mudhra
-
ఆ అదృష్టం కలిసివస్తుందని ఆశిస్తున్న హీరో!
స్వామిరారా.. కార్తీకేయ.. ఎక్కడికి పోతావు చిన్నవాడ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో సినిమాలు చేస్తూ.. సక్సెస్ సాధించాడు యంగ్ హీరో నిఖిల్. రీసెంట్గా కన్నడ రీమేక్ కిరాక్ పార్టీతో వచ్చి ప్రేక్షకులను నిరాశపరిచాడు. అయితే తాజాగా ‘ముద్ర’ తమిళ రీమేక్ (కనితన్)తో మరోసారి ప్రేక్షకులను పలకరించేందకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం షూటింగ్, డబ్బింగ్ పనులతో బిజీగా ఉన్న నిఖిల్.. ఈ చిత్రం గురించి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో నిఖిల్‌కు జోడిగా లావణ్య త్రిపాఠి నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలో వెన్నెల కిషోర్ కూడా ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ‘వీరిద్దరు కలిసి చేసిన భలేభలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా బ్లాక్ బస్టర్హిట్స్ అయ్యాయి. మళ్లీ ‘ముద్ర’లో కూడా వీరిద్దరు నటిస్తున్నారు. అదే అదృష్టం మళ్లీ కలిసివస్తుందని ఆశిస్తున్నా’ అంటూ నిఖిల్ ట్వీట్ చేశాడు. Todays shoot #Mudra with these two... their last two combos Bhale Bhale nd Soggade Rocked, hope the luck repeats for #Mudra... Note-9 S pen Remote snap 🤗😝😃 @Itslavanya @vennelakishore pic.twitter.com/CYTSzskWyQ — Nikhil Siddhartha (@actor_Nikhil) November 29, 2018 -
నల్ల ధనంపై పోరాటం
జగపతిబాబు హీరోగా ఎన్.కె. దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ముద్ర’. నట్టి కుమార్ సమర్పణలో క్యూటీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నట్టి క్రాంతి సారధ్యంలో నట్టి కరుణ నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణానంతర పనులు తుది దశలో ఉన్నాయి. నట్టి కుమార్ మాట్లాడుతూ– ‘‘బ్లాక్ మనీ వల్ల సమాజాభివృద్ధి కుంటుపడుతోంది. ఎన్నికల్లో నెగ్గడం కోసం రాజకీయ నాయకులు నల్ల ధనాన్ని విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు. ఇది సమాజంపైన, దేశ ఆర్థిక వ్యవస్థపైన విపరీతమైన ప్రభావం చూపుతోంది. రాజకీయ నాయకులు బ్లాక్ మనీని ఎలా సంపాదిస్తున్నారు? దాన్ని ఎన్నికల్లో ఎలా ఖర్చుపెడుతున్నారన్న అంశాన్ని మా చిత్రంలో చూపించాం. నల్ల ధనంపై పోరాటం చేసే వ్యక్తిగా జగపతిబాబు కనిపిస్తారు. ఇందులో మూడు పాటలు, ఐదు ఫైట్లు ఉన్నాయి. దీపావళికి ‘ముద్ర’ సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ బాబు, సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ. -
పరిశోధన పూర్తవుతోంది!
జర్నలిస్ట్‌గా నిఖిల్ చేస్తోన్న పరిశోధన చివరి దశకు వచ్చేసిందట. ఇంకొన్ని రోజుల్లో జర్నలిస్ట్ అర్జున్‌గా తనకు అప్పగించిన పనిని పూర్తి చేయనున్నారట. నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా టిఎన్ సంతోష్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ముద్ర’. బి.మధు సమర్పణలో కావ్యా వేణుగోపాల్, రాజ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ గురించి చిత్రబృందం మాట్లాడుతూ – ‘‘మా సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో క్లైమాక్స్ షూటింగ్ జరుపుతున్నాం. డబ్బింగ్ పనులు కూడా మొదలుపెట్టాం. వాస్తవిక సంఘటనల ఆధారంగా ‘ముద్ర’ చిత్రం తెరకెక్కిస్తున్నాం. ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన లభించింది. నవంబర్‌లో మా చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సామ్సీయస్, కెమెరా: సూర్య. -
స్టింగ్ ఆపరేషన్
చేతిలో కెమెరా పట్టుకుని అక్కడే వెయిట్ చేస్తున్నారు హీరో నిఖిల్. క్లాక్ తిరుగుతూనే ఉంది. టైమ్ గడిచిపోతోంది. అతను మాత్రం అక్కడి నుంచి కదలడం లేదు. కావాల్సిన సమాచారం సేకరించే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని పట్టుదలగా ఉన్నాడు. ఈ పట్టుదల ఎందుకంటే అతను చేస్తున్న స్టింగ్ ఆపరేషన్ సక్సెస్ కావడానికి. మరి... స్టింగ్ ఆపరేషన్ ఏ క్రిమినల్ బెండు తీసింది అనేది వెండితెరపై తెలుస్తుంది. నిఖిల్ హీరోగా టీ.ఎన్. సంతోష్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ముద్ర’. తమిళ సినిమా ‘కణిదన్’కి ఇది రీమేక్. ఇందులో లావణ్యా త్రిపాఠి కథానాయిక. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అర్జున్ పాత్రలో నిఖిల్ కనిపిస్తారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుందని సమాచారం. నైట్ షూట్ చేస్తున్నారట చిత్రబృందం. -
జర్నలిస్ట్ ముద్ర
నిఖిల్ సిద్ధార్థ్, లావణ్యా త్రిపాఠి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘ముద్ర’. టి.ఎన్.సంతోష్ దర్శకత్వంలో కావ్య వేణుగోపాల్, రాజ్ కుమార్ నిర్మిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రమిది. జర్నలిజం నేపథ్యంలో ఉంటుంది. కరెంట్ ఇష్యూస్ సాల్వ్ చేయడంలో మీడియా ఎటువంటి కీలకపాత్ర పోషిస్తుంది? అనే విషయాన్ని మా చిత్రంలో చూపించనున్నాం. నిఖిల్ తొలిసారి జర్నలిస్ట్‌గా నటిస్తున్నారు. నిఖిల్ ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. ఆఖరి షెడ్యూల్ ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది. సెప్టెంబర్ కల్లా షూటింగ్ పూర్తి చేసి, నవంబర్ 8న సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: బి.మధు, కెమెరా: సూర్య, సంగీతం: సామ్ సి.ఎస్. -
రిపోర్టర్ యాక్షన్
నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా టి.ఎన్. సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ముద్ర’. అవురా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, మూవీ డైనమిక్స్ ఎల్.ఎల్.పి బ్యానర్స్‌పై కావ్య వేణుగోపాల్, రాజ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యాక్షన్ ఎంటరై్టనర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. ఇప్పటికే 50శాతం షూటింగ్ పూర్తయింది. తాజా షెడ్యూల్లో నిఖిల్, లావణ్యా త్రిపాఠిలపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. సినిమాలో కొన్ని సీన్స్ వాస్తవానికి దగ్గరగా ఉండటంతో ఒరిజినల్ లొకేషన్స్‌లో షూటింగ్ జరుపుతున్నాం. ఇందులో నిఖిల్ రిపోర్టర్‌గా కనిపించనున్నారు. ప్రస్తుతం ఓ టీవీ స్టూడియోలో షూటింగ్ జరుగుతోంది. నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘ముద్ర’ ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. ‘వెన్నెల’ కిశోర్, పోసాని కృష్ణమురళి, నాగినీడు, ప్రగతి, సత్య, తరుణ్ అరోరా, రాజా రవీంద్ర ముఖ్య పాత్రలు చేస్తున్న ఈ సినిమాకి కెమెరా: సూర్య, సంగీతం: సామ్ సి.ఎస్. -
‘ముద్ర’ కృష్ణమూర్తి కన్నుమూత
♦ 1980లో ‘ముద్ర’ కమ్యూనికేషన్స్‌కు శ్రీకారం ♦ గుంటూరు జిల్లా వినుకొండలో జననం ♦ దేశవ్యాప్తంగా ప్రచారరంగంలో తనదైన ‘ముద్ర’ సాక్షి, హైదరాబాద్/వినుకొండ రూరల్: దేశంలోనే ప్రచారరంగంలో తనదైన ముద్ర వేసుకున్న ‘ముద్ర’ వ్యవస్థాపకుడు ఎ.జి.కృష్ణమూర్తి (73) శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా వినుకొండ. అచ్యుతుని భుజంగరావు, సీతారావమ్మ దంపతులకు 1942 ఏప్రిల్ 29న వినుకొండలో కృష్ణమూర్తి జన్మించారు. తండ్రి భుజంగరావు సొంతూరు గుంటూరు కాగా ఆరోగ్యశాఖలో విధి నిర్వహణలో భాగంగా వివిధ ప్రాంతాల్లో పని చేశారు. పుట్టింది వినుకొండలోనే అయినా కృష్ణమూర్తి తెనాలి మారిసుపేట, బాపట్ల, అహ్మదాబాద్‌లలో ఎక్కువ కాలం ఉన్నారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి బీఏ పట్టా పొందారు. ప్రభుత్వ ఉద్యోగిగా తన జీవిత పయనాన్ని ప్రారంభించిన కృష్ణమూర్తి అడ్వర్టైజింగ్ రంగంలో దేశవ్యాప్త గుర్తింపు సాధించారు. 1968లో కాలికోమిల్స్లో కెరీర్‌ను ప్రారంభించిన ఆయన.. 1972లో శిల్పి అడ్వర్టయిసింగ్ ఏజెన్సీని నెలకొల్పారు. అనంతరం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో అడ్వర్టైజింగ్ మేనేజర్‌గా చేరారు. 1982లో ‘ముద్ర’ కమ్యూనికేషన్స్‌కు శ్రీకారం చుట్టారు. 1991లో ముద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అహ్మదాబాద్‌ను స్థాపించారు. తర్వాత దేశవ్యాప్తంగా ప్రచార రంగంలో తమ సేవలను విస్తరించారు. పేద కుటుంబం కాకపోయినా, కష్టాల మద్య పెరిగామని, ధీరూభాయిని కలుసుకోవటం తన జీవితంలో పెనుమార్పులు తీసుకువచ్చినట్లు తన ఆత్మకథలో రాసుకున్నారు. కృష్ణమూర్తి, లీల దంపతులకు ముగ్గురు కుమార్తెలు అనురాధా, సుధ, సుజాత, ఒక కుమారుడు కళ్యాణ్. దేశం గర్వించదగ్గ స్థాయికి చేరుకున్న కృష్ణమూర్తి కాలమిస్ట్‌గా, రచయితగా కూడా ప్రసిద్ధుడు. ఆంగ్లం, తెలుగులో పలు వ్యాసాలు, పుస్తకాలు ప్రచురించారు. ఆయన పుస్తకాలు పలు భారతీయ భాషల్లో ప్రచురితమయ్యాయి. చివరగా ఆయన హైదరబాద్‌లో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. కృష్ణమూర్తి మృతిపై జగన్ సంతాపం వాణిజ్య ప్రకటనల రంగంలో తనదైన ముద్ర వేసిన ‘ముద్ర’ కృష్ణమూర్తి మరణం ఆ రంగానికి తీరని నష్టమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ముద్ర ఆడ్వర్టయిజ్‌మెంట్ ఒక్కొక్క ఇటుక పేర్చుతూ సుమారు రూ.46,900 కోట్ల ప్రకటనల సామ్రాజ్యాన్ని సృష్టించారని పేర్కొన్నారు. కొద్దిపాటి పెట్టుబడితో ప్రారంభించి ఐదు అగ్ర సంస్థల్లో ఒకటిగా నిలిపారన్నారు. ఆయన మరణం తీరని లోటని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
అడ్వర్టైజ్ మెంట్ రంగంలో చెరగని ‘ముద్ర’.. ఏజీకే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ అడ్వర్టైజ్మెంట్ రంగంలో తనకంటూ ప్రత్యేక ‘ముద్ర’ ఏర్పర్చుకున్న ఆచ్యుతిని గోపాల కృష్ణమూర్తి (ఏజీకే) తన క్రియేటివిటీతో కార్పొరేట్లు, వినియోగదారుల్ని 80,90 దశకాల్లో మంత్రముగ్ధుల్ని చేశారు. శుక్రవారం కన్నుమూసిన ఏజీకే.. ముద్రా కమ్యూనికేషన్స్ పేరుతో దేశీయ ప్రకటనల రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1942 గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించిన ఆయన రిలయన్స్, విమల్, రస్నా వంటి బ్రాండ్స్‌కు ప్రాచుర్యం కల్పించడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 35 ఏళ్ల క్రితం ఆయన సృష్టించిన ‘ఓన్లీ విమల్’, ‘ఐ లవ్ యూ రస్నా’ ట్యాగ్ లైన్లు ఇప్పటికీ ప్రజల నోటిలో నానుతున్నాయంటే అవి ఎంత చెరగని ముద్ర వేసుకున్నాయో అర్థం చేసుకోవచ్చు. 1972లో శిల్పి అడ్వర్టైజ్మెంట్ సంస్థలో అకౌంటెంట్‌గా వృత్తిని ఆరంభించారు. ఆ తర్వాత అనతి కాలంలోనే 1976లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో అడ్వర్టైజ్మెంట్ మేనేజర్‌గా చేరి నప్పటి నుంచి ఏజీకే ఇక వెనుతిరిగి చూసుకోలేదు. ఏజీకేలో వున్న క్రియేటివిటీని గుర్తించిన రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ...ఆయన స్వంతంగా ఒక ఏజెన్సీ పెట్టుకునేందుకు ప్రోత్సాహాన్నందించారు. 1980లో రూ. 35,000 పెట్టుబడితో ముద్రా కమ్యూనికేషన్స్ పేరుతో సొంతంగా తనకిష్టమైన అహ్మదాబాద్‌లో చిన్న యాడ్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకున్నారు. ఒక ప్రాంతీయ సంస్థగా మొదలైన ముద్రా అనతి కాలంలోనే దేశీయ అడ్వర్టైజ్మెంట్ సంస్థల్లో టాప్-3గా నిలిచింది. ఆ తర్వాత ఆసియాలోనే తొలి అడ్వర్టైజ్మెంట్ శిక్షణా సంస్థను ‘ ముద్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్’ పేరుతో 1991లో ప్రారంభించారు. ప్రకటనల రంగంలో ఈ సంస్థ 800కిపైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులను దక్కించుకుంది. ఆరేళ్లపాటు ఏజెన్సీ ఆఫ్ ది ఇయర్‌గా అవార్డులను అందుకుంది. 2003లో ముద్రా నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత ఏజీకే బ్రాండ్ కన్సల్టెన్సీ పేరుతో మరో సంస్థను ప్రారంభించి దానికి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రకటనల రంగంలోనే కాకుండా రచనలతోనూ అనేకమందికి స్ఫూర్తినిచ్చారు. ముఖ్యంగా ధీరూభాయ్ అంబానీ జీవన శైలి, అడ్వర్టైజ్మెంట్ ప్రాక్టీసెస్, వ్యక్తిత్వ వికాసాలపై అనేక రచనలు చేశారు. 2013లో ‘ఇఫ్ యూ కెన్ డ్రీమ్’ పేరుతో విడుదలైన ఆటో బయోగ్రఫీ ఆయన చివరి రచనగా చెప్పుకోవచ్చు. ఈ రంగంలో చేసిన కృష్టికి అనేక అవార్డులు, రివార్డులను అందుకున్నారు. వీటిలో ఏఏఏఐ-ప్రేమ్ నారాయణ్ అవార్డు, అడ్వర్టైజింగ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ వంటివి ఉన్నాయి. ఏజీకేకి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. ఏజీకే మృతిపట్ల కార్పొరేట్ రంగ ప్రతినిధులు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.