మాయవన్గా సందీప్ | Sundeep Kishans Maayavan First Look | Sakshi
Sakshi News home page

మాయవన్గా సందీప్

Published Sat, Jul 30 2016 8:44 AM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

మాయవన్గా సందీప్ - Sakshi

మాయవన్గా సందీప్

రన్, ఒక్క అమ్మాయి తప్ప సినిమాలతో నిరాశపరిచిన సందీప్ కిషన్, మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తెలుగుతో పాటు పలు తమిళ చిత్రాల్లోనూ నటించిన ఈ యంగ్ హీరో మరోసారి తమిళ సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న డిఫరెంట్ మూవీ మాయవన్లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తున్నాడు.

లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జాకీ ష్రాఫ్, డానియల్ బాలాజీలు ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్లుక్ పోస్టర్ సినిమా మీద ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తుండగా.. ఆగస్టు 2న ఫస్ట్ టీజర్ను రిలీజ్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత సివి కుమార్ తొలిసారిగా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను స్టూడియో గ్రీస్ సంస్థతో కలిసి ఆయనే స్వయంగా నిర్మిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement