ఆ అదృష్టం కలిసివస్తుందని ఆశిస్తున్న హీరో! | Nikhil Tweet About Mudra On Lavanya Tripati And vennela Kishore | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 30 2018 12:42 PM | Last Updated on Fri, Nov 30 2018 1:10 PM

Nikhil Tweet About Mudra On Lavanya Tripati And vennela Kishore - Sakshi

స్వామిరారా.. కార్తీకేయ.. ఎక్కడికి పోతావు చిన్నవాడ లాంటి డిఫరెంట్‌ కాన్సెప్ట్స్‌తో సినిమాలు చేస్తూ.. సక్సెస్‌ సాధించాడు యంగ్‌ హీరో నిఖిల్‌. రీసెంట్‌గా కన్నడ రీమేక్‌ కిరాక్‌ పార్టీతో వచ్చి ప్రేక్షకులను నిరాశపరిచాడు. అయితే తాజాగా ‘ముద్ర’ తమిళ రీమేక్‌ (కనితన్‌‌)తో మరోసారి ప్రేక్షకులను పలకరించేందకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం షూటింగ్‌, డబ్బింగ్‌ పనులతో బిజీగా ఉన్న నిఖిల్‌.. ఈ చిత్రం గురించి చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. 

ఈ చిత్రంలో నిఖిల్‌కు జోడిగా లావణ్య త్రిపాఠి నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలో వెన్నెల కిషోర్‌ కూడా ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ‘వీరిద్దరు కలిసి చేసిన భలేభలే మగాడివోయ్‌, సోగ్గాడే చిన్నినాయనా బ్లాక్‌ బస్టర్‌హిట్స్‌ అయ్యాయి. మళ్లీ ‘ముద్ర’లో కూడా వీరిద్దరు నటిస్తున్నారు. అదే అదృష్టం మళ్లీ కలిసివస్తుందని ఆశిస్తున్నా’ అంటూ నిఖిల్‌ ట్వీట్‌ చేశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement