‘‘ఈ మధ్య కాలంలో నేనెక్కువ సినిమాలు కమిట్ కాలేదు. దానికి ముఖ్య కారణం ఆ పాత్రలన్నీ నేను గతంలో చేసినట్టుగా అనిపించడమే. రెగ్యులర్ పాత్రలు చేసీ చేసీ బోర్ కొట్టింది. ఏదైనా చాలెంజింగ్‌గా చేయాలనుకుంటున్న సమయంలో ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ నా వద్దకు వచ్చింది’’ అని లావణ్యా త్రిపాఠి అన్నారు. సందీప్ కిషన్, లావణ్యా త్రిపాఠి జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. డెన్నీస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో ఈ సినిమాను టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం నిర్మించారు. ఈ సినిమా మార్చి 5న విడుదల కానున్న సందర్భంగా లావణ్యా త్రిపాఠి చెప్పిన విశేషాలు.
– ఈ సినిమా పాయింట్‌ను ఒకసారి సందీప్ కిషన్ నాతో పంచుకున్నారు. చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. ఇందులో నేను, సందీప్ ఇద్దరం హాకీ క్రీడాకారులుగా కనిపిస్తాం. తమిళ సినిమాకు ఇది రీమేక్ అయినా తెలుగు నేటివిటీకు తగ్గట్టు మార్పులు చేశారు. ఈ సినిమాలో నేను చేసిన పాత్ర నా నిజజీవితానికి దగ్గరగా అనిపించింది. పాత్రలోకి సులభంగా ఒదిగిపోయాను. హాకీ క్రీడాకారుల బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో గమనించాను. శిక్షణ తీసుకున్నాను. పాత హకీ మ్యాచ్‌లు చూశాను.
► ఓ డైలాగ్ చెప్పి, ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి వెళ్లిపోయే పాత్రలు బోర్ కొట్టేశాయి. ఓ పాత్ర కోసం మానసికంగా, శారీరకంగా కష్టపడాలి అనిపించింది. అందుకే హాకీ బ్యాట్ తీసుకుని మైదానంలోకి అడుగుపెట్టాను. చెమటలు పట్టేలా శ్రమించా. ఈ పాత్ర నాకు చాలా సంతప్తినిచ్చింది. ∙హాకీ ప్లేయర్ పాత్ర కోసం ప్రత్యేకమైన కసరత్తులు ఏం చేయలేదు. ఫిట్‌నెస్ మీద ఎప్పుడూ దృష్టిపెడతాను. ఈ పాత్రకు తగ్గట్టు కొన్ని వర్కౌట్స్ చేశా. స్కూల్లో బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్ ఎక్కువగా ఆడేదాన్ని. స్కూల్లో హాకీ ఉండేది కాదు. కానీ ఈ సినిమా చేశాక స్కూల్స్‌లో హాకీని కూడా భాగం చేస్తే బావుంటుందనిపించింది. రాజకీయాల వల్ల ఎంత ప్రతిభ ఉన్న క్రీడాకారులైనా కొన్నిసార్లు నష్టపోతుంటారు అనే పాయింట్‌ని ఈ సినిమాలో చెప్పాం.
► సందీప్‌తో గతంలో ‘మాయవన్ ’ అనే సినిమా చేశా. తను మంచి కోస్టార్. షూటింగ్ చేస్తున్నప్పుడే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం కలిగింది.
► ఇంకొన్నేళ్ల పాటు సినిమాలే చేయాలనుకుంటున్నాను. ఓటీటీలో అప్పుడే చేయాలనుకోవడం లేదు. విలన్ గా యాక్ట్ చేయాలనుంది. అప్పుడే మన సామర్థ్యం తెలుస్తుంది. కొన్ని స్క్రిప్ట్‌లు విన్నాను. వాటి వివరాలు త్వరలోనే ప్రకటిస్తాను.
ఆ పాత్రలు చేసీ చేసీ బోర్ కొట్టింది
Published Sun, Feb 28 2021 5:43 AM | Last Updated on Sun, Feb 28 2021 5:43 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment