మూడో సినిమా | Sundeep Kishan-Anandi Arts movie announced | Sakshi
Sakshi News home page

మూడో సినిమా

Published Fri, May 8 2020 5:24 AM | Last Updated on Fri, May 8 2020 5:24 AM

Sundeep Kishan-Anandi Arts movie announced - Sakshi

సందీప్‌ కిషన్‌

సందీప్‌ కిషన్‌ హీరోగా ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’, ‘బీరువా’ వంటి చిత్రాలు అందించిన నిర్మాత పి. కిరణ్‌ సందీప్‌తోనే మరో చిత్రాన్ని నిర్మించనున్నారు. గురువారం సందీప్‌ కిషన్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని తమ కాంబినేషన్‌లో రూపొందనున్న మూడో   సినిమాని ప్రకటించారు. ఈ చిత్రానికి రామ్‌ అబ్బరాజు దర్శకత్వం వహించనున్నారు. ఆనంది ఆర్ట్స్‌ క్రియేష¯Œ ్స పతాకంపై ప్రొడక్షన్‌ నెంబర్‌ 15గా రూపొందనున్న ఈ చిత్రానికి భాను బోగవరపు కథ అందిస్తున్నారు. అందమైన రొమాంటిక్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న చిత్రమిది. ప్రస్తుతం సందీప్‌ కిషన్‌ హీరోగా నటిస్తోన్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ సినిమా నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ చిత్రం పూర్తయిన తర్వాత ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ సినిమా షూటింగ్‌ ఆరంభమవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement