ఎక్స్‌ప్రెస్‌ వేగం | First look of Sundeep Kishan-starrer A1 Express is out | Sakshi
Sakshi News home page

ఎక్స్‌ప్రెస్‌ వేగం

Published Mon, Oct 7 2019 4:24 AM | Last Updated on Mon, Oct 7 2019 4:24 AM

First look of Sundeep Kishan-starrer A1 Express is out - Sakshi

హాకీ ఆట ఆడబోతున్నారు హీరో సందీప్‌ కిషన్‌. మరి.. ఈ ఆటలో సందీప్‌ ప్రత్యర్థులను బోల్తా కొట్టించి ఎక్స్‌ప్రెస్‌ వేగంతో ఎలా గోల్స్‌ చేస్తారో చూడటానికి కాస్త సమయం ఉంది. సందీప్‌ కిషన్‌ హీరోగా డెన్నిస్‌ జీవన్‌ కనుకొలను దర్శకత్వంలో తెరకెక్కనున్న తాజా చిత్రానికి ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ సినిమాను టీజీ విశ్వ ప్రసాద్,  అభిషేక్‌ అగర్వాల్, సందీప్‌ కిషన్, దయా పన్నెం నిర్మించనున్నారు. వివేక్‌ కూచిభొట్ల సహ–నిర్మాత. స్పోర్ట్స్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో హాకీ ప్లేయర్‌గా కనిపిస్తారు సందీప్‌. హిప్‌ హాప్‌ తమిళ సంగీతం అందిస్తారు.  ఈ సినిమా ప్రీ లుక్‌ను ఆదివారం విడుదల చేశారు. నవంబర్‌ మొదటి వారంలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది విడుదల చేయాలను కుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement