిసి చూసేలా నీ సినిమాలు ఉండాలి.. లేదంటే ఇంటి నుంచి బయటికి వెళ్లిపో’ అన్నారు. అందుకే అలాంటి మంచి కథలు ఎంచుకుంటున్నాను. ► ‘కార్తికేయ 2’ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెం బరులో ప్రారంభమవుతుంది. వీఐ ఆనంద్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఓ సినిమా చేయబోతున్నా. ‘శ్వాస’ సినిమా ఆగిపోవడానికి కారణం డైరెక్షన్ టీమే. నాకు చెప్పిన కథ ఒకటి.. తీస్తోంది మరొకటి. అందుకే చేయకూడదనుకున్నా. అయితే ఆ సినిమాకి ఇచ్చిన అడ్వాన్స్‌ని నిర్మాతలు వెనక్కి తీసుకోకపోవడంతో వారితో ‘హనుమాన్’ అనే సినిమా చేసేందుకు ఒప్పుకున్నా. -
‘అర్జున్ సురవరం’గా రాబోతోన్న నిఖిల్!
టైటిల్‌పై జరిగిన పోరులో హీరో నిఖిల్ కాస్త వెనక్కితగ్గి.. తన తదుపరి చిత్రం పేరును మార్చేశాడు. నిర్మాత నట్టికుమార్.. హీరో నిఖిల్‌పై అసహనం వ్యక్తం చేయడం.. ఇద్దరి మధ్య ఈ గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో.. ‘ముద్ర’ టైటిల్‌ను వదులుకొన్నాడు. తాజాగా తన చిత్రానికి సంబంధించిన కొత్త టైటిల్‌ను, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ మూవీలో జర్నలిస్ట్‌గా నటిస్తున్న నిఖిల్ పాత్ర పేరు అర్జున్ సురవరం కావడంతో.. దీన్నే టైటిల్‌గా ఫిక్స్ చేశారు. సోషల్ మీడియాలో టైటిల్‌ను సూచించమని తన అభిమానులను కోరగా.. కొంతమంది ఈ టైటిల్‌ను కూడా సూచించారు. మొత్తానికి ముద్ర నుంచి తప్పించుకున్న నిఖిల్ ‘అర్జున్ సురవరం’ గా రాబోతున్నాడు. టీఎన్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్నారు. తమిళ హిట్ మూవీ కణితన్‌కు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. మార్చిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. #ArjunSuravaram#FreshPoster is here Coming to Theatres this March 29th. Plz Do spread the Word 😀🙏 pic.twitter.com/hsUwx5QvJx — Nikhil Siddhartha (@actor_Nikhil) February 4, 2019 -
నిఖిల్ మూవీ టైటిల్ మారనుందా?
నిఖిల్ తాజాగా నటిస్తున్న సినిమా టైటిల్‌పై వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నిర్మాత నట్టి కుమార్, హీరో నిఖిల్ మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో.. ఈ సినిమా టైటిల్ మారనుందని తెలుస్తోంది. జగపతి బాబు హీరోగా ముద్ర అనే సినిమా కూడా రిలీజ్ కావడం.. ఈ సినిమాపై సోషల్ మీడియాలో నిఖిల్‌ను తన అభిమానులు ప్రశ్నించడం.. ఆ సమయంలో నిఖిల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ వ్యాఖ్యలపై నిర్మాత నట్టికుమార్ సీరియస్ అవ్వడంతో తీవ్ర చర్చకు దారి తీసింది. దీంతో వెనక్కి తగ్గిన చిత్రబృందం నిఖిల్ నటిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ను మార్చబోతున్నట్లు సమాచారం. కొత్త టైటిల్, ఫస్ట్‌లుక్‌ను రేపు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. తమిళంలో హిట్ అయిన కణితన్‌కు రీమేకే ఈ చిత్రం. ఈ మూవీలో లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తుంది. మార్చిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్రయత్నిస్తోంది. -
ఆ అదృష్టం కలిసివస్తుందని ఆశిస్తున్న హీరో!
స్వామిరారా.. కార్తీకేయ.. ఎక్కడికి పోతావు చిన్నవాడ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో సినిమాలు చేస్తూ.. సక్సెస్ సాధించాడు యంగ్ హీరో నిఖిల్. రీసెంట్గా కన్నడ రీమేక్ కిరాక్ పార్టీతో వచ్చి ప్రేక్షకులను నిరాశపరిచాడు. అయితే తాజాగా ‘ముద్ర’ తమిళ రీమేక్ (కనితన్)తో మరోసారి ప్రేక్షకులను పలకరించేందకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం షూటింగ్, డబ్బింగ్ పనులతో బిజీగా ఉన్న నిఖిల్.. ఈ చిత్రం గురించి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో నిఖిల్‌కు జోడిగా లావణ్య త్రిపాఠి నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలో వెన్నెల కిషోర్ కూడా ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ‘వీరిద్దరు కలిసి చేసిన భలేభలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా బ్లాక్ బస్టర్హిట్స్ అయ్యాయి. మళ్లీ ‘ముద్ర’లో కూడా వీరిద్దరు నటిస్తున్నారు. అదే అదృష్టం మళ్లీ కలిసివస్తుందని ఆశిస్తున్నా’ అంటూ నిఖిల్ ట్వీట్ చేశాడు. Todays shoot #Mudra with these two... their last two combos Bhale Bhale nd Soggade Rocked, hope the luck repeats for #Mudra... Note-9 S pen Remote snap 🤗😝😃 @Itslavanya @vennelakishore pic.twitter.com/CYTSzskWyQ — Nikhil Siddhartha (@actor_Nikhil) November 29, 2018 -
డబ్బింగ్ షురూ
జనరల్‌గా ఆస్ట్రోనాట్ అంటే రాకెట్ లాంచింగ్ స్టేషన్లో బిజీ బిజీగా ఉంటారు. కానీ టాలీవుడ్ ఆస్ట్రోనాట్ వరుణ్ తేజ్ చెన్నై, హైదరాబాద్‌లోని స్కూల్స్‌కి వెళ్లొచ్చారు మరి.. స్టూడెంట్స్‌కు రాకెట్ గురించి ఏమైనా పాఠాలు చెప్పారా? లేక చిన్ననాటి జ్ఞాపకాలను వెతుక్కుంటూ వెళ్లారా? అనే విషయాలు ప్రస్తుతానికి సస్పెన్స్. ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎమ్‌పిహెచ్’. లావాణ్యా త్రిపాఠి, అదితీరావ్ హైదరీ కథానాయికలుగా నటించారు. ప్రస్తుతం ఈ సినిమాకు డబ్బింగ్ చెబుతున్నారు వరుణ్ తేజ్. ‘‘ఫస్ట్ లుక్కు మంచి స్పందన లభించింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. సత్యదేవ్, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు చేసిన ఈ సినిమాకు ప్రశాంత్ విహారి స్వరకర్త. క్రిష్ సమర్పణలో సాయిబాబు, రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 21న రిలీజ్ కానుంది. -
రిపోర్ట్‌లో ఏముంది?
జర్నలిస్ట్ అర్జున్ ఇన్వెస్టిగేషన్ క్లైమాక్స్‌కు చేరుకుంది. ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్‌లోని విషయాలను వెండితెరపై తెలుసుకోవచ్చు. నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా టి.ఎన్. సంతోష్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ముద్ర’. బి. మధు సమర్పణలో కావ్య వేణుగోపాల్, రాజ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 28న విడుదల కానుంది. జర్నలిస్ట్ సురవరం అర్జున్ పాత్రలో నిఖిల్ నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ‘‘మా సినిమా ఫస్ట్ లుక్కు మంచి స్పందన లభిస్తోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా జర్నలిజం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. సమాజంలో మీడియా పాత్రను గుర్తు చేసే సన్నివేశాలు ఉన్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘వెన్నెల’ కిశోర్, పోసాని కృష్ణమురళి, నాగినీడు, ప్రగతి, సత్య, తరుణ్ అరోరా, రాజా రవీంద్ర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు.