సరికొత్త రికార్డు దిశగా నాని
చాలా రోజుల తరువాత హిట్ ట్రాక్ ఎక్కిన నాని భారీ వసూళ్లతో దూసుకుపోతున్నాడు. యంగ్ హీరోలలో ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాని ఓ సరికొత్త రికార్డ్కు చేరువవుతున్నాడు. ఈ ఫీట్తో స్టార్ హీరోల లిస్ట్లో చేరడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇటీవల 'భలే భలే మగాడివోయ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతున్నాడు.
25 రోజుల్లో ఈ సినిమా 45 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి స్టార్ హీరోలకు షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్లో టాప్ స్టార్స్కు కూడా సాధ్యం కాని భారీ వసూళ్లతో దూసుకుపోతున్న భలే భలే మగాడివోయ్ మొత్తం గ్రాస్ కలెక్షన్స్ విషయంలోనూ సంచలనాలు నమోదు చేస్తోంది. ఇప్పటికీ చాలా థియేటర్స్లో హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతున్న ఈ సినిమా, త్వరలోనే 50 కోట్ల క్లబ్ లో చేరే ఛాన్స్ ఉందంటున్నారు ట్రేడ్ పండితులు.
నాని, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన భలే భలే మగాడివోయ్ కేవలం 6 కోట్ల బడ్జెట్తో రూపొందింది. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది బిగెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలవటంతో పాటు నానిని స్టార్ హీరోల సరసన నిలబెట్టింది.