నాని ఫాంలోకి వచ్చాడు | nani movies with hanu ragavapuri, indhraganti mohanakrishna | Sakshi
Sakshi News home page

నాని ఫాంలోకి వచ్చాడు

Published Fri, Oct 2 2015 9:31 AM | Last Updated on Sun, Sep 3 2017 10:21 AM

నాని ఫాంలోకి వచ్చాడు

నాని ఫాంలోకి వచ్చాడు

ఇటీవల కాలంలో వరుస అపజయాలతో కష్టాల్లో పడ్డ నాని తిరిగి ఫాంలోకి వచ్చాడు. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కిన ఈ యంగ్ హీరో భలే భలే మగాడివోయ్ మంచి విజయం సాధించడంతో స్టార్ స్టేటస్ అందుకున్నాడు. ఈ సినిమాతో భారీ కలెక్షన్లను రాబట్టిన నాని.. చిన్న సినిమా నిర్మాతలకు స్టార్ హీరోగా మారిపోయాడు.

అదే జోరులో ఇప్పుడు వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే అందాల రాక్షసి ఫేం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దాదాపుగా షూటింగ్ పూర్తి కావచ్చిన ఈసినిమాలో బాలకృష్ణ అభిమానిగా నటిస్తున్నాడు నాని. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కున్న ఈ సినిమా ద్వారా వెంకీ అట్లూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

ఈ రెండు సినిమాలతో పాటు తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు నాని. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని సరసన బీరువా ఫేం సురభి హీరోయిన్ గా నటిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement