అంతరిక్షం కొత్త లుక్‌ | Antariksham 9000 KMPH release date locked | Sakshi
Sakshi News home page

అంతరిక్షం కొత్త లుక్‌

Published Fri, Nov 9 2018 6:06 AM | Last Updated on Fri, Nov 9 2018 6:06 AM

Antariksham 9000 KMPH release date locked - Sakshi

లావణ్యా త్రిపాఠి,వరుణ్‌ తేజ్‌

వరుణ్‌ తేజ్‌ హీరోగా ‘ఘాజీ’ ఫేమ్‌ సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అంతరిక్షం 9000 కేఎమ్‌పిహెచ్‌’. అదితీరావ్‌ హైదరీ, లావణ్యా త్రిపాఠి కథానాయికలు.  ఇందులో వరుణ్‌తేజ్, అదితీరావ్‌ వ్యోమగాములుగా కనిపిస్తారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా కొత్త లుక్‌ను రిలీజ్‌ చేశారు చిత్రబృందం. ‘‘ఇటీవలే రిలీజ్‌ చేసిన ఫస్ట్‌లుక్, టీజర్‌లకు మంచి స్పందన లభిస్తోంది. సినిమాను డిసెంబర్‌ 21న విడుదల చేయాలను కుంటున్నాం’’ అని యూనిట్‌ సభ్యులు పేర్కొన్నారు. సత్యదేవ్, అవసరాల శ్రీనివాస్‌ నటించిన ఈ సినిమాకు ప్రశాంత్‌ విహారి స్వరకర్త. దర్శకుడు క్రిష్‌ సమర్పణలో సాయిబాబు, రాజీవ్‌రెడ్డి నిర్మించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement