నిఖిల్
జర్నలిస్ట్‌గా నిఖిల్ చేస్తోన్న పరిశోధన చివరి దశకు వచ్చేసిందట. ఇంకొన్ని రోజుల్లో జర్నలిస్ట్ అర్జున్‌గా తనకు అప్పగించిన పనిని పూర్తి చేయనున్నారట. నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా టిఎన్ సంతోష్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ముద్ర’. బి.మధు సమర్పణలో కావ్యా వేణుగోపాల్, రాజ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ గురించి చిత్రబృందం మాట్లాడుతూ – ‘‘మా సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో క్లైమాక్స్ షూటింగ్ జరుపుతున్నాం. డబ్బింగ్ పనులు కూడా మొదలుపెట్టాం. వాస్తవిక సంఘటనల ఆధారంగా ‘ముద్ర’ చిత్రం తెరకెక్కిస్తున్నాం. ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన లభించింది. నవంబర్‌లో మా చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సామ్‌సీయస్, కెమెరా: సూర్య.
Comments
Please login to add a commentAdd a comment