ఓటీటీలోకి ఆరేళ్ల తర్వాత తెలుగు థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ | Project Z Movie OTT Release Date Details | Sakshi
Sakshi News home page

Project Z OTT: సందీప్ కిషన్ హిట్ సినిమా.. ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

Published Mon, May 27 2024 1:02 PM | Last Updated on Mon, May 27 2024 1:12 PM

Project Z Movie OTT Release Date Details

తెలుగు హీరో సందీప్ కిషన్ అప్పుడెప్పుడో చేసిన ఓ హిట్ సినిమా.. దాదాపు ఆరేళ్ల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది. దీంతో మూవీ లవర్స్ ఎగ్జైట్ అవుతున్నారు. కొన్నాళ్ల ముందు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఫిక్స్ చేయగా, తాజాగా స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఆ మూవీ ఏంటి? ఏ ఓటీటీలో రాబోతుంది?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ రెండు మాత్రం స్పెషల్)

సందీప్ కిషన్ హీరోగా చేసిన 'మాయావన్' అనే తమిళ థ్రిల్లర్ సినిమా.. 2017లో రిలీజై హిట్ అయింది. దీన్ని 'ప్రాజెక్ట్ Z' పేరుతో తెలుగులో డబ్ చేశారు. కానీ పెద్దగా రీచ్ కాలేకపోయింది. ఆ తర్వాత మాత్రం ఓటీటీలో బాగా రీచ్ వచ్చింది. ప్రస్తుతం హిందీ వెర్షన్ అమెజాన్ ప్రైమ్, తమిళ వెర్షన్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో మాత్రం ఇప్పుడు ఆహా ఓటీటీలోకి రాబోతుంది.

ఈ వీకెండ్ అంటే మే 31 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంటే దాదాపు ఆరేళ్ల తర్వాత తెలుగు వెర్షన్ ఓటీటీలోకి వస్తుందనమాట. ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ ఇప్పటికే షూటింగ్ జరుపుకొంటోంది. 'మాయా-వన్' టైటిల్‌తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఇది థియేటర్లలోకి రావొచ్చు.

(ఇదీ చదవండి: ఓటీటీలో రవితేజ సినిమా అరుదైన ఘనత.. తొలిసారి దివ్యాంగుల కోసం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement