నల్ల ధనంపై పోరాటం | jagapathi bau mudhra released to diwali | Sakshi
Sakshi News home page

నల్ల ధనంపై పోరాటం

Published Thu, Oct 18 2018 12:26 AM | Last Updated on Wed, Apr 3 2019 4:10 PM

jagapathi bau mudhra released to diwali - Sakshi

జగపతిబాబు

జగపతిబాబు హీరోగా ఎన్‌.కె. దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ముద్ర’. నట్టి కుమార్‌ సమర్పణలో క్యూటీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నట్టి క్రాంతి సారధ్యంలో నట్టి కరుణ నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణానంతర పనులు తుది దశలో ఉన్నాయి. నట్టి కుమార్‌ మాట్లాడుతూ– ‘‘బ్లాక్‌ మనీ వల్ల సమాజాభివృద్ధి కుంటుపడుతోంది. ఎన్నికల్లో నెగ్గడం కోసం రాజకీయ నాయకులు నల్ల ధనాన్ని విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు.

ఇది సమాజంపైన, దేశ ఆర్థిక వ్యవస్థపైన విపరీతమైన ప్రభావం చూపుతోంది. రాజకీయ నాయకులు బ్లాక్‌ మనీని ఎలా సంపాదిస్తున్నారు? దాన్ని ఎన్నికల్లో ఎలా ఖర్చుపెడుతున్నారన్న అంశాన్ని మా చిత్రంలో చూపించాం. నల్ల ధనంపై పోరాటం చేసే వ్యక్తిగా జగపతిబాబు కనిపిస్తారు. ఇందులో మూడు పాటలు, ఐదు ఫైట్లు ఉన్నాయి. దీపావళికి ‘ముద్ర’ సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్‌ బాబు, సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement