డబుల్‌ మజాకా ఉంటుంది: రాజేష్‌ దండా | Producer Rajesh Danda about Sandeep Kishan mazaka | Sakshi
Sakshi News home page

డబుల్‌ మజాకా ఉంటుంది: రాజేష్‌ దండా

Published Tue, Feb 25 2025 2:26 AM | Last Updated on Tue, Feb 25 2025 2:26 AM

Producer Rajesh Danda about Sandeep Kishan mazaka

‘‘ధమాకా’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత త్రినాథరావుగారి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘మజాకా’. ఈ సినిమాని ఆయన బాగా తీశారు. ఆయనతో మరో సినిమా చేయాలని ఉంది. ‘మజాకా’ కి సీక్వెల్‌ చేయాలనే ఆలోచనతో ఈ మూవీ చివరలో ‘డబుల్‌ మజాకా’ అనే టైటిల్‌ కూడా వేస్తున్నాం’’ అని నిర్మాత రాజేష్‌ దండా తెలిపారు. సందీప్‌ కిషన్, రీతూ వర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘మజాకా’. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ మూవీలో అన్షు, రావు రమేష్‌ కీలక పాత్రలు పోషించారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్, హాస్య మూవీస్‌ బ్యానర్స్‌పై రాజేష్‌ దండా నిర్మించారు.

బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం రేపు(బుధవారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజేష్‌ దండా విలేకరులతో మాట్లాడుతూ–   ‘‘త్రినాథరావు, రైటర్‌ ప్రసన్నగారి శైలిలో ఉండే మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘మజాకా’. భావోద్వేగాలతో పాటు చక్కని సందేశం కూడా ఉంటుంది. మా మూవీ రిలీజ్‌ డేట్‌కి తక్కువ సమయం ఉండటంతో ప్రమోషన్స్‌ కొత్తగా ΄్లాన్‌ చేయాలనుకున్నప్పుడు అనిల్‌ సుంకరగారు లైవ్‌ షూటింగ్‌ ఐడియా చెప్పారు.

ఆయనతో నా భాగస్వామ్యం కొనసాగుతుంది. వచ్చే ఏడాది మా కాంబినేషన్‌లో ఓ స్టార్‌ హీరోతో బిగ్‌ మూవీ చేయబోతున్నాం. ‘అల్లరి’ నరేశ్, సందీప్‌ కిషన్‌లతో నా అనుబంధం ప్రత్యేకమైనది.. వారితో మళ్లీ సినిమాలు చేస్తాను. ఇకపై వినోదాత్మక సినిమాలే చేస్తాను. ‘సామజవరగమన’ సినిమాకి సీక్వెల్‌ ఉంటుంది. ప్రస్తుతం కిరణ్‌ అబ్బవరంతో ఓ సినిమా, హీరోయిన్‌ సంయుక్తతో ఓ చిత్రం చేస్తున్నాను’’ అని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement