స్ట్రైకింగ్‌కి సిద్ధం | Lavanya Tripathi As Lavanya Rao in A1 Express New Movie | Sakshi
Sakshi News home page

స్ట్రైకింగ్‌కి సిద్ధం

Dec 16 2019 12:12 AM | Updated on Dec 16 2019 12:12 AM

Lavanya Tripathi As Lavanya Rao in A1 Express New Movie - Sakshi

లావణ్యా త్రిపాఠి

హాకీ స్టిక్‌ పట్టుకొని గ్రౌండ్‌లో సిద్ధంగా ఉన్నారు లావణ్యా రావ్‌. బాల్‌ రావడం ఆలస్యం నేరుగా గోల్‌ కొట్టాలని వెయిట్‌ చేస్తున్నారు. తన గేమ్‌ని చూడటానికి కొంచెం టైమ్‌ ఉంది. సందీప్‌ కిషన్, లావణ్యా త్రిపాఠి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’. డెన్నిస్‌ జీవన్‌ కనుకొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్, సందీప్‌ కిషన్, దయా పన్నెం నిర్మిస్తున్నారు.

హాకీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సందీప్, లావణ్య హాకీ క్రీడా కారులుగా కనిపిస్తారు. ఆదివారం లావణ్య త్రిపాఠి పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమాలో తన లుక్‌ను రిలీజ్‌ చేశారు. ‘‘లావణ్య రావ్‌ అనే హాకీ ప్లేయర్‌ పాత్ర చేయడం చాలా సంతోషంగా, ఎగ్జయి టింగ్‌గా ఉంది. ఈ పాత్ర నా కెరీర్‌లో స్పెషల్‌గా ఉండబోతోంది’’ అన్నారు లావణ్య. ఈ చిత్రానికి సంగీతం: హిప్‌ హాప్‌ తమిళ, సహ–నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement