బిజీ బిజీగా అందాల రాక్షసి | Lavanya tripati busy with four films | Sakshi
Sakshi News home page

బిజీ బిజీగా అందాల రాక్షసి

Published Sun, May 8 2016 12:01 PM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

బిజీ బిజీగా అందాల రాక్షసి - Sakshi

బిజీ బిజీగా అందాల రాక్షసి

కెరీర్ స్టార్టింగ్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ఇప్పుడు వరుస ఆఫర్లతో బిజీ అవుతున్న హీరోయిన్ లావణ్య త్రిపాఠి. అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటి, తొలి సినిమాతో కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయినా, తన క్యూట్ లుక్స్తో ఆకట్టుకుంది. ఈ సినిమాలో లావణ్య నటనకు మంచి రెస్పాన్స్ వచ్చినా, తరువాత అవకాశాలు మాత్రం రాలేదు. కానీ సీనియర్ హీరో నాగార్జున సరసన నటించిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమా లావణ్య ఫేట్ మార్చేసింది.

సోగ్గాడే చిన్ని నాయనా ఘన విజయం సాదించటంతో లావణ్య త్రిపాఠికి వరుస అవకావాలు క్యూ కట్టాయి. యంగ్ హీరోలందరూ ఈ అమ్మడితో కలిసి నటించడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన శ్రీరస్తూ శుభమస్తూ సినిమా షూటింగ్ పూర్తి చేసిన లావణ్య, మరో మూడు సినిమాలకు ఓకె చెప్పేసింది.

శ్రీనువైట్ల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు లావణ్య త్రిపాఠిని హీరోయిన్గా కన్ఫామ్ చేశారు. ఈ ఈ సినిమాతో పాటు సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న తమిళ సినిమా, శర్వానంద్ హీరోగా బివియస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న కొత్త సినిమాల్లో కూడా లావణ్యనే హీరోయిన్గా నటిస్తోంది. ఇలా వరస సినిమాలతో బిజీ అవుతున్న లావణ్య త్వరలోనే టాప్ చైర్కు పోటి ఇవ్వడం కాయం అన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement