Project Z
-
ఓటీటీలోకి ఆరేళ్ల తర్వాత తెలుగు థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
తెలుగు హీరో సందీప్ కిషన్ అప్పుడెప్పుడో చేసిన ఓ హిట్ సినిమా.. దాదాపు ఆరేళ్ల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది. దీంతో మూవీ లవర్స్ ఎగ్జైట్ అవుతున్నారు. కొన్నాళ్ల ముందు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఫిక్స్ చేయగా, తాజాగా స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఆ మూవీ ఏంటి? ఏ ఓటీటీలో రాబోతుంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ రెండు మాత్రం స్పెషల్)సందీప్ కిషన్ హీరోగా చేసిన 'మాయావన్' అనే తమిళ థ్రిల్లర్ సినిమా.. 2017లో రిలీజై హిట్ అయింది. దీన్ని 'ప్రాజెక్ట్ Z' పేరుతో తెలుగులో డబ్ చేశారు. కానీ పెద్దగా రీచ్ కాలేకపోయింది. ఆ తర్వాత మాత్రం ఓటీటీలో బాగా రీచ్ వచ్చింది. ప్రస్తుతం హిందీ వెర్షన్ అమెజాన్ ప్రైమ్, తమిళ వెర్షన్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో మాత్రం ఇప్పుడు ఆహా ఓటీటీలోకి రాబోతుంది.ఈ వీకెండ్ అంటే మే 31 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంటే దాదాపు ఆరేళ్ల తర్వాత తెలుగు వెర్షన్ ఓటీటీలోకి వస్తుందనమాట. ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ ఇప్పటికే షూటింగ్ జరుపుకొంటోంది. 'మాయా-వన్' టైటిల్‌తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఇది థియేటర్లలోకి రావొచ్చు.(ఇదీ చదవండి: ఓటీటీలో రవితేజ సినిమా అరుదైన ఘనత.. తొలిసారి దివ్యాంగుల కోసం)Mystery, suspense, and a gripping thriller! "Project Z" premieres May 31st on @ahavideoIN @sundeepkishan @Itslavanya @bindasbhidu @DanielBalaje @icvkumar @ThirukumaranEnt @GhibranVaibodha @BhavaniHDMovies @bhavanidvd pic.twitter.com/G3s8w9yW2y— ahavideoin (@ahavideoIN) May 27, 2024 -
సందీప్, లావణ్య త్రిపాఠి హిట్ సినిమా.. ఏడేళ్ల తర్వాత తెలుగులో విడుదల
సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, జాకీష్రాఫ్ ప్రధాన పాత్రల్లో సి.వి. కుమార్ దర్శకత్వంలో తమిళ్లో తెరకెక్కిన 'మాయావన్' చిత్రం 'ప్రాజెక్ట్ z' గా ఏప్రిల్ 6న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. సుమారు ఏడేళ్ల తర్వాత తెలుగులో డబ్ అయి విడుదలైంది. ఎప్పుడో 2017లో తమిళంలో విడుదలైన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేయడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయం. తమిళంలో విడుదలైన ఏడేళ్ల తర్వాత ఇప్పుడు తెలుగులో విడుదల చేయడం ఏంటి అని సినీ ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. 2017లో తమిళ్లో విడుదలైన 'మాయావన్' సినిమా ప్రేక్షకులను బాగానే మెప్పించింది. ఆ ఏడాదిలో బెస్ట్ థ్రిల్లర్ మూవీస్‌లో ఒకటిగా గుర్తింపు కూడా పొందింది. నిర్మాతగా పిజ్జా సినిమాను నిర్మించి హిట్ కొట్టిన సీవీ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అప్పుడు ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు కోలీవుడ్‌లో ‘మాయవన్’కు సీక్వెల్ తెరకెక్కుతోంది. ఇందులో సందీప్ కిషనే హీరోగా నటిస్తుండగా.. సీవీ కుమారే దర్శత్వం వహిస్తున్నారు. ఈ సీక్వెల్ పార్ట్‌ను తెలుగులో కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.. కథ అర్థం కావాలంటే మొదటి భాగం చూడాలి. అందుకే ఏడేళ్ల తర్వాత ఈ సినిమా పార్ట్-1ను 'ప్రాజెక్ట్ z' గా రేపు విడుదల చేస్తున్నారు. వాస్తవంగా 'మాయవన్' తమిళంలో రిలీజ్ అయిన సమయంలోనే తెలుగులో 'ప్రాజెక్ట్-జడ్' పేరుతో అనువాదం చేశారు. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. కానీ పలు కారణాలతో అప్పుడు విడుదల కాలేదు. థ్రిల్లర్ సినిమాలను ఇష్ట పడే వారికి 'ప్రాజెక్ట్ z' తప్పక నచ్చుతుందని చెప్పవచ్చు. మాయవన్ పేరుతో తమిళ్ వర్షన్ యూట్యూబ్‌లో కూడా రన్ అవుతుంది. -
సెన్సార్ పూర్తి చేసుకున్న 'ప్రాజెక్ట్ z'
సందీప్ కిషన్, లావణ్య త్రిపాటి, జాకీష్రాఫ్ ప్రధాన పాత్రల్లో సి.వి. కుమార్ దర్శకత్వంలో తమిళ్లో తెరకెక్కిన మాయావన్ చిత్రాన్ని ప్రాజెక్ట్ z గా ఎస్‌బికె ఫిలింస్ కార్పోరేషన్లో ఎస్.కె. బషీద్ సమర్పణలో నిర్మాత ఎస్.కె. కరీమున్నీసా తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెప్టెంబర్ ప్రథమార్ధం లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కమర్షియల్ ఫార్మాట్ కు భిన్నంగా కొత్త తరహా కథలతో ఆకట్టుకుంటున్న సందీప్, తాజాగా నక్షత్రం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను నిరాశపరిచాడు. ప్రస్తుతం ప్రాజెక్ట్ zతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందీప్ కిషన్ ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని భావిస్తున్నాడు.